ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన నెలవారీ ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమం ద్వారా ఇవాళ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ చండీగఢ్‌లోని ఓ ఫుడ్‌స్టాల్ యజమాని సంజయ్ రాణా చొరవను ప్రశంసించారు. ఈ మేరకు కోవిడ్-19 టీకాలు తీసుకునేలా ప్రజలకు ప్రేరణ ఇవ్వడంలో అతని చొరవను కొనియాడారు. కోవిడ్ టీకా తీసుకున్నవారికి ‘షోలే భటూరే’ వంటకాన్ని రాణా ఉచితంగా ఇవ్వాలన్న తన కుమార్తె, మేనకోడలు సూచించగా అందుకు అంగీకరించాడు.
#चंडीगढ़ के संजय राणा जी की प्रेरणादायक और नेक कहानी
— PIB in Chandigarh (@PIBChandigarh) July 25, 2021
संजय राणा जी के छोले-भटूरे मुफ़्त में खाने के लिए आपको दिखाना पड़ेगा कि आपने उसी दिन vaccine लगवाई है | Vaccine का message दिखाते ही वे आपको स्वादिष्ट छोले–भटूरे दे देंगे
- पीएम श्री @narendramodi#MannKiBaat @vpsbadnore pic.twitter.com/r5QGypN8ao
చండీగఢ్‌లోని సెక్టర్-29లో సంజయ్ రాణా సైకిలుమీద ‘షోలే భటూరే’ అమ్ముతుంటాడు. ఈ క్రమంలో టీకా వేసుకున్న రోజున ఆ మేరకు ఆధారం చూపినవారికి ఈ వంటకాన్ని ఉచితంగా అందజేసేవాడని ప్రధానమంత్రి వెల్లడించారు. దీన్నిబట్టి డబ్బుకన్నా సమాజ సంక్షేమం, సేవాస్ఫూర్తి, కర్తవ్య నిర్వహణలే మిన్న అని రుజువు చేశాడంటూ సదరు ఫుడ్‌స్టాల్ యజమాని చొరవను ఆయన మరోసారి ప్రశంసించారు.