“Hackathon is a learning opportunity for me too and I eagerly look forward to it”
“India of 21st century is moving forward with the mantra of ‘Jai Jawan, Jai Kisan, Jai Vigyan and Jai Anusandhan’”
“Today we are at a turning point in time, where every effort of ours will strengthen the foundation of the India of the next thousand years”
“The world is confident that in India it will find low-cost, quality, sustainable and scalable solutions to global challenges”
“Understand the uniqueness of the current time as many factors have come together”
“Our Chandrayaan mission has increased the expectations of the world manifold”
“Through Smart India Hackathon, the youth power of the country is extracting the Amrit of solutions for developed India”

స్మార్ట్ ఇండియా హాకథన్ 2023 గ్రాండ్ ఫినాలి లో పాలుపంచుకొన్న వ్యక్తుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా సమావేశం కావడంతో పాటు వారి ని ఉద్దేశించి ప్రసంగించారు.

బొగ్గు మంత్రిత్వ శాఖ ద్వారా వచ్చిన సమస్యాత్మక వివరణ అయిన ‘ట్రాన్స్ పోర్టేశన్ ఎండ్ లాజిస్టిక్స్’ ఇతివృత్తం పై పని చేసిన కర్నాటక లోని మైసూరు కు చెందిన నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇంజీనియరింగ్ ప్రతినిధులు శ్రీ సైకత్ దాస్ తోను, శ్రీ ప్రతీక్ సాహా తోను ప్రధాన మంత్రి మాట్లాడారు. వారు రైల్ వే కార్గో కోసం ఐఒటి-ఆధారిత వ్యవస్థ కు రూపకల్పన చేస్తున్నారు. హాకథన్ అనేది నేర్చుకొనేందుకు తనకు సైతం లభించిన ఒక అవకాశం గా ఉంది అని, ఈ కార్యక్రమం లో పాలుపంచుకొంటున్న వారి తో తాను భేటీ అయ్యి వారి తో మాట్లాడేందుకు ఎంతో కుతూహలం తో ఉన్నానని ప్రధాన మంత్రి వారి కి చెప్పారు. కార్యక్రమం లో పాలు పంచుకొంటున్న వారి మోములు వెలిగిపోతూ ఉండడాన్ని ప్రధాన మంత్రి గమనించి వారి ఉత్సాహం, వారి ఇచ్ఛాశక్తి మరియు దేశ నిర్మాణం కోసం వారి వంతు గా ప్రయాస పడాలన్న వారి యొక్క అభిలాష.. ఇవే భారతదేశం లో యువ శక్తి యొక్క గుర్తింపు చిహ్నాల వలె మారాయని ప్రధాన మంత్రి అన్నారు. బాంగ్లాదేశ్ కు చెందిన విద్యార్థులు కూడా పని చేస్తున్న ఆ బృందం రైలు మార్గం ద్వారా బొగ్గు ను మోసుకు పోయే రైల్ వే కోల్ వేగన్ లలో సరకు ను పరిమితి కంటే తక్కువ గా నింపడం (అండర్ లోడింగ్) వల్లను, సరకు ను పరిమితి కి మించి నింపడం (ఓవర్ లోడింగ్) వల్లను ఎదురయ్యే సమస్యల ను పరిష్కరించడం కోసం ప్రయత్నిస్తున్నట్లుగా ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు వచ్చారు. బొగ్గు వేగన్ ల అండర్ లోడింగ్ మరియు ఓవర్ లోడింగ్ ల కారణం గా అయితే జరిమానాల ను చెల్లించవలసి రావడమో లేదా నష్టాల ను చవిచూడడమో జరుగుతున్నది. ఈ కార్య భారాన్ని వహించిన బృందం లో భారతదేశం నుండి ముగ్గురు సభ్యులు, మరి అలాగే బాంగ్లాదేశ్ నుండి ముగ్గురు సభ్యులు పని చేస్తున్నారు. ఆ బృందం యొక్క ప్రయాస లు ప్రస్తుతం ఒక పరివర్తన పూర్వకమైన దశ లో ఉన్న ఇండియన్ రైల్ వేస్ కు లాభాన్ని అందించగలవన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. లాజిస్టిక్స్ అనేది శ్రద్ధ తీసుకోవలసినటువంటి రంగం గా ఉంది అని ఆయన చెప్తూ, భవిష్యత్తు లో బాంగ్లాదేశ్ నుండి మరింత ఎక్కువ మంది విద్యార్థులు భారతదేశాని కి వస్తారన్న ఆశ ను వెలిబుచ్చారు; ఆ తరహా విద్యార్థులకు ‘స్టడీ ఇన్ ఇండియా’ కార్యక్రమం సహాయకారి గా ఉంటుందని ఆయన అన్నారు.

 

ఇస్ రో (ఐఎస్ఆర్ఒ) కు చెందిన మూన్‌లేండర్ అందుకొన్న మీడియమ్- రెజల్యూశన్ ఇమేజెస్ ను మెరుగు పరచేటటువంటి ప్రాజెక్టు విషయం లో అహమదాబాద్ లోని గుజరాత్ టెక్నలాజికల్ యూనివర్సిటీ కి చెందిన తివారి హర్షిత. ఎస్ గారు మరియు శ్రీ జేఠ్‌వా జయ్. పి గారు లు పాటుపడ్డారు. ఇమేజ్ ప్రాసెసింగు ను మరియు ఎఐ ని ఉపయోగించడం ద్వారా ఆ ఇమేజేస్ ను సుపర్ రెజల్యూశన్ ఇమేజెస్ గా మార్పిడి చేసి చంద్రగ్రహం తాలూకు విపత్తి ప్రభావిత స్థలాల చిత్రపటాన్ని రూపొందించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం. ఈ ప్రాజెక్టు ద్వారా రాబట్టే ఫలితం భావి సాహస యాత్ర లకు మార్గదర్శక బాట ను కనుగొనడం లోను, ఆ గ్రహం మీద ఒక సాఫ్ట్ లేండింగ్ స్పాట్ ను ఖరారు చేయడం లోను సహాయకారి కాగలదు. దేశం లోని వేరు వేరు అంతరిక్ష రంగ సంబంధి స్టార్ట్-అప్స్ నుండి మరియు ఇస్ రో జట్టు నుండి మార్గదర్శకత్వాన్ని, ఇంకా పర్యవేక్షణ పరమైన సహాయాన్ని తీసుకోవలసిందంటూ ప్రధాన మంత్రి సలహా ను ఇచ్చారు. చంద్రయాన్-3 సఫలం అయిన తరువాత భారతదేశం యొక్క అంతరిక్ష కార్యక్రమం ప్రపంచ దేశాల కు ఒక ఆశాకిరణం గా మారిందని, భారతదేశాన్ని విదేశాలు చూసే దృష్టికోణం లో మార్పు ను తీసుకు వచ్చిందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ రంగం లో యువత ముందంజ వేసేందుకు గాను ప్రైవేట్ సెక్టర్ ప్రవేశాని కి అనువు గా ఈ రంగం యొక్క తలుపుల ను తెరవడం జరుగుతోందని ఆయన చెప్తూ, భారతదేశం యొక్క అంతరిక్ష రంగం లో తోడ్పాటు ను అందించ దలచే యువత కు ప్రస్తుత కాలం ఒక పరిపూర్ణమైనటువంటి కాలం అని చెప్పాలి అని ఆయన స్పష్టం చేశారు. ఇస్ రో తన సదుపాయాల ను నవతరం స్టార్ట్-అప్స్ కోసం అందుబాటు లోకి తెస్తోంది అని కూడా ఆయన ప్రస్తావించారు. వారు అహమదాబాద్ లో గల ఇన్-స్పేస్ (IN-SPACe) ప్రధాన కేంద్రాన్ని సందర్శించాలని ఆయన సూచించారు.

ఒడిశా లోని సంబల్‌పుర్ లో గల వీర్ సురేందర్ సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ కి చెందిన శ్రీ అంకిత్ కుమార్ మరియు శ్రీ సైయద్ సిద్ధికీ హుస్సేన్ లు బాలల మానసిక స్వస్థత అనే అంశం లో ఓపెన్ ఇనొవేశన్ విషయమై కృషి చేశారు. వారు ఒక రేటింగు కు రూపకల్పన చేశారు. ఇది ఆ కోవ కు చెందిన శిశువుల తల్లితండ్రుల కు మరియు వైద్య వృత్తి నిపుణుల కు ముందస్తు గా కొన్ని హెచ్చరికల ను చేయడం ద్వారా బాలల సంరక్షణ విషయం లో సహాయకారి గా ఉంటుంది. ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేసిన మీదట ఈ బృందం లోని ఒక సభ్యురాలు ఈ ప్రాజెక్టు ను గురించిన వివరాల ను ఆయన కు తెలియజెప్పారు. ఒక ముఖ్య రంగాన్ని ఎంపిక చేసుకొన్నందుకు బృందం సభ్యుల కు అభినందనల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. యువజనుల లో మానసిక స్వస్థత సంబంధి సమస్య ను గురించి ప్రధాన మంత్రి దీర్ఘం గా మాట్లాడి, అటువంటి అంశాల పై విద్య విభాగం శ్రమించడానికి, మరియు కనుగొన్న పరిష్కారం స్థాయి ని విస్తరించేందుకు ఉన్న అవకాశాల ను అన్వేషించడానికి మరియు అటువంటి అంశాల ను విద్య సంస్థల లో ఆచరణ లో కి తీసుకు రావడానికి ఉండే ప్రాముఖ్యమే వేరు అని నొక్కిపలికారు. ‘‘భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశం గా మలచాలి అంటే అందులో యువ జనుల మానసిక స్వస్థత పాత్ర ముఖ్యం’’ అని ఆయన అన్నారు. మై-ఇండియా (MY-India ) పోర్టల్ ను గురించి కూడా వారి తో ప్రధాన మంత్రి మాట్లాడారు.

   ప్రధానమంత్రితో గువహటిలోని అస్సాం రాయల్ గ్లోబల్ యూనివర్శిటీ నుంచి ఆర్.రేష్మా మస్తుత కృత్రిమ మేధ (ఎఐ) ఉపకరణం ‘భాషిణి’ సాయంతో మాట్లాడారు. తక్షణ భాషానువాదం కోసం ఈ ఉపకరణాన్ని ఇటువంటి కార్యక్రమంలో వినియోగించడం ఇదే తొలిసారి. దక్షిణ భారతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రేష్మా, ఆమె బృందం ‘ఒకే భారతం-శ్రేష్ట భారతం’ స్ఫూర్తికి నిజమైన రాయబారులని ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. వెబ్ అనువర్తనాల ద్వారా జలవిద్యుత్ కేంద్రాల ఇన్‌పుట్-ఆధారిత ‘ఎఐ’ ఉత్పాదక డిజైన్ల తయారీలో ఆమె బృందం కృషి చేసింది. విద్యుచ్ఛక్తి రంగంలో భారతదేశం స్వయం సమృద్ధం కావడంతోపాటు శిలాజ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడంలో ఈ కృషి తోడ్పడుతుంది. దీనిపై ప్రధాని స్పందిస్తూ- విద్యుత్ రంగాన్ని ‘ఎఐ’తో అనుసంధానించే మార్గాన్వేషణ చేయాలని పిలుపునిచ్చారు. ఈ రెండు రంగాలూ వికసిత భారతం స్వప్న సాకారానికి ఎంతో ముఖ్యమైనవని ఆయన పేర్కొన్నారు. అలాగే దేశ భవితను తీర్చిదిద్దడంలో అత్యంతక కీలక రంగాలని స్పష్టం చేశారు. ‘ఎఐ’ ఆధారిత పరిష్కారాల ద్వారా విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని కూడా ప్రధాని నొక్కిచెప్పారు. వీటితోపాటు విద్యుత్ ప్రసారంసహా వినియోగంపై పర్యవేక్షణకూ ఈ పరిజ్ఞనాధారిత పరిష్కారాలు అవశ్యమని స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి కొన్నేళ్లుగా విద్యుత్‌ సరఫరాలో ప్రభుత్వం సాధించిన విజయాన్ని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందులో భాగంగా వ్యవసాయ కమతాల్లో స్వల్ప-స్థాయి సౌరశక్తి ప్లాంట్లు, పట్టణాల్లో ఇళ్ల పైకప్పు ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి  సారించామని తెలిపారు. ఈ ప్రయత్నాలకు ఊపునివ్వడంలోనూ ‘ఎఐ’ పరిష్కారాలకు ప్రాధాన్యం ఉందన్నారు. మరోవైపు ప్రతి ఒక్కరూ ఈశాన్య భారత ప్రాంతాలను సందర్శించాలని ఆయన అభ్యర్థించారు.

 

   ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోగల నోయిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన రిషబ్ ఎస్.విశ్వామిత్ర తన కృషి గురించి వివరించారు. మోసపు వలవేసే (ఫిషింగ్) వెబ్‌సైట్ల‌ను గుర్తించే ‘ఎఐ’ ఆధారిత పరిష్కారాల దిశగా ‘ఎన్‌టిఆర్ఒ’ సాయంతో బ్లాక్‌చెయిన్, సైబర్ భద్రత రంగాల్లో పరిశోధన చేసినట్లు తెలిపారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ- సైబర్ మోసాలకు సంబంధించి ఎదురవుతున్న సరికొత్త సవాళ్లను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు మోసగాళ్లు ఈ కొత్త సాంకేతికతలను వినియోగిస్తుండటంపై మరింత అప్రమత్తత అవసరమన్నారు. సృజనాత్మక ‘ఎఐ’ సాయంతో డీప్ ఫేక్ (నిజమైనవే అనిపించే నకిలీ) వీడియోల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ మేరకు ఏదైనా ఫొటో లేదా వీడియో విశ్వసనీయతను లోతుగా నిర్ధారించుకోవాల్సిందిగా ప్రజలకు సూచించారు. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధకు సంబంధించి అంతర్జాతీయ చట్రం రూపకల్పన దిశగా భారత్ కృషిని ఆయన వివరించారు.

   అనంతరం స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ- దేశ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాన్వేషణలో యువత‌రం అంకితభావంపై ప్రధానమంత్రి హర్షం వెలిబుచ్చారు. మునుపటి హ్యాకథాన్‌ల విజయాలను పునరుద్ఘాటిస్తూ- వాటి ఆధారంగా ఏర్పాటైన వివిధ అంకుర సంస్థలు, అందివచ్చిన పరిష్కారాలు ప్రభుత్వంతోపాటు సమాజానికీ ఎంతో ఉపకరిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుత 21వ శతాబ్దపు మన తారకమంత్రం ‘‘జై జవాన్.. జై కిసాన్.. జై విజ్ఞాన్.. జై అనుసంధాన్’’ను గుర్తు చేస్తూ- ప్రతి భారతీయుడూ యథాతథ స్థితి సంబంధిత జడత్వం నుంచి విముక్తులవుతున్నారని శ్రీ మోదీ అన్నారు. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశాలను ప్రస్తావిస్తూ... మన దేశం సాధించిన విజయాల్లో యూపీఐ, మహమ్మారి సమయంలో టీకాల కార్యక్రమం వగైరాల గురించి ప్రధానమంత్రి వివరించారు.

   యువ ఆవిష్కర్తలు, డొమైన్ నిపుణులనుద్దేశించి మాట్లాడుతూ- రాబోయే వెయ్యేళ్ల దశదిశలను నిర్దేశించే ప్రస్తుత కాల వ్యవధి ప్రాధాన్యాన్ని ప్రధాని పునరుద్ఘాటించారు. ప్రపంచంలో అతి పిన్న వయస్కులు అధికసంఖ్యలోగల దేశాల్లో భారత్ ఒకటని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశంలోని అపార ప్రతిభతోపాటు సుస్థిర-శక్తియుత ప్రభుత్వం, వృద్ధి పథంలో సాగుతున్న ఆర్థిక వ్యవస్థ, శాస్త్ర-సాంకేతిక విజ్ఞానం తదితరాలకు లభిస్తున్న విశేష  ప్రాధాన్యం వంటి అనేక సానుకూలాంశాలతో కూడిన ఈ కాలపు విశిష్టతను అర్థం చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. అలాగే ‘‘సాంకేతిక పరిజ్ఞానం నేటి మన జీవితాల్లో అత్యంత కీలక భాగమైంది’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో యువ ఆవిష్కర్తల పాత్రను నొక్కిచెబుతూ- సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారానే అన్ని రంగాల్లో ఉన్నతీకరణ సాధ్యమని పేర్కొన్నారు.

   భారతదేశంలో రాబోయే 25 ఏళ్ల అమృత కాలం యువ ఆవిష్కర్తల ప్రతిభకు తార్కాణంగా నిలిచే కాలమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. స్వయం సమృద్ధ భారత నిర్మాణం ఒక  సమష్టి లక్ష్యమని నొక్కిచెప్పారు. ఈ మేరకు కొత్తదనాన్ని దిగుమతి చేసుకోవడం, ఇతర దేశాలపై ఆధారపడటం కాకుండా అన్నివిధాలా స్వావలంబన సాధనే లక్ష్యంగా ఉండాలని ఉద్బోధించారు. మన దేశ రక్షణ రంగం ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నదని పేర్కొంటూ- అయినప్పటికీ కొన్ని రక్షణ సాంకేతికతలను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నదని చెప్పారు. ఇక సెమి-కండక్టర్, చిప్ సాంకేతికతలలోనూ స్వావలంబన ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. క్వాంటమ్ సాంకేతిక, ఉదజని ఇంధనం రంగాల్లో భారత్ నిర్దేశించుకున్న ఉన్నత లక్ష్యాలను ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ 21వ శతాబ్దపు ఆధునిక పర్యావరణ వ్యవస్థ రూపకల్పన ద్వారా ప్రభుత్వం ఆయా రంగాలన్నిటికీ ప్రత్యేక ప్రాధాన్యం  ఇస్తున్నదని చెప్పారు. అయితే, ఈ కృషి ద్వారా లక్ష్యం చేరడం యువతరం సాధించే విజయాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

 

   అలాగే ‘‘అనేక అంతర్జాతీయ సవాళ్లకు భారత్‌ తక్కువ వ్యయంతో, నాణ్యమైన, సుస్థిర, అనుసరణీయ పరిష్కారాలను అందించగలదని ప్రపంచం విశ్వసిస్తోంది. ముఖ్యంగా మన చంద్రయాన్ ప్రయోగంతో ఈ అంచనాలు అనేక రెట్లు పెరిగాయి’’ అని ’’ అని యువ ఆవిష్కర్తలకు ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో మన ఆవిష్కరణలు ప్రపంచ ఆకాంక్షలను నెరవేర్చేలా ఉండాలని సూచించారు. ప్రస్తుత హ్యాక‌థాన్ లక్ష్యం గురించి వివ‌రిస్తూ- ‘‘స్మార్ట్ ఇండియా హ్యాక‌థాన్ లక్ష్యం దేశ స‌మ‌స్య‌ల‌ను తీర్చడం... పరిష్కారాల ద్వారా ఉపాధి సృష్టించడం. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని యువశక్తి తమ మేధను మధించి,  వికసిత భారతం పరిష్కారామృతాన్ని వెలికితీస్తోంది’’ అని అభివర్ణించారు. దేశంలో యువశక్తిపై పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రస్తావిస్తూ- ఏదైనా సమస్యకు పరిష్కారం కనుగొనడంలో వికసిత భారతం సంకల్పాన్ని మదిలో ఉంచుకోవాలని ప్రధాని వారికి సూచించారు. ‘‘మీరు ఏం చేసినా అది ఉత్తమమైనది కావచ్చు.. అయితే, ప్రపంచం మిమ్మల్ని అనుసరించేలా మీరు సదరు పనిచేయాలి’’ అని ఉద్బధిస్తూ ప్రధాని మోదీ తన ప్రసంగం ముగించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ వాస్తవిక సాదృశ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

నేపథ్యం

   యువతరం నేతృత్వంలో ప్రగతిపై ప్రధానమంత్రి దూరదృష్టికి అనుగుణంగా ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్’ (ఎస్ఐహెచ్) కార్యక్రమం రూపొందింది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు-విభాగాలు, పరిశ్రమలు, ఇతరత్రా సంస్థల్లో గడ్డు సమస్యలకు పరిష్కారాన్వేషణ దిశగా దేశంలోని విద్యార్థులకు ఇదొక వేదికనందిస్తుంది. తొలిసారి 2017లో ప్రారంభమైన ‘ఎస్ఐహెచ్’కి యువ ఆవిష్కర్తల నుంచి విశేష స్పందన లభించింది. అప్పటినుంచి 5 దఫాలు నిర్వహించిన హ్యాకథాన్ ద్వారా వివిధ రంగాల్లో సమస్యలకు వినూత్న పరిష్కారాలు లభించడంతోపాటు తదనుగుణంగా కొన్ని అంకుర సంస్థలు కూడా ఆవిర్భవించాయి.

   ఈసారి 2023 డిసెంబరు 19 నుంచి 23వ వరకూ భారీస్థాయిలో తుది ‘ఎస్ఐహెచ్’ నిర్వహించబడుతోంది. ఇందులో 44,000 బృందాలు 50,000కుపైగా సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొచ్చాయి. తొలి ‘ఎస్ఐహెచ్’తో పోలిస్తే ఆవిష్కరణ ప్రతిపాదనలు దాదాపు 7 రెట్లు పెరిగాయి. దేశవ్యాప్తంగా 48 నోడల్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న తుది కార్యక్రమంలో 12,000 మంది భాగస్వాములు, 2500 మందికిపైగా ప్రోత్సాహకులు పాల్గొంటున్నారు. అంతరిక్ష విజ్ఞానం, అత్యాధునిక విద్య, విపత్తుల నిర్వహణ, రోబోటిక్స్-డ్రోన్స్, సంస్కృతి-వారసత్వం తదితర ఇతివృత్తాలపై పరిష్కారాలు అందించేందుకు ఈ ఏడాది మొత్తం 1282 బృందాలు ఎంపిక చేయబడ్డాయి.

   ఈ మేరకు 25 కేంద్ర/రాష్ట్ర మంత్రిత్వ శాఖల పరిధిలోని 51 విభాగాల నుంచి వచ్చిన 231 (176 సాఫ్ట్‌ వేర్, 55 హార్డ్‌ వేర్) సమస్యా ప్రతిపాదనలను ఈ బృందాలు పరిశీలించి, పరిష్కారాలను సూచిస్తాయి. కాగా, ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2023’ కింద వినూత్న ఆవిష్కరణలకు రూ.2 కోట్లకుపైగా బహుమతి మొత్తం ప్రకటించబడింది. ఇందులో నుంచి ప్రతి సమస్యపైనా పరిష్కార విజేతగా నిలిచిన ప్రతి జట్టుకు రూ.1 లక్షదాకా నగదు బహుమతి  లభిస్తుంది.

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi visits the Indian Arrival Monument
November 21, 2024

Prime Minister visited the Indian Arrival monument at Monument Gardens in Georgetown today. He was accompanied by PM of Guyana Brig (Retd) Mark Phillips. An ensemble of Tassa Drums welcomed Prime Minister as he paid floral tribute at the Arrival Monument. Paying homage at the monument, Prime Minister recalled the struggle and sacrifices of Indian diaspora and their pivotal contribution to preserving and promoting Indian culture and tradition in Guyana. He planted a Bel Patra sapling at the monument.

The monument is a replica of the first ship which arrived in Guyana in 1838 bringing indentured migrants from India. It was gifted by India to the people of Guyana in 1991.