‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ లో భాగం గా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ లబ్ది దారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడా పాలుపంచుకొన్నారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఆగస్టు 5వ తేదీ భారతదేశానికి చాలా ప్రత్యేకమైంది గా మారింది అన్నారు. రెండు సంవత్సరాల కిందట ఆగస్టు 5వ తేదీ నాడే, దేశం 370వ అధికరణాన్ని రద్దు చేసి జమ్ము- కశ్మీర్ లో అందరికి ప్రతి ఒక్క హక్కు ను, ప్రతి ఒక్క సౌకర్యాన్ని అందుబాటు లోకి తీసుకు రావడం ద్వారా ‘ఏక్ భారత్- శ్రేష్ట భారత్’ స్ఫూర్తి ని మరింత గా పటిష్ట పరచింది అని ఆయన అన్నారు. ఆగస్టు 5నే, భారతీయులు- వందేళ్ల అనంతరం- ఒక భవ్యమైన రామ ఆలయం నిర్మాణం దిశ లో ఒకటో అడుగు ను వేశారు అని కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ప్రస్తుతం అయోధ్య లో రామ ఆలయ నిర్మాణం పనులు శరవేగం గా జరుగుతున్నాయి అని ఆయన అన్నారు.
ఈ తేదీ కి ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి మరింత గా వివరిస్తూ, ఒలింపిక్ మైదానం లో పునరుత్తేజాన్ని పొందిన మన యువతీయువకులు హాకీ లో మన ప్రతిష్ట ను ఈ రోజు న పున:ప్రతిష్ఠాపన చేయడం ద్వారా ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని తీసుకు వచ్చారన్నారు.
ఒక పక్క మన దేశం, మన యువత భారతదేశానికి కోసం కొత్త కొత్త కార్య సిద్ధులను సంపాదించి పెడుతూ ఉంటే, దేశం లో కొంతమంది రాజకీయ స్వార్థం కోసం సెల్ఫ్- గోల్ చేసుకోవడంలో తలమునకలు గా ఉన్నారు అంటూ ప్రధాన మంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. దేశం ఏమి కోరుకుంటున్నదీ, దేశం ఏమి సాధిస్తున్నదీ, దేశం ఏ విధం గా మారుతున్నదీ అనే అంశాలను వారు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఈ ఘనమైన దేశం ఆ కోవ కు చెందిన స్వార్థ రాజకీయాలకు, దేశ వ్యతిరేక రాజకీయాలకు బందీ కాజాలదు అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ వ్యక్తులు ఎంతగా ప్రయత్నించినప్పటికి కూడా దేశం అభివృద్ధి చెందకుండా ఆపలేరు. ఈ దేశం వారి కి కట్టుబడిపోవడమంటూ జరుగదు. ఈ దేశం ప్రతి రంగం లోనూ ముందుకు దూసుకుపోతున్నది, ప్రతి ఒక్క కష్టానికి ఎదురీదుతున్నది అని ఆయన అన్నారు.
ఈ నూతన ఉత్సాహాన్ని గురించి చాటి చెప్పడం కోసం, భారతీయులు ఇటీవల కాలం లో సాధించిన అనేక రికార్డులను విజయాలను గురించి ప్రధాన మంత్రి వివరించారు. ఒలింపిక్స్ కు అదనం గా శ్రీ నరేంద్ర మోదీ త్వరలో పూర్తి కానున్న 50 కోట్లవ టీకాకరణ ను గురించి, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ లో ఒక కొత్త వేగ గతి ని సూచిస్తోందా అన్నట్లుగా జులై నెల లో 1 లక్షా 16 వేల కోట్ల రూపాయల విలువైన రికార్డు స్థాయి జిఎస్ టి వసూళ్లు నమోదు కావడం గురించి కూడా మాట్లాడారు. ఇది వరకు ఎన్నడూ ఎరుగని విధం గా నెలవారీ వ్యావసాయక ఎగుమతుల సంఖ్య 2 లక్షల 62 కోట్ల మేరకు ఉందని కూడా ఆయన చెప్పారు. భారతదేశం స్వాతంత్ర్యం సాధించిన తరువాత నమోదు అయిన అత్యధిక సంఖ్య ఇది. దీనితో భారతదేశం వ్యావసాయక ఎగుమతి ప్రధానమైనటువంటి అగ్రగామి పది దేశాల సరసన చేరింది అని ఆయన అన్నారు. భారతదేశం లో మొట్టమొదటి సారి గా తయారు చేసిన యుద్ధ విమాన వాహక నౌక ‘విక్రాంత్’ తొలి సముద్ర యాత్ర ను గురించి, ప్రపంచం లోనే అతి ఎత్తయిన ప్రాంతం లో మోటార్ వాహనాల ద్వారా ప్రయాణించేందుకు వీలు ఉన్న రహదారి నిర్మాణం లద్దాఖ్ లో పూర్తి కావడాన్ని గురించి, ఇంకా ‘ఇ-రూపీ’ ని ప్రవేశ పెట్టడం గురించి కూడా ప్రధాన మంత్రి మాట్లాడారు.
కేవలం తమ స్థితి ని గురించి ఆందోళన చెందే ప్రతిపక్షాలు ప్రస్తుతం భారతదేశాన్ని ఆపలేవు అని ప్రధాన మంత్రి విమర్శించారు. పతకాలను గెలుచుకోవడం ద్వారా ప్రపంచాన్ని న్యూ ఇండియా ఏలుతున్నదని, అంతేతప్ప ర్యాంకుల తో కాదని ఆయన చెప్పారు. న్యూ ఇండియా లో ముందుకు సాగిపోయేందుకు మార్గం అనేది కుటుంబ నామధేయం ద్వారా కాక కఠోర కృషి ద్వారానే నిర్ధారణ అవుతుంది అని ఆయన అన్నారు. భారతదేశం లో యువతీ యువకులు వారితో పాటు దేశం ముందుకు పయనిస్తోందన్న గట్టి నమ్మకం తో ఉన్నారు అని ఆయన అన్నారు.
మహమ్మారి ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ గతం లో ఆ తరహా పెద్ద సంక్షోభం దేశాన్ని చుట్టుముట్టినపుడు దేశం లోని అన్ని వ్యవస్థ లు ఘోరమైన కుదుపునకు లోనయ్యాయి అని ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చారు. అయితే భారతదేశం లో ప్రస్తుతం ప్రతి ఒక్క వ్యక్తి పూర్తి బలం తో ఈ మహమ్మారి తో పోరాడుతున్నట్లు ఆయన తెలిపారు.
వంద సంవత్సరాల లో ఒక సారి వచ్చే సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి జరుగుతున్న ప్రయత్నాల ను గురించి ప్రధాన మంత్రి సుదీర్ఘం గా వివరించారు. వైద్య రంగం లో మౌలిక సదుపాయాల ను పెంచడం, ప్రపంచం లోనే అత్యంత భారీదైన ఉచిత టీకా కార్యక్రమాన్ని నిర్వహించడం, బలహీన వర్గాల లో ఆకలి బాధ ను తప్పించడానికి అమలవుతున్న ఉద్యమం .. ఆ తరహా కార్యక్రమాలు లక్షల కొద్దీ కోట్ల రూపాయల పెట్టుబడి ని అందుకొన్నాయని, మరి భారతదేశం విజయవంతం గా ముందుకు సాగిపోతోందని ఆయన అన్నారు. మహమ్మారి కాలం లో మౌలిక సదుపాయాల కల్పన ప్రక్రియ ఆగిపోలేదని, ఈ అంశం ఉత్తర్ ప్రదేశ్ లో రాజమార్గాలు, ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టు లు, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, డిఫెన్స్ కారిడార్ లతో నిరూపణ అయ్యిందని ఆయన చెప్పారు.
రెండు ఇంజిన్ ల ప్రభుత్వం పేదల కోసం, అణచివేత బారిన పడిన వర్గాల వారి కోసం, బలహీన వర్గాల వారి కోసం, ఆదివాసీల కోసం రూపొందించిన పథకాలు త్వరిత గతి న అమలు అయ్యేందుకు పూచీ పడిందని ప్రధానమంత్రి అన్నారు. ‘పిఎమ్ స్వనిధి యోజన’ ను ఈ విషయం లో ఒక ఘనమైన ఉదాహరణ గా ఆయన పేర్కొన్నారు. మహమ్మారి కాలం లో ఏర్పడిన స్థితి తాలూకు గంభీరత ను తగ్గించడం కోసం తీసుకొన్న చర్యల ను కూడా ఆయన ఒక్కటొక్కటి గా వివరించారు. ఒక ప్రభావవంతమైనటువంటి వ్యూహం ఆహార పదార్థాల ధరల ను అదుపులో ఉంచడమే కాకుండా రైతుల కు విత్తనాల ను, ఎరువుల ను సరఫరా చేయడం కోసం తగిన చర్యలు చేపట్టడం జరిగిందని, రైతులు మున్నెన్నడూ లేని స్థాయి లో దిగుబడి ని అందించారని, ప్రభుత్వం సైతం ఎమ్ఎస్ పి ద్వారా రికార్డు స్థాయి లో సేకరణ ను పూర్తి చేసిందని ఆయన వివరించారు.
ఉత్తర్ ప్రదేశ్ లో రికార్డు స్థాయి ఎమ్ఎస్ పి సేకరణ కు గాను ముఖ్యమంత్రి ని కూడా ఆయన ప్రశంసించారు. యుపి లో ఎమ్ఎస్ పి ద్వారా లబ్ది ని పొందిన రైతు ల సంఖ్య కిందటి సంవత్సరం లో రెట్టింపు అయిందని తెలిపారు. యుపి లో 24 వేల కోట్ల రూపాయల పైచిలుకు సొమ్ము ను రైతు ల పంటల కు ధర రూపం లో 13 లక్షల రైతు కుటుంబాల ఖాతా లో నేరు గా జమ చేయడమైందని ఆయన చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ లో 17 లక్షల కుటుంబాల కు ఇళ్ల ను కేటాయించడమైంది. లక్షల కొద్దీ పేద కుటుంబాలు టాయిలెట్ సౌకర్యాన్ని అందుకొన్నాయి. ఉచితంగా గ్యాస్ కనెక్శన్ లను, విద్యుత్ కనెక్షన్ లు లక్షల సంఖ్య లో ఇవ్వడం జరిగింది. రాష్ట్రం లో 27 లక్షల కుటుంబాలు గొట్టపు మార్గం ద్వారా నీటి ని అందుకొన్నాయి అని ప్రధాన మంత్రి తెలిపారు.
గడచిన కొన్ని దశాబ్దాల లో ఉత్తర్ ప్రదేశ్ ను రాజకీయాల పట్టకం ద్వారా నే చూస్తూ రావడం జరిగింది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి లో ఉత్తర్ ప్రదేశ్ ఏ విధం గా ఒక ఉత్తమమైన పాత్ర ను పోషించగలుగుతుందో అనే విషయాన్ని చర్చించడానికైనా అనుమతి ఇవ్వలేదు అని ఆయన అన్నారు. మనం ఉత్తర్ ప్రదేశ్ సత్తా ను ఒక చిన్న దర్శిని ద్వారా చూసే పద్ధతి ని రెండు ఇంజిన్ లతో కూడిన ప్రభుత్వం మార్చివేసిందని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ భారతదేశ వృద్ధి ఇంజన్ కు కీలకమైంది కాగలదు అనేటటువంటి విశ్వాసం ఇటీవలి సంవత్సరాల లో ఏర్పడింది అని ఆయన చెప్పారు.
ఈ దశాబ్ది గడచిన ఏడు దశాబ్దాల లో ఉత్తర్ ప్రదేశ్ కు ఏర్పడిన లోటు ను భర్తీ చేసుకోవడానికి రాష్ట్రానికి తోడ్పడే దశాబ్దం అని ప్రధాన మంత్రి చెబుతూ, తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యాన్ని ఉత్తర్ ప్రదేశ్ లోని యువతీయువకులు, కుమార్తె లు, పేద ప్రజలు, అణచివేత బారిన పడిన వర్గాలు, వెనుకబడిన వర్గాలు చాలినంత సంఖ్య లో భాగస్వామ్యం తీసుకోకుండా పూర్తి చేయడం కుదరదని, మరి వారికి ఉత్తమమైన అవకాశాలను ఇవ్వడం ద్వారా దీనిని సాధించవచ్చని ఆయన అన్నారు.
आज की ये 5 अगस्त की तारीख बहुत विशेष बन गई है।
— PMO India (@PMOIndia) August 5, 2021
ये 5 अगस्त ही है, जब 2 साल पहले देश ने एक भारत, श्रेष्ठ भारत की भावना को और सशक्त किया था।
5 अगस्त को ही, आर्टिकल-370 को हटाकर जम्मू कश्मीर के हर नागरिक को हर अधिकार, हर सुविधा का पूरा भागीदार बनाया गया था: PM @narendramodi
यही 5 अगस्त है जब कोटि-कोटि भारतीयों ने सैकड़ों साल बाद भव्य राम मंदिर के निर्माण की तरफ पहला कदम रखा।
— PMO India (@PMOIndia) August 5, 2021
आज अयोध्या में तेजी से राम मंदिर का निर्माण हो रहा है: PM @narendramodi
एक तरफ हमारा देश, हमारे युवा भारत के लिए नई सिद्धियां प्राप्त कर रहे हैं, जीत का Goal कर रहे हैं तो वहीं देश में कुछ लोग ऐसे भी हैं जो राजनीतिक स्वार्थ में Self Goal करने में जुटे हैं।
— PMO India (@PMOIndia) August 5, 2021
देश क्या चाहता है, देश क्या हासिल कर रहा है, देश कैसे बदल रहा है इससे इनको कोई सरोकार नहीं: PM
ये महान देश ऐसी स्वार्थ और देशहित विरोधी राजनीति का बंधक नहीं बन सकता।
— PMO India (@PMOIndia) August 5, 2021
ये लोग देश को, देश के विकास को रोकने की कितनी भी कोशिश कर लें, ये देश इनसे रुकने वाला नहीं है।
हर कठिनाई को चुनौती देते हुए, देश हर मोर्चे पर तेज़ी से आगे बढ़ रहा है: PM @narendramodi
जो लोग सिर्फ अपने पद के लिए परेशान हैं, वो अब भारत को रोक नहीं सकते।
— PMO India (@PMOIndia) August 5, 2021
नया भारत, पद नहीं पदक जीतकर दुनिया में छा रहा है।
नए भारत में आगे बढ़ने का मार्ग परिवार नहीं, बल्कि परिश्रम से तय होगा।
और इसलिए, आज भारत का युवा कह रहा है- भारत चल पड़ा है, भारत का युवा चल पड़ा है: PM
अतीत में हमने अनुभव किया है कि जब देश पर पहले इस तरह का बड़ा संकट आता था तो देश की तमाम व्यवस्थाएं बुरी तरह से हिल जाती थीं।
— PMO India (@PMOIndia) August 5, 2021
लेकिन आज भारत, भारत का प्रत्येक नागरिक पूरी ताकत से इस महामारी का मुकाबला कर रहा है: PM @narendramodi
डबल इंजन की सरकार ने ये सुनिश्चित किया है कि गरीबों, दलितों, पिछड़ों, आदिवासियों के लिए बनी योजनाएं ज़मीन पर तेज़ी से लागू हों।
— PMO India (@PMOIndia) August 5, 2021
पीएम स्वनिधि योजना भी इसका एक बड़ा उदाहरण है: PM @narendramodi
बीते दशकों में उत्तर प्रदेश को हमेशा राजनीति के चश्मे से देखा गया था।
— PMO India (@PMOIndia) August 5, 2021
यूपी देश के विकास में भी अग्रिम भूमिका निभा सकता है, इसकी चर्चा तक ही नहीं होने दी गई: PM @narendramodi
डबल इंजन की सरकार ने यूपी के सामर्थ्य को एक संकुचित नज़रिए से देखने का तरीका बदल डाला है।
— PMO India (@PMOIndia) August 5, 2021
यूपी भारत के ग्रोथ इंजन का पावर हाउस बन सकता है, ये आत्मविश्वास बीते सालों में पैदा हुआ है: PM @narendramodi
ये दशक एक तरह से उत्तर प्रदेश के पिछले 7 दशकों में जो कमी हुई उसकी भरपाई करने का दशक है।
— PMO India (@PMOIndia) August 5, 2021
ये काम यूपी के सामान्य युवाओं, हमारी बेटियों, गरीब, दलित, वंचित, पिछड़ों की पर्याप्त भागीदारी और उनको बेहतर अवसर दिए बगैर नहीं हो सकता: PM @narendramodi