దిల్లీ కి వెలుపల మొట్టమొదటి సారి సిఐఎస్ఎఫ్ స్థాపక దిన కవాతు ను నిర్వహించినందుకు సిఐఎస్ఎఫ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
దేశీయ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అమిత్ శాహ్ ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ ఒక ట్వీట్ లో -
‘‘దిల్లీ కి వెలుపల మొట్టమొదటి సారి సిఐఎస్ఎఫ్ స్థాపక దిన కవాతు ను నిర్వహించినందుకు సిఐఎస్ఎఫ్ ను నేను మెచ్చుకొంటున్నాను. అటువంటి నిర్ణయాలు భాగస్వామ్య తరహా పరిపాలన తాలూకు భావన ను ఇనుమడింప చేస్తాయి.’’ అని పేర్కొన్నారు.
I laud the @CISFHQrs for organising their Raising Day parade outside Delhi for the first time. Such decisions increase the spirit of participative governance. https://t.co/JsTteauOQJ
— Narendra Modi (@narendramodi) March 13, 2023