‘‘సశక్త్ ఉత్తరాఖండ్; ఎండ్ బ్రాండ్ - హౌస్ ఆఫ్ హిమాలయాస్’’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు
‘‘ఉత్తరాఖండ్ఎటువంటి రాష్ట్రం అంటే అక్కడ దైవత్వం మరియు అభివృద్ధి.. ఈ రెండూ కలసికట్టుగాఉండడాన్ని మనం గమనించవచ్చును’’
‘‘భారతదేశం యొక్కఎస్‌డబ్ల్యుఒటి విశ్లేషణ ను పట్టి చూస్తే మహత్వాకాంక్షలు, ఆశ, ఆత్మవిశ్వాసం, నూతన ఆవిష్కరణ లు మరియు అవకాశాలు సమృద్ధి గా కనిపిస్తాయి’’
‘‘ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరియు భారతదేశం యొక్క ప్రభుత్వం పరస్పరం ప్రయాసల ను పెంపొందించుకొంటున్నాయి’’
‘‘ ‘మేక్ ఇన్ ఇండియా’ కోవ లోనే ‘వెడ్ ఇన్ ఇండియా’ ఉద్యమాన్ని మొదలు పెట్టండి’’
‘‘ఉత్తరాఖండ్ లోమధ్యతరగతి సమాజం తాలూకు శక్తి ఒక భారీ బజారు ను సృష్టిస్తున్నది’’
‘‘హౌస్ ఆఫ్హిమాలయాస్ అనేది మన ‘వోకల్ ఫార్ లోకల్, ఇంకా లోకల్ ఫార్ గ్లోబల్’ భావన ను మరింత గా బలపరుస్తుంది’’
‘‘నేను రెండు కోట్ల మంది లక్షాధికారి సోదరీమణుల ను తయారు చేయాలని సంకల్పించుకొన్నాను’’
‘‘ఇదే సరి అయినటువంటి అదును. ఇది భారతదేశం యొక్క తరుణం’’
సశక్త్ ఉత్తరాఖండ్ ను మరియు బ్రాండ్ హౌస్ ఆఫ్ హిమాలయాస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ‘శాంతి నుండి సమృద్ధి’ అనేది ఈ శిఖర సమ్మేళనం యొక్క ఇతివృత్తం గా ఉంది.

ఉత్తరాఖండ్ లోని దెహ్‌రాదూన్ లో గల ఫారెస్ట్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో జరుగుతున్న ‘ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమిట్ 2023’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భం లో ఏర్పాటైన ఒక ప్రదర్శన ను పరిశీలించడం తో పాటు, గ్రౌండ్ బ్రేకింగ్ వాల్ ను కూడా ఆవిష్కరించారు. సశక్త్ ఉత్తరాఖండ్ ను మరియు బ్రాండ్ హౌస్ ఆఫ్ హిమాలయాస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ‘శాంతి నుండి సమృద్ధి’ అనేది ఈ శిఖర సమ్మేళనం యొక్క ఇతివృత్తం గా ఉంది.

 

 

ఈ సందర్భం లో పరిశ్రమ రంగ ప్రముఖులు వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు. అడానీ గ్రూపు డైరెక్టరు మరియు మేనేజింగ్ డైరెక్టరు శ్రీ ప్రణవ్ అడానీ మాట్లాడుతూ, ఉత్తరాఖండ్ ప్రైవేటు రంగం సంబంధి పెట్టుబడికి అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల లో ఒక గమ్యస్థానం గా మారింది అన్నారు. దీనికి కారణం ఇటీవలి కాలాల్లో వృద్ధి మరియు అభివృద్ధి ల పట్ల రాష్ట్రం అనుసరిస్తున్న విధానమే అని ఆయన అన్నారు. ఈ విధానం లో భాగం గా ఏక సూత్ర ఆమోదాలు, స్పర్థాత్మకమైనటువంటి భూమి ధరలు, తక్కువ ఖర్చు లో విద్యుత్తు లభ్యత మరియు సమర్థమైన పంపిణీ వ్యవస్థ, ఉన్నత నైపుణ్యాలు సొంతం చేసుకొన్న శ్రమ శక్తి లతో పాటు, జాతీయ రాజధాని కి సమీపం లో ఉండడం, ఇంకా చాలా భద్రమైన చట్టం మరియు సురక్ష వాతావరణం ఈ రాష్ట్రం కలిగి ఉంది అని ఆయన వివరించారు. రాష్ట్రం లో తమ సంస్థ కార్యకలాపాల ను విస్తరించే దిశ లో తాము సిద్ధం చేసిన ప్రణాళిక లు మరియు మరిన్ని పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాలు కల్పించడం గురించి శ్రీ అడానీ తెలియ జేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రాని కి అదే పనిగా ఇస్తున్న సమర్థన కు గాను ప్రధాన మంత్రి కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారతదేశం లో ప్రజలు ఆయన అంటే అపూర్వమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు అని శ్రీ అడానీ అన్నారు.

 

జెఎస్‌డబ్ల్యు చైర్ మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సజ్జన్ జిందల్ ఉత్తరాఖండ్ రాష్ట్రం తో ప్రధాన మంత్రి కి ఉన్న అనుబంధాన్ని గురించి ప్రత్యేకం గా ప్రస్తావించారు. కేదార్ నాథ్ మరియు బద్రీనాథ్ లలో అభివృద్ధి పథకాల విషయం లో ఈ సంగతి తన అనుభవం లోకి వచ్చింది అని శ్రీ జిందల్ తెలిపారు. దేశం యొక్క స్వరూపాన్ని మార్చివేసినట్లు ప్రధాన మంత్రి చేసిన ప్రయాసల ను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భం లో జిడిపి వృద్ధి ని గురించి ఆయన పేర్కొనడం తో పాటు, త్వరలో భారతదేశం ప్రపంచం లో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా మారబోతోందని చెప్పారు. ఒక గ్లోబల్ సూపర్ పవర్ గా అయ్యేందుకు భారతదేశం సాగిస్తున్న యాత్ర లో ప్రధాన మంత్రి యొక్క నాయకత్వాని కి శ్రీ జిందల్ ధన్యవాదాలు తెలియ జేశారు. దేశవ్యాప్తం గా తీర్థయాత్ర స్థలాల కు సంధానం సదుపాయాన్ని మెరుగు పరచడం అనే అంశం లో ప్రభుత్వం తీసుకొంటున్న శ్రద్ధ ను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఉత్తరాఖండ్ లో సుమారు గా 15,000 కోట్ల రూపాయల పెట్టుబడి ని తీసుకు రావడం కోసం కంపెనీ ఒక ప్రణాళిక ను అమలు పరచనుందని, అంతేకాకుండా, ‘క్లీన్ కేదార్ నాథ్ ప్రాజెక్టు’ను నవంబరు లోనే మొదలు పెట్టిందని కూడా ఆయన వివరించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం అందిస్తున్న సమర్థన కు గాను ఆయన ధన్యవాదాల ను వ్యక్తం చేశారు. భారతదేశం యొక్క అభివృద్ధి ప్రస్థానం లో కంపెనీ సమర్థన ను కొనసాగిస్తుంది అని ప్రధాన మంత్రి కి ఆయన హామీ ని ఇచ్చారు.

 

 

ఐటిసి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజీవ్ పురి జి-20 శిఖర సమ్మేళనం యొక్క సాఫల్యాన్ని గుర్తు కు తీసుకు వస్తూ, గ్లోబల్ సౌథ్ ఆశయాల సాధన కు ప్రధాన మంత్రి వకాల్తా పుచ్చుకోవడాన్ని, మరి అలాగే ప్రధాన మంత్రి యొక్క ప్రపంచ స్థాయి రాజకీయ కుశలత ను మెచ్చుకొన్నారు. గడచిన కొన్నేళ్ళలో ప్రయోజన పూర్వకమైనటువంటి విధాన సంబంధి కార్యక్రమాలు అనేకం తెర మీద కు రావడం తో, ప్రపంచం అనేక విధాలైన సవాళ్ళ తో సతమతం అవుతుంటే, భారతదేశం మాత్రం సానుకూల వాతావరణం లో ఉండగలిగింది అని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థ లో అనేక రంగాలు మార్పు చెందడం, మరి జిడిపి సంఖ్యలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి అని ఆయన అన్నారు. నాయకత్వం కల్పించినటువంటి ఒక స్థితి ఏదైతే ఏర్పడిందో, తత్ఫలితం గా ప్రపంచం అంతటా చూసుకొంటే, ఈ దశాబ్దం భారతదేశాని కి చెందుతుంది అని కొందరు, అసలు ఈ శతాబ్దం భారతదేశానిదే అని కొందరు అంటున్నారు అని ఆయన అన్నారు.

 

‘పతంజలి’ యొక్క వ్యవస్థాపకుడు మరియు యోగ గురువు శ్రీ బాబా రామ్‌దేవ్ తన ప్రసంగం లో ప్రధాన మంత్రి ని ‘వికసిత్ భారత్’ యొక్క దార్శకుని గా పేర్కొన్నారు. అంతేకాదు, ఆయన 140 కోట్ల మంది భారతదేశ పౌరులకే కాకుండా, ప్రపంచాని కి కూడా ఒక కుటుంబ సభ్యుడు అని శ్రీ బాబా రామ్‌దేవ్ అన్నారు. 5 ట్రిలియన్ డాలర్ విలువ కలిగిన ఆర్థిక వ్యవస్థ అనే ప్రధాన మంత్రి పెట్టుకొన్న లక్ష్యం గురించి శ్రీ బాబా రామ్‌దేవ్ ప్రముఖం గా ప్రకటించారు. ఈ దిశ లో పెట్టుబడుల ను తీసుకు రావడం తో పాటు, ఉద్యోగ అవకాశాల కల్పన లో పతంజలి అందిస్తున్న తోడ్పాటుల ను గురించి ఆయన ప్రస్తావించారు. రాబోయే కాలాల్లో 10,000 కోట్ల కు పైచిలుకు పెట్టుబడులు మరియు 10,000 కోట్ల కు మించిన ఉద్యోగాల కల్పన కు సంబంధించి ప్రధాన మంత్రి కి ఆయన హామీ ని ఇచ్చారు. ఒక ‘న్యూ ఇండియా’ను ఆవిష్కరించడం లో ప్రధాన మంత్రి యొక్క దృఢ సంకల్పాన్ని మరియు ఇచ్ఛాశక్తి ని ఆయన ప్రశంసించారు. రాష్ట్రం లో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడం లో ఉత్తరాఖండ్ యొక్క ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయాసల ను కూడా శ్రీ బాబా రామ్‌దేవ్ ప్రశంసించారు. రాష్ట్రం లో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయవలసింది గా కార్పొరేట్ లకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి నాయకత్వం లో రాష్ట్రం లోని పర్యటన, వైద్యం, విద్య, వ్యవసాయం, సంధానం మరియుు మౌలిక సదుపాయాల రంగాల లో జరిగిన అభివృద్ధి ని కూడా ఆయన హర్షించారు. భారతదేశాన్ని ఒక ప్రపంచ స్థాయి ఆర్థిక ప్రబల శక్తి గా తీర్చిదిద్దాలన్న ప్రధాన మంత్రి సంకల్పాన్ని బలపరచాలని, అలాగే ఒక ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించాలని, ఇన్వెస్టర్ లకు శ్రీ బాబా రామ్‌దేవ్ విజ్ఞప్తి చేశారు.

 

 

దేశం యొక్క అభివృద్ధి కోసం దిశ ను, దృష్టి కోణాన్ని మరియు ముందు చూపును అందిస్తున్నందుకు గాను ప్రధాన మంత్రి కి ధన్యవాదాల ను ఎమ్మార్ ఇండియా సిఇఒ శ్రీ కళ్యాణ్ చక్రవర్తి వ్యక్తం చేశారు. ఒక ‘వికసిత భారత్’ గా దేశం సాగిస్తున్న యాత్ర లో భాగం పంచుకోవడాని కి కార్పొరేట్ జగతి కంకణం కట్టుకొంటుంది అని ఆయన అన్నారు. భారతదేశం-యుఎఇ సంబంధాల లో క్రొత్త చైతన్యం చోటుచేసుకొందని కూడా ఆయన పేర్కొన్నారు. ఎమ్మార్ యొక్క ప్రధాన కేంద్రం ఉన్నది యుఎఇ లోనే. భారతదేశం పట్ల ప్రపంచం యొక్క దృక్పథం లో సకారాత్మకమైన పరివర్తన రావడాన్ని గురించి శ్రీ కళ్యాణ్ చక్రవర్తి ప్రముఖం గా పేర్కొన్నారు. జిఎస్‌టి వంటి విధాన పరమైన సంస్కరణ లు అనేకం అమలయ్యాయని, మరి పారిశ్రామిక జగతి కి క్రొత్త క్రొత్త అవకాశాలు ఫిన్ టెక్ విప్లవం ద్వారా అందివస్తున్నాయని ఆయన అన్నారు.

 

టివిఎస్ సప్లయ్ చైన్ సొల్యూశన్స్ యొక్క చైర్ మన్ శ్రీ ఆర్. దినేశ్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి యొక్క దూరదృష్టి యుక్త నాయకత్వం పట్ల తమ కంపెనీ యొక్క నిబద్ధత ను గురించి పునరుద్ఘాటించారు. ఉత్తరాఖండ్ యొక్క వృద్ధి గాథ లో తమ సంస్థ అందించిన తోడ్పాటుల ను గురించి ఆయన వివరించారు. టైర్ లు మరియు ఆటో కంపోనంట్స్ ల తయారీ విభాగాలు, ఇంకా లాజిస్టిక్స్ సంబంధి సేవలు మరియు ఆటో రంగం గురించి ఆయన కొన్ని ఉదాహరణల ను ఇచ్చారు. తయారీ రంగం లో మరియు గోదాము సామర్థ్యం విషయం లో అదనపు పెట్టుబడులు పరం గా కంపెనీ కి ఉన్న పథకాల ను గురించి ఆయన వెల్లడించారు. వీటి ద్వారా సంస్థ తాలూకు వివిధ కంపెనీల లో 7,000 లకు పైగా ఉద్యోగాల సృష్టి జరుగుతుంది అని ఆయన వెల్లడించారు. మారుతున్న ప్రపంచ పరిస్థితుల కు అనుగుణం గా ఆర్థిక సహాయ సంబంధి సమర్థన, ఇంకా అదనపు నైపుణ్యాల సాధన ల ద్వారా ఆటో మార్కెట్ రంగం లో సహ భాగస్వాముల తో కలసి ముందంజ వేసేందుకు తమ కంపెనీ సిద్ధం గా ఉంది అని ఆయన స్పష్టం చేశారు. ఒక లక్ష మంది కి పైగా వ్యక్తుల కు కౌన్సెలింగ్ మరియు సమర్థన అందించడం కోసం 10 నమూనా కెరియర్ సెంటర్ లను ఏర్పాటు చేయడం జరుగుతుంది అని సిఐఐ యొక్క అధ్యక్షుని హోదా లో ఆయన వాగ్ధానం చేశారు. ఆతిథ్యం, ఆరోగ్య సంరక్షణ మరియు అడ్వాన్స్‌డ్ మేన్యుఫాక్చరింగ్ రంగాల లో 10,000 మంది కి శిక్షణ ను అందించగలిగిన సామర్థ్యం కలిగి ఉండే ఒక స్పెశాలిటీ మల్టీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయబోయే మొదటి రాష్ట్రం గా ఉత్తరాఖండ్ నిలువబోతోంది అని ఆయన తెలిపారు.

 

 స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్రసంగిస్తూ దేవ‌భూమి ఉత్త‌రాఖండ్‌లో ఉన్నందుకు సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.  ఈ శతాబ్దపు మూడో దశాబ్దం ఉత్తరాఖండ్ దే అని తాను గతంలో చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఈ ప్రకటన సాకారం కావడం సంతృప్తిని కలిగించే విషయమని శ్రీ మోదీ అన్నారు. సిల్కియారా వద్ద సొరంగం నుండి కార్మికులను విజయవంతంగా రక్షించే ప్రాజెక్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని, పాల్గొన్న వారందరినీ ప్రధాన మంత్రి అభినందించారు.

ఉత్తరాఖండ్‌తో తనకున్న సన్నిహిత అనుబంధాన్ని పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి, ఉత్తరాఖండ్ అనేది దైవత్వం, అభివృద్ధిని ఏకకాలంలో అనుభవించే రాష్ట్రమని అన్నారు. భావాన్ని మరింత విశదీకరించేందుకు ప్రధాని తన కవితల్లో ఒకదాన్ని చదివారు.

 

ఈ సందర్భంగా హాజరైన పెట్టుబడిదారులను పరిశ్రమ హెవీవెయిట్‌లుగా ప్రస్తావిస్తూ, బహుళజాతి సంస్థలు నిర్వహించిన ఎస్డబ్ల్యూఓటి విశ్లేషణ సారూప్యతను ప్రధాన మంత్రి వివరించారు.  ఎస్డబ్ల్యూఓటి విశ్లేషణ ఫలితాలు దేశంలో అనేక ఆకాంక్షలు, ఆశలు, ఆత్మవిశ్వాసం, ఆవిష్కరణలు, అవకాశాలను సూచిస్తాయని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. విధాన ఆధారిత పాలన, రాజకీయ స్థిరత్వం కోసం పౌరుల సంకల్పం సూచికలను కూడా ఆయన ప్రస్తావించారు. "ఆకాంక్ష భారతదేశం అస్థిరత కంటే స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటుంది" అని అన్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ, ప్రజలు సుపరిపాలన, దాని ట్రాక్ రికార్డ్ ఆధారంగా ఓటు వేశారని నొక్కిచెప్పారు. కోవిడ్ మహమ్మారి, అస్థిర భౌగోళిక-రాజకీయ దృష్టాంతంతో సంబంధం లేకుండా రికార్డు వేగంతో ముందుకు సాగడానికి దేశం సామర్థ్యాన్ని ప్రధాని మోదీ వివరించారు. "కరోనా వ్యాక్సిన్ అయినా, ఆర్థిక విధానాలు అయినా, భారతదేశం దాని సామర్థ్యాలు, విధానాలపై నమ్మకం కలిగి ఉంది" అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. తత్ఫలితంగా, ప్రపంచంలోని ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోల్చినప్పుడు భారతదేశం స్వతహాగా బలంగా నిలుస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. ఉత్తరాఖండ్‌తో సహా భారతదేశంలోని ప్రతి రాష్ట్రం ఈ బలం ప్రయోజనాలను పొందుతోందని ఆయన పేర్కొన్నారు.

డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రయోజనాలను ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు, దీని వల్ల అనేక ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం స్థానిక పరిస్థితులు అనుసారంగా పనిచేస్తుండగా, భారత ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో అపూర్వమైన పెట్టుబడులు పెడుతోందని తెలిపారు. ప్రభుత్వంలోని రెండు స్థాయిలు ఒకరి ప్రయత్నాలను మరొకరు పెంచుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి చార్ ధామ్‌కు వెళ్లే పనులను ప్రస్తావిస్తూ, ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య దూరాన్ని రెండున్నర గంటల ప్రయాణానికి తగ్గించే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని అన్నారు. డెహ్రాడూన్, పంత్‌నగర్ విమానాశ్రయాల విస్తరణ ఎయిర్ కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది. రాష్ట్రంలో హెలీ ట్యాక్సీ సేవలను విస్తరిస్తున్నామని, రైలు కనెక్టివిటీని పటిష్టం చేస్తున్నామన్నారు. ఇవన్నీ వ్యవసాయం, పరిశ్రమలు, లాజిస్టిక్స్, నిల్వ, పర్యాటకం, ఆతిథ్యానికి కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి' అని ప్రధాన మంత్రి అన్నారు. 

సరిహద్దు ప్రాంతాలలో ఉన్న ప్రదేశాలకు పరిమిత ప్రవేశం కల్పించిన గత ప్రభుత్వాల విధానానికి విరుద్ధంగా, దేశంలోని మొదటి గ్రామంగా వాటిని అభివృద్ధి చేయడానికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. అభివృద్ది పరామితులలో వెనుకబడిన గ్రామాలు,  ప్రాంతాలపై దృష్టి సారిస్తున్న ఆకాంక్షాత్మక జిల్లాలు, ఆకాంక్షాత్మక బ్లాకుల కార్యక్రమాన్ని ఆయన ప్రస్తావించారు. శ్రీ మోదీ ఉత్తరాఖండ్ ఇంకా వినియోగించుకోలేని సామర్థ్యాలను పెట్టుబడిదారులను అత్యధికంగా ఉపయోగించుకోవాలని కోరారు. 

డబుల్ ఇంజన్ ప్రభుత్వ ప్రయోజనాలను పొందుతున్న ఉత్తరాఖండ్ పర్యాటక రంగంపై మాట్లాడుతూ, భారతదేశాన్ని సందర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలతో పాటు దేశంలోని ప్రజల ఉత్సాహాన్ని ప్రధాని గుర్తు చేశారు. పర్యాటకులకు ప్రకృతితో పాటు భారతదేశ వారసత్వాన్ని పరిచయం చేసేందుకు ఉద్దేశించిన థీమ్ ఆధారిత పర్యాటక సర్క్యూట్‌లను రూపొందించడం గురించి ఆయన తెలియజేశారు. ప్రకృతి, సంస్కృతి, వారసత్వాన్ని కలిగి ఉన్న ఉత్తరాఖండ్ ఒక బ్రాండ్‌గా ఆవిర్భవించబోతోందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. యోగా, ఆయుర్వేదం, తీర్థ క్షేత్ర, అడ్వెంచర్ స్పోర్ట్స్ రంగాలలో అన్వేషించడాని, అవకాశాలను సృష్టించడానికి పెట్టుబడిదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన నొక్కి చెప్పారు. 'మేక్ ఇన్ ఇండియా' తరహాలో 'వెడ్ (వివాహం) ఇన్ ఇండియా' ఉద్యమాన్ని ప్రారంభించాలని దేశంలోని ధనవంతులు, సంపన్నులు మరియు యువతకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. వచ్చే ఐదేళ్లలో ఉత్తరాఖండ్‌లో కనీసం ఒక వివాహ వేడుకైన నిర్వహించాలని ఆయన వారిని అభ్యర్థించారు. “ఉత్తరాఖండ్‌లో 1 సంవత్సరంలో 5000 వివాహాలు జరిగినా, కొత్త మౌలిక సదుపాయాలు అమలులోకి వస్తాయి, ప్రపంచానికి వివాహ గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మారుస్తాయి”, అని అన్నారు.

భారత్‌లో బలమైన మార్పు గాలి వీస్తోందని ప్రధాని అన్నారు. "గత 10 ఏళ్లలో ఆకాంక్ష భారత్‌ను సృష్టించారు. గతంలో అణగారిన జనాభాలో ఎక్కువ భాగం పథకాలు, అవకాశాలతో అనుసంధానం జరిగింది. పేదరికం నుంచి బయటపడిన కోట్లాది మంది ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తున్నారు. నియో మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ ఇద్దరూ ఎక్కువ ఖర్చు చేస్తున్నారు భారతదేశం మధ్యతరగతి సామర్థ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఉత్తరాఖండ్‌లో సమాజం  ఈ శక్తి మీకు భారీ మార్కెట్‌ను కూడా సృష్టిస్తోంది" అని శ్రీ మోదీ అన్నారు.

 

హౌస్ ఆఫ్ హిమాలయాస్ బ్రాండ్‌ను ప్రారంభించినందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ప్రధాని అభినందించారు. ఉత్తరాఖండ్‌లోని స్థానిక ఉత్పత్తులను విదేశీ మార్కెట్‌లకు తీసుకెళ్లడానికి ఇది ఒక వినూత్న ప్రయత్నమని పేర్కొన్నారు. "హౌజ్ ఆఫ్ హిమాలయాస్ వోకల్ ఫర్ లోకల్ మరియు లోకల్ ఫర్ గ్లోబల్ అనే మా భావనను మరింత బలోపేతం చేస్తుంది" అని శ్రీ మోదీ అన్నారు. భారతదేశంలోని ప్రతి జిల్లా మరియు బ్లాక్‌ల నుండి ఉత్పత్తులు ప్రపంచవ్యాప్త బ్రాండ్ గా మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో ఖరీదైన మట్టి పాత్రలను ప్రత్యేక పద్ధతుల్లో తయారు చేసి అందజేస్తున్నారని ఉదాహరణగా చెప్పారు. సాంప్రదాయకంగా ఇటువంటి అనేక అద్భుతమైన ఉత్పత్తులను తయారు చేసే భారతదేశంలోని విశ్వకర్మల నైపుణ్యం మరియు నైపుణ్యాన్ని గమనించిన ప్రధాన మంత్రి, అటువంటి స్థానిక ఉత్పత్తుల కోసం ప్రపంచ మార్కెట్‌ను అన్వేషించడం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు మరియు వివిధ జిల్లాలలో అటువంటి ఉత్పత్తులను గుర్తించాలని పెట్టుబడిదారులను కోరారు. మహిళా స్వయం సహాయక బృందాలు, ఎఫ్‌పిఓలతో నిమగ్నమయ్యే అవకాశాలను అన్వేషించాలని కూడా ఆయన వారిని కోరారు. "లోకల్-గ్లోబల్‌గా చేయడానికి ఇది అద్భుతమైన భాగస్వామ్యం" అని ఆయన చెప్పారు. లఖపతి దీదీ అభియాన్‌ను హైలైట్ చేస్తూ, దేశంలోని గ్రామీణ ప్రాంతాల నుండి రెండు కోట్ల మంది లఖపతి దీదీలను సృష్టించాలనే తన సంకల్పాన్ని నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, హౌస్ ఆఫ్ హిమాలయ బ్రాండ్‌ను ప్రారంభించడంతో ఈ కార్యక్రమం ఊపందుకుంటుందని అన్నారు. చొరవ చూపిన ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

జాతీయ స్వభావాన్ని బలోపేతం చేయడం గురించి ఎర్రకోట నుండి తన స్పష్టమైన పిలుపును ప్రస్తావిస్తూ, “మనం ఏది చేసినా అది ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉండాలి. మన ప్రమాణాలను ప్రపంచం అనుసరించాలి. జీరో ఇంపాక్ట్, జీరో డిఫెక్ట్ అనే సూత్రంపై మన తయారీ ఉండాలి. మేము ఇప్పుడు ఎగుమతి ఆధారిత తయారీని ఎలా పెంచాలనే దానిపై దృష్టి పెట్టాలి. ప్రతిష్టాత్మకమైన పిఎల్ఐ ప్రచారాలు క్లిష్టమైన రంగాలకు పర్యావరణ వ్యవస్థను సృష్టించే తీర్మానాన్ని ప్రదర్శిస్తాయని ఆయన అన్నారు. కొత్త పెట్టుబడుల ద్వారా స్థానిక సరఫరా గొలుసులు, ఎంఎస్ఎంఈ లను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

చౌక ఎగుమతులు, సామర్థ్యాల పెంపుదలకు ప్రాధాన్యమివ్వాలనే మనస్తత్వం నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. పెట్రోలియం దిగుమతుల బిల్లు రూ.15 లక్షల కోట్లు, బొగ్గు దిగుమతి బిల్లు రూ.4 లక్షల కోట్లు అని ఆయన ప్రస్తావించారు. నేటికీ భారతదేశం 15 వేల కోట్ల విలువైన పప్పు దినుసులను దిగుమతి చేసుకుంటుండగా పప్పులు, నూనె గింజల దిగుమతులను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆయన వివరించారు.

భారత్‌లో మినుములు వంటి పోషక విలువలు సమృద్ధిగా ఉండగా, పోషకాహారం పేరుతో ప్యాక్‌డ్ ఫుడ్‌కు వ్యతిరేకంగా ప్రధాని హెచ్చరించారు. ఆయుష్‌కు సంబంధించిన ఆర్గానిక్ ఫుడ్‌కు ఉన్న అవకాశాలను మరియు రాష్ట్ర రైతులు మరియు పారిశ్రామికవేత్తలకు అవి అందించే అవకాశాలను ఆయన హైలైట్ చేశారు. ప్యాకేజ్డ్ ఫుడ్‌లో కూడా, ప్రపంచ మార్కెట్‌లను యాక్సెస్ చేయడానికి స్థానిక ఉత్పత్తికి సహాయం చేయాలని ఆయన సమావేశాన్ని కోరారు.

భారత్‌లో మినుములు వంటి పోషక విలువలు సమృద్ధిగా ఉండగా, పోషకాహారం పేరుతో ప్యాక్‌డ్ ఫుడ్‌ వినిమయం పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని హెచ్చరించారు. ఆయుష్‌కు సంబంధించిన ఆర్గానిక్ ఫుడ్‌కు ఉన్న అవకాశాలను, రాష్ట్ర రైతులు, పారిశ్రామికవేత్తలకు అవి అందించే అవకాశాలను ఆయన హైలైట్ చేశారు. ప్యాకేజ్డ్ ఫుడ్‌లో కూడా, ప్రపంచ మార్కెట్‌లను యాక్సెస్ చేయడానికి స్థానిక ఉత్పత్తికి సహాయం చేయాలని ఆయన సమావేశాన్ని కోరారు.

ప్రసంగాన్ని ముగించిన ప్రధాన మంత్రి, భారతదేశానికి, దాని కంపెనీలకు, దాని పెట్టుబడిదారులకు ప్రస్తుతము అపూర్వమైన సమయమని వ్యాఖ్యానించారు. "రాబోయే కొద్ది సంవత్సరాలలో భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది", స్థిరమైన ప్రభుత్వం, సహాయక విధాన వ్యవస్థ, సంస్కరణల మనస్తత్వం మరియు పరివర్తన మరియు అభివృద్ధిపై విశ్వాసం కలయికను ఘనతగా పేర్కొన్నారు. “ఇదే సమయం, సరైన సమయం. ఇది భారతదేశ సమయం”, ఉత్తరాఖండ్‌తో కలిసి నడవాలని,  దాని అభివృద్ధి ప్రయాణంలో పాలుపంచుకోవాలని పెట్టుబడిదారులకు ప్రధాని  విజ్ఞప్తి చేశారు.

 

ఈ కార్యక్రమంలో  ఉత్తరాఖండ్ గవర్నర్, రిటైర్డ్  లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం:
‘ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023’ ఉత్తరాఖండ్‌ను కొత్త పెట్టుబడి గమ్యస్థానంగా స్థాపించే దిశగా ఒక అడుగు. రెండు రోజుల శిఖరాగ్ర సమావేశం 2023 డిసెంబర్ 8,  9 తేదీలలో "శాంతి- శ్రేయస్సు" అనే ఇతివృత్తంతో జరుగుతుంది.

ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పెట్టుబడిదారులు, ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఇందులో కేంద్ర మంత్రులు, వివిధ దేశాల రాయబారులతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొంటున్నారు. 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi

Media Coverage

'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."