‘‘భారతదేశం యొక్క నాగరకత, సంస్కృతి, విశ్వాసం మరియు ధర్మం ల కోసం గురుగోబింద్ సింహ్ జీ యొక్క సాహిబ్ జాదా లు చేసిన త్యాగం పోల్చలేనటువంటిది’’
‘‘ప్రస్తుతం స్టార్ట్-అప్స్ జగతి లో రాణిస్తున్న భారతదేశ యువత ను చూస్తూ ఉంటేమనలో గర్వం కలుగుతుంది.  భారతదేశం యొక్క యువజనులు నూతన ఆవిష్కరణల ద్వారా దేశాన్నిముందుకు తీసుకు పోవడాన్ని చూస్తూ ఉంటే మనం గర్వపడతాం’’
‘‘ఇదే కదా ఆ న్యూ ఇండియా; ఏ న్యూ ఇండియా అయితే నూతన ఆవిష్కరణ ల పథంనుంచి వెనుదీయదో.  ధైర్య సాహసాలు, దృఢ దీక్ష నేటి భారతదేశాని కి గుర్తింపుచిహ్నం గా నిలుస్తున్నాయి’’
‘‘టీకాకరణ కార్యక్రమం లో భారతదేశం బాలలు వారి ఆధునికమైనమరియు శాస్త్రీయమైన స్వభావాన్ని చాటుకొన్నారు.  జనవరి 3వ తేదీ నాటి నుంచి కేవలం 20 రోజుల లోపల 40 మిలియన్ మందికి పైగా బాలలు కరోనా వేక్సీన్ను వేయించుకొన్నారు’’

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (పిఎమ్ఆర్ బిపి) గ్రహీతల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. 2021వ సంవత్సరం మరియు 2022వ సంవత్సరానికి గాను పిఎమ్ఆర్ బిపి విజేతల కు డిజిటల్ సర్టిఫికెట్ లను బ్లాక్ చైన్ టెక్నాలజీ ని ఉపయోగించి ప్రదానం చేయడమైంది. పురస్కార విజేతల కు ధ్రువ పత్రాల ను ఇవ్వడం కోసం ఈ సాంకేతిక విధానాన్ని మొట్టమొదటిసారి గా వినియోగించడం జరిగింది. ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో మహిళ లు మరియు బాలల వికాసం శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ, సహాయ మంత్రి డాక్టర్ ఎమ్. మహేంద్రభాయి కూడా ఉన్నారు.

మధ్యప్రదేశ్ లోని ఇందౌర్ కు చెందిన చిరంజీవి అవీ శర్మ తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, రామాయణాని కి సంబంధించిన వేరు వేరు విషయాల లో అతడు గొప్ప పట్టు ను చాటుకోవడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకోగోరారు. లాక్ డౌన్ కాలం లో రామాయణ ధారావాహిక ను ప్రసారం చేయాలన్న నిర్ణయాన్నుంచి తాను ప్రేరణ ను పొందినట్లు మాస్టర్ అవీ శర్మ బదులిచ్చాడు. తన రచన లో నుంచి కొన్ని ద్విపదల ను కూడా మాస్టర్ అవీ ఈ సందర్భం లో వల్లించాడు. సుశ్రీ ఉమా భారతి గారు బాలిక గా ఉన్న కాలం లో, ఆమె సమర్పించిన ఒక కార్యక్రమానికి తాను వెళ్లి ఆమె చెప్పింది విన్నానని, ఆ కార్యక్రమం లో ఆమె అపార ఆధ్యాత్మిక గాఢత ను, జ్ఞ‌ానాన్ని కనబరచారని ప్రధాన మంత్రి వివరించారు. మధ్య ప్రదేశ్ గడ్డ లోనే ఆ తరహా బాల్య ప్రౌ
ఢిమ కు తావు ను ఇచ్చేది ఏదో ఉంది అని ఆయన అన్నారు. చిరంజీవి అవీ యే ఒక ప్రేరణ గా నిలుస్తున్నట్లు, అంతేకాకుండా పెద్ద పెద్ద కార్యాలను పూర్తి చేయాలి అంటే ఆ విషయం లో మీరు ఎన్నటికీ చిన్న వారు కానే కాదు అనే నానుడి కి ఒక ఉదాహరణ గా కూడా ఉన్నట్లు ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

కర్నాటక కు చెందిన కుమారి రెమోన ఇవెట్ పరేరా తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, భారతదేశం యొక్క నాట్యం పట్ల ఆమె కు ఉన్నటువంటి ఉద్వేగాన్ని గురించి చర్చించారు. ఆ అమ్మాయి తన ఉద్వేగాన్ని అనుసరించడం లో ఎదుర్కొన్న కష్టాలు ఏమేమిటి అనేది ఆయన తెలుసుకోదలచారు. ఆ అమ్మాయి తల్లి తన కు ఎదురైన ప్రతికూలతల ను ఉపేక్షించి మరీ తన కుమార్తె కలల ను పండించుకొనటట్టు చూశారు అంటూ రెమోన తల్లి ని ప్రధాన మంత్రి అభినందించారు. రెమోన కార్యసాధనలు ఆమె వయస్సు కంటే ఎంతో పెద్దవి అని ప్రధాన మంత్రి అన్నారు. ఘనమైన దేశం యొక్క శక్తి ని ప్రదర్శించేటటువంటి ఒక మార్గం గా ఆమె కళారూపం ఉంది అని ఆ అమ్మాయి తో ప్రధాన మంత్రి అన్నారు.

త్రిపుర కు చెందిన కుమారి పుహాబి చక్రబర్తి తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, కోవిడ్ కు సంబంధించిన ఆమె నూతన ఆవిష్కరణ గురించిన వివరాలను తెలుసుకోదలచారు. క్రీడాకారుల కోసం తాను రూపొందించిన ఫిట్ నెస్ ఏప్ ను గురించి ప్రధాన మంత్రి కి ఆమె తెలిపారు. తన ప్రయాస లో పాఠశాల నుంచి, స్నేహితుల దగ్గరి నుంచి, ఇంకా తల్లితండ్రుల దగ్గర నుంచి అందిన మద్ధతు ఎటువంటిది అంటూ ప్రధాన మంత్రి అడిగారు. కొత్త కొత్త యాప్ లను అభివృద్ధి పరచడం తో పాటుగా క్రీడల కు కూడా కాలాన్ని కేటాయించడం కోసం ఎటువంటి సమతుల్యత ను పాటిస్తున్నారు అంటూ ప్రధాన మంత్రి ఆమె ను అడిగారు.

బిహార్ లోని పశ్చిమ చంపారణ్ కు చెందిన చిరంజీవి ధీరజ్ కుమార్ తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఒక మొసలి దాడి బారి నుంచి తన చిట్టి తమ్ముడి ని అతడు ఎలా కాపాడిందీ తనకు తెలియ జేయాలని కోరారు. తన తమ్ముడి ని రక్షించే సమయం లో అతడి మది లో మెదలిన భావాలు, మరి అలాగే ప్రస్తుతం తన కు దక్కిన ఖ్యాతి ఎలా ఉన్నాయో ప్రధాన మంత్రి ప్రశ్నించారు. ఆ అబ్బాయి ధైర్య సాహసాల ను, చాకచక్యాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. దేశాని కి ఒక జవాను గా తాను సేవ చేయాలనుకొంటున్నట్లు ప్రధాన మంత్రి కి చిరంజీవి ధీరజ్ తెలియజేశాడు.

పంజాబ్ కు చెందిన చిరంజీవి మేధాంశ్ కుమార్ గుప్త తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, కోవిడ్ అంశాల కు సంబంధించిన ఒక ఏప్ ను ఎలా రూపొందించావు అంటూ అడిగారు. మేధాంశ్ వంటి బాలల్లో నవ పారిశ్రామికత్వాన్ని ప్రోత్సహించాలన్న ప్రభుత్వ ప్రయాస లు ఫలిస్తున్నాయని, మరి అంతేకాకుండా ఉద్యోగాల ను కోరుకొనే కంటే ఉద్యోగాల ను ఇవ్వాలి అనేటటువంటి ఒక ధోరణి బాగా బలపడుతోంది అనే విషయాన్ని తాను గమనించినట్లు ప్రధాన మంత్రి ఈ సందర్భం లో చెప్పారు.

చండీగఢ్ కు చెందిన బాలిక తరుశి గౌర్ తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, చదువుల కు మరియు ఆటల కు మధ్య సమతూకం అనే అంశం లో ఆ అమ్మాయి అభిప్రాయం ఏమిటనేది తెలుసుకోగోరారు. బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కామ్ గారి ని తరుశి ఎందుకు తన ఆదర్శం గా భావిస్తున్నదో ప్రధాన మంత్రి తెలుసుకోదలచారు. మేరీ కామ్ గారి కి శ్రేష్ఠత్వం పట్ల ఉన్న నిబద్ధత తో పాటు ఒక క్రీడాకారిణి గా, ఒక మాతృమూర్తి గా ఆవిడ లో ఉట్టిపడుతున్న సమతుల్యత తనను ఆకట్టుకున్నట్లు ప్రధాన మంత్రి కి కుమారి తరుశి గౌర్ తెలియజేశారు. క్రీడాకారుల కోసం అవసరమైన సదుపాయాల ను అన్నిటిని కల్పించడానికి, మరి అదే విధం గా ప్రతి స్థాయి లో గెలవాలి అనేటటువంటి ఒక మనస్తత్వాన్ని అంకురింప చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకొందని ప్రధాన మంత్రి అన్నారు.

కార్యక్రమం లో పాల్గొన్నవారి ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ పురస్కారాల ను దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకొంటున్న ముఖ్యమైనటువంటి కాలం లో ప్రదానం చేయడం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకొందని ప్రధాన మంత్రి అన్నారు. గతం నుంచి శక్తి ని పుంజుకొని, అమృత కాలం తాలూకు రాబోయే 25 సంవత్సరాల లో ఘనమైన ఫలితాల ను సాధించడం కోసం ఎవరైనా తన ను తాను సమర్పణ చేసుకోవలసిన తరుణం ఇదే అని ఆయన అన్నారు. జాతీయ బాలిక దివస్ సందర్భం లో దేశం యొక్క కుమార్తెల కు ఆయన అభినందనలు తెలిపారు. స్వాతంత్య్ర పోరాటం తాలూకు వైభవోపేతమైనటువంటి చరిత్ర ను, అలాగే వీర బాల కనకలత బరువా, ఖుదీరామ్ బోస్, ఇంకా రాణి గైడినిలియూ ల తోడ్పాటు ను ప్రధాన మంత్రి స్మరించుకొన్నారు. ‘‘ఈ యోధులు చాలా చిన్న వయస్సు లోనే దేశం యొక్క స్వాతంత్య్రాన్ని వారి జీవన యాత్ర గా మలచుకొని మరి అందుకోసం వారి ని వారు సమర్పణ చేసుకొన్నారు’’ అంటూ ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

స్వాతంత్య్రం అనంతర యుద్ధ కాలం లో శ్రీ బల్ దేవ్ సింహ్ మరియు శ్రీ బసంత్ సింహ్ లు బాల సైనికుల పాత్ర ను పోషించగా గడచిన సంవత్సరం లో దీపావళి పండుగ రోజున జమ్ము, కశ్మీర్ లోని నౌశేరా సెక్టరు ను తాను సందర్శించినప్పుడు వారితో భేటీ కావడాన్ని కూడా ఆయన గుర్తు కు తెచ్చుకున్నారు. వారు చాలా చిన్న వయస్సు లోనే వారి ప్రాణాల ను గురించి పట్టించుకోకుండానే సైన్యాని కి సాయపడ్డారు. ఈ వీరుల సాహసాని కి ప్రధాన మంత్రి నమస్సులు అర్పించారు.

గురు గోబిన్ద్ సింహ్ జీ యొక్క పుత్రులు ప్రదర్శించిన శౌర్యాన్ని, వారు చేసిన త్యాగాన్ని ప్రధాన మంత్రి ఉదాహరణలు గా ఉట్టంకించారు. సాహిబ్ జాదా లు అమితమైన పరాక్రమంతో త్యాగాని కి నడుంకట్టారు. అప్పట్లో వారు లేత వయస్సు లో ఉన్నారు అని ఆయన చెప్పారు. బారతదేశం యొక్క నాగరకత, సంస్కృతి, విశ్వాసం, ఇంకా ధర్మం కోసం వారు చేసిన త్యాగం సాటి లేనిదని ఆయన అన్నారు. ఆ సాహిబ్ జాదా లను గురించి, వారు చేసిన త్యాగం గురించి మరిన్ని విషయాల ను తెలుసుకోవలసింది గా యువజనుల ను ప్రధాన మంత్రి కోరారు.

దిల్లీ లో గల ఇండియా గేట్ కు సమీపం లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ యొక్క డిజిటల్ స్టాట్యూ ను కూడా నెలకొల్పడం జరిగింది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘మనం మన అతి పెద్దదైన ప్రేరణ ను నేతాజీ వద్ద నుంచి పొందుతున్నాం. అది ఏమిటి అంటే మొట్టమొదటి ప్రాధాన్యం దేశాని కి సేవ చేయాలనేదే. నేతాజీ నుంచి స్ఫూర్తి ని పొంది, మీరు దేశం కోసం సేవ చేయడం అనే మార్గం లో ముందుకు సాగిపోవలసి ఉంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఏ రంగం లో అయినా గాని, విధానాల లో, కార్యక్రమాల లో గాని యువత ను కేంద్ర స్థానం లో నిలపడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సందర్భం లో స్టార్ట్-అప్ ఇండియా, స్టాండ్-అప్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లతో పాటు ఆత్మనిర్భర్ భారత్ యొక్క ప్రజా ఉద్యమం, ఇంకా ఆధునికమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన మొదలైన కార్యక్రమాల ను ఆయన ప్రస్తావించారు. ఇది భారతదేశం లోని యువజనుల వేగాని కి సరిపోయేది గా ఉంది. భారతదేశం లోని యువత దేశ విదేశాల లో ఈ విధం గా ఒక సరికొత్త చరిత్ర కు నాయకత్వం వహిస్తున్నారు అని ఆయన అన్నారు. నూతన ఆవిష్కరణ రంగం లో, స్టార్ట్-అప్ రంగం లో భారతదేశం సామర్ధ్యం పెరుగుతూ ఉన్న సంగతి ని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ప్రపంచం లో ప్రధానమైన కంపెనీల కు భారతదేశాని కి చెందిన యువ సిఇఒ లు నాయకత్వం వహిస్తున్న వాస్తవాన్ని గమనించి దేశ ప్రజలు గర్విస్తున్నారు అని ఆయన చెప్పారు. ‘‘స్టార్ట్-అప్ జగతి లో భారతదేశానికి చెందిన యువతీయవకులు రాణిస్తూ ఉండటాన్ని చూసినప్పుడల్లా మనకు గర్వం గా అనిపిస్తుంది. ఈ రోజు న భారతదేశం యొక్క యువత నూతన ఆవిష్కరణల తో దేశాన్ని ముందుకు తీసుకుపోతూ ఉండటాన్ని చూసినప్పుడు అందుకు గాను మనం గర్వపడుతున్నాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ఇదివరకు కుమార్తె ల ప్రవేశాని కి అనుమతి అయినా ఇవ్వనటువంటి రంగాల లో కుమార్తె లు ప్రస్తుతం ఆశ్చర్యకరమైన ఫలితాల ను సాధిస్తున్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఇదే న్యూ ఇండియా. ఈ న్యూ ఇండియా నూతన ఆవిష్కరణ ల నుంచి వెనుకంజ వేయదు; ధైర్యం, దృఢ సంకల్పం అనేవి ప్రస్తుతం భారతదేశాని కి ప్రమాణచిహ్నాలు గా ఉన్నాయి అని ఆయన అన్నారు.

భారతదేశం లోని బాలలు టీకాకరణ కార్యక్రమం లో కూడా ఆధునికమైనటువంటి మరియు శాస్త్రీయ పరమైనటువంటి ఆలోచన విధానాన్ని చాటిచెప్పడాన్ని ప్రధాన మంత్రి పొగడారు. జనవరి 3వ తేదీ మొదలుకొని, కేవలం 20 రోజుల లోపల 40 మిలియన్ మంది కి పైగా బాలలు కరోనా వేక్సీన్ ను ఇప్పించుకొన్నారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్ లో నాయకత్వాని కి కూడాను వారిని ఆయన ప్రశంసించారు. వోకల్ ఫార్ లోకల్ కు ఒక ఎంబేసడర్ గా ఉండాలని, ఆత్మనిర్భర్ భారత్ ప్రచార ఉద్యమానికి నాయకత్వాన్ని వహించాలంటూ వారికి ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."