దేశ వారసత్వ పరిరక్షణ కోసం ఎనలేని కృషి కొనసాగుతున్నదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. ఆ మేరకు భారత వారసత్వాన్ని కాపాడటమే కాకుండా అందంగా తీర్చిదిద్దడానికి తాము కట్టుబడి ఉన్నామని శ్రీ మోదీ అన్నారు. కాగా, ‘ఐజిఎన్‌ఎసిఎ’ ప్రాంగణంలో వేద వారసత్వ పోర్టల్, కళావైభవ్ (వర్చువల్ ప్రదర్శనశాల)ను కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలియజేసిందని పేర్కొంటూ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ చేసిన ట్వీట్లపై శ్రీ మోదీ ఈ మేరకు స్పందించారు.
వేద వారసత్వ పోర్టల్‌ను హిందీ, ఇంగ్లీషు భాషల్లో రూపొందించినట్లు ఢిల్లీలోని ‘ఐజిఎన్‌సిఎ’ తన ట్వీట్‌లో తెలిపింది. ఇందులో 18 వేలకుపైగా వేద మంత్రాల దృశ్య-శ్రవణ సారాంశాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.
ఢిల్లీలోని తమ కేంద్రంలో చేపట్టిన తాజా కార్యక్రమాలపై ‘ఐజిఎన్‌సిఎ’ ట్వీట్‌పై ప్రధానమంత్రి స్పందిస్తూ:
“ఇదెంతో అసమాన ప్రయత్నం! దేశ వారసత్వ పరిరక్షణతోపాటు మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
बेहतरीन प्रयास! देश की विरासत को संजोने और संवारने के लिए हमारी सरकार प्रतिबद्ध है। https://t.co/AgSuFcrBZm
— Narendra Modi (@narendramodi) March 25, 2023