తరువాతి బడ్జెటు కు సన్నద్ధం అయ్యే క్రమం లో పరిశ్రమ ప్రతినిధుల తో ప్రధానమంత్రి ఈ తరహా సమావేశాన్ని నిర్వహించడం ఇది రెండో సారి
ఒలింపిక్స్ లో దేశం పతకాల సాధన కై పట్టుబట్టినట్లుగానే మన పరిశ్రమలు ప్రతిరంగం లోను ప్రపంచం లో అగ్రగామి అయిదు స్థానాల లో నిలబడాలని దేశం కోరుకుంటోంది:ప్రధాన మంత్రి
దేశ ఆర్థిక పురోగతి ని పెంపొందించడం కోసం కార్యక్రమాల ను చేపట్టడాని కిప్రభుత్వం దృఢ సంకల్పం తో ఉంది: ప్రధాన మంత్రి
ప్రైవేటు రంగం పట్ల నమ్మకాన్ని కలిగి ఉన్నందుకు ప్రధాన మంత్రి కిధన్యవాదాలు తెలిపిన పరిశ్రమ రంగ ప్రముఖులు; ప్రధాన మంత్రి యొక్క ‘ఆత్మనిర్భర్ భారత్’ దార్శనికత కు వారు తమ నిబద్ధత ను తెలియజేశారు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పరిశ్రమ కు చెందిన వివిధ రంగాల లోని కంపెనీ ల ముఖ్య నిర్వహణ అధికారుల తో లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఈ రోజు న సమావేశమయ్యారు. తరువాతి కేంద్ర బడ్జెట్ సమర్పణ కు గడువు సమీపిస్తుండగా పరిశ్రమ ప్రతినిధుల తో ప్రధాన మంత్రి ఈ విధం గా జరిపిన రెండో సమావేశం ఇది.

 

కోవిడ్ కు వ్యతిరేకం గా జరుగుతూ ఉన్న యుద్ధం లో దేశం యొక్క అంతర్గత శక్తి బయల్పడడాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. పరిశ్రమ ప్రముఖులు సూచనల ను, సలహాల ను అందించినందుకు గాను వారికి ఆయన ధన్యవాదాల ను వ్యక్తం చేశారు. పిఎల్ఐ ప్రోత్సాహకం వంటి విధానాల ను పూర్తి గా వినియోగించుకోవలసిందంటూ వారికి ఆయన ఉద్భోదించారు. దేశం ఒలింపిక్ క్రీడోత్సవాల లో పతకాల సాధన కై రాణించిన మాదిరి గానే, మన పరిశ్రమ లు ప్రతి ఒక్క రంగం లో ప్రపంచం లో అగ్రగామి అయిదు స్థానాల లో నిలబడడాన్ని చూడాలని కూడా దేశం కోరుకొంటోందని, మరి దీని కోసం మనమంతా సమష్టి గా కృషి చేయవలసి ఉందని ఆయన అన్నారు. వ్యవసాయం మరియు ఫూడ్ ప్రోసెసింగ్ వంటి రంగాల లో మరింత ఎక్కువ గా కార్పొరేట్ రంగం పెట్టుబడి పెట్టాలని, అంతేకాక ప్రాకృతిక వ్యవసాయం పైకి దృష్టి ని సారించాలని ఆయన చెప్పారు. విధానపరం గా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి స్థిరత్వాన్ని గురించి ఆయన నొక్కి చెప్తూ, దేశ ఆర్థిక ప్రగతి కి ఉత్తేజాన్ని ఇవ్వగలిగిన కార్యక్రమాల ను చేపట్టడానికి ప్రభుత్వం పూర్తి గా కట్టుబడి ఉందని ఆయన అన్నారు. నియమ పాలన తాలూకు భారాన్ని తగ్గించే దిశ లో ప్రభుత్వం శ్రద్ధ తీసుకొంటోందని కూడా ఆయన వివరించారు. నియమ పాలన లో అనవసర జోక్యాలు ఉన్నాయని భావిస్తే వాటిని తొలగించే అంశాల లో సూచనల ను ఇవ్వవలసింది గా ఆయన విజ్ఞప్తి చేశారు.

 

పరిశ్రమ ప్రతినిధులు వారి అభిప్రాయాల ను ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు వచ్చారు. ప్రైవేటు రంగం పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేసినందుకు ప్రధాన మంత్రి కి వారు ధన్యవాదాలు తెలిపారు. ఆయన నాయకత్వం కారణం గాను, ఆయన కాలిక జోక్యాల ద్వారా ను, పరివర్తన పూర్వకమైనటువంటి సంస్కరణల ద్వారా ను దేశ ఆర్థిక వ్యవస్థ కోవిడ్ తరువాత పుంజుకొని ముందుకు సాగిపోతోందని వారు అన్నారు. ప్రధాన మంత్రి యొక్క ‘ఆత్మనిర్భర్ భారత్’ దార్శనికత కు తోడ్పడే దిశ లో కంకణబద్ధులం అవుతాం అని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొన్న పిఎమ్ గతిశక్తి, ఐబిసి మొదలైన కార్యక్రమాల ను వారు ప్రశంసించారు. దేశం లో వ్యాపారం చేయడం లో సౌలభ్యాన్ని మరింత గా పెంచేందుకు తీసుకోదగ్గ చర్యల ను గురించి కూడా వారు ప్రస్తావించారు. సిఒపి26 లో భారతదేశం చేసిన వాగ్దానాల ను గురించి కూడా వారు మాట్లాడారు; ప్రతిపాదిత లక్ష్యాల ను సాధించే దిశ లో పరిశ్రమ ఏ విధం గా తోడ్పాటును అందించగలిగేదీ వారు తెలియ జేశారు.

 

ప్రభుత్వం సకాలం లో ప్రతిస్పందించినందువల్ల కోవిడ్ అనంతర కాలం లో ఆర్థిక వ్యవస్థ ఇంగ్లిషు అక్షరం ‘వి’ ఆకారం రీతి న పుంజుకొందని శ్రీ టి.వి. నరేంద్రన్ అన్నారు. ఫూడ్ ప్రోసెసింగ్ పరిశ్రమ వర్ధిల్లడం కోసం సలహాల ను శ్రీ సంజీవ్ పురీ ఇచ్చారు. స్వచ్ఛ్ భారత్, స్టార్ట్-అప్ ఇండియా ల వంటి చక్కని సంస్కరణ ల ద్వారా ప్రధాన మంత్రి అపూర్వమైన మార్పుల ను తీసుకు రావడం లో సఫలం అయ్యారని శ్రీ ఉదయ్ కోటక్ అన్నారు. స్క్రాపేజ్ పాలిసి ని మరింత విస్తృతం గా ఎలా చేయవచ్చో శ్రీ శేషగిరి రావు తన అభిప్రాయాల ను తెలియ జేశారు. భారతదేశాన్ని తయారీ రంగం లో దిగ్గజం గా మలచాలన్న ప్రధాన మంత్రి దార్శనికత ను సాకారం చేయడాని కి శ్రీ కెనిచీ ఆయుకావా వచనబద్ధత ను వ్యక్తం చేశారు. సిఒపి26 లో ప్రధాన మంత్రి ప్రకటించిన ‘పంచామృత్’ వాగ్దానాన్ని గురించి శ్రీ వినీత్ మిత్తల్ మాట్లాడారు. గ్లాస్ గో లో ప్రధాన మంత్రి నాయకత్వాని కి అంతర్జాతీయ సమాజం సభ్యులు ఎంతగానో సమర్థించారని శ్రీ సుమంత్ సిన్హా అన్నారు. ఆరోగ్య రంగం లో మానవ వనరుల ను పెంచేందుకు తీసుకోవలసిన ఉపాయాల ను గురించి ప్రీతా రెడ్డి గారు తన మాట్లాడారు. ఎఐ, ఇంకా మశీన్ లర్నింగ్ ల వంటి ప్రవర్థమాన రంగాల పై శ్రద్ధ వహించవలసిన అవసరాన్ని గురించి శ్రీ రితేశ్ అగర్వాల్ ప్రస్తావించారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi