‘‘ప్రస్తుతంలో,భారతదేశం ప్రపంచ వ్యాపారాని కి ఒక ప్రముఖ కేంద్రం గా మారుతున్న వేళ, దేశం యొక్కసముద్ర సంబంధి బలాన్ని పెంచడం పైన మేం శ్రద్ధ వహిస్తున్నాం’’
‘‘ఓడరేవులు, శిపింగ్ మరియు అంతర్ దేశీయ జల మార్గాల రంగాల లో ‘వ్యాపార నిర్వహణ పరమైన సౌలభ్యా’న్ని పెంచడానికి గత పది సంవత్సరాల లో అనేక సంస్కరణల ను అమలు పరచడమైంది’’
‘‘ప్రపంచ వ్యాపారంలో భారతదేశాని కి ఉన్న సామర్థ్యాన్ని మరియు స్థానాన్ని ప్రపంచం గుర్తిస్తున్నది’’
‘‘వికసిత్ భారత్ఆవిష్కారం కోసం భారతదేశాని కి ఉన్న సముద్ర సంబంధి సత్తా ను పరిపుష్టం చేసేందుకు ఒకమార్గసూచీ ని మేరిటైమ్ అమృత్ కాల్ విజన్ ముందుకు తెస్తున్నది’’
‘‘కోచి లో న్యూడ్రై డాక్ భారతదేశాని కి గర్వకారణం అని చెప్పాలి’’
‘‘కోచి శిప్ యార్డ్దేశం లోని నగరాల లో ఆధునికమైనటువంటి మరియు గ్రీన్ వాటర్ కనెక్టివిటీ విషయం లో ఒకముఖ్య పాత్ర ను పోషిస్తున్నది’’

నాలుగు వేల కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన మౌలిక సదుపాయల రంగం సంబంధి ప్రాజెక్టుల ను మూడింటి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేరళ లోని కోచి లో ఈ రోజు న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల లో కొచ్చిన్ శిప్ యార్డ్ లిమిటెడ్ (సిఎస్ఎల్) లో న్యూ డ్రై డాక్ (ఎన్‌డిడి) , సిఎస్ఎల్ లోనే ఇంటర్‌నేశనల్ శిప్ రిపేర్ ఫెసిలిటీ (ఐఎస్ఆర్ఎఫ్) మరియు కోచి లోని పుదువిపీన్ లో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేశన్ కు చెందిన ఎల్‌పిజి ఇంపోర్ట్ టర్మినల్ లు భాగం గా ఉన్నాయి. ఈ ప్రధానమైన మౌలిక సదుపాయాల కల్పన సంబంధి పథకాలు భారతదేశం లో ఓడరేవుల ను, శిపింగ్ ను మరియు జలమార్గాల రంగాన్ని మెరుగు పరచి సామర్థ్యాన్ని వృద్ధి చేయడం మరియు ఆ రంగాన్ని స్వయం సమృద్ధం గా తీర్చిదిద్దాలన్న ప్రధాన మంత్రి దృష్టికోణాని కి అనుగుణం గా ఉన్నాయి.

 

ప్రధాన మంత్రి సభ ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ రోజు న ఉదయం పూట భగవాన్ గురువయూరప్పన్ ను దర్శించుకొన్న విషయాన్ని ప్రస్తావించారు. రామాయణం తో ముడిపడ్డ కేరళ లోని పవిత్ర దేవాలయాల ను గురించి అయోధ్య ధామ్ లో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇటీవల ప్రారంభించిన సందర్భం లో తాను ఇచ్చిన ప్రసంగం లో ప్రస్తావించడాన్ని కూడా ఆయన గుర్తు కు తీసుకు వచ్చారు. అయోధ్య ధామ్ లో ప్రాణప్రతిష్ఠ జరిగే కంటే కొన్ని రోజుల ముందు రామస్వామి దేవాలయం లో దైవ దర్శనం తాలూకు భాగ్యం తనకు ప్రాప్తించినందుకు ఆయన కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. కేరళ కు చెందిన కళాకారులు ఈ రోజు ఉదయం ఇచ్చిన సుందరమైన కార్యక్రమం కేరళ లో అవధ్ పురి తాలూకు భావన ను రేకెత్తించింది అని ఆయన అన్నారు.

 

అమృత కాలం లో భారతదేశాన్ని ‘వికసిత్ భారత్’ గా ముందుకు తీసుకుపోవడం లో ప్రతి ఒక్క రాష్ట్రాని కి ఉన్న పాత్ర ను గురించి ప్రధాన మంత్రి నొక్కిపలికారు. మునుపటి కాలాల్లో భారతదేశం ఆర్జించిన సమృద్ధి లో నౌకాశ్రయాల భూమిక ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్ఫురణ కు తెస్తూ, ప్రస్తుతం భారతదేశం ప్రపంచ వ్యాపారం లో ప్రధానమైన కేంద్రం గా మారుతూ ఉండడం లో ఓడరేవుల కు అదే తరహా పాత్ర ఉంటుందన్నారు. ఆ స్థితి లో ప్రభుత్వం కోచి వంటి నౌకాశ్రయ నగరాల శక్తి ని సాన పట్టడం లో తలమునకలు గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సందర్భం లో ఆయన నౌకాశ్రయాల సామర్థ్యాన్ని వృద్ధి చెందింప చేయడం, నౌకాశ్రయాల సంబంధి మౌలిక సదుపాయాల కల్పన లో పెట్టుబడి పెట్టడం, ఇంకా ‘సాగర్‌మాల’ పథకం లో భాగం గా ఓడరేవుల యొక్క సంధానాన్ని మెరుగు పరచడం వంటి అంశాల ను గురించి వివరించారు.

 

దేశం అతి పెద్ద డ్రై డాక్ ను కోచి ఈ రోజు న అందుకొందని ప్రధాన మంత్రి అన్నారు. నౌక ల నిర్మాణం, నౌకల కు మరమ్మతుల ను చేయడం మరియు ఎల్‌పిజి ఇంపోర్ట్ టర్మినల్ ల వంటి ఇతర ప్రాజెక్టు లు సైతం కేరళ లోను మరియు దేశ దక్షిణ ప్రాంతాల లోను అభివృద్ధి కి జోరు ను జతపరచ గలుగుతాయి అని కూడా ఆయన అన్నారు. విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను భారతదేశం లోనే తయారు చేసిన (‘మేడ్ ఇన్ ఇండియా’) ఖ్యాతి కోచి శిప్ యార్డు కు చెందుతుందని కూడా ఆయన అన్నారు. నూతనం గా జత పడే సదుపాయాలు శిప్ యార్డు యొక్క శక్తి యుక్తుల ను అనేక రెట్లు ఇనుమడింప చేస్తాయి అని ఆయన వివరించారు.

 

గడచిన 10 సంవత్సరాల లో ఓడరేవులు, శిపింగ్, ఇంకా జలమార్గాల రంగం లో చోటు చేసుకొన్న సంస్కరణల ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తుతిస్తూ, అవి భారతదేశ నౌకాశ్రయాల లో క్రొత్త గా పెట్టుబడుల ను తీసుకు వచ్చాయి, క్రొత్త గా ఉద్యోగ అవకాశాల ను కూడా కల్పించాయి అని వివరించారు. భారతదేశ నౌకల కు సంబంధించిన నియమ నిబంధనల పరం గా తలపెట్టిన సంస్కరణ లు దేశం లో నౌక ల సంఖ్య లో 140 శాతం వృద్ధి కి బాట ను పరచాయి అని ఆయన తెలిపారు. అంతర్ దేశీయ జలమార్గాల వినియోగం ద్వారా దేశం లోపల కూడాను ప్రయాణాలు మరియు సరకు రవాణా ల పరం గా పెద్ద ఊతం లభించిందని ప్రధాన మంత్రి అన్నారు.

 

‘‘సబ్ కా ప్రయాస్ (అందరి ప్రయత్నాలు) మెరుగైన ఫలితాల ను అందిస్తాయి’’ అంటూ ప్రధాన మంత్రి అభివర్ణించారు. భారతదేశం లో నౌకాశ్రయాలు గత పది సంవత్సరాల లో రెండంకెల వార్షిక వృద్ధి ని నమోదు చేశాయి అని ఆయన అన్నారు. పదేళ్ళ క్రితం వరకు చూసుకొన్నట్లయితే, నౌక లు ఓడరేవుల వద్ద సుదీర్ఘ కాలం వేచి ఉండవలసి వచ్చేది; నౌకల లో సరకుల ను దింపుకోవడానికి ఎంతో కాలం పట్టేది అని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. ‘‘ఇవాళ్టి స్థితి మారింది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. టర్న్ అరౌండ్ టైము విషయాని కి వస్తే, అభివృద్ధి చెందిన అనేక దేశాల కంటే భారతదేశం ఎంతో ముందుంది అని ఆయన వెల్లడించారు.

 

"గ్లోబల్ ట్రేడ్‌లో భారతదేశం సామర్థ్యాన్ని, స్థానాన్ని ప్రపంచం గుర్తిస్తోంది", మధ్య ప్రాచ్య ఐరోపా ఎకనామిక్ కారిడార్‌కు సంబంధించి భారతదేశం జి-20 ప్రెసిడెన్సీ సమయంలో చేసిన ఒప్పందాలను వెలుగులోకి తెస్తూ ప్రధాని మోదీ అన్నారు.  మధ్య ప్రాచ్య ఐరోపా ఎకనామిక్ కారిడార్‌ భారతదేశ తీరప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం ద్వారా వికసిత భారత్ రూపకల్పనకు మరింత బలోపేతం చేస్తుందని శ్రీ మోదీ చెప్పారు. వికసిత  భారత్ కోసం భారతదేశం సముద్ర పరాక్రమాన్ని బలోపేతం చేయడానికి రోడ్‌మ్యాప్‌ను అందించడానికి ఇటీవల ప్రారంభించిన మారిటైమ్ అమృత్ కాల్ విజన్‌ను కూడా ప్రధాన మంత్రి స్పృశించారు. దేశంలో మెగా పోర్ట్‌లు, నౌకానిర్మాణం, నౌకల మరమ్మతు మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పునరుద్ఘాటించారు.

 

కొత్త డ్రై డాక్ భారతదేశానికి గర్వకారణమని ప్రధాని మోదీ అన్నారు. ఇది పెద్ద నౌకలను డాక్ చేయడానికి మాత్రమే కాకుండా ఇక్కడ నౌకానిర్మాణం, ఓడ మరమ్మత్తు పనిని సాధ్యం చేస్తుంది, విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా విదేశీ మారకద్రవ్యాన్ని కూడా ఆదా చేస్తుంది.

అంతర్జాతీయ నౌక మరమ్మతు కేంద్రం ప్రారంభోత్సవాన్ని ప్రస్తావిస్తూ, కొచ్చిని భారత్‌, ఆసియాలోనే అతిపెద్ద ఓడ మరమ్మతు కేంద్రంగా మారుస్తామని ప్రధాని చెప్పారు. ఐఎన్ఎస్ విక్రాంత్ తయారీలో బహుళ ఎంఎస్ఎంఈల సారూప్యతను గుర్తించడం ద్వారా, అటువంటి భారీ నౌకానిర్మాణం, మరమ్మత్తు సౌకర్యాల ప్రారంభోత్సవంతో ఎంఎస్ఎంఈల కొత్త పర్యావరణ వ్యవస్థను రూపొందించడంపై ప్రధాన మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త ఎల్పిజీ దిగుమతి టెర్మినల్ కొచ్చి, కోయంబత్తూర్, ఈరోడ్, సేలం, కాలికట్, మధురై, తిరుచ్చి ప్రాంతాల  ఎల్పిజీ అవసరాలను తీరుస్తుందని, అలాగే పరిశ్రమలు, ఇతర ఆర్థిక అభివృద్ధి కార్యకలాపాలు, ఈ ప్రాంతాల్లో కొత్త ఉద్యోగాల కల్పనకు మార్గం వేస్తుందని  ఆయన అన్నారు. 

అగ్రస్థానంలో ఉన్న కొచ్చి షిప్‌యార్డ్ గ్రీన్ టెక్నాలజీ సామర్థ్యాలను, ‘మేక్ ఇన్ ఇండియా’ నౌకలను తయారు చేయడంలో దాని ప్రాధాన్యతను ప్రధాన మంత్రి గుర్తించారు. కొచ్చి వాటర్ మెట్రో కోసం తయారు చేసిన విద్యుత్ నౌకలను కూడా ప్రధాని ప్రశంసించారు. అయోధ్య, వారణాసి, మధుర, గౌహతికి ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ప్యాసింజర్ ఫెర్రీలు ఇక్కడ తయారు అవుతున్నాయి. "దేశంలోని నగరాల్లో ఆధునిక, గ్రీన్ వాటర్ కనెక్టివిటీలో కొచ్చి షిప్‌యార్డ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది" అని ఆయన అన్నారు. నార్వే కోసం జీరో-ఎమిషన్ ఎలక్ట్రిక్ కార్గో ఫెర్రీలు తయారు అవుతున్నాయి. ప్రపంచంలోని మొట్టమొదటి హైడ్రోజన్-ఇంధన ఫీడర్ కంటైనర్ ఓడలో పురోగతిలో ఉన్న పనిని కూడా అతను ప్రస్తావించారు. “కొచ్చి షిప్‌యార్డ్ హైడ్రోజన్ ఇంధన ఆధారిత రవాణా వైపు భారతదేశాన్ని తీసుకెళ్లే మన మిషన్‌ను మరింత బలోపేతం చేస్తోంది. అతి త్వరలో దేశానికి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీ లభిస్తుందని నేను విశ్వసిస్తున్నాను” అని ప్రధాని మోదీ తెలిపారు.

నీలి ఆర్థిక వ్యవస్థ, ఓడరేవు ఆధారిత అభివృద్ధిలో మత్స్యకారుల సంఘం పాత్రను ప్రధాన మంత్రి హైలైట్ చేశారు. గత 10 సంవత్సరాలలో చేపల ఉత్పత్తి,  ఎగుమతుల్లో అనేక రెట్లు పెరిగిన ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధికి, లోతైన సముద్రంలో చేపలు పట్టేందుకు ఆధునికీకరించిన పడవలకు కేంద్ర ప్రభుత్వం అందించిన సబ్సిడీ, మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డ్‌లను శ్రీ మోదీ ప్రశంసించారు. రైతుల తరహాలో. మత్స్యకారుల ఆదాయం భారీగా పెరగడంతో పాటు వారి జీవితాలను సులభతరం చేసేందుకు సీఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారతదేశం సహకారాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తోందని ఆయన అన్నారు. ప్ర‌ధాన మంత్రి కేర‌ళ త్వ‌ర‌గా అభివృద్ధి చెందాల‌ని ఆకాంక్షిస్తూ, కొత్త అవ‌స్థాప‌న ప్రాజెక్టుల‌కు పౌరుల‌ను అభినందించారు.

ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్,  జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ తదితరులు పాల్గొన్నారు.

 

నేపథ్యం :

కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్ఎల్) ప్రస్తుత ప్రాంగణంలో సుమారు రూ. 1,800 కోట్ల వ్యయంతో నిర్మించిన న్యూ డ్రై డాక్, న్యూ ఇండియా ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రతిబింబించే ఒక ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్. 75/60 మీటర్ల వెడల్పు, 13 మీటర్ల లోతు, 9.5 మీటర్ల వరకు డ్రాఫ్ట్‌తో 310 మీటర్ల పొడవున్న ఈ ఒక రకమైన స్టెప్డ్ డ్రై డాక్, ఈ ప్రాంతంలోని అతిపెద్ద సముద్ర మౌలిక సదుపాయాలలో ఒకటి. కొత్త డ్రై డాక్ ప్రాజెక్ట్ భారీ గ్రౌండ్ లోడింగ్‌ను కలిగి ఉంది, ఇది భవిష్యత్తులో 70,000 టన్నుల స్థానభ్రంశం వరకు విమాన వాహకాలు అలాగే పెద్ద వాణిజ్య నౌకలు వంటి వ్యూహాత్మక ఆస్తులను నిర్వహించడానికి అధునాతన సామర్థ్యాలతో భారతదేశాన్ని ఉంచుతుంది, తద్వారా అత్యవసర జాతీయ అవసరాల కోసం భారతదేశం విదేశీ దేశాలపై ఆధారపడటాన్ని తొలగిస్తుంది.

దాదాపు రూ. 970 కోట్లతో నిర్మించిన ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ (ఐఎస్ఆర్ఎఫ్) ప్రాజెక్ట్ 6000 టన్నుల సామర్థ్యంతో షిప్ లిఫ్ట్ సిస్టమ్, ట్రాన్స్‌ఫర్ సిస్టమ్, ఆరు వర్క్‌స్టేషన్‌లు, 1,400 మీటర్ల బెర్త్‌ను కలిగి ఉంది, ఇందులో 130 ఓడలు ఉంచవచ్చు. ఐఎస్ఆర్ఎఫ్ సిఎస్ఎల్ ప్రస్తుత నౌకల మరమ్మత్తు సామర్థ్యాలను ఆధునీకరించి, విస్తరింపజేస్తుంది. కొచ్చిని గ్లోబల్ షిప్ రిపేర్ హబ్‌గా మార్చే దిశగా అడుగులు వేస్తుంది.

 

కొచ్చిలోని పుతువైపీన్ వద్ద ఇండియన్ ఆయిల్ ఎల్పిజి  దిగుమతి టెర్మినల్ దాదాపు రూ. 1,236 కోట్లతో నిర్మించారు. ఇది అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉంది. 15400 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో, టెర్మినల్ ప్రాంతంలోని లక్షలాది గృహాలు, వ్యాపారాలకు స్థిరమైన ఎల్పిజి సరఫరాను నిర్ధారిస్తుంది. ఈ ప్రాజెక్ట్ అందరికీ అందుబాటులో ఉండే & అందుబాటు ధరలో ఇంధనాన్ని అందించడంలో భారతదేశం ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తుంది.
ఈ 3 ప్రాజెక్ట్‌ల ప్రారంభంతో, దేశం నౌకానిర్మాణం, మరమ్మత్తు సామర్థ్యాలు, అనుబంధ పరిశ్రమలతో సహా ఇంధన మౌలిక సదుపాయాల వృద్ధికి ఊతం లభిస్తుంది. ఈ ప్రాజెక్టులు ఎగ్జిమ్ ట్రేడ్‌ను కూడా పెంచుతాయి, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గిస్తాయి, ఆర్థిక వృద్ధిని పెంచుతాయి, స్వయం సమృద్ధిని పెంచుతాయి. అనేక దేశీయ,  అంతర్జాతీయ వ్యాపార అవకాశాలను సృష్టిస్తాయి.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi