సిబిఎస్ఇ 12వ తరగతి విద్యార్థుల తో జరుగుతున్న మాటామంతీ కార్యక్రమం లో ఒకింత ఆశ్చర్యకరం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను కూడా పాలుపంచుకొన్నారు. ఈ సంభాషణ ను విద్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లితండ్రులు కూడా హాజరయ్యారు.
వర్చువల్ పద్ధతి లో జరిగిన ఈ సంభాషణ లో దేశం లోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు జతపడ్డారు. విద్యార్థుల తో సాన్నిహిత్యం కోసం ప్రధాన మంత్రి తాను హిందీ భాషేతర ప్రాంతాల విద్యార్థుల తో మాట్లాడేటప్పుడు వారి సొంత భాష కు చెందిన మాటలనే మాట్లాడారు.
విద్యార్థులు సకారాత్మకత ను, ఆచరణాత్మకత ను కనబరచడాన్ని ప్రధాన మంత్రి మెచ్చుకొంటూ, మన విద్యార్థులు అన్ని ఇబ్బందులను, సవాళ్ల ను వారి బలం గా మార్చుకొంటూ ఉండటమనేది మన దేశానికి సంతోషాన్ని కలిగించే అంశం, అంతే కాదు ఇది మన దేశానికి బలం కూడా అన్నారు. సంభాషణ సాగిన క్రమం లో విద్యార్థుల్లో ఉట్టిపడ్డ ఆత్మవిశ్వాసాన్ని కూడా ఆయన ప్రశంసించారు.
మీ మీ అనుభవాలు చాలా ముఖ్యమైనటువంటివి, మరి అవి మీ జీవనం లో ప్రతి దశ లోనూ ఉపయోగకారి అవుతాయి అని ప్రధాన మంత్రి అన్నారు. మనం మన పాఠశాలల్లో, కళాశాలల్లో నేర్చుకొనేటటువంటి జట్టు స్ఫూర్తి ని ఆయన ఓ ఉదాహరణ గా చెప్పారు. ఈ పాఠాల ను కరోనా కాలం లో మనం ఒక కొత్త పద్ధతి లో నేర్చుకొన్నాం, మరి మనం ఈ కఠిన కాలం లో మన దేశం తాలూకు జట్టు స్ఫూర్తి ని గమనించాం కూడా అని ఆయన అన్నారు.
పర్యావరణ దినం అయిన జూన్ 5 న పర్యావరణానికి ఎంతో కొంత మేలు చేయండి అంటూ విద్యార్థుల ను ప్రధాన మంత్రి కోరారు. అదే విధం గా అంతర్జాతీయ యోగ దినం అయినటువంటి జూన్ 21 న మీ కుటుంబం తో కలసి యోగ చేయవలసింది అని ఆయన సూచించారు. టీకా మందు నమోదు ప్రక్రియ లో కుటుంబ సభ్యులకు, ఇరుగు పొరుగు వారికి సాయం చేయాల్సిందిగా కూడా విద్యార్థుల కు ఆయన విజ్ఞప్తి చేశారు.