‘‘ఇది నిజాని కిమహాకుంభ్ కు సిసలైన రూపం; ఇది మునుపెన్నడూ ఎరుగనంత శక్తి ని మరియు ఉత్సాహాన్ని జనింప చేస్తున్నది’’
‘‘స్టార్ట్-అప్మహాకుంభ్ ను సందర్శించే భారతీయ పౌరులు ఎవరైనా, భవిష్యత్తు లో యూనికార్న్ లను మరియుడెకాకార్న్ లను చూడగలుగుతారు’’
‘‘స్టార్ట్-అప్ అనేది ఒక సామాజిక సంస్కృతి గా మారిపోయింది; మరి సామాజిక సంస్కృతి ని ఏ ఒక్కరు అడ్డుకోజాలరు’’
‘‘దేశం లో 45 శాతాని కి పైగా స్టార్ట్-అప్స్ మహిళల నాయకత్వం లోనేనడుస్తున్నాయి’’
‘‘ప్రపంచవ్యాప్తంగా వినియోగం లోకి తీసుకు వచ్చేందుకు భారతదేశం కనుగొంటున్న పరిష్కారాలు ప్రపంచం లోఅనేక దేశాల కు ఒక సహాయక సాధనం గా మారుతాయని నేను నమ్ముతున్నాను’’

స్టార్ట్-అప్ మహాకుంభ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ఈ రోజు న ప్రారంభించారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను కూడా ఆయన పరిశీలించారు.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, స్టార్ట్-అప్ మహాకుంభ్ కు గల ప్రాముఖ్యాన్ని ప్రముఖం గా ప్రకటించారు. 2047 వ సంవత్సరాని కల్లా భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశం గా మారేందుకు దేశం అనుసరించవలసిన ఒక మార్గసూచీ ని గురించి ఆయన నొక్కి పలికారు. గడచిన కొన్ని దశాబ్దాల లో సమాచార సాంకేతిక విజ్ఞాన రంగం (ఐటి) లో మరియు సాఫ్ట్ వేర్ సెక్టర్ లో భారతదేశం తనకంటూ ఒక ముద్ర ను వేసిన విషయాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. నూతన ఆవిష్కరణ లు మరియు స్టార్ట్-అప్ స్ రంగం లో క్రొత్త గా ఉనికి లోకి వస్తున్న ధోరణుల ను గురించి ఆయన వివరించారు. ఈ కారణం గా ప్రపంచ దేశాల లో స్టార్ట్-అప్స్ రంగం లో పని చేస్తున్న వారు నేటి సందర్భం యొక్క ప్రాముఖ్యాన్ని చాటి చెబుతున్నారు అని ఆయన అన్నారు. దేశం లో స్టార్ట్-అప్స్ సాధించిన సాఫల్యాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, వాటి ని విజయపథం లో నడుపుతున్న ప్రజ్ఞ ను గుర్తెరగాలి అని కోరారు. ఈ సమావేశాని కి హాజరు అయిన ఇన్వెస్టర్ లు, ఇంక్యుబేటర్ లు, విద్య రంగ ప్రముఖులు, పరిశోధకులు, పరిశ్రమ సభ్యులు, వర్తమాన నవ పారిశ్రమికవేత్త లు మరియు రాబోయే కాలం లో నవ పారిశ్రమికవేత్తలు గా ఎదగాలనుకొంటున్న వారిని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘ఇది నిజాని కి ఒక మహాకుంభ్ కు సిసలైన రూపం అని చెప్పాలి; ఇక్కడ ఇది వరకు ఎన్నడూ ఎరుగనంత శక్తి మరియు ఉత్సాహం పెల్లుబుకుతున్నాయి’’ అన్నారు. ప్రదర్శన లో తాను కలియదిరిగినప్పుడు అక్కడ పలువురు వారి నూతన ఆవిష్కరణల ను ఎంతో స్వాభిమానం తో ఆవిష్కరించి న తీరు ను గమనించినప్పుడు తనలో ఇటువంటి ఉత్సాహమే కలిగిందని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘స్టార్ట్-అప్ మహాకుంభ్ ను దర్శించే ఏ భారతీయుడు లేదా ఏ భారతీయురాలు అయినా భవిష్యత్తు లో యూనికార్న్ లను మరియు డెకాకార్న్ లను చూస్తారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

సరి అయినటువంటి విధానాల ను అమలు పరుస్తున్న కారణం గా దేశం లో స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్ వృద్ధి చెందుతున్న తీరు పట్ల ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. సమాజం లో స్టార్ట్-అప్ అంటే మొదట్లో ఇష్టం లేకపోవడం, అనాసక్తి ఉండేవి అని ఆయన గుర్తు కు తీసుకు వచ్చారు. స్టార్ట్-అప్ ఇండియా లో భాగం గా కాలం గడిచిన కొద్దీ క్రొత్త క్రొత్త ఆలోచనల కు ఒక వేదిక అంటూ దొరికింది అని ఆయన చెప్పారు. మది లో తలెత్తిన ఆలోచనల కు ఆర్థిక వనరులు జత పడడం తో ఒక ఇకోసిస్టమ్ ఏర్పడింది; ఇంక్యుబేటర్ లు వెలిశాయి, ఫలితం గా రెండో అంచె నగరాల లో మరియు మూడో అంచె నగరాల లో యువతీ యువకుల కు తత్సంబంధి సదుపాయాలు అందివచ్చాయి అని ఆయన అన్నారు. ‘‘స్టార్ట్-అప్ ఇక ఒక సామాజిక సంస్కృతి గా స్థిర పడిపోయింది, మరి ఈ సామాజిక సంస్కృతి ని ఎవ్వరు ఆపజాలరు’’ అని ఆయన అన్నారు.

స్టార్ట్-అప్ క్రాంతి కి నాయకత్వాన్ని చిన్న నగరాలు వహిస్తున్నాయి; అదీను వ్యవసాయం, వస్త్రాలు, ఔషధాలు, రవాణా, అంతరిక్షం, యోగ, ఇంకా ఆయుర్వేద లు సహా అనేక రంగాల లో స్టార్ట్-అప్స్ తెర మీద కు వస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. అంతరిక్ష రంగాని కి సంబంధించిన స్టార్ట్-అప్స్ ను గురించి ప్రధాన మంత్రి మరింత వివరం గా మాట్లాడుతూ, స్పేస్ షటిల్ ను ప్రయోగించడం సహా అంతరిక్ష రంగం లో 50 కు పైగా విభాగాల లో భారతదేశాని కి చెందిన స్టార్ట్-అప్స్ ప్రస్తుతం పని చేస్తున్నాయి అన్నారు.

 

స్టార్ట్- అప్స్ విషయం లో ఇదివరకటి ఆలోచనల లో మార్పు చోటు చేసుకొంటోంది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అంటే ఎంతో డబ్బు అవసర పడుతుంది అనే ధోరణి ని స్టార్ట్- అప్స్ మార్చివేశాయి అని ఆయన అన్నారు. ఒక ఉద్యోగం చేయాలి అని కోరుకోవడం కంటే ఒక ఉద్యోగాన్ని అవతలి వ్యక్తి కి ఇవ్వాలి అనేటటువంటి దారిని ఎన్నుకొన్నందుకు గాను దేశం లోని యువతీ యువకుల ను ఆయన ప్రశంసించారు.

‘‘12 లక్షల మంది యువతీ యువకులు ప్రత్యక్షం గా శ్రమిస్తున్న 1.25 లక్షల స్టార్ట్-అప్స్ తో ప్రపంచం లో మూడో అతిపెద్ద స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్ గా భారతదేశం వర్ధిల్లుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. నవ పారిశ్రమికవేత్తలు వారి యొక్క పేటెంట్ లను త్వరిత గతి న దాఖలు చేసే విషయం లో జాగరూకత తో ఉండాలి అని ప్రధాన మంత్రి కోరారు. స్టార్ట్-అప్స్ కు మరియు అనేక వ్యాపారాల కు 20,000 కోట్ల రూపాయల పైచిలుకు నిధుల ను జెమ్ (GeM) పోర్టల్ అందజేసింది అని ఆయన తెలిపారు. క్రొత్త క్రొత్త రంగాల లోకి అడుగిడుతున్నందుకు గాను యువత ను ప్రధాన మంత్రి అభినందించారు. విధానపరమైన వేదికల లో ఆరంభించినటువంటి కొన్ని స్టార్ట్-అప్స్ ప్రస్తుతం సరిక్రొత్త శిఖర స్థాయిల ను అందుకొంటున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు.

 

స్టార్ట్-అప్స్ కు డిజిటల్ ఇండియా అందిస్తున్న ప్రోత్సాహాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ఇది ఒక పెద్ద ప్రేరణాత్మక వనరు గా ఉంది అన్నారు. ఈ అంశాన్ని ఒక అధ్యయనం గా చేపట్టాలి అంటూ కళాశాలల కు ఆయన సూచన ను చేశారు. దేశం లో డిజిటల్ సర్వీసుల విస్తరణ కై నూతన ఉత్పాదనల ను మరియు సేవల ను అభివృద్ధి పరుస్తూ, నాయకత్వ స్థానాన్ని వహిస్తున్నటువంటి ఫిన్- టెక్ రంగ సంబంధి స్టార్ట్-అప్స్ కు ఒక ప్రధానమైన సమర్థన ను అందించే పాత్ర ను పోషిస్తున్న యుపిఐ ని గురించి ఆయన ప్రస్తావించారు. యుపిఐ ఏ విధం గా పని చేస్తుందో వివరించేటటువంటి మరియు ప్రయోగాత్మక అభ్యాసాన్ని ప్రదానం చేసేటటువంటి ఒక కేంద్రాన్ని జి20 శిఖర సమ్మేళనం సందర్భం లో భారత్ మండపమ్ లో ఏర్పాటు చేసినప్పుడు, పరిశ్రమ ప్రముఖులు మరియు ప్రపంచ నేతలు ఆ కేంద్రం వద్ద భారీగా బారు తీరి అమిత ఆసక్తి ని కనబరచారు అంటూ ఆయన గుర్తు చేశారు. ఇది అన్ని వర్గాల వారిని ఆర్థిక సేవల రంగం లోకి తీసుకు వచ్చే ప్రక్రియ ను పటిష్ట పరచింది; అంతేకాకుండా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ కొన్ని వర్గాల వారికో పరిమితం చేయకుండా, అన్ని వర్గాల వారి చెంతకు తీసుకు పోవడం తో పాటుగా పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు అనేటటువంటి అంతరాన్ని తగ్గించివేసింది అని ప్రధాన మంత్రి వివరించారు. దేశం లో ప్రతి వంద స్టార్ట్- అప్స్ లో 45 కు పైగా స్టార్ట్-అప్స్ కు.. అవి విద్య రంగం స్టార్ట్-అప్స్ కావచ్చు, లేదా వ్యవసాయ రంగం స్టార్ట్-అప్స్ కావచ్చు లేదా ఆరోగ్య రంగానికి చెందిన స్టార్ట్-అప్స్ అయినా సరే, నాయకత్వాన్ని వహిస్తున్నది మహిళలే అని చెప్తూ, ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

నూతన ఆవిష్కరణ ల సంస్కృతి ఒక్క ‘వికసిత్ భారత్’ కే కాకుండా యావత్తు మానవాళి కి ప్రాముఖ్యం కలిగిన అంశం గా ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. స్టార్ట్-అప్స్ ను ఒక వృద్ధి సంబంధి చోదక శక్తి గా ఎంచుతున్న స్టార్ట్ అప్స్-20 లో భాగం గా గ్లోబల్ స్టార్ట్-అప్ కోసం ఒక వేదిక ను ఇవ్వజూపడానికి భారతదేశం చొరవ ను తీసుకొంటుంది అని ఆయన చెప్పారు. కృత్రిమ మేథ (ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్- ఎఐ) రంగం లోనూ భారతదేశాని ది పైచేయి గా ఉందన్న అంశాన్ని గురించి కూడా ఆయన మాట్లాడారు.

 

ఎఐ పరిశ్రమ ముందుకు రావడం తో యువ నూతన ఆవిష్కర్తల కు, గ్లోబల్ ఇన్వెస్టర్ లకు.. ఈ రెండు వర్గాల కు కూడాను.. అనేక అవకాశాలు అందుబాటు లోకి వస్తున్నాయి అని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. ఈ సందర్భం లో ఆయన నేశనల్ క్వాంటమ్ మిశన్ ను గురించి, ఇండియా ఎఐ మిశన్ మరియు సెమికండక్టర్ మిశన్ లను గురించి ప్రస్తావించారు. కొంత కాలం క్రితం యుఎస్ సేనిట్ లో తాను ప్రసంగించినప్పుడు ఎఐ ని గురించిన చర్చ జరిగిన విషయాన్ని శ్రీ నరేంద్ర మోదీ జ్ఞప్తి కి తెచ్చుకొంటూ, ఈ రంగం లో భారతదేశం నాయకత్వ పాత్ర ను పోషించడాన్ని కొనసాగిస్తుంది అంటూ హామీ ని ఇచ్చారు. ‘‘ప్రపంచం అంతటా వినియోగించేందుకు వీలుపడే పరిష్కార మార్గాల ను భారతదేశం లో రూపొందించడం జరుగుతుంది, అవి ప్రపంచం లో అనేక దేశాల లో సహాయకారి పాత్ర ను పోషించ గలుగుతాయి అని నేను నమ్ముతున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

