ఆయుష్మాన్ భారత్ పథకం లో భాగం గా 1.5 లక్షల హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్ లను ఏర్పాటు చేయాలి అనేటటువంటి లక్ష్యాన్ని సాధించడమనేది ‘న్యూ ఇండియా’ కు ఒక సరికొత్త శక్తి ని అందిస్తుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆరోగ్యవంతులైన పౌరుల ద్వారానే భారతదేశం యొక్క సమృద్ధి సిద్ధిస్తుంది అని కూడా ఆయన అన్నారు.
ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి తాను ఒక ట్వీట్ లో సమాధానాన్ని ఇస్తూ -
‘‘పౌరుల స్వస్థత లోనే భారతవర్షం యొక్క సమృద్ధి ఇమిడి ఉంటుంది. ఈ దిశ లో రికార్డు సంఖ్య లో ఏర్పాటు చేసిన ఈ హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్ లు ప్రధానమైన పాత్ర ను పోషిస్తాయి. ఈ కార్య సాధన ‘న్యూ ఇండియా’ కు ఒక సరికొత్త శక్తి ని ప్రసాదించేటటువంటిదే సుమా.’’ అని పేర్కొన్నారు.
स्वस्थ नागरिकों में ही भारतवर्ष की समृद्धि निहित है। इस दिशा में रिकॉर्ड संख्या में बने ये हेल्थ एंड वेलनेस सेंटर्स बड़ी भूमिका निभाएंगे। यह उपलब्धि न्यू इंडिया में एक नई ऊर्जा भरने वाली है। https://t.co/OfBsRIorsR
— Narendra Modi (@narendramodi) December 29, 2022