భోపాల్ లో పునరభి వృద్ధి పనులు పూర్తి అయిన రాణి కమలాపతిరైల్ వే స్టేశన్ ను దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
ఉజ్జయిని కి-ఇందౌర్ కు మధ్య కొత్త గా రెండు మెము (MEMU) రైళ్ళ ను పచ్చజెండా ను చూపిప్రారంభించిన ప్రధాన మంత్రి
గేజ్ మార్పిడి మరియు విద్యుతీకరణ లు జరిగిన ఉజ్జయిని-ఫతేహాబాద్చంద్రావతిగంజ్ బ్రాడ్ గేజ్ సెక్శన్, భోపాల్ -బాడ్ ఖేరా సెక్శన్ లో మూడో మార్గాన్ని, విద్యుతీకరణ జరిగిన మాతేలా-నిమర్ ఖేరీబ్రాడ్ గేజ్ సెక్శన్ ను మరియు విద్యుతీకరణ జరిగిన గుణ-గ్వాలియర్ సెక్శన్ ను దేశప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు
‘‘ఈ నాటి ఈ కార్యక్రమం వైభవోపేతమైన చరిత్ర మరియు సమృద్ధమైన ఆధునిక భవిష్యత్తు ల కలయిక కు ఒక సంకేతం గా నిలుస్తోంది’’
‘‘ఒక దేశం తన సంకల్పాల ను నెరవేర్చుకోవడాని కి చిత్తశుద్ధి తో ఒకటైనప్పుడుమెరుదల చోటు చేసుకొని, ఒక పరివర్తన సంభవిస్తుంది; గత కొన్నేళ్ళుగా ఈ పరిణామాన్ని మనం గమనిస్తూవస్తున్నాం’’
‘‘ఒకప్పుడు విమానాశ్రయం లో అందుబాటు లో ఉన్న సౌకర్యాలు ప్రస్తుతం రైల్ వేస్టేశన్ లో లభ్యం అవుతున్నాయి’’
‘‘ఈ నాటి ఈ కార్యక్రమం వైభవోపేతమైన చరిత్ర మరియు సమృద్ధమైన ఆధునిక భవిష్యత్తు ల కలయిక కు ఒక సంకేతం గా నిలుస్తోంది’’
‘‘పథకాలు ఆలస్యం కాకుండాను, మరి ఎలాంటి అవరోధం లేకుండాను మేం జాగ్రత్తతీస

     

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్య ప్రదేశ్ లోని భూపాల్ లో వేరు వేరు రైల్ వే ప్రాజెక్టుల ను ఈ రోజు న దేశ ప్రజల కు అంకితం చేశారు. పునర్ అభివృద్ధి పరచిన భూపాల్ లోని రాణి కమలాపతి రైల్ వే స్టేశన్ ను ఆయన దేశ ప్రజల కు అంకితం చేశారు. గేజ్ మార్పిడి జరిగిన మరియు విద్యుతీకరణ పని పూర్తి అయిన ఉజ్జయిని-ఫతేహాబాద్ చంద్రావతిగంజ్ బ్రాడ్ గేజ్ సెక్శను ను, భోపాల్-బాడ్ ఖేరా సెక్శన్ లో మూడో మార్గాన్ని, విద్యుతీకరణ జరిగిన మాతేలా-నిమర్ ఖేరీ బ్రాడ్ గేజ్ సెక్శన్ ను మరియు విద్యుతీకరణ జరిగిన గుణ-గ్వాలియర్ సెక్శన్ లు సహా రైల్ వేల కు చెందిన అనేక ఇతర కార్యక్రమాల ను కూడా ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం ఇచ్చారు. ప్రధాన మంత్రి ఉజ్జయిని-ఇందౌర్ మధ్య మరియు ఇందౌర్-ఉజ్జయిని మధ్య కొత్త గా రెండు ఎమ్ఇఎమ్ యు.. ‘మెము’ (MEMU) ట్రయిన్ లకు ప్రారంభ సూచకంగా ఆకుపచ్చని జెండా ను చూపెట్టారు. ఈ సందర్భం లో మధ్య ప్రదేశ్ గవర్నర్, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి లతో పాటు కేంద్ర రైల్ వే శాఖ కేంద్ర మంత్రి పాలుపంచుకున్నారు.

ప్రధాన మంత్రి సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, చరిత్రాత్మకం అయినటువంటి భోపాల్ రైల్ వే స్టేశన్ సరికొత్త రూపాన్ని సంతరించుకోవడం ఒక్కటే కాకుండా రాణి కమలాపతి గారి పేరు ను దీనికి జోడించడం వల్ల ఆ రైల్ వే స్టేశన్ కు ఉన్న ప్రాముఖ్యం కూడా వృద్ధి చెందింది అని అన్నారు. ఈ రోజు న భారతీయ రైల్ వే ల గౌరవం కూడా గోండ్ వానా గౌరవాని కి జత కలిసింది అని ఆయన అన్నారు. ఆధునిక రైల్ వే ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేయడాన్ని వైభవోపేతమైన చరిత్ర మరియు సమృద్ధమైన ఆధునిక భవిత ల మేలు కలయిక గా ప్రధాన మంత్రి అభివర్ణించారు. అలాగే, ‘జన జాతీయ గౌరవ్ దివస్’ సందర్భం లో ప్రజల కు ఆయన శుభాకాంక్షల ను కూడా తెలియ జేశారు. ఈ పథకాలు మధ్య ప్రదేశ్ ప్రజల కు మేలు చేస్తాయి అని ఆయన అన్నారు.

భారతదేశం ఏ విధం గా మారుతోంది, కలలు ఏ విధం గా నెరవేరగలుగుతాయి అనడానికి ఒక ఉదాహరణ గా భారతీయ రైల్ వేలు ఉన్నాయని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఆరేడేళ్ళ కిందటి వరకు భారతీయ రైల్ వే లతో ఎవరు తటస్థపడినప్పటికీ భారతీయ రైల్ వేల ను శాపనార్థాలు పెట్టడం జరిగేది. స్థితి మారడం పై ప్రజలు వారి ఆశ ను వదలి వేసుకొన్నారు. కానీ, ఎప్పుడైతే దేశం తన సంకల్పాల ను సాధించుకోవడానికి మనస్ఫూర్తి గా ఏకం అయిందో అప్పుడు మెరుగుదల చోటు చేసుకొంటుంది, మరి మార్పు వస్తుంది; దీనిని మనం గత కొన్ని సంవత్సరాలు గా నిరంతరం గమనిస్తున్నాం’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.

దేశం లో ఒకటో ఐఎస్ఒ సర్టిఫికెట్ లభించిన, అలాగే ఒకటో పిపిపి నమూనా పై ఆధారపడినటువంటి రైల్ వే స్టేశన్.. అదే రాణి కమలాపతి రైల్ వే స్టేశన్.. ను దేశ ప్రజల కు ఈ రోజు న అంకితం చేయడం జరిగిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఒక కాలం లో విమానాశ్రయం లో లభ్యమైన సౌకర్యాలు ప్రస్తుతం రైల్ వే స్టేశన్ లో అందుబాటు లోకి వచ్చాయని ఆయన అన్నారు.

భారతదేశం ప్రస్తుతం ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణం లో రికార్డు పెట్టుబడుల ను పెట్టడం ఒక్కటే కాకుండా ప్రాజెక్టు లు జాప్యం కాకుండాను, ఎటువంటి అడ్డంకి అనేది లేకుండాను జాగ్రత్త వహిస్తున్నట్లు కూడా ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఇటీవలే ఆరంభమైన ‘పిఎమ్ గతిశక్తి నేశనల్ మాస్టర్ ప్లాన్’ ఈ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం లో దేశాని కి తోడ్పడుతుందని ఆయన తెలిపారు. రైల్ వే సంబంధిత మౌలిక సదుపాయల కల్పన పథకాలు పథక రచన దశ నుంచి కదలిక ను అందుకొనేందుకు ఏళ్ళు పట్టిన కాలం అంటూ ఒకటి ఉండిందని ప్రధాన మంత్రి అన్నారు. కానీ, ప్రస్తుతం భారతీయ రైల్ వేలు కొత్త పథకాల ను గురించిన ప్రణాళికల ను వేయడం లో అతి శీఘ్రత ను కనబరుస్తూ ఆ ప్రణాలికల ను అనుకొన్న కాలాని కి పూర్తి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

భారతీయ రైల్ వేలు దూరాల ను కలిపేటటువంటి ఒక సాధనం మాత్రమే కాదని, దేశ సంస్కృతి ని, పర్యటన ను, తీర్థయాత్రల ను కలిపేటటువంటి ముఖ్యమైన మాధ్యమం గా కూడా అవుతోందని ప్రధాన మంత్రి అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అనేక దశాబ్దాల తరువాత మొట్టమొదటి సారిగా భారతీయ రైల్ వేల కు చెందిన ఈ యొక్క సామర్ధ్యాన్ని ఇంత భారీ ఎత్తున అన్వేషించడం జరుగుతోందని ఆయన అన్నారు. ఇంతకు ముందు రైల్ వేల ను పర్యటన కోసం ఉపయోగించినప్పటికీ, అది ఒక ప్రీమియమ్ క్లబ్ కు పరిమితం అయిందని ఆయన అన్నారు. ప్రప్రథమం గా సామాన్య వ్యక్తి కి సమంజసమైన ధరల లో పర్యటన తో పాటు తీర్థ యాత్ర తాలూకు ఆధ్యాత్మిక అనుభవాన్ని కూడా అందించడం జరుగుతోంది అని ఆయన అన్నారు. రామాయణ్ సర్క్యూట్ ట్రైన్ ఆ కోవ కు చెందిన వినూత్నమైన ప్రయాస అని ఆయన చెప్పారు.

పరివర్తన తాలూకు సవాలు ను స్వీకరించి, అమలు లోకి తీసుకు వస్తున్నందుకు గాను రైల్ వే లను ఆయన అభినందించారు.

     

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi