ఆయుష్మాన్ భవ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం కింద 80,000 మందికిపైగా ప్రజలు అవయవ దానానికి ప్రతినబూనడం ఈ కార్యక్రమ విజయానికి తిరుగులేని నిదర్శనమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రశంసించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“అవయవ దానంపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ప్రజా స్పందన నాకు ఎనలేని సంతోషం కలిగిస్తోంది! ప్రాణరక్షణ దిశగా ఇదొక కీలక ముందడుగని చెప్పడంలో సందేహం లేదు. భవిష్యత్తులో మరింత పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ఉదాత్త కృషికి తమవంతు తోడ్పాటునందిస్తారని ఆశిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Gladdened by the overwhelming response to this effort! This is indeed a remarkable step towards saving lives. I do hope more people join this noble initiative in the future. https://t.co/q5pTv9Xeza
— Narendra Modi (@narendramodi) October 16, 2023