రాయ్‌పూర్‌లో నూత‌నంగా నిర్మించిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ‌యోటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌ను జాతికి అంకితం చేసిన ప్ర‌ధాన‌మంత్రి
వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యాల‌కు గ్రీన్ క్యాంప‌స్ అవార్డుల‌ను బ‌హుక‌రించిన ప్ర‌ధాన‌మంత్రి
రైతులకు, వ్య‌వ‌సాయ రంగానికి సేఫ్టీనెట్ ల‌భించిన చోట ప్ర‌గ‌తి శ‌ర‌వేగంతో ఉంటుంది.
సైన్సు, ప్ర‌భుత్వం, సమాజం క‌లిసి ప‌నిచేసిన చోట ఫ‌లితాలు మెరుగుగా ఉంటాయి. రైతులు, శాస్త్ర‌వేత్త‌లతో కూడిన కూట‌మి నూత‌న స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు దేశాన్ని బ‌లోప‌తేం చేయ‌గ‌ల‌దు.
రైతులు పంట ఆధారిత వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డే స్థితినుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు, వారిని విలువ ఆధారిత‌, ఇత‌ర పంట ప్ర‌త్యామ్నాయాల‌పై ప్రోత్స‌హించేందుకు కృషి జ‌రుగుతోంది.
"పంట ఆధారిత ఆదాయ వ్యవస్థ పై ఆధార‌ప‌డే స్థితినుండి రైతులను బ‌య‌ట‌ప‌డేయ‌డానికి, విలువ జోడింపు, ఇతర వ్యవసాయ ఎంపికల కోసం వారిని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి"

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ , ప్ర‌త్యేక ల‌క్ష‌ణాలు గ‌ల 35 పంట ర‌కాల‌ను వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా దేశ‌ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. అలాగే ప్ర‌ధాన‌మంత్రి, రాయ్‌పూర్‌లో నూత‌నంగా నిర్మించిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్య‌ట్ ఆఫ్ బ‌యోటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌ను దేశానికి అంకితం చేశారు.  ఈ సంద‌ర్బంగా  ప్ర‌ధాన‌మంత్రి వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యాల‌కు గ్రీన్ క్యాంప‌స్ అవార్డుల‌ను ప్ర‌దానం చేశారు. వ్య‌వ‌సాయంలో వినూత్న ప‌ద్ధ‌తుల‌ను వాడుతున్న రైతుల‌తోనూ, ఈ స‌మావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగించారు.

జ‌మ్ము కాశ్మీర్‌లోని గందేర్‌బ‌ల్ కు చెందిన శ్రీ‌మతి జైతూన్ బేగంతో మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి, వినూత్న వ్య‌వ‌సాయ విధానాల‌ను నేర్చుకోవ‌డంలో ఆమె ప్ర‌స్థానం గురించి, ప్ర‌స్తావించారు. అలాగే ఇత‌ర రైతుల‌కు ఆమె ఏ విధంగా శిక్ష‌ణ ఇచ్చిందీ, కాశ్మీర్ లోయ‌లో బాలికా విద్య కోసం ఆమె ఏవిధంగా పాటుప‌డుతున్న‌దీ ప్ర‌స్తావించారు. క్రీడ‌ల‌లో కూడా జ‌మ్ము కాశ్మీర్ కు చెందిన బాలిక‌లు రాణిస్తున్నార‌న్నారు. చిన్న క‌మ‌తాలు క‌లిగిన రైతుల అవ‌స‌రాలు , అన్ని ప్ర‌యోజ‌నాలు వీరికి నేరుగా అందాల‌న్న‌ది ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త అని అన్నారు..

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని బులంద్‌ష‌హ‌ర్ కు చెందిన రైతు శ్రీ కుల్వంత్ సింగ్‌తో మాట్లాడుతూ  ప్ర‌ధాన‌మంత్రి, అత‌ను ఏవిధంగా వైవిధ్యంతోకూడిన విత్త‌నాల‌ను ఉత్ప‌త్తి చేయ‌గ‌లిగిందీ అడిగి తెలుసుకున్నారు. పూసాలోని వ్య‌వ‌సాయ సంస్థ‌లోని శాస్త్ర‌వేత్త‌ల‌తో మాట్లాడ‌డం ద్వారా ఆయ‌న ఏవిధంగా ప్ర‌యోజ‌నం పొందిందీ తెలుసుకున్నారు. ఇలాంటి సంస్థ‌ల‌లోని శాస్త్ర‌వేత్త‌ల‌తో సంబంధాలు క‌లిగి ఉండ‌డంలో రైతుల ట్రెండ్ గురించి ప్ర‌ధానమంత్రి అడిగి తెలుసుకున్నారు.పంట‌ల‌ను ప్రాసెస్ చేస్తున్నందుకు, విలువ‌జోడింపు చేస్తున్నందుకు ప్ర‌ధాని ఆయ‌న‌ను అభినందించారు.  రైతుల‌కు మంచి ధ‌ర ల‌భించేలా చేసేందుకు ప్రభుత్వం ఎన్నో కార్య‌క్ర‌మాల‌తో అంటే మార్కెట్‌లు అందుబాటులోకి తేవ‌డం, నాణ్య‌మైన విత్త‌నాల స‌ర‌ఫ‌రా, భూసార కార్డుల పంపిణీ వంటి వాటిద్వారా గ‌ట్టి కృషి చేస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. 

