The Hospital will remove darkness from the lives of many people in Varanasi and the region, leading them towards light: PM
Kashi is also now becoming famous as a big health center and healthcare hub of Purvanchal in UP: PM
Today, India's health strategy has five pillars - Preventive healthcare, Timely diagnosis of disease, Free and low-cost treatment, Good treatment in small towns and Expansion of technology in healthcare: PM

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఆర్ జె శంకర కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ ఆస్పత్రి  వివిధ కంటి సమస్యలకు  సమగ్ర సలహాలు , చికిత్సలను అందిస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను శ్రీ మోదీ సందర్శించారు.
 

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఈ మంచి సమయంలో కాశీని సందర్శించడం పుణ్యాన్ని పొందే అవకాశం అని అన్నారు. కాశీ ప్రజలు, సాధువులు, దాతలు హాజరు కావడాన్ని ప్రస్తావిస్తూ, పరమ పూజ్య శంకరాచార్యుల దర్శనం, ప్రసాదం,  ఆశీస్సులు పొందానని ఆయన అన్నారు. కాశీ, ఉత్తరాంచల్ లకు ఈ రోజు మరో అధునాతన ఆసుపత్రి లభించిందని, శంకరుని భూమిలో ఆర్ జె శంకర కంటి ఆసుపత్రిని అంకితం చేశానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాశీ, ఉత్తరాంచల్ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

భారతదేశ ప్రాచీన గ్రంధాలలో పేర్కొన్న ఒక సూత్రాన్ని సారూప్యంగా ఇస్తూ, ఆర్ జె శంకర కంటి ఆసుపత్రి ఎంతో మందిని అంధకారం నుంచి వెలుగు వైపు నడిపిస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పుడే కంటి ఆసుపత్రిని సందర్శించానని, ఇది ఆధ్యాత్మికత, ఆధునికత మేళవింపు అని తాను భావించానని, కంటిచూపు ఇవ్వడంలో వృద్ధులు, యువకులకు ఈ ఆసుపత్రి ఉపయోగపడుతుందని శ్రీ మోదీ అన్నారు. పెద్ద సంఖ్యలో పేదలకు ఈ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందుతుందని తెలిపారు. ఈ కంటి ఆసుపత్రి  ఎంతో మంది యువతకు కొత్త ఉద్యోగ మార్గాలను సృష్టిస్తుందని, అలాగే వైద్య విద్యార్థులకు ఉద్యోగ, ఇంటర్న్ షిప్ అవకాశాలతో పాటు సహాయక సిబ్బందికి కూడా ఉద్యోగాలు లభిస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారు.
 

తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శంకర ఐ ఫౌండేషన్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ప్రధాన మంత్రి, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి గురువు సమక్షంలో శంకర కంటి ఆసుపత్రిని ప్రారంభించడం గురించి ప్రస్తావించారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి, జగద్గురు శంకరాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీల ఆశీస్సులు పొందడం ఎంతో సంతృప్తినిచ్చిందని, పరమ పూజ్య జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి మార్గదర్శకత్వంలో అనేక కార్యాలు పూర్తిచేశామని పేర్కొన్నారు. నేటి సందర్భాన్ని ప్రస్తావిస్తూ, మూడు విభిన్న సంప్రదాయాల  గురువులను దర్శించడం తనకు వ్యక్తిగతంగా సంతృప్తి కలిగించిన విషయమని ప్రధానమంత్రి అన్నారు. ఈ సందర్భాన్ని ఆశీర్వదించిన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ, వారణాసి ప్రజాప్రతినిధిగా ఆయనకు స్వాగతం పలికారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త స్వర్గీయ శ్రీ రాకేశ్ ఝున్ ఝున్ వాలా సేవను, కృషిని కూడా శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. శ్రీ ఝున్ ఝున్ వాలా వారసత్వాన్ని, సంప్రదాయాలను కొనసాగిస్తున్న ఆయన సతీమణి శ్రీమతి రేఖా ఝున్ ఝున్ వాలాను కూడా ఆయన ప్రశంసించారు. వారణాసిలో సంస్థలను ఏర్పాటు చేయాలని శంకర కంటి ఆసుపత్రి,  చిత్రకూట్ కంటి ఆసుపత్రి రెండింటినీ తాను అభ్యర్థించానని, కాశీ ప్రజల అభ్యర్థనను గౌరవించిన రెండు సంస్థలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గతంలో తన పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన వేలాది మంది చిత్రకూట్ కంటి ఆసుపత్రి లో చికిత్స పొందారని, ఇప్పుడు వారణాసిలో కొత్తగా రెండు అత్యాధునిక కంటి  ఆసుపత్రులు వచ్చాయని తెలిపారు.

అనాదిగా వారణాసి ఆధ్యాత్మిక , సాంస్కృతిక రాజధానిగా గుర్తింపు పొందిందని, ఇప్పుడు యూపీ, పూర్వాంచల్ ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా కూడా వారణాసి ప్రసిద్ధి చెందుతోందని ప్రధానమంత్రి అన్నారు. బి హెచ్ యు ట్రామా సెంటర్ అయినా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా, దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్ అయినా, కబీర్ చౌరా హాస్పిటల్ లో సౌకర్యాలను బలోపేతం చేయడం అయినా, సీనియర్ సిటిజన్లు, ప్రభుత్వ ఉద్యోగులు లేదా మెడికల్ కాలేజీల కోసం స్పెషాలిటీ హాస్పిటల్ అయినా గత దశాబ్ద కాలంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో చాలా కృషి జరిగిందని శ్రీ మోదీ అన్నారు. వారణాసిలో క్యాన్సర్ రోగుల చికిత్సకు కూడా అధునాతన ఆరోగ్య సదుపాయం ఉందని ఆయన అన్నారు. గతంలో ఢిల్లీ, ముంబై లకు వెళ్లడంతో పోలిస్తే ఇప్పుడు వారణాసిలోనే రోగులకు మంచి వైద్యం అందుతోందని మోదీ వివరించారు. బీహార్, జార్ఖండ్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది చికిత్స కోసం వారణాసికి వస్తున్నారని తెలిపారు. పూర్వం “మోక్షదాయిని” (మోక్షం ఇవ్వగల) వారణాసి ఇప్పుడు కొత్త శక్తి , వనరులతో “నవజీవనదాయిని” (కొత్త జీవితం ఇవ్వగల) వారణాసిగా మారుతోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
 

గత ప్రభుత్వాల గురించి ప్రస్తావిస్తూ, వారణాసితో సహా పూర్వాంచల్ లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ప్రధానమంత్రి అన్నారు.  పదేళ్ల క్రితం పూర్వాంచల్ లో బ్రెయిన్ ఫీవర్ కు బ్లాక్ స్థాయిలో చికిత్సా కేంద్రాలు లేక బాలబాలికలు మృతి చెందడం మీడియాలో పెద్ద దుమారం రేపిందని అన్నారు. అయితే గత దశాబ్ద కాలంలో కాశీలోనే కాకుండా పూర్వాంచల్ మొత్తం ప్రాంతంలో ఆరోగ్య సౌకర్యాలు అనూహ్యంగా విస్తరించడం పట్ల శ్రీ మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. నేడు పూర్వాంచల్ లో బ్రెయిన్ ఫీవర్ చికిత్సకు 100కు పైగా కేంద్రాలు పనిచేస్తున్నాయని, గత పదేళ్ళలో పూర్వాంచల్ ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో 10 వేలకు పైగా కొత్త పడకలను చేర్చారని ఆయన పేర్కొన్నారు. పూర్వాంచల్ గ్రామాల్లో పదేళ్లలో ఐదున్నర వేలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించామని తెలిపారు. పూర్వాంచల్ జిల్లా ఆసుపత్రుల్లో డయాలసిస్ సౌకర్యాలు లేని పదేళ్ల క్రితంతో పోలిస్తే నేడు 20కి పైగా డయాలసిస్ యూనిట్లు పనిచేస్తున్నాయని, రోగులకు ఉచిత చికిత్స అందిస్తున్నాయని చెప్పారు.

21వ శతాబ్దపు భారత దేశం ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన పాత మనస్తత్వాన్ని, విధానాన్ని విడనాడిందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. రోగనిరోధక ఆరోగ్యం, సకాలంలో వ్యాధి నిర్ధారణ, ఉచిత మందులు,  చికిత్స, చిన్న పట్టణాల్లో మెరుగైన ఆరోగ్య సేవలు , తగినంతమంది వైద్యులు, ఆరోగ్య సేవలలో విస్తృతంగా సాంకేతికత వినియోగం భారత్ ఆరోగ్య సంరక్షణ వ్యూహం ఐదు ప్రధాన స్తంభాలని ప్రధానమంత్రి వివరించారు.

ప్రజలు రోగాల బారిన పడకుండా రక్షించడం అత్యంత ప్రాధాన్యమని, భారత ఆరోగ్య సంరక్షణ విధానంలో ఇది మొదటి స్తంభమని పేర్కొన్న ప్రధానమంత్రి, వ్యాధులు ప్రజలను పేదలుగా మారుస్తాయని అన్నారు. గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, ఒక తీవ్రమైన జబ్బు వారిని తిరిగి పేదరికం వైపు నెట్టి వేయగలదని మోదీ అన్నారు. అందుకే ప్రభుత్వం పరిశుభ్రత, యోగా, ఆయుర్వేదం, పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. టీకా కార్యక్రమం విస్తృత ప్రభావాన్ని ప్రస్తావిస్తూ, దశాబ్దం క్రితం టీకా కవరేజీ కేవలం 60 శాతం మందికి మాత్రమే ఉందని, కోట్లాది మంది పిల్లలు టీకా లేకుండా మిగిలిపోయారని శ్రీ మోదీ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ పరిధి ఏటా ఒకటి నుంచి ఒకటిన్నర శాతం మాత్రమే పెరిగేదని, ప్రతి ప్రాంతాన్ని, ప్రతి బిడ్డను వ్యాక్సినేషన్ పరిధిలోకి తీసుకురావడానికి మరో 40-50 ఏళ్లు పట్టేదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పిల్లలకు వ్యాక్సినేషన్ కవరేజీని పెంచడానికి ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. మిషన్ ఇంద్రధనుష్ గురించి ప్రస్తావిస్తూ, దీనిలో అనేక మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేశాయని, ఫలితంగా వ్యాక్సినేషన్ కవరేజ్ రేటు పెరిగిందని, కోట్లాది మంది గర్భిణులు, పిల్లలకు సేవలను తీసుకెళ్లామని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో వ్యాక్సినేషన్ కు ప్రభుత్వం పెద్దపీట వేయడం వల్ల కలిగిన ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, నేడు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా జరుగుతోందని ఆన్నారు.
 

వ్యాధిని ముందుగానే గుర్తించడం ప్రాముఖ్యతను వివరిస్తూ, క్యాన్సర్ , మధుమేహం వంటి అనేక వ్యాధులను ప్రారంభంలోనే గుర్తించడానికి దేశవ్యాప్తంగా లక్షలాది ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం దేశంలో క్రిటికల్ కేర్ బ్లాక్స్, అధునాతన ల్యాబ్ ల నెట్ వర్క్ ను కూడా అభివృద్ధి చేస్తున్నామని నిర్మిస్తున్నామని చెప్పారు. "ఆరోగ్య రంగం లోని ఈ రెండో  స్తంభం లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతోంది", అని ఆయన అన్నారు.

ఆరోగ్య రక్షణ వ్యూహంలో మూడో స్తంభం ఆయిన తక్కువ ఖర్చుతో చికిత్స , చౌకగా మందుల లభ్యత గురించి మాట్లాడుతూ, వ్యాధుల చికిత్సపై సగటు ఖర్చు 25 శాతం తగ్గిందని స్పష్టం చేశారు. 80 శాతం రాయితీపై మందులు లభించే ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల గురించి కూడా ప్రస్తావించారు. గుండె స్టెంట్లు, మోకాలి ఇంప్లాంట్లు, క్యాన్సర్ మందుల ధరలను గణనీయంగా తగ్గించామని, ఆయుష్మాన్ యోజన పేదలకు రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తుందని తెలిపారు. ఆయుష్మాన్ యోజన కింద ఇప్పటివరకు 7.5 కోట్ల మందికి పైగా రోగులు ఉచిత చికిత్స ప్రయోజనాన్ని పొందారని ఆయన తెలిపారు.
 

ఆరోగ్య సంరక్షణ రంగానికి నాలుగో స్తంభాన్ని ప్రస్తావిస్తూ, చికిత్స కోసం ఢిల్లీ-ముంబై వంటి పెద్ద నగరాలపై ఆధారపడటం తగ్గుతుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో చిన్న నగరాల్లో ఎయిమ్స్, మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దేశంలో వైద్యుల కొరతను అధిగమించేందుకు గత దశాబ్ద కాలంలో వేలాది కొత్త మెడికల్ సీట్లను జోడించామని ప్రధాని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో మరో 75 వేల సీట్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆరోగ్య సౌకర్యాలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే ఆరోగ్య రక్షణ వ్యూహం లో ఐదో మూలస్తంభమని ప్రధాన మంత్రి వివరించారు. నేడు డిజిటల్ హెల్త్ ఐడీలను రూపొందించామని, ఇ-సంజీవని యాప్ వంటి మార్గాల ద్వారా రోగులకు ఇంటి నుంచే వైద్యులను సంప్రదించే సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. ఇ-సంజీవని యాప్ సాయంతో ఇప్పటి వరకు 30 కోట్ల మందికిపైగా ప్రజలు వైద్య సలహాలు పొందారని చెప్పారు.  ఆరోగ్య సేవలను డ్రోన్ టెక్నాలజీతో అనుసంధానం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు.
 

ప్రసంగాన్ని ముగిస్తూ, ఆరోగ్యవంతమైన, సమర్థులైన యువతరం వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేరుస్తుందన్న విశ్వాసాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. భారత వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర సిబ్బందికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కాంచీపురంలోని కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

 

Click here to read full text speech

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures

Media Coverage

India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948
December 03, 2024

The Prime Minister Shri Narendra Modi lauded the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948 in Rajya Sabha today. He remarked that it was an important legislation which will boost energy security and also contribute to a prosperous India.

Responding to a post on X by Union Minister Shri Hardeep Singh Puri, Shri Modi wrote:

“This is an important legislation which will boost energy security and also contribute to a prosperous India.”