అహ్మదాబాద్ లో 11వ ఖేల్ మహాకుంభ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్టేడియంలో పొంగిపొరలుతున్న యువ సముద్ర శక్తి, వారిలోని ఉత్సాహం గురించి ప్రస్తావిస్తూ ఇది క్రీడా మహాకుంభ్ మాత్రమే కాదు, యువశక్తి మహాకుంభ్ అని ప్రధానమంత్రి అన్నారు. ప్రధానమంత్రి ప్రసంగానికి ముందు భారీ వేడుక జరిగింది.
కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా మహాకుంభ్ జరగలేదని, కాని ఈ అద్భుతమైన వేడుక క్రీడాకారుల్లో కొత్త విశ్వాసం, శక్తి అందించిందని ప్రధానమంత్రి అన్నారు. “12 సంవత్సరాల క్రితం నేను నాటిన విత్తనం మొలకెత్తి ఈ రోజు ఒక మహావృక్షంగా మారింది” అని అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను తీసుకున్న చర్యను ఆయన గుర్తు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నరేంద్రమోదీ విజనరీ నాయకత్వంలో ఈ క్రీడా మహాకుంభ్ 2010లో 16 క్రీడలు, 13 లక్షల మంది వీక్షకులతో ప్రారంభమయింది. ఇప్పుడు ఈ 11వ ఖేల్ మహాకుంభ్ 36 క్రీడలు, 26 పారా క్రీడలు, 45 లక్షల మంది వీక్షకుల మైలురాయిని చేరింది.
గతంలో భారతీయ క్రీడా రంగం కొన్ని క్రీడలకే పరిమితం అయ్యేది, దేశీయ క్రీడలను నిర్లక్ష్యం చేసే వారు అని శ్రీ మోదీ చెప్పారు. క్రీడలకు కూడా ఆశ్రిత పక్షపాతం అనే వ్యాధి సోకిందంటూ “క్రీడాకారుల ఎంపికలో పారదర్శకత లేకపోవడం పెద్ద సమస్య. క్రీడాకారుల శక్తి అంతా సమస్యలపై పోరాటానికే సరిపోయేది. ఆ విషవలయం నుంచి బయటపడి ఇప్పుడు క్రీడాకారులు ఆకాశానికి వారధి కడుతున్నారు. బంగారం, వెండి పతకాలు దేశ విశ్వాసానికి మెరుగులు దిద్దుతున్నాయి” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. నేడు భారతదేశం టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడల్లో రికార్డు సంఖ్యలో పతకాలు తెస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. దేశ యువతపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉన్నదని ఆయన అన్నారు. “టోక్యో ఒలింపిక్స్ లో తొలిసారిగా భారతదేశం 7 పతకాలు సాధించింది. అదే తరహా రికార్డును పారాలింపిక్స్ లో కూడా భరతమాత్ర పుత్రులు, పుత్రికలు సాధించారు. ఈ అంతర్జాతీయ పోటీల్లో 19 పతకాలు సాధించారు. ఇది ఒక ప్రారంభం మాత్రమే. భారతదేశం ఎన్నటికీ ఆగదు లేదా అలసిపోదు” అని శ్రీ మోదీ నొక్కి చెప్పారు.
ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులు పెరుగుతున్న త్రివర్ణ పతాక ప్రభావానికి చిహ్నమని ప్రధానమంత్రి అన్నారు. ఈ క్రీడా ప్రాంగణంలో కూడా అదే తరహా గర్వం, దేశభక్తి కనిపిస్తున్నాయని చెప్పారు. వివిధ రంగాల్లో యువనాయకత్వం ప్రాధాన్యాన్ని కూడా ఆయన గట్టిగా ప్రస్తావించారు. “నేడు స్థానికం కోసం నినాదం సహా స్టార్టప్ ఇండియా నుంచి స్టాండప్ ఇండియా వరకు, మేక్ ఇన్ ఇండియా నుంచి స్వయం సమృద్ధ భారత్ వరకు అన్ని రకాల ప్రచార బాధ్యతలు యువత తమ భుజస్కంధాల పైనే వేసుకున్నారు. మన యువత భారతదేశం సామర్థ్యాన్ని సుస్థిరం చేశారు” అని ప్రధానమంత్రి అన్నారు.
జీవితంలో షార్ట్ కట్ లు ఎప్పుడూ తీసుకోవద్దని ప్రధానమంత్రి యువతకు సలహా ఇచ్చారు. ఇలాంటి షార్ట్ కట్ ల మనుగడ ఎప్పుడూ స్వల్పంగానే ఉంటుందని ఆయన అన్నారు. “విజయ మంత్రం ఒక్కటే - దీర్ఘకాలిక ప్రణాళిక, నిరంతర కట్టుబాటు,. ఏ విజయం లేదా పరాజయం కూడా ఎప్పటికీ మన తుది గమ్యం కాకూడదు” అని ఆయన ఉద్బోధించారు.
క్రీడల్లో విజయం అనేది ఎప్పుడూ పరిపూర్ణంగానే ఉండాలి, దేశంలో క్రీడల ప్రోత్సాహానికి భారతదేశం సంపూర్ణ దృక్పథం అనుసరిస్తోంది అని ప్రధానమంత్రి అన్నారు. ఖేలో ఇండియా కార్యక్రమం అలాంటి ఆలోచనకు చక్కని ఉదాహరణ అని కూడా ఆయన చెప్పారు. “దేశంలోని ప్రతిభను గుర్తించి వారికి అవసరమైన మద్దతు ఇవ్వడం మేం ప్రారంభించాం. ప్రతిభ ఉన్నప్పటికీ సరైన శిక్షణ లేని కారణంగా మన యువత వెనుకబడిపోయే వారు. నేడు క్రీడాకారులకు మెరుగైన శిక్షణ వసతులు అందిస్తున్నాం” అని ఆయన తెలిపారు. గత 7-8 సంవత్సరాల కాలంలో క్రీడా బడ్జెట్ 70 శాతం పెరిగిందని, క్రీడాకారులకు, కోచ్ లకు కూడా ప్రోత్సాహం, ప్రోత్సాహకాలు గణనీయంగా పెరిగాయి అని ఆయన చెప్పారు. క్రీడలను ఒక లాభసాటి ఉపాధిగా మార్చుకోవడంలో సాధించిన పురోగతి గురించి ప్రస్తావించారు. కోచింగ్, మేనేజ్ మెంట్, శిక్షకులు, డైటీషియన్లు, క్రీడా రచనలు వంటి ఎన్నో రంగాల నుంచి తమకు ఇష్టమైన రంగాన్ని యువత ఎంచుకోవచ్చునని ఆయన అన్నారు. మణిపూర్, మీరట్ లలో క్రీడా విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి, పలు సంస్థల్లో క్రీడా కోర్సులు కూడా వస్తున్నాయని చెప్పారు. మనకి ఉన్న విస్తారమైన కోస్తా దృష్ట్యా బీచ్ క్రీడలు, జల క్రీడలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆయన సూచించారు. సంతానంలో క్రీడాసక్తికి ప్రోత్సాహం అందించాలని తల్లిదండ్రులను కోరారు.
ఖేల్ మహాకుంభ్ గుజరాత్ లోని క్రీడా వాతావరణాన్ని విప్లవాత్మకం చేసింది. వయసుతో నిమిత్తం లేకుండా రాష్ట్రం మొత్తం నుంచి ప్రజలు తరలివచ్చి నెల రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో పోటీ పడుతున్నారు. సాంప్రదాయిక క్రీడలైన కబడ్డీ, ఖోఖో, టగ్ ఆఫ్ వార్, యోగాసన, మల్లఖంభ్ తో పాటు ఆధునిక క్రీడలైన ఆర్టిస్టిక్ స్కేటింగ్, టెన్నిస్, ఫెన్సింగ్ వంటి క్రీడలకు ఇది వేదికగా ఉంది. గ్రామీణ స్థాయిలో పచ్చి ప్రతిభను గుర్తించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. గుజరాత్ లో పారా క్రీడలకు కూడా ప్రోత్సాహం అందిస్తోంది.
कोरोना के कारण दो सालों तक खेल महाकुंभ पर ब्रेक लगा रहा।
— PMO India (@PMOIndia) March 12, 2022
लेकिन भूपेन्द्र भाई ने जिस भव्यता के साथ इस आयोजन को शुरू किया है, उसने युवा खिलाड़ियों को नए जोश से भर दिया है: PM @narendramodi
मुझे याद है, 12 साल पहले 2010 में गुजरात के मुख्यमंत्री के नाते खेल महाकुंभ की शुरुआत की थी, तो वो मेरे लिए एक सपने के बीज बोने जैसा था।
— PMO India (@PMOIndia) March 12, 2022
उस बीज को मैं आज इतने विशाल वटवृक्ष का आकार लेते देख रहा हूँ: PM @narendramodi
खिलाड़ियों के चयन में पारदर्शिता की कमी भी एक बड़ा फैक्टर थी।
— PMO India (@PMOIndia) March 12, 2022
खिलाड़ियों की सारी प्रतिभा परेशानियों से जूझने में ही निकल जाती थी।
उस भंवर से निकलकर भारत के युवा आज आकाश छू रहे हैं।
गोल्ड और सिल्वर की चमक देश के आत्मविश्वास को चमका रही है: PM @narendramodi
टोक्यो Olympics में भारत ने पहली बार 7 मेडल जीते हैं।
— PMO India (@PMOIndia) March 12, 2022
यही रिकॉर्ड भारत के बेटे-बेटियों ने टोक्यो Paralympics में भी बनाया।
भारत ने इस वैश्विक प्रतियोगिता में 19 मेडल्स जीते।
लेकिन, ये तो अभी केवल शुरुआत है।
न हिंदुस्तान रुकने वाला है, न थकने वाला है: PM @narendramodi
आज स्टार्टअप इंडिया से लेकर स्टैंडअप इंडिया तक!
— PMO India (@PMOIndia) March 12, 2022
मेक इन इंडिया से लेकर आत्मनिर्भर भारत और ‘वोकल फॉर लोकल’ तक!
नए भारत के हर अभियान की ज़िम्मेदारी भारत के युवाओं ने खुद आगे बढ़कर उठाई है।
हमारे युवाओं ने भारत के सामर्थ्य को साबित करके दिखाया है: PM @narendramodi
मेरी आप सब युवाओं के लिए भी सलाह है- सफलता के लिए कभी कोई शॉर्टकट मत खोजिएगा!
— PMO India (@PMOIndia) March 12, 2022
सफलता का केवल एक ही मंत्र है- ‘Long term planning, और continuous commitment’.
न एक जीत कभी हमारा आखिरी पड़ाव हो सकती है, न एक हार: PM @narendramodi
हमने देश की प्रतिभाओं को पहचानना, उन्हें हर जरूरी सहयोग देना शुरू किया।
— PMO India (@PMOIndia) March 12, 2022
प्रतिभा होने के बावजूद हमारे युवा ट्रेनिंग के अभाव में पीछे रह जाते थे।
आज बेहतर से बेहतर ट्रेनिंग सुविधाएं खिलाड़ियों को दी जा रही हैं: PM @narendramodi
2018 में हमने मणिपुर में देश की पहली नेशनल स्पोर्ट्स यूनिवर्सिटी की स्थापना की।
— PMO India (@PMOIndia) March 12, 2022
स्पोर्ट्स में higher education के लिए यूपी में भी मेजर ध्यानचंद स्पोर्ट्स यूनिवर्सिटी शुरू होने जा रही है: PM @narendramodi