‘‘ప్రేమ కు, కరుణ కు, సేవ కు మరియు త్యాగాని కి ప్రతీక గా అమ్మ నిలచారు. భారతదేశం యొక్కఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ఆమె ముందుకు తీసుకు పోతున్నారు’’
‘‘భారతదేశం ఎటువంటి దేశం అంటే అక్కడ చికిత్స అనేది ఒక సేవ, ఆరోగ్యం అనేది ఒక దానం గా ఉన్నాయి. అక్కడ ఆరోగ్యంమరియు ఆధ్యాత్మికత లు ఒక దాని తో మరొకటి జతపడి ఉన్నాయి’’
‘‘మన ధార్మిక సంస్థలు, అలాగే మన సామాజిక సంస్థలు విద్య తోను, వైద్యంతోను జతపడ్డ బాధ్యత లను నిర్వర్తించేటటువంటి ఈ యొక్క వ్యవస్థ ఒక రకం గా పాత కాలపు పబ్లిక్-ప్రైవేట్భాగస్వామ్యమే అని చెప్పవచ్చును; కానీ నేను దీనిని ‘పరస్పర ప్రయాస’ గా కూడా భావిస్తున్నాను.’’
‘‘ఇతర దేశాల లో గమనించిన విధం గా, టీకా మందు పట్ల సంకోచం అనేది భారతదేశం లోవ్యక్తం కాలేదు; దీనికి, ఆధ్యాత్మిక నాయకులు ఇచ్చిన సందేశం కూడా ఒక కారణం గా ఉంది’’
‘‘మనం ఎప్పుడైతే దాస్యం యొక్క మనస్తత్వాన్ని వదలిపెడతామోమన కార్యాల దిశ కూడా మారుతుంది’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫరీదాబాద్ లో అత్యాధునిక అమృత హాస్పిటల్ ను ఈ రోజు న ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నవారిలో హరియాణా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, హరియాణా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ దుష్యంత్ చౌటాలా, కేంద్ర మంత్రి శ్రీ క్రిష్ణ పాల్ గుర్జర్, శ్రీ మాత అమృతానందమయి తదితరులు కూడా ఉన్నారు.

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, దేశం ‘అమృత కాలం’ లో అడుగిడుతున్న తరుణం లో సమష్టి ఆకాంక్షలు మరియు సంకల్పాలు జాగృతం అవుతున్నాయి; ఈ తరుణం లో దేశం శ్రీ మాత అమృతానందమయి యొక్క ఆశీస్సులు అనేటటువంటి అమృతాన్ని అందుకోవడం సముచితం గా ఉంది అన్నారు. ఈ ఆసుపత్రి ఆధునికత్వం మరియు ఆధ్యాత్మికత్వాల మిశ్రణం గా రూపుదిద్దుకొంది, మరి ఇది ఆపన్న రోగుల కు చౌక లో చికిత్సల ను అందుబాటు లోకి తీసుకు వచ్చే ఒక సాధనం గా మారగలదు అని కూడా ఆయన అన్నారు. ‘‘ప్రేమ , కరుణ, సేవ , ఇంకా త్యాగాలు అమ్మ లో మూర్తీభవించాయి. ఆమె భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సంప్రదాయాల ను వ్యాప్తి చేస్తున్నారు.’’ అని ఆయన అన్నారు.

భారతదేశం లో గల సేవ మరియు వైద్యం ల తాలూకు ఘనమైనటువంటి సంప్రదాయాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ‘‘చికిత్స అనేది ఒక సేవ గా, ఆరోగ్యం అనేది ఒక దానం గా ఉన్నటువటి దేశం భారతదేశం. ఈ దేశం లో ఆరోగ్యం మరియు ఆధ్యాత్మికత.. ఈ రెండూ కూడాను ఒక దాని తో మరొకటి జతపడి ఉన్నాయి. మనకు వైద్య విజ్ఞాన శాస్త్రం అనేది ఒక వేదం గా ఉంది. మనం మన వైద్య విజ్ఞాన శాస్త్రాని కి ఆయుర్వేదం అనే పేరు ను కూడా పెట్టుకొన్నాం’’ అని ఆయన అన్నారు. భారతదేశం శతాబ్దాల పాటు బానిసత్వం లో మగ్గిన కష్టకాలం లో సైతం తన ఆధ్యాత్మిక వారసత్వాన్ని మరియు సేవ తాలూకు సంప్రదాయాన్ని ఎన్నడూ మరుగు న పడిపోనివ్వలేదు అని ఆయన శ్రోతల కు గుర్తు కు తెచ్చారు.

పూజనీయురాలు అమ్మ వంటి సాధు గణం రూపం లో ఆధ్యాత్మిక శక్తి ఎల్లప్పటి కి దేశం నలు మూలల కు ప్రసరించేటటువంటి ఒక సౌభాగ్యం ఈ దేశానికి కలిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. విద్య కు, వైద్యాని కి సంబంధించిన బాధ్యతల ను మన ధార్మిక సంస్థ లు మరియు సామాజిక సంస్థ లు నిర్వర్తించేటటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఒక రకం గా అది ప్రాచీన కాలాని కి చెందినటువంటి పిపిపి నమూనాయే అని కూడా ప్రధాన మంత్రి అన్నారు. ‘‘దీనిని పబ్లిక్-ప్రైవేట్ పార్ట్ నర్ శిప్ అని అంటున్నారు. కానీ, నేను దీని ని ఒక పరస్పర ప్రయాస అని కూడా భావిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

భారతదేశం లో తయారు చేసిన టీకా మందు ను గురించి, కొంత మంది పనిగట్టుకొని ఏ విధం గా ప్రచారం చేసిందీ ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఫలితం గా, సమాజం లో పలు రకాల వదంతులు వ్యాపించడం మొదలు పెట్టాయి అని ఆయన అన్నారు. ఎప్పుడైతే ధర్మ గురువు లు మరియు ఆధ్యాత్మిక గురువు లు కలసికట్టు గా ముందుకు వచ్చి, వదంతుల ను పట్టించుకోవద్దంటూ ప్రజల కు విజ్ఞప్తి చేశారో వెనువెంటనే దాని ప్రభావం కనిపించింది అని కూడా ప్రధాన మంత్రి అన్నారు. ఇతర దేశాల లో వ్యక్తమైనట్లు గా టీకా మందు పరమైనటువంటి సంకోచం భారతదేశం లో ఎదురవలేదన్నారు.

ఎర్ర కోట బురుజుల నుంచి దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి తాను చేసిన ప్రసంగాన్ని మరొక సారి గుర్తుచేస్తూ, ‘అమృత కాలం’ తాలూకు అయిదు ప్రతిజ్ఞల తో కూడిన ఒక దృష్టికోణాన్ని తాను దేశప్రజల సమక్షానికి తీసుకు వచ్చానన్నారు. ఆ అయిదు ప్రతినల లో బానిసత్వ మనస్తత్వాన్ని పూర్తి గా విడనాడాలన్నది ఒక ప్రతిన గా ఉంది. ప్రస్తుతం దేశం లో దీనిని గురించి కూడా ఎంతో చర్చ జరుగుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఎప్పుడైతే మనం ఈ యొక్క మనస్తత్వాన్ని విడచిపెడతామో అప్పుడు మన కార్యాల దిశ సైతం మారుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సాంప్రదాయిక జ్ఞానం పట్ల దేశం లో నమ్మకం పెరుగుతున్నందువల్ల ఈ పరివర్తన దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ లో కనిపిస్తోందని ఆయన అన్నారు. యోగ కు ప్రస్తుతం ప్రపంచం లో ఆమోదం లభించింది మరి ప్రపంచం వచ్చే సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం గా జరుపుకోనుంది.

ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ, ప్రస్తుతం దేశం లో ప్రతి ఇంటా గొట్టపు మార్గం ద్వారా నీరు అందుబాటులో ఉన్న సదుపాయాన్ని కలిగి ఉన్నటువంటి ప్రముఖ రాష్ట్రాల లో ఒక రాష్ట్రం గా హరియాణా ఉందన్నారు. బేటీ బచావో, బేటీ పఢావో ఉద్యమాని కి సర్వోత్కృష్టమైనటువంటి తోడ్పాటు ను అందిస్తున్నందుకు గాను హరియాణా ప్రజానీకాని కి ప్రధాన మంత్రి అభినందనల ను వ్యక్తంచేశారు. దేహ దారుఢ్యం, ఇంకా క్రీడ లు వంటివి హరియాణా సంస్కృతి లోనే భాగం గా ఉన్నాయని కూడా ఆయన అన్నారు.

 

 

 

 

 

 

పూర్వరంగం

ప్రధాన మంత్రి ఫరీదాబాద్‌ లో అమృత హాస్పిటల్‌ ను ప్రారంభించడం తో నేశనల్ కేపిటల్ రీజియన్ (ఎన్ సిఆర్) లో వైద్య సంబంధి ఆధునిక మౌలిక సదుపాయాల లభ్యత కు ఒక ఉత్తేజం లభించనుంది. మాత అమృతానందమయి మఠం నిర్వహించే ఈ సూపర్ స్పెశలిటీ హాస్పిటల్ లో 2600 పడకల ను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు గా 6,000 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో నిర్మాణాధీనం లో ఉన్న ఈ ఆసుపత్రి ఫరీదాబాద్ ప్రజల కు మరియు యావత్తు ఎన్ సిఆర్ ప్రాంతం ప్రజల కు అత్యధునాతనమైనటువంటి ఆరోగ్య సంరక్షణ సదుపాయాల ను అందిస్తుంది.

 

 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi