‘‘ప్రస్తుతం, మీ వంటి క్రీడాకారుల లో ఉత్సాహం అధికం గా ఉంది; శిక్షణ కూడామెరుగు పడుతున్నది; మరి క్రీడలంటే దేశం లో వాతావరణం సైతం బ్రహ్మాండం గాఉంది’’
‘‘లక్ష్యమల్లా మువ్వన్నెల పతాకాన్ని ఉన్నతం గా ఎగిరేటట్లు చూడడమూ, జాతీయ గీతం యొక్క ఆలాపన జరుగుతూ ఉంటే దానినిఆలకించడమూ ను’’
‘‘దేశం స్వాతంత్య్రం తాలూకు 75 సంవత్సరాల ను ఒక వేడుక గా జరుపుకొంటున్న తరుణం లో క్రీడాకారులు,క్రీడాకారిణులు కామన్ వెల్థ్ గేమ్స్ కు బయలుదేరి వెళ్తున్నారు’’
‘మీరంతా చక్కటి శిక్షణ ను పొందారు, ప్రపంచం లో అతి ఉత్తమమైనటువంటి సదుపాయాలలో శిక్షణ ను స్వీకరించారు. ఆ శిక్షణ ను మరి మీ ఇచ్ఛా శక్తి ని చాటుకోవలసిన సమయంఆసన్నం అయిందిక’’
మీరు ఇంతవరకు సాధించింది తప్పక ప్రేరణ ను అందించేదే. అయితే ఇక మీరు సరికొత్త గా కనపడుతూ, కొత్త రికార్డుల ను సాధించాలి’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో పాలుపంచుకోవడం కోసం సిద్ధం గా ఉన్న భారతదేశ జట్టు సభ్యుల తో ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా భేటీ అయ్యారు. ఈ కార్యక్రమాని కి అటు క్రీడాకారులు/క్రీడాకారిణులు, ఇటు వారి కోచ్ లు కూడా హాజరు అయ్యారు. యువజన వ్యవహారాలు, క్రీడలు, సమాచారం- ప్రసార శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ తో పాటు క్రీడల కార్యదర్శి కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

అంతర్జాతీయ చదరంగ దినం సందర్భం లో ప్రధాన మంత్రి కామన్ వెల్థ్ గేమ్స్ తాలూకు భారతదేశం జట్టు కు శుభాకాంక్షల ను తెలియజేశారు. చెస్ ఒలింపియాడ్ జులై 28వ తేదీ నాటి నుంచి తమిళ నాడు లో జరుగనుంది. వారు వారి కంటే ముందటి క్రీడాకారులు సాధించిన విధం గానే భారతదేశం గర్వపడేటట్టు చేయాలని ఆయన ఆకాంక్షించారు. మొట్టమొదటి సారి గా 65 మంది కి పైగా క్రీడాకారులు/ క్రీడాకారిణులు ఈ ఆటల పోటీల లో పాలుపంచుకొంటున్నారని ఆయన తెలియజేస్తూ, వారంతా బ్రహ్మాండమైన ప్రభావాన్ని కలుగజేయాలనే ఆకాంక్ష ను వ్యక్తం చేశారు. వారు ‘‘మనసు పెట్టి ఆడాలి, గట్టి కృషి ని చేయాలి, పూర్తి శక్తి తోను, ఎలాంటి ఒత్తిడి కి లోనవకుండాను ఆడాలి సుమా.’’ అంటూ వారి కి ఆయన సూచించారు.

సంభాషణ సాగిన క్రమం లో, మహారాష్ట్ర క్రీడాకారుడు శ్రీ అవినాశ్ సాబ్ లే యొక్క జీవితానుభవాన్ని గురించి, మరి సియాచిన్ లో భారతీయ సైన్యం లో ఆయన పని చేసిన కాలాన్ని గురించి ప్రధాన మంత్రి అడిగి తెలుసుకొన్నారు. భారతీయ సైన్యం లో తాను పని చేసిన నాలుగు సంవత్సరాల కాలం లో ఎంతో నేర్చుకోగలిగినట్లు శ్రీ సాబ్ లే జవాబిచ్చారు. భారతీయ సైన్యం నుంచి తాను పొందిన శిక్షణ, తాను అలవరచుకున్న క్రమశిక్షణ లతో తాను ఏ రంగం లో అడుగిడినప్పటికీ కూడాను అందులో రాణించడాని కి తన కు తోడ్పడుతాయి అని ఆయన అన్నారు. సియాచిన్ లో పని చేస్తూ స్టీపల్ చేజ్ ఫీల్డ్ నే ఎందుకు ఎంచుకొన్నదీ చెప్పాలంటూ ప్రధాన మంత్రి అడిగారు. దానికి ఆయన ప్రత్యుత్తరాన్ని ఇస్తూ, స్టీపల్ చేజ్ అనేది అవరోధాల ను అధిగమించడానికి సంబంధించిందని, తాను సైన్యం లో అదే విధమైనటువంటి శిక్షణ ను స్వీకరించానని పేర్కొన్నారు. అంత వేగం గా బరువు ను తగ్గించుకొన్న తాలూకు శ్రీ సాబ్ లే యొక్క అనుభవాన్ని గురించి ప్రధాన మంత్రి వాకబు చేశారు. దానికి ఆయన సమాధానాన్ని ఇస్తూ, సైన్యం తాను క్రీడల లో చేరడాని కి ప్రేరణ ను ఇచ్చిందని, మరి శిక్షణ పొందడానికి అదనపు సమయం తనకు చిక్కిందని, అది బరువు ను తగ్గించుకోవడం లో సాయపడిందని వివరించారు.

పశ్చిమ బంగాల్ కు చెందిన శ్రీ అచింత శులీ తో కూడా ప్రధాన మంత్రి మాట్లాడారు. శ్రీ శులీ 73 కిలో గ్రాముల కేటగిరి లో పాల్గొనే ఒక వెయిట్ లిఫ్టర్. శ్రీ శులీ తనకు ఉన్న శాంత స్వభావాని కి మరియు తన వెయిట్ లిఫ్టింగ్ క్రీడ కు మధ్య సమతుల్యత ను ఏ విధంగా పాటిస్తారో అనే అంశాన్ని ప్రధాన మంత్రి అడిగి తెలుసుకోగోరారు. శ్రీ అచింత శులీ బదులిస్తూ, తాను క్రమం తప్పక యోగ ను అభ్యసిస్తుంటానని, అదే తన మనస్సు ను శాంతం గా ఉంచడం లో దోహదపడుతున్నట్లు వెల్లడించారు. శ్రీ శులీ కుటుంబ వివరాల ను గురించి ప్రధాన మంత్రి అడుగగా, తనకు తల్లి గారు మరియు పెద్ద అన్నయ్య ఉన్నారని, వారు తనకు ఎల్లవేళలా అండగా ఉంటారని శ్రీ శులీ చెప్పారు. క్రీడ లో అయ్యే గాయాల ను గురించిన వివరాల ను తెలియజేయవలసింది గా కూడా ప్రధాన మంత్రి ఆయన ను అడిగారు. గాయాలు అనేవి ఆట లో ఒక భాగం, మరి వాటిని అతి జాగ్రత్త గా నయం చేసుకొంటూ ఉంటాను అంటూ శ్రీ శులీ సమాధానమిచ్చారు. గాయాని కి దారితీసిన పొరపాట్లు ఎలాంటివి అనేవి కూడా తాను విశ్లేషించుకొంటూ ఉంటానని, భవిష్యత్తు లో గాయాలు కాకుండా తగిన జాగ్రత చర్యల ను తీసుకొంటూ ఉంటానని కూడా శ్రీ శులీ అన్నారు. శ్రీ శులీ ప్రయాస లు ఫలప్రదం కావాలని ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. అంతేకాకుండా, శ్రీ అచింతా శులీ ప్రస్తుతం చేరుకొన్న స్థానాని కి చేరుకొనేలా ఆయనకు అవసరపడ్డవి అన్నీ సమకూర్చిన ఆయన కుటుంబానికి ప్రత్యేకించి ఆయన మాతృమూర్తి ని మరియు సోదరుడి ని ప్రధాన మంత్రి ప్రశంసించారు.

కేరళ కు చెందిన బాడ్ మింటన్ క్రీడాకారిణి ట్రీసా జాలీ గారి తో ప్రధాన మంత్రి సంభాషించారు. జాలీ గారు మీరు కన్నూర్ లో ఉంటారు కదా, అక్కడ ఫుట్ బాల్ కు, వ్యవసాయాని కి చక్కనైన ఆదరణ ఉంది. మీరేమో బాడ్ మింటన్ ను ఎంచుకొన్నారు, ఇలా ఎందుకు? అంటూ ప్రధాన మంత్రి ఆరా తీశారు. దీనికి ఆమె బదులిస్తూ, తాను ఈ క్రీడ వైపు మొగ్గు చూపేందుకు ప్రేరణ తన తండ్రి గారి వద్ద నుంచే లభించింది అని పేర్కొన్నారు. గాయత్రి గోపిచంద్ గారి తో ఆమె స్నేహాన్ని గురించి, అలాగే (క్రీడా) మైదానం లో భాగస్వామ్యాన్ని గురించి చెప్పాలంటూ జాలీ గారి ని ప్రధాన మంత్రి అడిగారు. ఫీల్డ్ పార్ట్ నర్ తో చక్కని స్నేహబంధం అనేది ఆట లో తనకు సాయపడుతున్నదని జాలీ బదులిచ్చారు. (స్వదేశాని కి) తిరిగి వచ్చినప్పుడు ఏయే విధాలు గా వేడుకల ను జరుపుకోవాలని అనుకొంటున్నారు? అని కూడా ఆమె ను ప్రధాన మంత్రి అడిగారు.

ఝార్ ఖండ్ కు చెందిన హాకీ క్రీడాకారిణి సలీమా టేటే గారి తో ప్రధాన మంత్రి మాట్లాడారు. హాకీ రంగం లో ఆమె తండ్రి గారి యొక్క మరియు ఆమె యొక్క ప్రస్థానాలను గురించి చెప్పాలంటూ ప్రధాన మంత్రి అడిగారు. తన తండ్రి హాకీ క్రీడ ను ఆడుతూ ఉండగా చూసిన తాను ఆయన వద్ద నుంచి స్ఫూర్తి ని పొందినట్లు సలీమా తెలియ జేశారు. టోక్యో ఒలింపిక్ క్రీడోత్సవాల లో ఆడినప్పటి మీ యొక్క అనుభవాన్ని గురించి వెల్లడించండంటూ ప్రధాన మంత్రి ఆమె ను అడిగారు. ఆమె తాను టోక్యో కు వెళ్ళే కంటే ముందు గా ప్రధాన మంత్రి తో జరిగిన మాటామంతీ తనకు ప్రేరణ ను అందించిందన్నారు.

షాట్ పుట్ విభాగం లో పారా ఎథ్ లీట్, హరియాణా కు చెందిన శర్మిల గారి తో ప్రధాన మంత్రి మాట్లాడారు. 34 ఏళ్ళ వయస్సు లో క్రీడ రంగం లో ఒక వృత్తి జీవనాన్ని మొదలు పెట్టాలి అనేటటువంటి ప్రేరణ ఎలా లభించిందని ఆమె ను అడిగి ప్రధాన మంత్రి తెలుసుకో గోరారు. అంతేకాకుండా, రెండేళ్ళ కాలం లోనే ఒక బంగారు పతకాన్ని ఏ విధం గా కైవసం చేసుకొన్నదీ చెప్పండని ఆయన అన్నారు. క్రీడ లు అంటే తనకు బాల్యం నుంచే ఆసక్తి ఉన్నదనే విషయాన్ని శర్మిల గారు చెప్తూ, కుటుంబం ఆర్థిక స్థితి కారణం గా చిన్న వయస్సు లోనే తన కు పెళ్ళి అయిందని, భర్త తన ను ఇబ్బందుల పాలు చేసే వారని వివరించారు. తాను తన ఇద్దరు కుమార్తె లు మనుగడ కోసం తన తల్లితండ్రులపై ఆరు సంవత్సరాల పాటు ఆధారపడవలసి వచ్చిందని ఆమె చెప్పారు. తన బంధువు శ్రీ టేక్ చంద్ భాయి పతాకధారి గా ఉండేవారని, ఆయన తన కు సమర్ధన ను అందించారని, ఆయన తనకు రోజు లో ఎనిమిది గంటల సేపు ఎంతో కఠోరమైనటువంటి శిక్షణ ను ఇచ్చారని ఆమె తెలియజేశారు. ఆమె కుమార్తెల ను గురించిన వివరాల ను కూడా ప్రధాన మంత్రి తెలియ జేయవలసింది గా విజ్ఞప్తి చేశారు. షర్మిల ఒక్క తన పుత్రికల కోసమే కాక యావత్తు దేశాని కి కూడాను ఒక ఆదర్శప్రాయమైనటువంటి క్రీడాకారిణి అని ఆయన అన్నారు. తన కుమార్తె క్రీడల రంగం లో ప్రవేశించి, దేశాని కి తోడ్పడాలని తాను కోరుకుంటున్న విషయాన్ని శర్మిల ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకువచ్చారు. పూర్వం పారాలింపిక్స్ లో పాల్గొన్న ఆమె కోచ్ టేక్ చంద్ గారి ని గురించి చెప్పండని కూడా ప్రధాన మంత్రి అడిగారు. దీనికి శర్మిల సమాధానమిస్తూ, టేక్ చంద్ భాయి గారు తన యావత్తు వృత్తి జీవనం లో తనకు స్ఫూర్తి మూర్తి గా ఉన్నారని బదులిచ్చారు. శర్మిల కు శిక్షణ ను ఇచ్చే విషయం లో శ్రీ టేక్ చంద్ కనబరచినటువంటి అంకిత భావమే ఆమె ను క్రీడల లో పోటీ పడేటట్లుగా ప్రేరణ ను ఇచ్చిందని ఆమె అన్నారు. ఆమె వృత్తి జీవనాన్ని ప్రారంభించిన వయస్సు లో ఇతరులు అయితే గనక పట్టు ను వదలి వేసే వారు అని ప్రధాన మంత్రి అన్నారు. శర్మిల కు విజయం దక్కాలని కోరుకుంటూ, మరి కామన్ వెల్థ్ గేమ్స్ లో ఆమె చక్కగా రాణించాలంటూ ప్రధాన మంత్రి శుభ కామనల ను వ్యక్తం చేశారు.

అండమాన్- నికోబార్ కు చెంది ఒక సైకిలిస్టు శ్రీ డేవిడ్ బెక్ హమ్ తో ప్రధాన మంత్రి మాట్లాడారు. ప్రసిద్ధ ఫుట్ బాల్ క్రీడాకారుని పేరు నే కలిగి ఉన్న మీకు ఫుట్ బాల్ అంటే మక్కువేనా చెప్పండి అంటూ ప్రధాన మంత్రి అడిగారు. దీనికి శ్రీ డేవిడ్ జవాబిస్తూ, ఫుట్ బాల్ అంటే తనకు ఇష్టమని, అయితే అండమాన్ లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఆ క్రీడ ను అనుసరించేందుకు తనకు అవకాశాన్ని ఇవ్వలేదని తెలిపారు. ఈ క్రీడ ను అంత సుదీర్ఘ కాలం పాటు అనుసరించడానికి మిమ్మల్ని ప్రేరేపించింది ఏమిటంటారు? అంటూ ప్రధాన మంత్రి ఆయన ను ప్రశించారు. దీనికి ఆయన ప్రతిస్పందిస్తూ తన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే తనకు అమిత ప్రేరణ ను అందించారని చెప్పారు. ‘ఖేలో ఇండియా’ ఏ విధం గా మీకు సాయపడింది అంటూ ప్రధాన మంత్రి ఆయన ను అడిగారు. ‘ఖేలో ఇండియా’ తోనే తన ప్రయాణం మొదలైందని, అంతేకాకుండా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో ప్రధాన మంత్రి తన ను గురించి మాట్లాడడం సైతం తనకు ప్రేరణ ను అందించిందని శ్రీ డేవిడ్ చెప్పారు. సునామీ లో మీ తండ్రి గారు ప్రాణాల ను కోల్పోయినప్పటికీ, అటు తరువాత కొద్ది కాలానికే మీ తల్లి గారిని కూడా మీరు కోల్పోయినప్పటికీ మీరు లక్ష్యం దిశ గా దూసుకు పోతున్నందుకు గాను ఇవే అభినందనలు అంటూ ఆయన ను ప్రధాన మంత్రి ప్రశంసించారు.

సంభాషణ ముగిసిన అనంతరం క్రీడాకారుల ను, క్రీడాకారిణుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించారు. పార్లమెంటు సమావేశాలతో తీరిక లేకుండా ఉన్న కారణం గా వారి తో తాను ముఖాముఖి బేటీ కాలేక పోతున్నానన్నారు. వారు (స్వదేశానికి) తిరిగి వచ్చిన తరువాత వారితో కలసి వారి విజయాన్ని ఒక వేడుక గా తప్పక జరుపుకొందాం అంటూ వారికి ఆయన మాట ఇచ్చారు.

ప్రస్తుత కాలం ఒక రకం గా భారతదేశ క్రీడల చరిత్ర లో ఒక విధం గా అత్యంత ముఖ్యమైనటువంటి కాలం అని చెప్పాలని ప్రధాన మంత్రి అన్నారు. ఇవాళ క్రీడాకారుల లో ఉత్సాహం అధికం గా ఉంది, వారికి లభిస్తున్నటువంటి శిక్షణ కూడా అంతకంతకు మెరుగుపడుతున్నది; ఆటల పట్ల దేశం లో ఉన్న వాతావరణం సైతం భలే బ్రహ్మాండం గా ఉంది అని ఆయన అన్నారు. మీరంతా నూతన శిఖరాల ను అధిరోహిస్తున్నారు. కొత్త కొత్త శిఖరాల ను నెలకొల్పుతున్నారు అని ఆయన అన్నారు.

ఎవరైతే మొట్టమొదటిసారి గా అంతర్జాతీయ మైదానం లోకి అడుగు పెడుతున్నారో, వారిని ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, కేవలం మైదానం మారింది, అంతేగాని ఉత్సాహం మరియు సఫలత పట్ల గాఢత లో ఎలాంటి మార్పు లేదు అని పేర్కొన్నారు. ‘‘లక్ష్యమల్లా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంటే దానిని చూడడమూ, జాతీయ గీతం ఆలాపన జరుగుతూ ఉంటే ఆ ధ్వని ని వినడమూ ను. దీని కోసం ఒత్తిడి కి లోను కావద్దు, చక్కని ఆట ను, బలమైన ఆట ఆడడం ద్వారా ప్రభావాన్ని ప్రసరింప చేయాలి’’ అని ఆయన అన్నారు.

స్వాతంత్య్రం తాలూకు 75 సంవత్సరాల ను దేశం ఒక ఉత్సవం గా జరుపుకొంటూ ఉన్న కాలం లో క్రీడాకారులు, క్రీడాకారిణులు కామన్ వెల్థ్ గేమ్స్ కు వెళ్తున్నారని, వారు వారి అత్యుత్తమమైనటువంటి ఆట తీరు ను కనబరుస్తారని, అది దేశాని కి ఒక బహుమతి అవుతుందని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ప్రత్యర్థి ఎవరు అనేది పెద్ద తేడా గా ఉండదు అని ఆయన స్పష్టం చేశారు. క్రీడాకారులు, క్రీడాకారిణులు అందరు చక్కని శిక్షణ ను తీసుకొన్నారు. మరి ప్రపంచం లో అత్యుత్తమమైన సదుపాయాలు వారికి లభించాయి అని ప్రధాన మంత్రి చెప్తూ, వారు పొందిన శిక్షణ ను జ్ఞాపకం పెట్టుకొని, మరి వారి యొక్క ఇచ్ఛా శక్తి మీద ఆధారపడాలి అంటూ ప్రధాన మంత్రి ఉద్భోదించారు. క్రీడాకారులు, క్రీడాకారిణులు సాధించినది తప్పక స్ఫూర్తి ని ఇచ్చేదే; అయితే, వారు ఇక మీదట సరికొత్త రెకార్డుల ను ఏర్పరచడం పైన దృష్టి ని కేంద్రీకరించాలి. దేశం కోసం, దేశ ప్రజల కోసం వారిదైన సర్వశ్రేష్ఠ ప్రదర్శన ను అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకోవాలి అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రధానమైన క్రీడా సంబంధిత కార్యక్రమాల లో క్రీడాకారులు, క్రీడాకారిణులు పాలుపంచుకునే సందర్భాల లో ముందస్తు గా వారి కి స్ఫూర్తి ని ఇవ్వడం కోసమని ప్రధాన మంత్రి క్రమం తప్పక చేస్తున్నటువంటి ప్రయత్నాల లో ఒక భాగం గా ఈ సంభాషణ ఉంది. టోక్యో 2020 ఒలింపిక్స్ లో పాలుపంచుకొనే భారతదేశం యొక్క క్రీడాకారుల, క్రీడాకారిణుల జట్టు తోను, టోక్యో 2020 పారాలింపిక్స్ గేమ్స్, కోసం సిద్ధమైన భారతదేశం పారా ఎథ్ లీట్స్ జట్టు తోను ప్రధాన మంత్రి కిందటి సంవత్సరం లో సమావేశమయ్యారు.

క్రీడోత్సవాలు జరుగుతూ ఉన్న కాలం లో సైతం, క్రీడాకారులు, క్రీడాకారిణులు ఏవిధం గా పురోగమిస్తున్నదీ తెలుసుకుంటూ ఉండడం లో ప్రధాన మంత్రి మంచి కుతూహలాన్ని వ్యక్తపరిచారు. అనేక సందర్భాల లో క్రీడాకారులు, క్రీడాకారిణులు సఫలత ను సాధించినప్పుడు గాని, లేదా చిత్తశుద్ధి తో ప్రయత్నాలు చేసినప్పుడు గాని వారిని అభినందించడం కోసం కు ఆయన స్వయంగా ఫోన్ చేసి వారి తో మాట్లాడారు; వారు మరింత గా రాణించేటట్టు గా వారి లో ప్రేరణ ను రగిలిస్తూ వచ్చారు. దీనికి తోడు, వారు దేశాని కి తిరిగి వచ్చిన తరువాత కూడాను ప్రధాన మంత్రి ఆయా క్రీడాకారుల, క్రీడాకారిణుల జట్టుల తో భేటీ అయ్యారు.

కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 జులై నెల 28వ తేదీ మొదలుకొని ఆగస్టు నెల 8వ తేదీ వరకు బర్మింగ్ హమ్ లో జరుగనున్నాయి. మొత్తం 215 మంది క్రీడాకారులు, క్రీడాకారిణులు 19 క్రీడావిభాగాల లో 141 ఈవెంట్స్ లో పాల్గొని, భారతదేశాని కి ప్రాతినిధ్యం వహించనున్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage