తీవ్రమైన తుఫాను బురేవి కారణంగా, కేరళ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ తో మాట్లాడారు.
అనంతరం ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "కేరళ రాష్ట్రంలో పెను తుఫాను బురేవి కారణంగా సంభవించిన పరిస్థితులపై కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ (@vijayanpinarayi) గారితో మాట్లాడాను. కేరళకు సహాయం చేయడానికి కేంద్రం నుండి పూర్తి మద్దతు లభిస్తుందని హామీ ఇచ్చాను. దెబ్బతిన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను." అని పేర్కొన్నారు.
Spoke to Kerala CM Shri @vijayanpinarayi Ji on the conditions prevailing due to Cyclonic Storm Burevi in the state. Assured all possible support from the Centre to help Kerala. Praying for the safety and well-being of those staying in the affected areas.
— Narendra Modi (@narendramodi) December 2, 2020