హ్యాకథన్ ల వంటి కార్యక్రమాల ద్వారా భారతీయ యువత వద్ద నుండి పాఠాల ను నేర్చుకోవాలని ప్రపంచ దేశాలు కోరుకొంటున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం పరిస్థితుల లో పరీక్షించినటువంటి పరిష్కార మార్గాల కు ప్రపంచం లో ఆమోదం లభించింది అని ఆయన అన్నారు. నేశనల్ రిసర్చ్ ఫౌండేశన్ ను ఏర్పాటు చేయడాన్ని గురించి మరియు సత్వర వృద్ధి కి అవకాశం ఉన్నటువంటి రంగాల లో రాబోయే కాలం అవసరాల ను దృష్టి లో పెట్టుకొని పరిశోధన మరియు పథక రచన ల కోసం లక్ష కోట్ల రూపాయల నిధి ని ప్రతిపాదించడాన్ని గురించి కూడా ఆయన మాట్లాడారు.

 

స్టార్ట్-అప్ సెక్టరు లోకి ప్రవేశించి ఎదగాలని తలచే వ్యక్తుల కు మరియు సంస్థల కు సమర్థన ను అందించడం ద్వారా స్టార్ట్-అప్స్ ఈ సమాజాని కి వాటి వంతు తోడ్పాటు ను చెల్లు వేయాలి అని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆ స్టార్ట్-అప్స్ ప్రతినిధులు ఇంక్యుబేశన్ సెంటర్ లను , పాఠశాలల ను మరియు కళాశాలల ను సందర్శించి, వారి వారి నిశిత మైన ఆలోచనల ను విద్యార్థినీ విద్యార్థుల కు వెల్లడించాలి అని ఆయన కోరారు. ప్రభుత్వం వద్ద కు వచ్చిన సమస్యల పట్టిక ను హ్యాకథన్ మాధ్యం ద్వారా నివేదించి, వాటి కి తగిన పరిష్కారాల ను సూచించవలసిందంటూ యువతీ యువకుల ను భాగస్తుల ను చేసిన తన ఆలోచనల ను ఆయన ఈ సందర్భం లో తెలియ జెప్పారు. మంచి మంచి పరిష్కార మార్గాల ను ఎన్నింటినో పాలన లో అమలు పరచడం జరిగింది; మరి పరిష్కారాల ను కనుగొనడం కోసమంటూ హ్యాకథన్ సంస్కృతి ని ప్రభుత్వం లో ఏర్పాటు చేయడమైంది అని ఆయన వెల్లడించారు. వ్యాపార సంస్థలు మరియు సూక్ష్మ, లఘు, మధ్యతరహా వాణిజ్య సంస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ) లు ఇదే బాట లో నడవాలి అని ఆయన సూచన చేశారు. ఆచరించదగిన అంశాల తో ముందుకు రావలసింది గా మహాకుంభ్ ను ఆయన కోరారు.

ప్రపంచం లో పదకొండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఉన్న భారతదేశాన్ని అయిదో అతి పెద్దదైన ఆర్థిక వ్యవస్థ గా తీర్చిదిద్దడం లో భారతదేశం యొక్క యువత అందించిన తోడ్పాటు ను గురించి ప్రధాన మంత్రి వివరించారు. మూడో పదవీకాలం లో భారతదేశాన్ని ప్రపంచం లో మూడో అతి పెద్దదైన ఆర్థిక వ్యవస్థ గా మలచాలన్న హామీ ని నెరవేర్చడం లో స్టార్ట్-అప్స్ పోషించవలసి ఉన్న పాత్ర ను కూడా ఆయన ప్రముఖం గా పేర్కొన్నారు. యువజనుల తో తాను జరిపిన మాటామంతీ తనకు నూతనోత్సాహాన్ని ఇచ్చిందని చెప్తూ, ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. రాబోయే కాలం లో మరింత గా రాణించండి అని యువత కు శుభాకాంక్షల ను తెలియజేశారు.

 

వాణిజ్యం మరియు పరిశ్రమ ల శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్, సహాయ మంత్రులు శ్రీమతి అనుప్రియ పటేల్ మరియు శ్రీ సోమ్ ప్రకాశ్ లు సహా ఇతరులు ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi