‘జోడు ఇంజిన్’ ల ప్ర‌భుత్వం త్రిపుర రూపురేఖ‌ల‌ ను మార్చివేసింది: ప్ర‌ధాన మంత్రి
హెచ్ఐఆర్ఎ అభివృద్ధి ని.. అంటే హెచ్ఐఆర్ఎ అంటే.. హైవేస్, ఐ-వేస్, రైల్ వేస్, ఎయ‌ర్ వేస్ అభివృద్ధి ని త్రిపుర గమనిస్తున్న‌ది: ప్ర‌ధాన మంత్రి
సంధానం భార‌త‌దేశాని కి, బాంగ్లాదేశ్ కు మ‌ధ్య మిత్రత్వాన్ని బ‌ల‌ప‌ర‌చ‌డమొక్క‌టే కాకుండా వ్యాపారానికి ఒక దృఢ‌మైన బంధం గా కూడా నిరూపించుకొంటోంది: ప్ర‌ధాన‌మంత్రి
బాంగ్లాదేశ్ లో ఆర్థిక ప‌ర‌మైన అవ‌కాశాల‌ కు కూడా మైత్రి వంతెన ప్రోత్సాహాన్ని ఇస్తుంది: ప్ర‌ధాన మంత్రి

భార‌త‌దేశాని కి, బాంగ్లాదేశ్ కు మ‌ధ్య ఏర్పాటైన ‘మైత్రీ సేతు’ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా మంగ‌ళ‌వారం నాడు ప్రారంభించారు.  ఆయ‌న త్రిపుర లో అనేక మౌలిక స‌దుపాయాల ప‌థ‌కాల ను ప్రారంభించారు; మ‌రికొన్ని మౌలిక స‌దుపాయాల ప‌థ‌కాల కు శంకుస్థాప‌నల ను కూడా చేశారు.  ఈ కార్య‌క్ర‌మం లో  త్రిపుర గ‌వ‌ర్న‌ర్‌, త్రిపుర ముఖ్య‌మంత్రి పాలుపంచుకొన్నారు.  బాంగ్లాదేశ్ ప్ర‌ధాని వీడియో మాధ్య‌మం ద్వారా ఇచ్చిన సందేశాన్ని ఈ సంద‌ర్భం లో ప్ర‌ద‌ర్శించ‌డ‌మైంది.
 
ఈ కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ,  ఇదివ‌ర‌క‌టి 30 ఏళ్ళ ప్ర‌భుత్వాల‌ కు, గ‌డ‌చిన మూడు సంవ‌త్స‌రాలుగా కొన‌సాగుతున్న ‘జోడు ఇంజిన్ల’ ప్ర‌భుత్వాని కి మ‌ధ్య ఉన్న స్ప‌ష్ట‌మైన తేడా ను త్రిపుర గ‌మనిస్తోంద‌న్నారు.  ఇదివ‌ర‌క‌టి సంవ‌త్స‌రాల లో అవినీతి, క‌మిశన్‌ సంస్కృతి ఉండ‌గా, ప్ర‌స్తుతం వాటికి బ‌దులుగా ప్ర‌యోజ‌నాలు ల‌బ్ధిదారుల ఖాతాల లోకే నేరు గా అందుతున్నాయి.  జీతం సకాలం లో అందే విష‌యం లో అవాంతరాలను ఎదుర్కొన్న ఉద్యోగులు 7వ వేత‌న సంఘం సిఫారసు ల ప్రకారం జీతం అందుకొంటున్నార‌ని కూడా ఆయ‌న గుర్తు కు తెచ్చారు.  త్రిపుర లో రైతులు వారి పంట‌ ను అమ్ముకోవ‌డానికి ఎన్నో స‌మ‌స్య‌ల పాల‌బ‌డేవారు అలాంటిది, మొట్టమొదటి సారి గా త్రిపుర లో కనీస మద్దతు ధర (ఎమ్ఎస్‌పి) ని నిర్ణ‌యించ‌డం జ‌రిగింది.  ఇదివ‌ర‌కు స‌మ్మె ల సంస్కృతి ఉంటే దానికి బ‌దులు గా వ్యాపారం చేసుకోవ‌డంలో సౌల‌భ్యం తో కూడిన వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని కూడా ఆయ‌న అన్నారు.  కొత్త గా వ‌స్తున్న పెట్టుబ‌డులు మునుప‌టి ప‌రిశ్ర‌మ మూసివేత తాలూకు సన్నివేశాన్ని మార్చుతున్నాయి.  త్రిపుర నుంచి జ‌రుగుతున్న ఎగుమ‌తులు రాశి ప‌రంగా చూస్తే అయిదింత‌లు అధికం అయ్యాయ‌ని ఆయ‌న అన్నారు.‌

గ‌త ఆరు సంవత్సరాల లో, కేంద్ర ప్రభుత్వం త్రిపుర అభివృద్ధి కి అవసరమైన ప్ర‌తి ఒక్కదాని ప‌ట్ల శ్ర‌ద్ధ తీసుకొంది అని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.  రాష్ట్రాని కి కేంద్రం కేటాయింపుల లో గ‌ణ‌నీయ‌మైన పెరుగుద‌ల చోటు చేసుకొంది అని ఆయ‌న చెప్పారు.  2009- 2014 సంవ‌త్స‌రాల మ‌ధ్య కాలం లో కేంద్ర అభివృద్ధి ప‌థ‌కాల కై 3,500 కోట్ల రూపాయ‌ల‌ ను త్రిపుర అందుకొంటే 2014- 2019 మ‌ధ్య కాలం లో 12,000 కోట్ల రూపాయ‌ల‌ ను స‌ర్దుబాటు చేయ‌డ‌ం జరిగింది.

‘జోడు ఇంజిన్’ ల ప్ర‌భుత్వం తాలూకు ప్ర‌యోజ‌నాల‌ ను గురించి ప్ర‌ధాన మంత్రి స్పష్టం గా చెప్పారు.  ఏ రాష్ట్రాల లో ‘జోడు ఇంజిన్’ ల ప్ర‌భుత్వం లేదో అక్కడి పేద‌ల ను, రైతుల ను, మ‌హిళ‌ల‌ ను బ‌లోపేతం చేసే ప‌థ‌కాల తాలూకు పురోగ‌తి చాలా నెమ్మ‌ది గా ఉంది అని ఆయ‌న ప్రస్తావించారు.  ‘రెండు ఇంజిన్’ లు ఉన్న ప్ర‌భుత్వం త్రిపుర ను ప‌టిష్ట‌ప‌ర్చడానికి కృషి చేస్తోంద‌ని ఆయ‌న స్పష్టం చేశారు.  ఈ ‘జత ఇంజిన్’ ల ప్ర‌భుత్వం త్రిపుర ను విద్యుత్తు కొర‌త ఉన్న రాష్ట్రం స్థాయి నుంచి విద్యుత్తు మిగులు గా ఉన్న రాష్ట్రం స్థాయి కి మార్చివేసింద‌ని ఆయ‌న అన్నారు.  ‘జంట ఇంజిన్’ ల ప్ర‌భుత్వం రాష్ట్రం లో తీసుకు వ‌చ్చిన ఇత‌ర ప‌రివ‌ర్త‌న‌ల‌ ను గురించి ఆయ‌న ఒక్కటొక్క‌టి గా వివ‌రిస్తూ 2 ల‌క్ష‌ల గ్రామీణ కుటుంబాల‌ కు తాగు నీటి ని న‌ల్లా ల ద్వారా  స‌ర‌ఫ‌రా చేయ‌డం, 2.5 ల‌క్ష‌ల ఉచిత గ్యాస్ క‌నెక్ష‌న్ ల‌ను స‌మ‌కూర్చ‌డం, త్రిపుర లోని ప్ర‌తి ఒక్క ప‌ల్లె ను ఆరుబ‌య‌లు ప్రాంతాల లో మ‌ల‌ మూత్రాదుల విస‌ర్జన అభ్యాసానికి తావులేనిది గా తీర్చిదిద్ద‌డం, 50,000 మంది గ‌ర్భిణులు ‘మాతృ వంద‌న యోజ‌న’ తాలూకు ల‌బ్ధి ని అందుకోవ‌డం, 40,000 పేద కుటుంబాలు కొత్త ఇళ్ళ లో చేర‌డం వగైరా అంశాల‌ ను గురించి ప్ర‌స్తావించారు.

సంధానానికి సంబంధించిన మౌలిక స‌దుపాయాలు గ‌త మూడు సంవ‌త్స‌రాల లో ఎంతో మెరుగుప‌డ్డాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  త్రిపుర లో విమానాశ్ర‌యం కోసం ప‌నులు త్వ‌రిత‌ గ‌తి న జ‌ర‌గ‌డం, ఇంట‌ర్ నెట్ కోసం సీ-లింక్, అదే మాదిరి గా రైలు లింకు, జ‌ల‌మార్గాల ప‌నుల‌ను ఈ సందర్బం లో ఆయ‌న ఉదాహ‌రించారు.  త్రిపుర లో  హెచ్ఐఆర్ఎ ఆధారిత అభివృద్ధి అంటే.. హై వేస్, ఐ-వేస్, రైల్ వేస్, ఎయ‌ర్ వేస్ ఆధారిత అభివృద్ధి చోటు చేసుకొన్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు.‌

సంధానం అనేది భార‌త‌దేశాని కి, బాంగ్లాదేశ్ కు మ‌ధ్య స్నేహాన్ని బ‌ల‌ప‌ర‌చ‌డమొక్క‌టే కాకుండా వ్యాపారం ప‌రంగా ఒక బ‌ల‌మైన బంధాన్ని కూడా అందిస్తోంద‌ని ప్ర‌ధాన ‌మంత్రి అన్నారు.  యావ‌త్తు ప్రాంతాన్ని భార‌త‌దేశ ఈశాన్య ప్రాంతాని కి, బాంగ్లాదేశ్ కు మ‌ధ్య ఒక ట్రేడ్ కారిడార్ గా అభివృద్ధి ప‌ర‌చ‌డం జ‌రుగుతోంద‌ని ఆయ‌న తెలిపారు.  ఇటీవ‌లి కొన్నేళ్ల లో ఏర్పాటైన రైలు మార్గ ప‌థ‌కాలు, జ‌ల సంధాన ప‌థ‌కాలు ఈ వంతెన తో మరింతగా బ‌ల‌ప‌డ్డాయి అని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.  ఇది అస‌మ్ ద‌క్షిణ ప్రాంతాన్ని, మిజోర‌మ్‌, మ‌ణిపుర్ ల‌ సంధానాన్ని మెరుగు ప‌ర‌చ‌డం తోపాటు బాంగ్లాదేశ్ తో, ఆగ్నేయ ఆసియా తో త్రిపుర కు సైతం సంధానాన్ని మెరుగు ప‌రుస్తుంద‌ని ఆయ‌న చెప్పారు.  ఈ వంతెన బాంగ్లాదేశ్ లో ఆర్థిక ప‌ర‌మైన అవ‌కాశాల‌ కు ఉత్తేజాన్ని అందిస్తుంది అని ఆయ‌న అన్నారు.  ఈ వంతెన ప‌థ‌కాన్ని పూర్తి చేయ‌డం లో స‌హ‌కారాన్ని అందించినందుకు బాంగ్లాదేశ్ ప్ర‌భుత్వాని కి, బాంగ్లాదేశ్ ప్ర‌ధాని కి ప్ర‌ధాన మంత్రి ధ‌న్య‌వాదాలు తెలిపారు.   బాంగ్లాదేశ్ ను తాను సంద‌ర్శించిన వేళ లో ఈ వంతెన కు శంకుస్థాప‌న జ‌రిగిందని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  ‌‌

ప్ర‌స్తుతం ఈశాన్య ప్రాంతాని కి ఏ విధ‌మైన స‌ర‌ఫ‌రా కు అయినా స‌రే ప్ర‌జ‌లు ఒక్క ర‌హ‌దారి మార్గం మీదే ఆధార‌ప‌డ‌న‌క్క‌ర‌ లేద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  బాంగ్లాదేశ్ లోని చిట్ట‌గాంగ్ నౌకాశ్ర‌యాన్ని ఈశాన్య ప్రాంతం తో క‌లిపేందుకు న‌ది గుండా ఒక ప్ర‌త్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు సంబంధించిన కసరత్తు సాగుతోందని ఆయ‌న చెప్పారు.  గోదాములు, కంటేన‌ర్ ట్రాన్స్-శిప్‌మెంట్ సౌక‌ర్యాల తో ఒక పూర్తి స్థాయి లాజిస్టిక్ హ‌బ్ గా స‌బ్ రూమ్ లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ (ఐసిపి) ప‌ని చేస్తుంది అని ఆయ‌న తెలిపారు.

ఫేనీ న‌ది పైన నిర్మాణ‌మైన ఈ వంతెన కార‌ణం గా అగ‌ర్ తలా  భార‌త‌దేశం లో ఒక అంత‌ర్జాతీయ నౌకాశ్ర‌యాని కి అత్యంత స‌మీపం లో ఉన్న న‌గ‌రం గా మారనుంది.  ఎన్‌హెచ్‌-08, ఎన్‌హెచ్‌-208 ల విస్త‌ర‌ణ‌ కు సంబంధించిన ప‌థ‌కాలు ఏవైతే ప్రారంభానికి, శంకుస్థాప‌న కు నోచుకొన్నాయో అవి నౌకాశ్ర‌యం తో ఈశాన్య ప్రాంత సంధానాన్ని బ‌ల‌ప‌రుస్తాయ‌ని శ్రీ న‌రేంద్ర‌ మోదీ వివ‌రించారు.

ఈ రోజు న ప్రారంభం జరిగిన అనేక ప‌థ‌కాలు అగ‌ర్ తలా ను ఒక ఉత్త‌మ‌ న‌గ‌రం గా తీర్చిదిద్దేందుకు జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాలు అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  కొత్త‌ గా ఏర్పాట‌య్యే ఏకీకృత క‌మాండ్ కేంద్రం వాహ‌నాల రాక‌ పోక‌ల‌ కు సంబంధించిన స‌మ‌స్య‌ల ను, హింస ను నివారించేందుకు సాంకేతిక సంబంధి మ‌ద్ధ‌తు ను అందిస్తుందని ఆయ‌న అన్నారు.  అదే విధం గా, బ‌హుళ స్థాయిల లో వాహ‌నాల నిలుపుద‌ల సదుపాయం, వాణిజ్య భ‌వ‌నాల స‌ముదాయం, విమానాశ్ర‌యాన్ని క‌లిపే ర‌హ‌దారి విస్త‌ర‌ణ త‌దిత‌ర ప‌థకాలు ఈ రోజు న ప్రారంభ‌మై అగ‌ర్ తలా లో జీవ‌న సౌల‌భ్యాన్ని, వ్యాపార నిర్వ‌హ‌ణ సౌల‌భ్యాన్ని ఎంత‌గానో మెరుగుప‌రుస్తాయ‌ని ఆయ‌న వివ‌రించారు.

ద‌శాబ్దాల త‌ర‌బ‌డి పరిష్కారం కాకుండా వ‌చ్చినటువంటి పాత బ్రూ శ‌ర‌ణార్థుల స‌మ‌స్య ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాల ద్వారా ఒక ప‌రిష్కారానికి నోచుకొంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  600 కోట్ల రూపాయ‌ల విలువైన ప్యాకేజీ బ్రూ ప్ర‌జ‌ల జీవితాల లో ఒక స‌కారాత్మ‌క‌మైన‌టువంటి మార్పును తీసుకువస్తుందనే ఆశ‌ ను ఆయ‌న వ్య‌క్తం చేశారు.

రాష్ట్రాని కి ఉన్న ఘ‌న‌ వార‌స‌త్వాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించి, అగ‌ర్ తలా విమానాశ్ర‌యాని కి మ‌హారాజా బీర్ బిక్రం కిశోర్ మాణిక్య పేరు ను పెట్ట‌డం త్రిపుర అభివృద్ధి ప‌ట్ల ఆయ‌న‌ కు ఉన్న దృష్టికోణాన్ని గౌర‌వించుకొనేందుకు సూచికగా ఉందన్నారు.  అదేవిధంగా త్రిపుర తాలూకు సుసంప‌న్న సంస్కృతి కి, సాహిత్యానికి సేవ‌ చేసిన థంగా దా‌ర్ లాంగ్‌, స‌త్య‌రామ్ రియాంగ్‌, బేణీ చంద్ర జమాతియా‌ ల వంటి  వారిని గౌర‌వించుకొనే అవ‌కాశం ల‌భించినందుకు ప్ర‌ధాన మంత్రి సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.  వెదురు గ‌డ‌ల‌ తో ముడిప‌డ్డ స్థానిక క‌ళ ను ప్ర‌ధాన మంత్రి వ‌న్ ధ‌న్ యోజ‌న లో భాగం గా ప్రోత్స‌హించ‌డం జ‌రుగుతోంద‌ని, ఇది స్థానిక ఆదివాసీల‌ కు కొత్త కొత్త అవ‌కాశాల‌ ను అందిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.
 
త్రిపుర ప్ర‌భుత్వం మూడు సంవ‌త్స‌రాల కాలాన్ని పూర్తి చేసుకొన్నందుకు శ్రీ న‌రేంద్ర మోదీ అభినందిస్తూ, రాష్ట్ర ప్ర‌భుత్వం త్రిపుర ప్ర‌జ‌ల కు చేస్తున్న సేవను కొనసాగిస్తుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 జనవరి 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones