ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘రాష్ట్రీయ బాల్ పురస్కార్‘ స్వీకర్తల తో ఈ రోజు న ఇక్కడ సంభాషించారు.
ఈ అవార్డుల ను భారత రాష్ట్రపతి 2020వ సంవత్సరం జనవరి 22వ తేదీ న ప్రదానం చేశారు. అవార్డు గ్రహీత లు గణతంత్ర దినోత్సవ సైనిక ప్రదర్శన లో కూడా పాలు పంచుకోనున్నారు.
జమ్ము & కశ్మీర్, మణిపుర్ మరియు అరుణాచల్ ప్రదేశ్ నుండి ఒక్కొక్కరు సహా భారతదేశం లోని వివిధ రాష్ట్రాల నుండి 49 మంది అవార్డు స్వీకర్తల లో ఉన్నారు. ఈ బాలలు కళలు & సంస్కృతి, నూతన ఆవిష్కరణ, విద్యా సంబంధమైన కార్యసాధన, సామాజిక సేవ, క్రీడలు మరియు సాహసం రంగాల లో విజేతలు గా నిలచారు. జాతి నిర్మాణం లో అతి ముఖ్యమైన భాగస్వాముల లో బాలలు కూడా ఒకరు అనే విషయాన్ని భారత ప్రభుత్వం అంగీకరిస్తున్నది. ఈ దిశ గా వివిధ రంగాల లో మన బాలల అసామాన్య కార్యసాధనల ను గుర్తించడం కోసం ప్రభుత్వం కళలు & సంస్కృతి, నూతన ఆవిష్కరణ, విద్యా సంబంధమైన కార్యసాధన, సామాజిక సేవ, క్రీడలు మరియు సాహసం రంగాల లో ప్రతి ఏటా ఈ పురస్కారాల ను ప్రదానం చేస్తున్నది.
వేరు వేరు రంగాల లో బాలల అసామాన్య కార్యసిద్ధుల ను ప్రధాన మంత్రి మెచ్చుకొంటూ, అంత లేత ప్రాయం లోనే వారు సాధించింది అబ్బురం గా ఉందన్నారు.
‘‘సమాజం పట్ల మరియు దేశం పట్ల మీ యొక్క విధుల ను మీరు నెరవేర్చుతున్న తీరు ను గమనించటం నాకు గర్వం గా ఉంది. మన యువ సన్నిహిత మిత్రుల సాహస గాథ లు మరియు కార్యసాధన ల గురించి నేను వింటున్నప్పుడు ఆ సంగతులు నాకు అదనపు శక్తి ని ప్రసాదించి, మరింత గా కష్టపడేటందుకు దన్ను గా నిలుస్తున్నాయి’’ అని వివరించారు.
थोड़ी देर पहले आप सभी का परिचय जब हो रहा था, तो मैं सच में हैरान था। इतनी कम आयु में जिस प्रकार आप सभी ने अलग-अलग क्षेत्रों में जो प्रयास किए, जो काम किया है, वो अदभुत है: PM @narendramodi pic.twitter.com/L0PE4XYiGv
— PMO India (@PMOIndia) January 24, 2020
आप अपने समाज के प्रति, राष्ट्र के प्रति अपनी ड्यूटी के लिए जिस प्रकार से जागरूक हैं, ये देखकर गर्व होता है: PM @narendramodi pic.twitter.com/USU0Wo2Y5N
— PMO India (@PMOIndia) January 24, 2020
मैं आप सभी युवा साथियों के ऐसे साहसिक काम के बारे में जब भी सुनता हूं, आपसे बातचीत करता हूं, तो मुझे भी प्रेरणा मिलती है, ऊर्जा मिलती है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 24, 2020