QuoteWe need to follow a new mantra - all those who have come in contact with an infected person should be traced and tested within 72 hours: PM
Quote80% of active cases are from 10 states, if the virus is defeated here, the entire country will emerge victorious: PM
QuoteThe target of bringing down the fatality rate below 1% can be achieved soon: PM
QuoteIt has emerged from the discussion that there is an urgent need to ramp up testing in Bihar, Gujarat, UP, West Bengal, and Telangana: PM
QuoteContainment, contact tracing, and surveillance are the most effective weapons in this battle: PM
QuotePM recounts the experience of Home Minister in preparing a roadmap for successfully tackling the pandemic together with Delhi and nearby states

ప్రపంచ వ్యాప్త వ్యాధి కోవిడ్-19 యొక్క ప్రస్తుత స్థితి ని గురించి చర్చించి భవిష్యత్ చర్యల ను యోచించడానికి ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, తమిళ నాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్, గుజరాత్, తెలంగాణ మరియు ఉత్తర ప్రదేశ్.. ఈ పది రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో మరియు ప్రతినిధుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న పరస్పరం చర్చ లు జరిపారు. కర్నాటక పక్షాన ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించారు.

|

టీమ్ ఇండియా యొక్క సంఘటిత శ్రమ

దేశం లో ప్రతి ఒక్కరు సహకరించి కలసికట్టు గా పని చేశారని, టీమ్ ఇండియా సంఘటితం గా కృషి చేయడం ప్రశంసాయోగ్యమని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్బం లో ఆసుపత్రులు మరియు ఆరోగ్య సంరక్షణ సిబ్బంది ఎదుర్కొన్నటువంటి సవాళ్ళ ను మరియు

ఒత్తిడుల ను గురించి ఆయన ప్రస్తావించారు. దేశం లో 80 శాతం యాక్టివ్ కేసులు ఇవాళ్టి చర్చ లో పాలుపంచుకొన్న పది రాష్ట్రాల లోనే ఉన్నాయని ఆయన అన్నారు. ఈ పది రాష్ట్రాల లో వైరస్ ను ఓడించగలిగితే కోవిడ్-19 పై జరుగుతున్న పోరు లో యావత్తు దేశం విజయాన్ని సాధించగలుగుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

పరీక్షల ను పెంచడమూ, మరణాల రేటు ను తగ్గించడమూను

దేశవ్యాప్తంగా ప్రతి రోజు జరుపుతున్న కోవిడ్ పరీక్ష ల సంఖ్య దాదాపు 7 లక్షల కు చేరిందని, అది క్రమం గా పెరుగుతోందని, దాని వల్ల వ్యాధి సోకిన వారిని త్వరగా గుర్తించడానికి మరియు అదుపు చేయడానికి తోడ్పడిందని ప్రధాన మంత్రి అభిప్రాయపడ్డారు. దేశంలో సగటు మరణాల రేటు ప్రపంచం లోకెల్లా అతి తక్కువ అని, అది క్రమం గా తగ్గుతోందన్నారు. చికిత్స పొందుతున్న వారి శాతం కూడా తగ్గుతోందని, అదే కాలం లో కోలుకొంటున్న వారి శాతం పెరుగుతోందని ఆయన అన్నారు. ఈ చర్యల వల్ల ప్రజల విశ్వాసం హెచ్చిందని, మరి మరణాల రేటు ను 1 శాతం కన్నా తక్కువ కు కుదించాలన్న లక్ష్యాన్ని త్వరలోనే సాధించవచ్చునని ఆయన అన్నారు.

|

ఈ రోజు న జరిపిన చర్చల వల్ల బిహార్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు తెలంగాణ లలో కోవిడ్ పరీక్షల ను వెనువెంటనే పెంచవలసిన అవసరం ఉన్నదని బయటపడిందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. ఈ పోరాటం లో వ్యాధి నిరోధం, సన్నిహితులు/సంబంధికుల గుర్తింపు, కాపు కాయడం సమర్ధమైన ఆయుధాలు అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రజలు వీటి గురించి తెలుసుకున్నారని, ఈ ప్రయత్నాల కు తోడ్పడుతున్నారని, దాని ఫలితం గా మనం ఇళ్ల లో వేరు గా ఉంచడాన్ని సమర్ధం గా నిర్వహించడం లో విజయం సాధించామని చెప్పారు. ఆరోగ్య సేతు యాప్ ఉపయోగాన్ని గురించి ఆయన ప్రముఖం గా పేర్కొన్నారు. కేసుల ను మొదటి 72 గంటల లో గుర్తించగలిగితే వైరస్ వ్యాప్తి మందగించగలదని నిపుణులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. అందువల్ల రోగుల తో కలసిన వారిని 72 గంటల లోగా గుర్తించి, పరీక్షల ను నిర్వహించవలసిన ఆవశ్యకత ను ఆయన ఉద్ఘాటించారు. దీని ని- చేతుల ను శుభ్రం గా కడుక్కోవడం, (ఒక మనిషి కి మరొక మనిషి కి నడుమ న) రెండు గజాల దూరాన్ని పాటించడం, ముఖాని కి మాస్కు ను ధరించడం మాదిరిగానే- ఒక మంత్రం లాగా అనుసరించవలసింది అని ఆయన అన్నారు.

ఢిల్లీ మరియు సమీప రాష్ట్రాల లో అనుసరించినటువంటి వ్యూహం ఇదీ

ఢిల్లీ, ఆ చుట్టుప్రక్కల రాష్ట్రాల తో కలసి మహమ్మారి ని విజయవంతం గా ఎదుర్కోవడానికి దిశా నిర్దేశం చేయడం లో హోం మంత్రి అనుభవాన్ని ప్రధాన మంత్రి వివరించారు కంటెయిన్మెంట్ జోన్ లను వేరు చేయడం మరియు వ్యాధి సంక్రమించిన వారి ని, ముఖ్యం గా ఎక్కువ ముప్పు ఉన్న వారి ని వేరు గా ఉంచడం పై ప్రత్యేక దృష్టి ని కేంద్రీకరించడం ఆ వ్యూహం లో ప్రధాన అంశాలుగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆ చర్య ల ఫలితాలు మన ముందు ఉన్నాయి. దానికి తోడు, ఆసుపత్రుల యాజమాన్యానికి మెరుగైన చర్యలు మరియు ఐసియు పడకల పెంపు వంటివి సహాయపడ్డాయి.

|

ముఖ్యమంత్రులు ఏమన్నారంటే

ముఖ్యమంత్రులు వారి వారి రాష్ట్రాల లో వాస్తవ పరిస్థితుల ను ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు వచ్చారు. మహమ్మారి ని అదుపు చేయడానికి ప్రధాన మంత్రి నేతృత్వం లో విజయవంతం గా పర్యవేక్షణ చర్యల ను తీసుకొంటున్నందుకు ప్రధాన మంత్రి నాయకత్వాన్ని వారు ప్రశంసించారు. నిరంతర మార్గదర్శకత్వం చేస్తూన్నందుకు మరియు తోడ్పాటును అందిస్తున్నందుకు గాను ఆయన కు కృతజ్ఞతల ను తెలిపారు. పరీక్ష ల పెంపు, టెలి- మెడిసిన్ వినియోగం మరియు ఆరోగ్య సేవల మౌలిక సదుపాయాల పెంపు తదితర అంశాల గురించి మాట్లాడారు. దేశం లో సమగ్ర వైద్యం అందించడానికి మౌలిక సదుపాయాల ను ఏర్పాటు చేసేందుకు చర్య లు తీసుకోవలసింది అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కు వారు సూచించారు.

డబ్ల్యు హెచ్ఒ ప్రశంస

వైరస్ పై పోరాటం లో ప్రభుత్వం సాధ్యమైనన్ని ప్రయత్నాల ను చేస్తోందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యల ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ఒ) సైతం ప్రశంసించింది అని ఆయన అన్నారు.

కేంద్ర ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేశం లో కోవిడ్ కేసు ల తాలూకు సమగ్ర తీరు ను నివేదించారు. కొన్ని రాష్ట్రాల లో కేసుల వృద్ధి రేటు జాతీయ సగటు కన్నా ఎక్కువ గా ఉందని, ఆ రాష్ట్రాలు తమ రాష్ట్రం లో గల పరీక్షల సామర్ధ్యాన్ని పూర్తి గా వినియోగించుకొని పరీక్షలు జరపాలని కోరారు. మరణాల సంఖ్య ను ఖచ్చితం గా వెల్లడించవలసిన ఆవశ్యకత ను నొక్కిచెప్పారు. స్థానికులు, సామాజిక వర్గాల సహాయం తో కంటెయిన్మెంట్ జోన్ లను పర్యవేక్షించాలని ఆయన కోరారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి , హోం శాఖ సహాయ మంత్రి కూడా ఈ చర్చ లో పాల్గొన్నారు.

Click here to read full text speech

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
How NEP facilitated a UK-India partnership

Media Coverage

How NEP facilitated a UK-India partnership
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Rajasthan Chief Minister meets Prime Minister
July 29, 2025

The Chief Minister of Rajasthan, Shri Bhajanlal Sharma met the Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

The PMO India handle posted on X:

“CM of Rajasthan, Shri @BhajanlalBjp met Prime Minister @narendramodi.

@RajCMO”