ప్రపంచ చమురు, గ్యాస్ రంగం లోని ముఖ్య కార్యనిర్వహణ అధికారుల (సిఇఒ స్) తోను, నిపుణుల తోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా చర్చ జరిపారు.
ప్రధాన మంత్రి వారితో వివరం గా జరిపిన చర్చల లో చమురు అన్వేషణ, లైసెన్సింగ్ విధానం; గ్యాస్ మార్కెటింగ్; కోల్ బెడ్ మీథేన్, కోల్ గ్యాసిఫికేషన్ విధానాల్లో గత ఏడు సంవత్సరాల లో చమురు, గ్యాస్ రంగం లో ప్రవేశపెట్టిన సంస్కరణల తో పాటు ఇండియన్ గ్యాస్ ఎక్స్ఛేంజి లో ఇటీవల చేసిన మార్పు కూడా ప్రస్తావన కు వచ్చింది. భారతదేశాన్ని ‘చమురు, గ్యాస్ రంగం లో ఆత్మనిర్భరత కలిగింది గా తీర్చిదిద్దడం కోసం’ ఇటువంటి సంస్కరణ లు కొనసాగుతాయి అని ఆయన అన్నారు.
చమురు రంగాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఇటీవల కాలం లో ఆయిల్ రంగం పై ఫోకస్ ‘ఆదాయాన్ని పెంచడానికి’ బదులు ‘ఉత్పాదన’ ను పెంచడంపై శ్రద్ధ వహించడం జరుగుతోందన్నారు. దేశం లో ముడి చమురు నిలవ సదుపాయాల ను పెంచవలసిన అవసరం కూడా ఉందని ఆయన ప్రస్తావించారు. ఆయన ప్రసుత్త గ్యాస్ మౌలిక సదుపాయాల ను గురించి, తత్సంబంధ అవకాశాలను గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమం లో గొట్టపుమార్గాలు, సిటీ గ్యాస్ పంపిణీ, ఎల్ఎన్ జి ని తిరిగి గ్యాస్ గా మార్చే టర్మినల్స్ వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.
2016 నుంచి జరిగిన ఈ తరహా సమావేశాల లో అందుతున్నటువంటి సలహాలు చమురు, గ్యాస్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల ను అర్ధం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయన్న విషయం ప్రధాన మంత్రి ప్రస్తావించారు. భారతదేశం ఉదారత, ఆశావాదం, అవకాశాలు ఉన్నటువంటి దేశం అని, భారతదేశం లో కొత్త కొత్త ఆలోచన లు, వైఖరులు, నూతన ఆవిష్కరణ లు పొంగి పొరలుతున్నాయని ఆయన అన్నారు. భారతదేశం లో చమురు ను, గ్యాస్ ను అన్వేషించడం, ఈ రంగాన్ని అభివృద్ధి పరచడం కోసం భారతదేశం తో భాగస్వాములు కావాలంటూ సిఇఒల ను, నిపుణుల ను ఆయన ఆహ్వానించారు.
ఈ చర్చ లో ప్రపంచ వ్యాప్తం గా గల పరిశ్రమ ప్రముఖులు పాల్గొన్నారు. వారి లో రోజ్ నెఫ్ట్ చైర్మన్, సిఇఓ డాక్టర్ ఇగోర్ సెచిన్; సౌదీ ఆర్మకో సిఇఓ, ప్రెసిడెంట్ శ్రీ అమీన్ నాసెర్; బ్రిటిష్ పెట్రోలియం సిఇఓ శ్రీ బర్నార్డ్ లూనీ; ఐహెచ్ఎస్ మార్కిట్ వైస్ చైర్ మన్ డాక్టర్ డేనియెల్ యెర్గిన్; శ్లుంబర్ జర్ లిమిటెడ్ సిఇఓ శ్రీ ఒలివియర్ లీ పేయుశ్; రిలయన్స్ ఇండస్ట్రీజ్ లిమిటెడ్ చైర్ మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముకేశ్ అంబానీ; వేదాంతా లిమిటెడ్ చైర్ మన్ శ్రీ అనిల్ అగర్వాల్ మరియు ఇతరులు ఉన్నారు.
శక్తి లభ్యత ను, శక్తి సంబంధి భద్రత ను పెంచడం లోను, అందరికీ శక్తి ని తక్కువ ధరల కు అందించడం లోను ఇటీవల ప్రభుత్వం సాధించిన విజయాలను సిఇఒ లు, నిపుణులు అందరూ ప్రశంసించారు. ముందు చూపు తో కూడిన, ఆశావహమైన లక్ష్యాల తో భారతదేశం స్వచ్ఛ శక్తి దిశ గా పరివర్తన చెందడానికి కృషి చేయడం లో ప్రధాన మంత్రి నాయకత్వాన్ని వారు ప్రశంసించారు. భారతదేశం స్వచ్ఛ శక్తి సంబంధి సాంకేతిక విజ్ఞానాన్ని త్వరిత గతి న ఆచరించడానికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని వారు ప్రస్తావిస్తూ ప్రపంచ సరఫరా వ్యవస్థ కు ఆకారాన్ని ఇవ్వడం లో కీలక మైన పాత్ర ను పోషించ గలుగుతుందన్నారు. స్థిర, సమాన శక్తి దిశ లో మార్పు యొక్క అవసరాన్ని గురించి వారు మాట్లాడుతూ స్వచ్ఛ అభివృద్ధి ని, సుస్థిరత్వాన్ని మరింత గా ప్రోత్సహించడానికి వారు వారి వారి అభిప్రాయాల ను, సలహాల ను అందించారు.