ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఓఖా ప్రధాన భూభాగాన్ని బేట్ ద్వారక ద్వీపంతో కలిపే సుదర్శన్ సేతును ప్రారంభించారు. దాదాపు 2.32 కిలోమీటర్ల ఈ తీగల వంతెన దేశంలోనే అతి పొడవైనది కాగా, దీన్ని రూ.980 కోట్ల వ్యయంతో నిర్మించారు.

 

దీనిపై ప్రధానమంత్రి ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

   ‘‘సుదర్శన్ సేతు ఓఖా ప్రధాన భూభాగాన్ని బేట్ ద్వారక ద్వీపంతో కలుపుతుంది. దాదాపు 2.32 కిలోమీటర్ల ఈ తీగల వంతెన దేశంలో అత్యంత పొడవైనది కాగా, దీన్ని రూ.980 కోట్లతో నిర్మించారు.’’

 

‘‘సుదర్శన్ సేతు ఒక అద్భుతం’’ అని పేర్కొన్నారు.

 

నేపథ్యం

   సుదర్శన్ సేతు విశిష్ట రీతిలో రూపకల్పన చేయబడింది. ఈ వంతెన పొడవునా పాదచారులు సాగే మార్గంలో శ్రీమద్భగవద్గీతలోని శ్లోకాలతో, రెండు వైపులా శ్రీకృష్ణ భగవానుని చిత్రాలతో అలంకరించబడింది. పాదచారుల మార్గం ఎగువ భాగాల్లో ఒక మెగావాట్ విద్యుదుత్పాదక సామర్థ్యంగల సౌరఫలకాలను ఏర్పాటు చేశారు. ఈ వంతెనతో రవాణా సౌలభ్యం ఇనుమడించడమే కాకుండా ద్వారక-బేట్ ద్వారకల మధ్య భక్తుల ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ వంతెన నిర్మాణానికి ముందు యాత్రికులు బేట్ ద్వారక వెళ్లడానికి పడవలమీద ఆధారపడేవారు. ఇప్పుడీ వంతెన విశిష్టమైనది మాత్రమేగాక దేవభూమి ద్వారకలో ఇదొక ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ వంతెన ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రితో పాటు గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, ఎంపీ శ్రీ సి.ఆర్.పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

 

The Prime Minister was accompanied by Governor of Gujarat, Shri Acharya Devvrat, Chief Minister of Gujarat, Shri Bhupendra Patel and Member of Parliament, Shri C R Patil.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
The Bill to replace MGNREGS simultaneously furthers the cause of asset creation and providing a strong safety net

Media Coverage

The Bill to replace MGNREGS simultaneously furthers the cause of asset creation and providing a strong safety net
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 22 డిసెంబర్ 2025
December 22, 2025

Aatmanirbhar Triumphs: PM Modi's Initiatives Driving India's Global Ascent