దేవ్‌గఢ్ వద్ద కేబుల్ కార్ దుర్ఘటనకు సంబంధించి రక్షణ, సహాయ చర్యల్లో పాల్గొన్న భారత వాయుసేన, సైన్యం, జాతీయ విపత్తు ప్రతిస్పందన బలగం (ఎన్డీఆర్ఎఫ్), ఇండో-టిబెటన్ పోలీస్ (ఐటీబీపీ), స్థానిక పాలన యంత్రాంగం, పౌర సమాజ సిబ్బందితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సంభాషించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా, పార్లమెంటు సభ్యుడు శ్రీ నిషికాంత్ దూబే, హోంశాఖ కార్యదర్శి, సైన్యం/వాయుసేన అధిపతులు, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్, ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ రక్షణ-సహాయ చర్యల్లో పాల్గొన్నవారిని హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ప్రశంసించారు. చక్కని సమన్వయంతో చర్యల నిర్వహణకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన విపత్తుల నిర్వహణలో మునుపటి సహాయం ప్రాతిపదిక విధానం నేడు ప్రాణనష్టం నిరోధ ప్రాధాన్యమైనదిగా పరిణామం చెందిందని ఆయన పేర్కొన్నారు. తదనుగుణంగా నేడు తక్షణం ప్రతిస్పందించే, అన్ని స్థాయులలో ప్రాణరక్షణకు రంగంలోకి దూకే సమీకృత యంత్రాంగం సదా సిద్ధంగా ఉంటున్నదని గుర్తుచేశారు. ఇందులో భాగంగానే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సాయుధ బలగాలు, ఐటీబీపీ పోలీసులు, స్థానిక పాలన యంత్రాంగం సిబ్బంది ఈ రక్షణ, సహాయ చర్యల్లో ఆదర్శప్రాయ సమన్వయంతో శ్రమించాయని శ్రీ అమిత్ షా కొనియాడారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- రక్షణ, సహాయ చర్యల్లో పాల్గొన్న బృందాలను ప్రశంసిచడమే కాకుండా మృతుల కుటుంబాలకు తన సానుభూతి ప్రకటించారు. ‘‘మన సాయుధ బలగాలు, వాయుసేన, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు సిబ్బంది వంటి నైపుణ్యంగల దళం ఆపదవేళ పౌరులను రక్షించగల సామర్థ్యం కలిగి ఉండటంపై దేశం గర్విస్తున్నది’’ అలాగే ‘‘మూడు రోజులపాటు రాత్రింబవళ్లు కఠోరంగా శ్రమించి అత్యంత క్లిష్టమైన రక్షణ, సహాయ చర్యలను దిగ్విజయంగా పూర్తిచేశారు. అంతేకాకుండా చాలామంది పౌరుల ప్రాణాలను కాపాడారు. ఇందుకు బాబా వైద్యనాథ్ దయ కూడా తోడ్పడిందని నేను భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
ఎన్డీఆర్ఎఫ్ తన సాహసం, కఠోర శ్రమతో తననుతాను ఒక గుర్తింపును, ప్రతిష్ఠను సముపార్జించుకున్నదని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రికి ఎన్డీఆర్ఎఫ్ రక్షణ, సహాయ చర్యల క్రమాన్ని ఇన్‌స్పెక్టర్/జీడీ శ్రీ ఓం ప్రకాష్ గోస్వామి ప్రధానికి వివరించారు. ఈ విపత్కర పరిస్థితిలో భావోద్వేగ అంశాన్ని ఎలా నిభాయించగలిగారని ప్రధానమంత్రి శ్రీ ఓం ప్రకాష్‌ను ప్రశ్నించారు. ఎన్డీఆర్ఎఫ్ సాహసాన్ని దేశం మొతతం గుర్తించిందని ప్రధాని అన్నారు.
భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ వై.కె.కందాల్కర్ ఈ విపత్కర పరిస్థితిలో వాయుసేన నిర్వహించిన పాత్రను వివరించారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ- కేబుల్ కార్ వైర్ల సమీపానికి హెలికాప్టర్ నడిపించడంలో పైలట్ల నైపుణ్య అద్భుతమని కొనియాడారు. కేబుల్ కార్ దుస్థితితో ప్రతికూల పరిస్థితుల్లో పడిన ప్రయాణికులను, ముఖ్యంగా- మహిళలు, పిల్లలను రక్షించడంలో వాయుసేన ‘గరుణా’ కమాండోలు పోషించిన పాత్రను సార్జంట్ పంకజ్ కుమార్ రాణా విశదీకరించారు. ఈ విషయంలో వాయుసేన సిబ్బంది అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారని ప్రధాని కొనియాడారు.
రక్షణ, సహాయ చర్యల్లో సాధారణ పౌరులు ప్రధాన పాత్ర పోషించడం గురించి పలువురి ప్రాణాలు కాపాడిన దేవ్‌గఢ్ లోని ‘దామోదర్ రోప్ వే’కి చెందిన శ్రీ పన్నాలాల్ జోషి వివరించారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ- పరోపకారం మన సంస్కృతిలో భాగమని, ఆ మేరకు తమవంతు తోడ్పాటునందించిన పౌరుల సాహసం, సహాయశీలతను ప్రశంసించారు.
రక్షణ, సహాయ చర్యల్లో ఐటీబీపీ పోషించిన పాత్ర గురించి ఐటీబీపీ సబ్-ఇన్స్ పెక్టర్ శ్రీ అనంత్ పాండే వివరించారు. ఐటీబీపీ తొలిదశలో విజయవంతంగా తన పాత్రను పోషించడం ఆపదలో చిక్కుకున్న ప్రయాణికుల మనోస్థైర్యాన్ని పెంచిందని చెప్పారు. దీనిప ప్రధాని స్పందిస్తూ- ఈ జట్టు చూపిన సహనశీలతను కొనియాడుతూ... సవాళ్లను దృఢ సంకల్పంతో, సహనంతో ఎదుర్కొన్నప్పుడు విజయం తథ్యమననారు.
రక్షణ చర్యలలో స్థానికంగా సమన్వయంతోపాటు వైమానిక దళం వచ్చేదాకా ప్రయాణికుల మనోస్థైర్యాన్ని నిలపడంలో చేసిన కృషి గురించి దేవ్‌గఢ్ జిల్లా మేజిస్ట్రేట్/డిప్యూటీ కమిషనర్ శ్రీ మంజునాథ్ భజంతరి వివరించారు. బహుళ-సంస్థల సమన్వయం.. సమాచార ఆదానప్రదానాల వివరాలను కూడా ఆయన తెలిపారు. సకాలంలో అన్నివిధాలా సహాయ, సహకారాలు అందించినందుకుగాను ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రక్షణ చర్యలలో జిల్లా మేజిస్ట్రేట్ తన శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానం వినియోగించిన తీరు గురించి ప్రధాని ఆయనను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి దుర్ఘటనల పునరావృతం కాకుండా దీనికి సంబంధించిన అంశాలన్నిటినీ సవివరంగా క్రోడీకరించాల్సిందిగా ప్రధాని సూచించారు.
ఈ రక్షణ చర్యలలో సైన్యం పాత్రను బ్రిగేడియర్ అశ్వనీ నయ్యర్ వివరించారు. కిందిస్థాయిలో కేబుల్ కార్ నుంచి రక్షణ చర్యలను ఆయన విశదీకరించారు. సైనిక సిబ్బంది ఒక జట్టుగా చక్కని ప్రణాళికతో, వేగం/సమన్వయంతో పరిస్థితిని చక్కదిద్దిన తీరు ప్రశంసనీయమని ప్రధానమంత్రి కొనియాడారు. ఇటువంటి సందర్భాల్లో ప్రతిస్పందన సమయమే విజయానికి కీలకమని ప్రధాని అన్నారు. యూనిఫాం సిబ్బందిని చూడగానే ప్రజల్లో భరోసా కనిపిస్తుందన్నారు. ‘‘యూనిఫామ్‌పై ప్రజలకు ఎనలేని నమ్మకం ఉంది... కష్టాల్లో ఉన్నవారు మిమ్మల్ని చూసినప్పుడు తమ జీవితం ఇక సురక్షితమని విశ్వసిస్తారు.. వారిలో కొత్త ఆశలు చిగురిస్తాయి’’ అని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.
రక్షణ చర్యల సందర్భంగా పిల్లలు, వృద్ధుల అవసరాలను సదా దృష్టిలో ఉంచుకోవడంపై ప్రధాని సంతృప్తి వ్యక్తంచేశారు. ఇటువంటి ప్రతి అనుభవం నుంచి బలగాలు నిరంతరం నేర్చుకోవడాన్ని ఆయన అభినందించారు. బలగాల దీక్ష, దక్షతలను కొనియాడారు. వనరులు, అవసరమైన సామగ్రిపరంగా రక్షణ, సహాయ దళాలను నిత్యనూతనంగా ఉంచడంపై ప్రభుత్వ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. ‘‘ఈ రక్షణ చర్యలన్నీ సున్నితత్వం.. సహాయశీలత.. సాహసాలకు ప్రతీక’’ అని ఆయన అన్నారు.
సహనం, ధైర్యం ప్రదర్శించిన ప్రయాణికుల మనోస్థైర్యాన్ని ప్రధాని కొనియాడారు. స్థానిక పౌరుల నిబద్ధత, సేవాభావాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రక్షించబడిన ప్రయాణికులకు శ్రీ మోదీ అభినందనలు తెలిపారు. ‘‘దేశంలో ఏదైనా విపత్తు సంభవించినప్పుడల్లా మనం ఆ సవాలును సమష్టిగా ఎదుర్కొని విజయం సాధింగలమని ఈ సంక్షోభం మరోసారి స్పష్టం చేసింది. అలాగే ‘‘ఈ రక్షణ చర్యల్లో ‘సబ్‌కా ప్రయాస్’ కూడా ప్రధాన పాత్ర పోషించింది’’అని శ్రీ మోదీ అన్నారు.
బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ రక్షణ చర్యల అనుభవాలను భవిష్యత్తులో నిశితంగా వినియోగించగలిగేలా సమగ్రంగా క్రోడీకరించాలని, ఇందులో పాల్గొన్న వారందరినీ కోరుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
देश को गर्व है कि उसके पास हमारी थल सेना, वायु सेना, NDRF, ITBP के जवान और पुलिस बल के रूप में ऐसी कुशल फोर्स है, जो देशवासियों को हर संकट से सुरक्षित बाहर निकालने का माद्दा रखती है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 13, 2022
हालांकि हमें दुख है कि कुछ साथियों का जीवन हम नहीं बचा पाए।
— PMO India (@PMOIndia) April 13, 2022
अनेक साथी घायल भी हुए हैं। पीड़ित परिवारों के साथ हम सभी की पूरी संवेदना है।
मैं सभी घायलों के जल्द स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
आपने तीन दिनों तक, चौबीसों घंटे लगकर एक मुश्किल रेस्क्यू ऑपरेशन को पूरा किया और अनेक देशवासियों की जान बचाई है।
— PMO India (@PMOIndia) April 13, 2022
मैं इसे बाबा वैद्यनाथ जी की कृपा भी मानता हूं: PM @narendramodi
मुश्किल से मुश्किल चुनौती के सामने अगर हम धैर्य के साथ काम करते हैं, तो सफलता मिलती ही है।
— PMO India (@PMOIndia) April 13, 2022
आप सभी ने इस रेस्क्यू ऑपरेशन के दौरान जिस धैर्य का परिचय दिया, वो अतुलनीय है: PM @narendramodi while interacting with those involved in rescue operation in Deoghar
वर्दी पर लोगों की बहुत आस्था होती है।
— PMO India (@PMOIndia) April 13, 2022
संकट में फंसे लोग जब भी आपको देखते हैं तो उनको विश्वास हो जाता है कि उनकी जान अब सुरक्षित है।
उनमें नई उम्मीद जाग जाती है: PM @narendramodi
इस आपदा ने एक बार फिर ये स्पष्ट कर दिया कि जब भी देश में कोई संकट होता है तो हम सब मिलकर एक साथ उस संकट से मोर्चा लेते हैं और उस संकट से निकलकर दिखाते हैं।
— PMO India (@PMOIndia) April 13, 2022
सबके प्रयास ने इस आपदा में भी बहुत बड़ी भूमिका निभाई है: PM @narendramodi