నేటికాలపు నూతన భారతదేశం పతకాల కోసం తన క్రీడాకారులపై ఒత్తిడి తీసుకురాదు గానీ వారువారి ఉత్తమమైన ఆటతీరు ను అందిస్తారని ఆశిస్తుంది: ప్రధాన మంత్రి
మనపల్లెలు, మన సుదూర ప్రాంతాలు ప్రతిభ తో నిండిఉన్నాయి; మరి మన పారా ఎథ్ లీట్ ల దళం దీనికి సజీవ ఉదాహరణ గా ఉంది: ప్రధాన మంత్రి
ప్రస్తుతం దేశం ఆటగాళ్ల చెంతకు చేరాలని ప్రయత్నిస్తున్నది; గ్రామీణ ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ ను తీసుకోవడం జరుగుతోంది: ప్రధాన మంత్రి
స్థానికప్రతిభ ను గుర్తించడం కోసం ఖేలో ఇండియా సెంటర్ ల సంఖ్య ను ఇప్పుడు ఉన్న 360 నుంచి 1000 కిచేర్చడం జరుగుతుంది: ప్రధాన మంత్రి
భారతదేశంలో క్రీడా సంస్కృతి ని అభివృద్ధి పరచడం కోసం మన పద్ధతుల ను, మనవ్యవస్థ ను మెరుగుపరుచుకొంటూనే ఉండాలి, ఇది వరకటి తరం లో ఉన్న భయాల నువదలించుకోవాలి: ప్రధాన మంత్రి
దేశంఅరమరికలు లేనటువంటి మనస్సు తో తన క్రీడాకారుల కు సాయం చేస్తోంది: ప్రధాన మంత్రి
మీరు ఏరాష్ట్రాని కి, ఏ ప్రాంతాని కి చెందిన వారు అయినా, మీరుమాట్లాడేది ఏ భాష అయినా, అన్నింటి కంటే మిన్న ఏమిటి అంటే అదిమీరు ప్రస్తుతం టీమ్ ఇండియా లో భాగం కావడం. ఈ భావన మన సమాజం లో ప్రతి ఒక్క స్థాయి లో
టోక్యో 2020 పారాలింపిక్ గేమ్స్ కు వెళ్తున్న భారతదేశ పారా ఎథ్ లీట్ దళం తో మాట్లాడిన ప్రధాన మంత్రి
నేటికాలపు నూతన భారతదేశం పతకాల కోసం తన క్రీడాకారులపై ఒత్తిడి తీసుకురాదు గానీ వారువారి ఉత్తమమైన ఆటతీరు ను అందిస్తారని ఆశిస్తుంది: ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టోక్యో 2020 పారాలింపిక్ గేమ్స్ కు వెళ్తున్న భారతదేశ పారా ఎథ్ లీట్ దళం సభ్యుల తో, వారి కుటుంబాల తో, శిక్షకుల తో, సంరక్షకుల తో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న సమవేశమయ్యారు. ఈ సందర్భం లో క్రీడలు, యువజన వ్యవహారాలు, సమాచారం - ప్రసార శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ కూడా హజరు అయ్యారు.

 

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ పారా ఎథ్ లీట్ ల సంకల్ప శక్తి ని, వారి ఆత్మ విశ్వాసాన్ని ప్రశంసించారు. ఈ సారి పారాలింపిక్ గేమ్స్ కు అతి పెద్ద సంఖ్య లో క్రీడాకారుల దళం బయలుదేరి వెళ్తుండడానికి సంబంధించిన ఖ్యాతి వారి కఠోర శ్రమ దే అని ఆయన అన్నారు. పారా ఎథ్ లీట్ లతో భేటీ అయిన తరువాత టోక్యో 2020 పారాలింపిక్స్ గేమ్స్ లో భారతదేశం ఒక చరిత్ర ను సృష్టిస్తుందని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు. నేటి కాలపు నూతన భారతదేశం పతకాల కోసం క్రీడాకారుల పైన, క్రీడాకారిణుల పైన ఒత్తిడి ని తీసుకు రాదని, అయితే వారు వారి అత్యుత్తమమైన రీతి లో రాణిస్తారని ఆశపడుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ఇటీవలి ఒలింపిక్స్ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ క్రీడాకారులు వారు గెలిచినా గాని, లేదా అలా జరగకపోయినా గాని వారి ప్రయాస ల వెన్నంటి దేశం గట్టి గా నిలబడింది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ఈ రంగం లో శారీరిక బలానికి తోడు మానసిక బలాని కి ఉన్న ప్రాధాన్యాన్ని గురించి ప్రధాన మంత్రి చర్చించారు. పారా ఎథ్ లీట్ లు వారి పరిస్థితుల ను అధిగమించి ముందుకు సాగిపోతుండడాన్ని ఆయన పొగడారు. అనుభవం కొరవడడం, కొత్త స్థలం, కొత్త వ్యక్తులు, అంతర్జాతీయ సెట్టింగుల తాలూకు ఒత్తిడి వంటి అంశాల ను దృష్టి లో పెట్టుకొని ఈ దళం సభ్యుల కు స్పోర్ట్స్ సైకాలజీ కి సంబంధించి చర్చాసభలు, వర్క్ శాపుల ద్వారా మూడు సమావేశాల ను నిర్వహించడమైందని ఆయన అన్నారు.

 

మన గ్రామాల లో, సుదూర ప్రాంతాల లో ప్రతిభ పుష్కలం గా ఉందని, మరి మన పారా ఎథ్ లీట్ ల దళం దీనికి ఒక సజీవ ఉదాహరణ గా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. మనం మన యువత ను గురించి ఆలోచించవలసి ఉంది; మరి వారు అన్ని రంగాల సదుపాయాల ను, వనరుల ను అందుకొనేటట్లుగా జాగ్రత్త తీసుకోవలసి ఉంది అని ఆయన అన్నారు. ఈ రంగాల లో పతకాల ను గెలిచే శక్తి యుక్తులు ఉన్నటువంటి యువ ఆటగాళ్లు అనేక మంది ఉన్నారని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం దేశం వారి వద్దకు చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది; గ్రామీణ ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతూ ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. స్థానిక ప్రతిభావంతులను గుర్తించడం కోసం 360 ఖేలో ఇండియా సెంటర్ లను స్థాపించడం జరిగిందని ప్రధాన మంత్రి తెలిపారు. త్వరలోనే ఈ సెంటర్ ల సంఖ్య 1000 కి చేరుకొంటుందని ఆయన అన్నారు. పరికరాలు, మైదానాలు, ఇతర వనరులు, మౌలిక సదుపాయాల ను క్రీడాకారులకు, క్రీడాకారిణుల కు అందుబాటు లోకి తీసుకు రావడం జరుగుతుంది అని ఆయన అన్నారు. దేశం తన క్రీడాకారులకు అరమరికల కు తావు ఇవ్వనటువంటి హృదయం తో సాయపడుతోందని చెప్పారు. ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్’ ద్వారా దేశం అవసరమైన సదుపాయాలను సమకూర్చిందని, లక్ష్యాల ను కూడా ఏర్పరచిందని ప్రధాన మంత్రి అన్నారు.

అగ్ర స్థానానికి చేరుకోవడం కోసం మనం పాత తరం మనసుల లో గూడు కట్టుకొన్న భయాలను విడనాడవలసి ఉంది అని ప్రధాన మంత్రి మరీ మరీ చెప్పారు. ఆ కాలం లో సంతానం లో ఎవరికి అయినా క్రీడల పట్ల ఆసక్తి ఉంది అంటే గనక, ఒక క్రీడ లేదా రెండు క్రీడల లో వినా ఎటువంటి వృత్తి పరమైన అవకాశాలు లేవే అని కుటుంబాలు భయానికి లోనయ్యాయని ఆయన అన్నారు. ఈ అభద్రత ను పటాపంచలు చేయవలసిన అవసరం ఉంది అని ఆయన అన్నారు. భారతదేశం లో క్రీడల సంస్కృతి ని అభివృద్ది పరచడం కోసం మరి మన పద్ధతుల ను, మన వ్యవస్థ ను మనం మెరుగుపరచుకొనే తీరాలి అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. అంతర్జాతీయ క్రీడల కు ప్రోత్సాహం లభించడం వల్ల సాంప్రదాయక క్రీడ లు ఒక కొత్త గుర్తింపు నకు నోచుకొంటున్నాయి అని ఆయన గుర్తుకు తీసుకు వచ్చారు. మణిపుర్ లోని ఇమ్ఫాల్ లో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు, నూతన జాతీయ విద్య విధానం లో క్రీడల కు ఒక హోదా, అలాగే ఖేలో ఇండియా మూవ్ మంట్ ల వంటివి ఆ దిశ లో కీలకమైన అడుగు లు అంటూ ఆయన అభివర్ణించారు.

 

క్రీడాకారులు, క్రీడాకారిణులు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడల కు అతీతం గా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ స్ఫూర్తి ని బలోపేతం చేయాలి అని ప్రధాన మంత్రి సూచించారు. ‘‘మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారు అయినప్పటికీ, మీరు ఏ ప్రాంతానికి చెందిన వారు అయినప్పటికీ, మీరు ఏ భాష ను మాట్లాడుతున్న వారు అయినప్పటికీ.. వీటన్నింటి కి మించి.. ప్రస్తుతం మీరు ‘టీమ్ ఇండియా’ లో ఒక భాగం గా ఉన్నారు. ఈ భావన మన సమాజం లో ప్రతి ఒక్క స్థాయి లో అణువణువునా నిండిపోవాలి’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

 

ఇంతకు మునుపు దివ్యాంగ జనుల కు సదుపాయాల ను ఇవ్వడం అనేది సంక్షేమ చర్య గా భావించడం జరిగిందని, ప్రస్తుతం దీనిని దేశం తన బాధ్యతల లో ఒక భాగం గా మలచడానికి కృషి చేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కారణంగానే దివ్యాంగ జనుల కు సంపూర్ణ భద్రత ను అందించడం కోసం ‘ద రైట్స్ ఫార్ ఫర్సన్స్ విత్ డిసెబిలిటిస్’ వంటి ఒక చట్టాన్ని పార్లమెంట్ తీసుకు వచ్చిందని పేర్కొన్నారు. ఈ కొత్త ఆలోచన కు ‘సుగమ్య భారత్ క్యాంపెయిన్’ అతి పెద్ద ఉదాహరణ గా ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం వందల కొద్దీ ప్రభుత్వ భవనాలను, రైల్వే స్టేశన్ లను, రైలు పెట్టెల ను, దేశం లోని విమానాశ్రయాల ను ఇతరేతర మౌలిక సదుపాయాల ను దివ్యాంగులకు అనువుగా ఉండేటట్లు తీర్చిదిద్దడం జరుగుతోందని ఆయన అన్నారు. భారతీయ సంజ్ఞల భాష తాలూకు ప్రామాణిక నిఘంటువు, ఎన్ సిఇఆర్ టి యొక్క సంజ్ఞ భాష అనువాదం ల వంటి ప్రయాస లు జీవనం లో మార్పు ను తీసుకు వస్తున్నాయని, దేశం అంతటా అసంఖ్యాకంగా ఉన్న ప్రతిభా వంతులకు విశ్వాసాన్ని ప్రసాదిస్తున్నాయని చెబుతూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

వేరు వేరు క్రీడా విభాగాలు తొమ్మిదింటి కి చెందిన 54 మంది పారా ఎథ్ లీట్ లు దేశ ప్రజల కు ప్రాతినిధ్యం వహిస్తూ టోక్యో కు బయలుదేరి వెళ్లనున్నారు. ఇది పారా లింపిక్ గేమ్స్ లో పాలుపంచుకోనున్న భారతదేశం దళాలు అన్నింటి లోకి అతి పెద్ద దళం గా ఉంది.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi