అస్సాం పెట్రో రసాయనాల ప్లాంటు నుంచి బంగ్లాదేశ్‌కు తొలిసారి మిథనాల్ ఎగుమతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు పెట్రో రసాయనాల రంగంలో అస్సాంను ప్రధాన ఎగుమతిదారుగా నిలిపే దిశగా సాగుతున్న కృషిని ఆయన ప్రశంసించారు.
ఈ మేరకు అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ ట్వీట్‌కు ప్రతిస్పందనగా పంపిన సందేశంలో:
“అస్సాంసహా ఈశాన్య భారతమంతటా పెట్రో రసాయనాల రంగం వృద్ధికి మరింత ఉత్తేజమిచ్చే కృషికి ఈ పరిణామం నిదర్శనం” అని ప్రధానమంత్రి కొనియాడారు.
This will boost the petrochemicals sector in Assam and the entire Northeast. https://t.co/iHvelOPIic
— Narendra Modi (@narendramodi) July 3, 2023