గోవాలోని బార్డెజ్ కు చెందిన శ్రీ‌మతి ద‌ర్శ‌న్ పెడెనేక‌ర్ విభిన్న ర‌కాల పంట‌ల‌ను ఎలా సాగుచేస్తున్న‌దీ ఆమెను అడిగి తెలుసుకున్నారు. అలాగే వివిధ ర‌కాల ప‌శువులును ఆమె పెంచుతున్న తీరు గురించి అడిగారు. రైతులు కొబ్బ‌రికి విలువ జోడింపు గురించి ఆయ‌న అడిగి తెలుసుకున్నారు. మ‌హిళా రైతు వాణిజ్య‌వేత్త‌గా ఎలా అభ్యున్న‌తి సాధిస్తున్న‌దీ తెలుసుకుని ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు.


మ‌ణిపూర్ కు చెందిన శ్రీ తోయిబా సింగ్‌తో మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి, సాయుధ బ‌ల‌గాల‌నుంచి వ‌చ్చాక వ్య‌వ‌సాయాన్ని చేప‌ట్టినందుకు ప్ర‌ధాన‌మంత్రి తోయిబా సింగ్ ను అభినందించారు. వ్య‌వ‌సాయం, చేప‌ల పెంప‌కం, ఇత‌ర అనుబంధ రంగాల‌లో కృషి చేసినందుకు అత‌నిని ప్ర‌ధాన‌మంత్రి అభినందించారు. జై జ‌వాన్‌, జై కిసాన్‌కు తోయిబా సింగ్ ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తార‌న్నారు.

.ఉత్త‌రాఖండ్‌లోని ఉధంసింగ్ న‌గ‌ర్‌కు చెందిన శ్రీ సురేష్ రాణా తో మాట్లాడుతూ ప్ర‌దాన‌మంత్రి, మొక్క‌జొన్న పంట‌ సాగు ఎలా ప్రారంభించిందీ అడిగి తెలుసుకున్నారు. ఎఫ్‌.పి.ఒను స‌మ‌ర్ధంగా ఉప‌యోగిస్తున్నందుకు ప్ర‌ధాన‌మంత్రి ఉత్త‌రాఖండ్ రైతుల‌ను అభినందించారు. రైతులు స‌మ‌ష్టిగా కృషి చేసిన‌ట్ట‌యితే వారు పెద్ద ఎత్తున ప్ర‌యోజ‌నం పొందుతార‌న్నారు. ప్ర‌భుత్వం రైతుల‌కు అన్ని ర‌కాల వ‌న‌రులు, మౌలిక స‌దుపాయాలు అందుబాటులో ఉండేలా చేస్తున్న‌ట్టు చెప్పారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి, గ‌త 6-7 సంవ‌త్స‌రాల‌లో వ్య‌వ‌సాయ రంగానికి చెందిన వివిధ స‌వాళ్ల‌ను ప‌రిష్క‌రించేందుకు   సైన్సు, టెక్నాల‌జీ ల‌ను ప్రాధాన్య‌తా ప్రాతిప‌దిక‌న వినియోగిస్తున్న‌ట్టు తెలిపారు. మ‌రింత పౌష్టిక విలువ‌లు క‌లిగిన విత్త‌నాల‌ను , నూత‌న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ప్ర‌త్యేకించి వాతావ‌ర‌ణ మార్పుల‌కు అనుగుణంగా ఉండే విత్త‌నాల‌పై  దృష్టిపెడుతున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.

గ‌త ఏడాది, క‌రోనా వేళ‌ ప‌లు రాష్ట్రాల‌లో పెద్ద ఎత్తున మిడ‌త‌ల దాడిని   ప్ర‌ధానమంత్రి గుర్తు చేశారు. ఈ బెడ‌ద‌ను ఎదుర్కోనేందుకు ఇండియా ఎంతో కృషిచేసింద‌ని, రైతులు ఎక్కువ న‌ష్ట‌పోకుండా చూసింద‌ని చెప్పారు.

రైతుల‌కు వ్య‌వ‌సాయ‌రంగానికి భ‌ద్ర‌త ల‌భించిన చోట అభివృద్ధికూడా గ‌ణ‌నీయంగా ఉన్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. భూసారాన్ని ప‌రిర‌క్షించేందుకు 11 కోట్ల భూసార కార్డుల‌ను పంపిణీ చేసిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. రైతుల‌కు నీటి భ‌ద్ర‌త క‌ల్పించేందుకు 100 పెండింగ్ నీటిపారుద‌ల ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌డం, పంట‌ల‌ను తెగుళ్ల బారినుంచి ర‌క్షించేందుకు నూత‌న వంగ‌డాల‌ను అందించ‌డం, అధిక దిగుబ‌డుల‌కు వీలు కల్పించ‌డం, వంటి ప్ర‌భుత్వం తీసుకున్న ప‌లు చ‌ర్య‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. మ‌ద్ద‌తు ధ‌ర పెంపు, ప్రొక్యూర్ మెంట్ ప్ర‌క్రియ‌ను మెరుగు ప‌ర‌చ‌డం వంటివాటివ‌ల్ల  మ‌రింత మంది రైతులు ప్ర‌యోజ‌నం పొందుతార‌న్నారు. 430 మెట్రిక్ ట‌న్నుల‌కు పైగా గోధుమ‌ల‌ను ర‌బీ సీజ‌న్‌లో సేక‌రించ‌డం జ‌రిగింద‌న‌లి, రైతుల‌కు 85 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా చెల్లించ‌డం జ‌రిగింద‌ని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. కోవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో గోధుమ సేక‌ర‌ణ కేంద్రాల‌ను మూడురెట్ల‌కు పైగా పెంచిన‌ట్టు ఆయ‌న చెప్పారు.

సాంకేతిక ప‌రిజ్ఞానంతో రైతుల‌ను అనుసంధానం చేయ‌డం ద్వారా, బ్యాంకుల ద్వారా స‌హాయం పొంద‌డం వారికి మ‌రింత సుల‌భం అయ్యేట్టు చేసిన‌ట్టు ఆయ‌న తెలిపారు.  ప్ర‌స్తుతం, రైతులు వాతావ‌ర‌ణ స‌మాచారాన్ని మ‌రింత మెరుగైన ప‌ద్ధ‌తిలో తెలుసుకోగ‌లుగుతున్నారని ఆయ‌న చెప్పారు. దేశంలో 2 కోట్ల మందికి పైగా రైతుల‌కు కిసాన్ క్రెడిట్ కార్డుల‌ను అందించిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.

వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల కొత్త రకం తెగుళ్లు, కొత్త‌రకం వ్యాధులు, మ‌హ‌మ్మారులు వ‌స్తున్నాయ‌ని వీటివ‌ల్ల మాన‌వాళి, జంతువులు, మొక్క‌లు ఇబ్బందులపై ప్ర‌భావం ప‌డుతున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన అంశాల‌పై విస్తృత ప‌రిశోధ‌న‌లు అవ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. శాస్త్ర‌విజ్ఞానం, ప్ర‌భుత్వం, స‌మాజం క‌ల‌సిక‌ట్టుగా కృషి చేసిన‌ప్పుడు ఫ‌లితాలు మ‌రింత మెరుగుగా ఉంటాయ‌న్నారు. రైతులు, శాస్త్ర‌వేత్త‌ల కూట‌మి, నూత‌న స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు దేశాన్ని బ‌లోపేతం చేయ‌గ‌ల‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.

రైతులను పంట ఆధారిత ఆదాయ వ్య‌వ‌స్థ‌నుంచి బ‌య‌ట పడేసేందుకు , విలువ ఆధారిత  విధానాల‌ను ప్రోత్స‌హించేందుకు , ఇత‌ర పంట విధానాల‌ను ప్రోత్స‌హించేందుకు కృషి జ‌రుగుతున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.  మిలెట్లు, ఇత‌ర ధాన్యాల‌ను మ‌రింత అభివృద్ధి చేసి ఈ రంగంలో శాస్త్ర‌ప‌రిశోధ‌న ద్వారా త‌గిన ప‌రిష్కారాల‌ను సాధించేందుకు కృషి చేస్తున్న‌ట్టు తెలిపారు. వీటిని స్థానిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా దేశంలోని వివిధ ప్రాంతాల‌లో పండించేందుకు ఈ ప‌రిశోధ‌న‌లు తోడ్ప‌డ‌నున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. రానున్న సంవ‌త్స‌రాన్ని ఐక్య రాజ్య స‌మితి చిరుధాన్యాల సంవ‌త్స‌రంగా ప్ర‌క‌టించిన దానివ‌ల్ల అందివ‌చ్చే అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా ప్ర‌ధాన‌మంత్రి పిలుపునిచ్చారు.

మ‌న ప్రాచీన వ్య‌వ‌సాయ సంప్ర‌దాయాలతోపాటు,  భ‌విష్య‌త్‌వైపు ముందుకు సాగ‌డం కూడా అంతే ముఖ్య‌మ‌ని ఆయ‌న అన్నారు. అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం, వ్య‌వ‌సాయ ఉప‌క‌రణాలు భ‌విష్య‌త్ వ్య‌వ‌సాయానికి ఎంతో ముఖ్య‌మైన‌వ‌ని ఆయ‌న అన్నారు. అధునాత‌న వ్య‌వ‌సాయ యంత్రప‌రిక‌రాలు, ఉప‌క‌ర‌ణాల‌ను ప్రోత్స‌హించేందుకు  కృషి మంచి ఫ‌లితాలు ఇస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"