జనవరి 26 తర్వాత కూడా యాత్ర పొడిగింపు
‘“ వికాస్ రథ్ యాత్ర కాస్తా విశ్వాస్ రథయాత్ర గా మారింది. ఏ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని పరిస్థితి ఉండదన్న విశ్వాసం ఏర్పడింది’”
“ప్రతి ఒక్కరిచేత నిర్లక్ష్యానికి గురైన ప్రజలకు శ్రీ నరేంద్రమోదీ ఎంతో విలువ ఇచ్చి ఆదరిస్తారు”
“వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ,చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాలు అందేలా చూసేగొప్ప మాధ్యమం”.
“తొలిసారిగా ట్రాన్స్జెండర్ల గురించి ఒక ప్రభుత్వంపట్టించుకుంటోంది”‘’’
“ ప్రభుత్వంపై విశ్వాసం,నమ్మకం ప్రతిచోటా స్పష్టంగా కనిపిస్తోంది”

ప్రధానమంత్రి శ్రీ  నరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ భారత్  సంకల్ప్యాత్ర లబ్ధిదారులతో సంభాషించారు.దేశవ్యాప్తంగా  వేలాదిమంది లబ్ధిదారులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ  కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎం.పిలు, ఎం.ఎల్.ఎలు , స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ  సందర్భంగా  మాట్లాడుతూ ప్రధానమంత్రి, వికసిత్  భారత్  సంకల్ప్ యాత్ర రెండు  నెలలు పూర్తిచేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ యాత్ర కు సంబంధించిన వికాస్  రథ్ , విశ్వాస్ రథ్ గా మారిందని, అర్హులైన ఏ ఒక్కరికీ,  ప్రభుత్వ  సంక్షేమ పథకాలు అందని పరిస్థితి ఉండదన్న  విశ్వాసం  బలపడిందన్నారు.లబ్ధిదారులలో పెద్ద ఎత్తున ఉత్సాహం , ఆసక్తి వ్యక్తమవుతోందని, అందువల్ల వికసిత్ భారత్  సంకల్ప్  యాత్రను జనవవరి 26 అనంతరం కూడా  కొనసాగించాలని, ఫిబ్రవరిలో కూడా  దీనిని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర నవంబర్ 15 వ తేదీన, భగవాన్ బిర్సా ముండా ఆశీస్సులతో ప్రారంభమైందని ,ఇది ఒక ప్రజా  ఉద్యమంగా రూపుదిద్దుకున్నదని ప్రధానమంత్రి అన్నారు. ఈ యాత్రలో  ఇప్పటివరకు 15 కోట్ల  మంది పాల్గొన్నారని, దేశంలోని 80 శాతం పంచాయతీలను ఈ  యాత్ర పూర్తి చేసిందని తెలిపారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రధాన ఉద్దేశం, ఏదో ఒక కారణంతో ప్రభుత్వ పథకాలకు దూరమైన వారిని చేరుకోవడం   ఈ  కార్యక్రమ ప్రధాన  లక్ష్యమని అన్నారు. ప్రతిఒక్కరిచేతా నిరాదరణకు గురైన వారిని మొదీ ఆరాధిస్తారని, వారికి విలువ ఇస్తారని ప్రధానమంత్రి అన్నారు.

 

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, చిట్ట చివరి వ్యక్తి  వరకూ ప్రభుత్వ పథకాలు చేరేలా చేయడానికి, ఒక గొప్ప మాధ్యమమని అంటూ ప్రధానమంత్రి, ఈ యాత్ర సందర్భంగా ఇప్పటివరకు 4 కోట్ల  ఆరోగ్య పరీక్షలు, 2.5 కోట్ల టి.బి. నిర్ధారణ పరీక్షలు, 50 లక్షల సికిల్ సెల్ అనీమియా నిర్ధారణ  పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. 50 లక్షల ఆయుష్మాన్ కార్డులు, 33 లక్షల కొత్త పి.ఎం. కిసాన్ లబ్ధిదారుల కార్డులు, 25 లక్షల కొత్త కిసాన్ క్రెడిట్ కార్డులు, 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు, 10 లక్షల కొత్త స్వనిధి కొత్త దరఖాస్తుల స్వీకరణ సాధించినట్టు తెలిపారు. ఇవి కేవలం కొందరికి అంకెలుగా మాత్రమే కనిపించవచ్చని, కానీ ప్రతి ఒక్క అంకె ఒక జీవితమని ఆయన అన్నారు. వీరంతా ఇప్పటివరకూ  ప్రభుత్వ ప్రయోజనాలకు దూరమైన వారని ఆయన తెలిపారు.

బహుళ కోణాలలోని పేదరికానికి సంబంధించిన నూతన నివేదిక గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం గత 9 సంవత్సరాలలో తీసుకున్న చర్యల వల్ల, దేశంలో ని 25 కోట్ల మంది ప్రజలు పేదరికం  నుంచి బయటకు వచ్చారని అన్నారు.’’గత 10 సంవత్సరాలలో మా ప్రభుత్వం పారదర్శక  వ్యవస్థను తీసుకువచ్చింది. ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు చిత్తశుద్ధితో చర్యలు  చేపట్టింది.ఇది అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యం చేసింది. ‘‘ అని తెలిపారు. ఇందుకు ఉదాహరణగా పి.ఎం.ఆవాస యోజన కార్యక్రమాన్ని  ప్రధానమంత్రి ప్రస్తావించారు.ఈ పథకం  కింద సుమారు 4 కోట్ల  పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించినట్టు తెలిపారు. ఇందులో 70 శాతం ఇళ్లను మహిళల పేరుతో రిజిస్టర్  చేసినట్టు ఆయన  తెలిపారు.ఇది పేదరికం సమస్యను పరిష్కరించడానికి తోడ్పడడంతోపాటు మహిళలకు సాధికారతనిచ్చిందని తెలిపారు. ఈ ఇళ్ల సైజును పెంచడం జరిగిందని, నిర్మాణం విషయంలో ప్రజల అభీష్ఠాన్ని మన్నించడం జరిగిందన్నారు. ఇళ్లను శరవేగంగా నిర్మించడం జరిగిందని, నిర్మాణ కాలం 300 రోజుల  నుంచి 100 రోజులకు మెరుగపడిందని చెప్పారు. ’’అంటే తాము ఇళ్ళను ఇంతకుముందు కంటే  మూడురెట్ల వేగంగా నిర్మిస్తున్నట్టు  తెలిపారు.వీటిని పేదలకు అందిస్తున్నామని, ఈ చర్యలు దేశంలో పేదరికాన్ని గణనీయంగా తగ్గించేందుకు  ఉపకరిస్తున్నాయని తెలిపారు.

 

ట్రాన్స్ జండర్లకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల  గురించి తెలిపారు. ఇంతకు ముందు ప్రభుత్వ పథకాలు అందని వర్గాలకు ఏవిధంగా  చేయూత  నిస్తున్నదీ  వివరించారు.’’ ట్రాన్స్ జండర్ కమ్యూనిటీ  ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలిసారా మా ప్రభుత్వం గుర్తించింది. వారి జీవితాలు సులభతరం కావడానికి ప్రాధాన్యత నివ్వడం  జరిగింది. 2019 సంవత్సరంలో మా ప్రభుత్వం ట్రాన్స జండర్ల హక్కుల రక్షణకు  చట్టం తీసుకువచ్చింది. ఇది ట్రాన్స జండర్లు సమాజంలో గౌరవనీయ స్థానం పొందడానికి అవకాశం కల్పించింది. అంతేకాదు, వారిపట్ల గల వివక్షతను తొలగించింది. వేలాది  మందికి ట్రాన్ జండర్ గుర్తింపు కార్డులను ప్రభుత్వం మంజూరుచేసింది కూడా ‘‘ అని ఆయన తెలిపారు.

’’భారతదేశం శరవేగంగా మారుతున్నద,, ఇవాళ ప్రజల ప్రభుత్వం పై ప్రజల విశ్వాసం, నమ్మకం పెరుగుతున్నదని, నవభారత  నిర్మాణానికి సంకల్పం ప్రతి చోటా కనిపిస్తున్నదని ఆయన అన్నారు. ’’ ఇటీవల తాను గిరిజన బ్రుంద సభ్యులతో జరిపిన సంభాషణ గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతాలలో సైతం మహిళలు తమ హక్కుల సాధన గురించి తమ వారిలో చైతన్యం తీసుకువస్తుండడం గురించి తెలిపి వారి సంకల్పాన్ని అభినందించారు. స్వయం సహాయక బ్రుందాలకు సాధికారత  కల్పించేందుకు తీసుకున్న చర్యల గురించి ప్రస్తావించారు. ఈ బ్రుందాలను బ్యాంకులతో అనుసంధానం చేసేందుకు తీసుకున్న చర్యలు వివరించారు.  అలాగే హామీలేని రుణాల పరిమితిని పదిలక్షల రూపాయలనుంచి 20 లక్షల  రూపాయలకు పెంచిన విషయం ప్రస్తావించారు. దీనితో 10 కోట్ల  మంది కొత్తగా మహిళలు స్వయం సహాయక బ్రుందాలలో చేరుతున్నట్టు తెలిపారు. వీరు కొత్త వ్యాపారాలకు సుమారు 8 లక్షల కోట్ల  రూపాయల సహాయం పొందినట్టు  తెలిపారు. మహిళా రైతులుగా 3 కోట్ల మంది మహిళలు సాధికారత పొందిన విషయాన్ని  కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. 2 కోట్ల లక్షాధికారి  దీది, నమో డ్రోన్  దీది పథకం గురంచి కూడా ప్రధానమంత్రి తెలిపారు. ఇప్పటికే వెయిమంది నమో డ్రోన్ దిది శిక్షణను పూర్తి  చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడం, రైతు సాధికారత ప్రభుత్వ ప్రాధాన్యతా  అంశమని చెబుతూ ప్రధానమంత్రి, సన్నకారు రైతులను బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. 10 వేల ఎఫ్.పి.ఒ ల గురించి ప్రస్తావిస్తూ  ప్రధానమంత్రి , ఇందులో 8 వేల ఎఫ్.పి.లు ఇప్పటికే పనిచేస్తున్నాయన్నారు. పశువులలో గాలి కుంటు వ్యాధి రాకుండా నివారించేందుకు 50 కోట్ల వాక్సిన్లు వేయడం జరిగిందన్నారు. దీనివల్ల పాడి పశువులలో 50 శాతం పాల ఉత్పాదకత  పెరిగిందన్నారు.

 

భారత దేశ జనాభాలో యువ జనాభా గురించి ప్రస్తావిస్తూ  ప్రధానమంత్రి, వికసిత్ భారత్ సంకల్ఫ్ యాత్ర  సందర్భంగా క్విజ్ పోటీలు , క్రీడల పోటీలు నిర్వహించి  ఈ పోటీలలో గెలుపొందిన వారిని గౌరవించడం జరిగిందన్నారు. మై భారత్ పోర్టల్ లో యువత వలంటీర్లుగా  నమోదు చేసుకుంటుండడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.  2047 నాటికి వికసిత్ భారత్ సాధన జాతి సంకల్పమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

 

నేపథ్యం:

2023 నవంబర్ 15న వికసిత్ భారత్ సంకల్ప్  యాత్ర ప్రారంభించిన నాటినుంచి ప్రధానమంత్రి శ్రీ  నరేంద్రమోదీ ఎప్పటికప్పుడు ,దేశవ్యాప్తంగా గల లబ్ధిదారులతో  ముచ్చటిస్తూ  వస్తున్నారు. ఇప్పటికే ఐదుసార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారు లబ్ధిదారులతో  ముచ్చటించారు. ( 30 నవంబర్ 2023, 9 డిసెంబర్, 16 డిసెంబర్, 27 డిసెంబర్, 8  జనవరి 2024 ).గతనెలలో వారణాసి సందర్భన సందర్భంగా  ప్రధానమంత్రి డిసెంబర్  17,18 తేదీలలో వరుసగా  రెండు రోజులు వికసిత్  భారత్  సంకల్పయాత్ర లబ్ధిదారులతో ముఖాముఖి  సంభాషించారు.  వికసిత్ భారత్  సంకల్ప్  యాత్రను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పథకాలను అర్హులైన  వారందరికీ సకాలంలో  అందేట్టు చూడడం  దీనిలక్ష్యం. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఇప్పటివరకు పాల్గొన్నవారి సంఖ్య 15 కోట్లు  దాటింది. ఈ యాత్ర క్షేత్ర స్థాయిలో అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుండడం ఈ కార్యక్రమ విజయానికి నిదర్శనం.  ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ ఉమ్మడి దార్శనికతకు ప్రజలను ఏకం చేస్తోంది.

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi