Quoteసిద్ధార్థ్ నగర్, ఎటా, హర్ దోయి, ప్రతాప్‌ గఢ్, ఫతేహ్ పుర్, దేవరియా, గాజీపుర్, మీర్జాపుర్, ఇంకా జౌన్‌ పుర్ లలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి
Quote‘‘ఉత్తర్ ప్రదేశ్ లో జోడు ఇంజన్ ల ప్రభుత్వం ఎందరో కర్మ యోగులు దశాబ్దాల తరబడి చేసిన కఠోర శ్రమ ఫలితమే’’
Quote‘‘ప్రజా సేవ చేయడానికి వైద్య కళాశాల నుంచి బయటకువిచ్చేసే యువ వైద్యుల కు శ్రీ మాధవ్ ప్రసాద్ త్రిపాఠి పేరు ప్రేరణ ను ఇస్తూనేఉంటుంది’’
Quote‘‘ఇది వరకు మెనింజైటిస్ వల్ల అపఖ్యాతి పాల్జేసిన ఉత్తర్ప్రదేశ్ లోని పూర్వాంచల్ ఇకమీదట భారతదేశం లోని తూర్పు ప్రాంతాలల కు స్వస్థత తాలూకుఒక కొత్త ప్రకాశాన్ని అందించనుంది’’
Quote‘‘ప్రభుత్వం ఎప్పుడైతే సూక్ష్మ బుద్ధి ని కలిగి ఉంటుందో, పేద ప్రజల బాధల ను అర్థం చేసుకొనే కరుణ దాని మది లో ఉంటుందో,అప్పుడు ఈ తరహా కార్యాలు జరుగుతుంటాయి’’
Quote‘‘ఇన్నన్ని మెడికల్ కాలేజీల ను ప్రజల కు అంకితం చేయడం రాష్ట్రం లో ఇదివరకు జరుగనిది; ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతోంది అంటే, అందుకు ఒకే ఒక కారణం ఉంది- అదే రాజకీయ ఇచ్ఛాశక్తి, రాజకీయ ప్రాధాన్యం’’
Quote‘‘2017వ సంవత్సరం వరకు ఉత్తర్ ప్రదేశ్ లో ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 1900 సీట్లు మాత్రమే ఉన్నాయి. జోడు ఇంజన్ ల ప్రభుత్వం గత నాలుగేళ్ళ కాలంలోనే 1900 కంటే ఎక్కువ మెడికల్ సీట్ల ను పెంచివేసింది’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని సిద్ధార్థ్ నగర్ లో 9 మెడికల్ కాలేజీల ను ప్రారంభించారు. అవి సిద్ధార్థ్ నగర్, ఎటా, హర్ దోయి, ప్రతాప్‌ గఢ్, ఫతేహ్ పుర్, దేవరియా, గాజీపుర్, మీర్జాపుర్ మరియు జౌన్‌ పుర్ లలో ఏర్పాటయ్యాయి. ఈ కార్యక్రమం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు.

ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తో పాటు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఎందరో కర్మ యోగుల దశాబ్దాల తరబడి కఠోర శ్రమ ఫలితం గా ఏర్పడినట్లు పేర్కొన్నారు. సిద్ధార్థ్ నగర్ సైతం కీర్తి శేషుడు మాధవ్ ప్రసాద్ త్రిపాఠి గారి రూపం లో ప్రజాసేవ పట్ల తత్పరత కలిగిన ఒక ప్రతినిధి ని దేశాని కి అందించిందని, ఆయన చేసిన అవిశ్రాంత కృషి ప్రస్తుతం దేశ ప్రజల కు తోడ్పడుతోందన్నారు. సిద్ధార్థ్ నగర్ లోని కొత్త వైద్య కళాశాలల కు మాధవ్ బాబు పేరు ను ఆయన జత చేశారు. ఇది ఆయన సేవల కు అర్పించే ఒక నిజమైన నివాళి అని ఆయన అన్నారు. కళాశాల నుంచి బయటకు వచ్చే యువ డాక్టర్ లు ప్రజల కు సేవలు అందించడానికి వారికి మాధవ్ బాబు గారి పేరు ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

కొత్త గా 9 వైద్య కళాశాల లను నిర్మించడం తో దాదాపుగా రెండున్నర వేల కొత్త పడక లు ఏర్పాటు అయ్యాయని, 5 వేలకు పైగా డాక్టర్ లు మరియు పారా మెడిక్స్ కు నూతనం గా ఉపాధి అవకాశాలు అందివచ్చాయని ప్రధాన మంత్రి తెలిపారు. దీనితో ప్రతి సంవత్సరం వందల కొద్దీ యువతీ యువకుల కు వైద్య విద్య తాలూకు ఒక కొత్త దారి తెరచుకొంది అని ఆయన అన్నారు.

|

మెనింజైటిస్ కారణం గా దుఃఖదాయక మరణాలు సంభవించినందు వల్ల పూర్వాంచల్ ప్రతిష్ట ను ఇదివరకటి ప్రభుత్వాలు ధ్వంసం చేశాయని ప్రధాన మంత్రి అన్నారు. అదే పూర్వాంచల్, మరి అదే ఉత్తర్ ప్రదేశ్ ఇక భారతదేశం లోని ఈశాన్య ప్రాంతాల కు ఆరోగ్య సంబంధ కొత్త వెలుగు లను ప్రసరించబోతున్నాయని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

|

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు పార్లమెంటు లో సభ్యుని గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం లో అధ్వానమైన వైద్య వ్యవస్థ తాలూకు యాతన ను పార్లమెంటు దృష్టి కి తీసుకు వచ్చినప్పటి ఉదంతాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ ప్రజల కు సేవ చేసేందుకు యోగి గారికి ఒక అవకాశం లభించడం తో, ఈ ప్రాంతం లో మెదడువాపు వ్యాధి ప్రాబల్యాన్ని అడ్డుకొని వేలకొద్దీ బాలల ప్రాణాల ను కాపాడడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ప్రభుత్వం సూక్ష్మ బుద్ధి ని కలిగి ఉన్నప్పుడు, పేదల బాధ ను అర్థం చేసుకొనే ఒక కరుణాపూరితమైన భావన అంటూ ప్రభుత్వానికి ఉన్నప్పుడు.. ఇలాంటి కార్య సాధనలు సంభవం అవుతాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

|

అన్నేసి మెడికల్ కాలేజీల ను దేశ ప్రజల కు అంకితం చేయడం అనేది రాష్ట్రం లో ఒక అపూర్వం అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఇదివరకు ఇలాంటి ఘటన సంభవించలేదు. మరి ఇప్పుడే ఇది ఎందుకు జరుగుతోంది అని అంటే అందుకు ఒకే ఒక్క కారణం ఉంది; అది రాజకీయ ఇచ్ఛాశక్తి, రాజకీయ ప్రాధాన్యమూను’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. దిల్లీ లో 7 సంవత్సరాల క్రితం ఉన్న ప్రభుత్వాలు, నాలుగు సంవత్సరాల క్రితం ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వం వోట్ల కోసం పని చేసేవి. మరి అవి వోట్ల ను పరిగణన లోకి తీసుకుని ఏ చిన్న ఆసుపత్రి నో, లేదా ఔషధశాల నో ఏర్పాటు చేస్తామని ప్రకటించి సంతృప్తి చెందేవి అని ప్రధాన మంత్రి వివరించారు. చాలా కాలం పాటు అయితే భవనాన్ని నిర్మించకపోవడం గాని, లేదా ఒకవేళ భవనం తయారు అయినప్పటికీ అందులో ఎలాంటి యంత్రాలు లేకపోవడం గాని, లేదా ఒకవేళ భవనం, యంత్రాలు ఉన్నా కూడాను వైద్యులు , ఇతర సిబ్బంది అంటూ లేకపోవడం గాని జరిగేవి. అవినీతి పేదల వద్ద నుంచి వేల కోట్ల కొద్దీ రూపాయల ను దోపిడీ చేసే అవినీతి తాలూకు చక్రం అనేది నిర్దయ గా రోజులో ఇరవైనాలుగు గంటలూ తిరుగుతూ ఉండేది అని ప్రధాన మంత్రి అన్నారు.

|

2014వ సంవత్సరాని కంటే ముందు మన దేశం లో మెడికల్ సీట్లు 90,000 కన్నా తక్కువ గా ఉండేవి అని ప్రధాన మంత్రి అన్నారు. గడచిన 7 సంవత్సరాల లో, దేశం లో 60,000 మెడికల్ సీట్ల ను కొత్త గా కల్పించడమైందని ఆయన అన్నారు. ఇక్కడ ఉత్తర్ ప్రదేశ్ లో కూడాను, 2017వ సంవత్సరం వరకు 1900 మెడికల్ సీట్లు మాత్రమే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్నాయి. అదే డబల్ ఇంజన్ ప్రభుత్వం హయాం లో, 1900కు పైగా సీట్ల ను నాలుగేళ్ళ కాలం లోనే సమకూర్చడం జరిగిందని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Rs 1,555 crore central aid for 5 states hit by calamities in 2024 gets government nod

Media Coverage

Rs 1,555 crore central aid for 5 states hit by calamities in 2024 gets government nod
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 ఫెబ్రవరి 2025
February 19, 2025

Appreciation for PM Modi's Efforts in Strengthening Economic Ties with Qatar and Beyond