దేశ ప్ర‌జ‌లంద‌రి త‌ర‌ఫున నేను మీ మొత్తం క్రీడాకారుల బృందాన్ని అభినందిస్తున్నాను. ద‌శాబ్దాల త‌ర్వాత భార‌త ప‌తాకాన్ని గ‌ట్టిగా ప్ర‌తిష్ఠించారు. ఇది సామాన్య‌మైన విష‌యం కాదు.
ఇక ఇండియా ఎక్క‌డా వెన‌క‌బ‌డి లేదు. క్రీడ‌ల‌లో మీ విజ‌యాలు రాబోయే త‌రాల‌కు స్ఫూర్తిదాయ‌కాలు.
ఇలాంటి విజ‌యాలు దేశంలో మొత్తం క్రీడావాతావ‌ర‌ణానికి గొప్ప శ‌క్తిని ఇవ్వ‌డ‌మే కాదు , విశ్వాసాన్ని పాదుకొల్పుతాయి.
మ‌న మ‌హిళల బృందం త‌మ ప్ర‌తిభ‌ను చాటుతూ వ‌స్తోంది. త‌గిన స‌మ‌యం కోసం చూస్తున్నాం. ఇప్పుడు కాక‌పోతే వ‌చ్చేసారి మ‌నం త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తాం.
- మీరు మ‌రింత‌గా ఆడి మ‌రింత‌గా విక‌సించాల్సి ఉంది.
నేను ఏదైనా సాధించ‌గ‌ల‌ను అన్న‌ది ఇప్ప‌డు న‌వ‌భార‌త దేశ ప్ర‌జ‌ల‌భావ‌న‌గా ఉంది
ఇది భార‌త‌దేశ క్రీడా చ‌రిత్ర‌లో సువ‌ర్ణాధ్యాయం. మీలాంటి ఛాంపియ‌న్లు,మీ త‌రం క్రీడాకారులు ఇందుకు కార‌ణం. మ‌నం ఈ వేగాన్ని మ‌రింత ముందుకు తీసుకువెల్లాలి.
టెలిఫోన్ కాల్ సంద‌ర్భంగా చెప్పిన‌ట్టు బాల్ మిఠాయి తీసుకువ‌చ్చినందుకు ల‌క్ష్య సేన్ కు ప్ర‌ధాన‌మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ థామ‌స్ క‌ప్‌, ఉబెర్ క‌ప్ బాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్ బృంద స‌భ్యుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. వారు థామ‌స్ క‌ప్‌, ఉబెర్ క‌ప్ సంద‌ర్భంగా త‌మ అనుభ‌వాల‌ను పంచుకున్నారు. క్రీడాకారులు తమ క్రీడ‌కు సంబంధించిన వివిధ అంశాలు, బాడ్మింట‌న్ మాత్ర‌మే కాకుండా త‌మ జీవితానికి సంబంధించిన ప‌లు విష‌యాల‌ను వారు ప్ర‌స్తావించారు.

ప్ర‌ధాన‌మంత్రిచేత గొప్ప‌గా గుర్తింపు పొంద‌డం ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌ని క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ అన్నారు. జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించిన కెప్టెన్‌ను అత‌ని నాయ‌క‌త్వ శైలి, స‌వాళ్ల గురించి ప్ర‌ధాన‌మంత్రి అడిగి తెలుసుకున్నారు. జ‌ట్టులోని ప్ర‌తి ఒక్క‌రూ అద్భుత‌మైన ప‌నితీరు క‌న‌బ‌రుస్తున్నార‌ని, ఒక బృందంగా వారిలోని ప్ర‌తిభ‌ను వెలికితీయ‌డం జ‌ట్టు ల‌క్ష్య‌మ‌ని అన్నారు. కీల‌క నిర్ణ‌యాత్మ‌క మ్యాచ్ లో ఆడే అవ‌కాశం ద‌క్కినందుకు ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు. ప్ర‌పంచ నెంబ‌ర్ 1 ర్యాంకింగ్ గురించి, థామ‌స్ క‌ప్ గురించి ప్రధాన‌మంత్రి అడ‌గ‌గా అందుకు బ‌దులిస్తూ శ్రీకాంత్‌, ఈ రెండు కీల‌క మైలురాళ్ల‌ను సాధించ‌డం త‌న క‌ల అని, ఆ రెండింటినీ తాను సాధించిన‌ట్టు చెప్పారు. గ‌త సంవ‌త్స‌రాల‌లో పెద్ద‌గా ప్ర‌తిభ‌క‌న‌ర‌బ‌చ‌నందున థామ‌స్ క‌ప్ గురించి పెద్ద‌గా అనుకునే వారు కాద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ఈ బృందం సాధించిన విజ‌యం జ‌నంలోకి ఎక్క‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు.

“ దేశ ప్ర‌జ‌లంద‌రి త‌ర‌ఫున నేను మిమ్మ‌ల‌నంద‌రినీ అభినందిస్తున్నాను. ద‌శాబ్దాల త‌ర్వాత భార‌త ప‌తాకాన్ని గ‌ట్టిగా ప్ర‌తిష్ఠించారు. ఇది చిన్న విష‌యం కాదు. జ‌ట్టును క‌ల‌సిక‌ట్టుగా ఉంచి విప‌రీత‌మైన ఒత్తిడిని ఎదుర్కొన‌వ‌ల‌సి రావ‌డం సామాన్య విషయం కాదు. దీనిని నేను అర్థం చేసుకోగ‌ల‌ను. నేను మిమ్మ‌ల్ని ఫోన్ లో అభినందించాను. ఇప్పుడు మిమ్మ‌ల‌ను వ్య‌క్తిగ‌తంగా అభినందించ‌డం సంతోషంగా ఉంది.

సాత్విక్ సాయిరాజ్ రాంకి రెడ్డి గ‌త ప‌ది రోజులుగా త‌న ఆనందాన్ని, ప‌డిన శ్ర‌మ‌ను తెలియజేశారు. జట్టు సహాయక సిబ్బంది నుండి తనకు లభించిన అద్భుత‌ మద్దతును అతను గుర్తుచేసుకున్నారు. జట్టు విజయ క్షణాలను ఇప్పటికీ మ‌న‌నం చేసుకుంటున్న‌ట్టు చెప్పారు. ప్రధానమంత్రి వారితో త‌న‌ ఆనందాన్ని పంచుకున్నారు . ప‌త‌కాన్ని సాధించిన ఆనందంలో నిద్రలేకుండా గ‌డిపిన జట్టు సభ్యుల ట్వీట్లను ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి గుర్తు చేసుకున్నారు. రాంకి రెడ్డి త‌న ప‌నితీరును కోచ్ లకు వివ‌రించారు. ప‌రిస్థితుల‌కు అనుగుణంగా స‌ర్దుకుపోయే తీరు ప‌ట్ల ప్ర‌ధాని రాంకిరెడ్డిని అభినందించారు. భ‌విష్య‌త్ ల‌క్షాల సాధ‌న‌కు అత‌నికి శుభాకాంక్ష‌లు తెలిపారు.

చిరాగ్ శెట్టి కూడా త‌న టోర్న‌మెంట్ ప్ర‌యాణాన్ని వివ‌రించారు. అలాగే ఒలింపిక్ బృందంతో క‌లిసి ప్ర‌ధాన‌మంత్రి నివాసానికి వ‌చ్చిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు. ఒలింపిక్ క్రీడ‌ల‌లో కొంత‌మంది క్రీడాకారులు ప‌త‌కాన్ని సాధించ‌లేక‌పోవ‌డం ప‌ట్ల నిరాశ‌కు గురైన విష‌యాన్ని గుర్తించాన‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. అయితే క్రీడాకారులు ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ని, వారు ఇప్పుడు అంద‌రి అంచ‌నాల‌ను నిజం చేశార‌ని అన్నారు. ఒక ప‌రాజ‌యం తో అంతా ముగిసిపోద‌ని, ప‌ట్టుద‌ల‌, జీవితం ప‌ట్ల మంచి దృక్ఫ‌థం ఉండాల‌న్నారు. అలాంటి వారికి విజ‌యం అనేది స‌హ‌జ‌సిద్ధంగా ల‌భిస్తుంది. దీనిని మీరు సాకారం చేసి చూపారు అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. రాగ‌ల రోజుల‌లో జ‌ట్టు స‌భ్యులు మ‌రిన్ని విజ‌యాలు సాధిస్తార‌ని ప్ర‌ధాన‌మంత్రి ఆశాభావం వ్య‌క్తం చేశారు. బాగా ఆడాలి, బాగా విక‌సించాలి అని ఆయ‌న అన్నారు. ఆ ర‌కంగా క్రీడా ప్ర‌పంచంలోకి తీసుకెళ్లాల‌ని ఆయ‌న అన్నారు. ఇక ఇండియా ఎందులోనూ వెన‌క‌బ‌డ‌దు. మీ విజ‌యాలు క్రీడ‌ల‌లో రాగ‌ల త‌రాల‌కు స్ఫూర్తినివ్వ‌నున్నాయి, అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.
.విజ‌యం సాధించిన అనంత‌రం ప్రధాన‌మంత్రితో ఫోన్ లో మాట్లాడుతూ హామీ ఇచ్చిన విధంగా బాల్ మిఠాయి తీసుకువ‌చ్చినందుకు ల‌క్ష్యాసేన్ కు ప్ర‌ధానమంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. గ‌తంలో యువ‌జ‌న ఒలింపిక్స్‌లో గెలిచిన సంద‌ర్భంలో తాను ప్ర‌ధాన‌మంత్రిని క‌లుసుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు థామ‌స్ క‌ప్ గెలుచుకున్న అనంత‌రం ప్ర‌ధానిని క‌లిసిన‌ట్టు చెప్పారు. ఇలాంటి స‌మావేశాలు క్రీడాకారుల‌కు ఎంతో ప్రేర‌ణనిస్తాయ‌ని ఆయ‌న అన్నారు. నేను ఇండియా త‌ర‌ఫ‌/న మ‌రిన్ని ప‌త‌కాలు సాధించాల‌ని, ఇలాగే మిమ్మ‌ల్ని క‌లుసుకుంటూ ఉండాల‌ని కోరుకుంటున్నాను అని అత‌ను అన్నాడు. టోర్న‌మెంట్ సంద‌ర్భంగా ఆహారం విష‌తుల్యం కావ‌డం వంటి స‌మ‌స్య‌ను ఎదుర్కొవ‌డం గురించి అడిగి తెలుసుకున్నారు. క్రీడ‌ల‌ను ఎంచుకునే యువ‌త‌కు తాను ఏం సందేశం ఇస్తార‌ని కూడా ప్ర‌ధాన‌మంత్రి అడిగారు. ఇందుకు స‌మాధాన‌మిస్తూ ల‌క్ష్య సేన్‌, వారు త‌మ పూర్తి దృష్టిని శిక్ష‌ణ‌పై ఉంచాల‌న్నారు. ల‌క్ష్య ల‌క్ష్య బ‌లాలు, స‌మ‌తుల్య‌త గురించి అడిగి తెలుసుకున్నారు., ప‌ట్టుద‌ల‌తో ఉండ‌డానికి నేర్చుకున్న పాఠాల గురించి ,అత‌ని సంక‌ల్ప‌శ‌క్తి గురించి అడిగి తెలుసుకున్నారు.

దేశానికి స్వాతంత్రం సిద్దించి 75 సంవ‌త్స‌రాలు అవుతున్న గ‌ర్వించ‌ద‌గ్గ క్ష‌ణాల‌లో ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క టోర్న‌మెంట్‌లో గెలుపొంద‌డం ఇంకెంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని హ‌చ్‌.ఎస్‌.ప్ర‌ణ‌య్ అన్నారు. క్వార్ట‌ర్ ఫైన‌ల్లో ,సెమీ ఫైన‌ల్లో ఎంతో ఒత్తిడి ఎదుర్కొన్నామ‌ని జ‌ట్టు నుంచి ల‌భించిన మ‌ద్ద‌తుతో వీటన్నింటినీ ఎదుర్కోగ‌లిగామ‌ని అన్నారు.ప్ర‌ణ‌య్ లో ఒక యోధుడిని ప్ర‌ధాని గుర్తించారు. విజ‌యం ప‌ట్ల అత‌ని వైఖ‌రే అత‌ని గొప్ప బ‌ల‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

జ‌ట్టులో అంద‌రికంటే చిన్న అయిన ఉన్న‌తి హూడాను ప్ర‌ధాన‌మంత్రి అభినందించారు. ప‌త‌కం సాధించిన వారు, సాధించ‌ని వారు అని ప్ర‌ధాన‌మంత్రి ఎప్పుడూ వివ‌క్ష ప్ర‌ద‌ర్శించ‌లేద‌ని ఆమెఅన్నారు. ఆమె ప‌ట్టుద‌లను ప్ర‌ధాన‌మంత్రి అభినందించారు. హ‌ర్యానా నుంచి ఎంతో మంది అద్భుత క్రీడాకారులు, క్రీడాకారిణులు రావ‌డానికి హ‌ర్యానాగ‌డ్డ‌కు గ‌ల ప్ర‌త్యేక‌త ఏమిట‌ని ప్ర‌ధాన‌మంత్రి ఆమెను అడిగారు .పాలు పెరుగు అని ఆమె అన‌డంతో అక్క‌డివారంద‌రూ ఎంతో ఆనందించారు. ఉన్న‌తి పేరులో ఉన్న‌ట్టుగానే ఆమె ముందు ముందు మ‌రింత ఉన్న‌త స్థాయికి చేరుకోగ‌ల‌ద‌ని గ‌ట్టిగా విశ్వ‌సిస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. ఆమె ఇంకా ఎంతో దూరం ప్ర‌యాణించాల్సిఉంద‌ని అంటూ, విజ‌యాలు ఎప్పుడూ ఆత్మ సంతృప్తికి దారితీయ‌కుండా చూసుకోవాల‌ని అన్నారు.
ట్రెస్సా జాలీ , త‌న‌కు ల‌భించిన అద్భుత మ‌ద్ద‌తుగురించి తెలిపింది. ఉబెర్‌క‌ప్ లో మ‌న మ‌హిళా జ‌ట్టు ఆడిన తీరుకు దేశం గ‌ర్వ‌ప‌డుతోంద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

క్రీడాకారుల‌తో సంభాష‌ణ ముగింపు సంద‌ర్భంగా మాట్లాడుతూ , ఈ జ‌ట్టు థామ‌స్ కప్ గెలుచుకోవ‌డం ద్వారా దేశానికి అద్భుత ఎన‌ర్జీ ని అందించింద‌ని అన్నారు. ఏడు ద‌శాబ్దాల క‌ల ఇప్ప‌టికి సాకారం అయింద‌ని అన్నారు. బ్యాడ్మింట‌న్ గురించి అవ‌గాహ‌న ఉన్నావారు ఎవ‌రైనా ఈ విజ‌యాన్ని సాధించాల‌ని క‌ల‌గంటార‌ని ఈ క‌ల‌ని మీరు సాకారం చేశారు అని క్రీడాకారుల‌ను ప్ర‌ధాన‌మంత్రి అభినందించారు. ఇలాంటి విజ‌యాలు, క్రీడారంగంలో అద్భుత ఆత్మ‌విశ్వాసాన్ని , కొత్త శ‌క్తిని పాదుకొల్పుతాయన్నారు. , మ‌హా మ‌హా కోచ్‌లు , లేదా నాయ‌కుల వాక్ చాతుర్యంవ‌ల్ల సాధించ‌లేని విజ‌యాన్ని మీరు సాధించారు అని ఆయ‌న క్రీడాకారుల‌ను కొనియాడారు..

ఉబెర్ క‌ప్ గురించి ప్ర‌స్తావిస్తూ, ప్ర‌ధాన‌మంత్రి, మ‌నం విజ‌యం కోసం ఎదురు చూస్తున్నామంటే, అందుకు మ‌నం త‌గిన ఏర్పాట్లు కూడా చేయాల‌ని అన్నారు. ప్ర‌స్తుతం అద్భుత ప్ర‌తిభ క‌లిగిన క్రీడాకారులు త్వ‌ర‌లోనే మంచి ఫ‌లితాలు సాధించ‌నున్నార‌న్నారు. మ‌న మ‌హిళా జ‌ట్టు ఎప్ప‌టిక‌ప్పుడు అద్భుత ప్ర‌తిభ చూపుతూ వ‌స్తోంది. కాస్త స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చు. ఈ సారి కాక‌పోతే వ‌చ్చేసారి త‌ప్ప‌కుండా మ‌నం విజ‌యం సాధిస్తాం అని ఆయ‌న అన్నారు.

దేశం స్వాంతంత్రం సాధించి 75 సంవత్స‌రాలు గడుస్తున్న స‌మ‌యంలో మ‌న క్రీడాకారులు సాధించిన ఈ విజ‌యాలు , దేశంలోని ప్ర‌తి పౌరుడిని గ‌ర్వప‌డేట్టు చేస్తున్నాయి. ఇప్పుడు దేశ ప్ర‌జ‌లు నేను ఏదైనా సాధించ‌గ‌ల‌ను అనే విధంగా ఉన్నార‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. పోటీని ప‌క్క‌న పెట్టి ఎవ‌రికి వారు త‌మ ప‌నితీరుపై దృష్టిపెట్ట‌వ‌ల‌సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని ఆయ‌న అన్నారు. ఇప్పుడు అంచ‌నాల ఒత్తిడి పెరుగుతుంద‌ని , అయితే ఆ ఒత్తిడిని శ‌క్తిగా మ‌లుచుకోవాల‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. దీనిని ప్రోత్సాహంగా భావించాల‌ని ఆయ‌న చెప్పారు.
గ‌త 7-8 సంవ‌త్స‌రాల‌లొమ‌న క్రీడాకారులు స‌రికొత్త రికార్డుల‌ను లిఖించార‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ఒలింపిక్స్‌,పారా ఒలింపిక్స్‌, డెఫిలింపిక్స్ ల‌లో మ‌న క్రీడాకారులు అద్భుత ప్ర‌తిభ చూపార‌ని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. ఇవాళ క్రీడ‌ల‌కు సంబంధించిన ఆలోచ‌న‌లో మార్పు వ‌స్తోంద‌ని అంటూ ప్ర‌ధాన‌మంత్రి, దేశంలో కొత్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతోంద‌న్నారు. ఇది భార‌త‌దేశ క్రీడారంగ చ‌రిత్ర‌లో సువ‌ర్ణాధ్యాయం అని ఆయ‌న అన్నారు. ఈ చ‌రిత్ర‌ను లిఖించ‌డానికి మీ త‌రం క్రీడాకారులు, మీరే సార‌థుల‌ని ఆయ‌న వారిని కొనియాడారు. ఈ ఉత్సాహం ఇలా కొన‌సాగుతూ ముందుకు పోవాల‌ని అంటూ దేశంలోని క్రీడాకారులంద‌రికీ అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తు నిస్తామ‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures

Media Coverage

India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948
December 03, 2024

The Prime Minister Shri Narendra Modi lauded the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948 in Rajya Sabha today. He remarked that it was an important legislation which will boost energy security and also contribute to a prosperous India.

Responding to a post on X by Union Minister Shri Hardeep Singh Puri, Shri Modi wrote:

“This is an important legislation which will boost energy security and also contribute to a prosperous India.”