It is imperative for development that our administrative processes are transparent, responsible, accountable and answerable to the people: PM
Fighting corruption must be our collective responsibility: PM Modi
Corruption hurts development and disrupts social balance: PM Modi

అప్రమత్త భారతదేశం, సంపన్న భారతదేశం (सतर्क भारत, समृद्ध भारत) అనే ఇతివృత్తంతో నిఘా మరియు అవినీతి నిరోధకతపై జాతీయ సదస్సును ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు.  పౌరుల భాగస్వామ్యం ద్వారా ప్రజా జీవితంలో సమగ్రత మరియు సత్యవర్తన లను ప్రోత్సహించడంలో భారతదేశం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించి, నిఘా సమస్యలపై దృష్టి సారించాలానే ఉద్దేశ్యంతో,  కేంద్ర దర్యాప్తు సంస్థ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 

 

ప్రధానమంత్రి సదస్సునుద్దేశించి మాట్లాడుతూ, సర్దార్ పటేల్ సమైక్య భారతదేశం మరియు దేశ పరిపాలనా వ్యవస్థల రూపశిల్పి అని అభివర్ణించారు.   దేశ ప్రధమ హోంమంత్రిగా, దేశంలోని సామాన్యులను ఉద్దేశించి వ్యవస్థను నిర్మించడానికి, సమగ్రత ఆధారంగా విధానాలు రూపొందించడానికీ ఆయన కృషి చేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  ఆయితే, ఆ తరువాతి దశాబ్దాల్లో, వేలాది కోట్ల రూపాయల మేర మోసాలు, నకిలీ కంపెనీల స్థాపన, పన్ను వేధింపులు, పన్ను ఎగవేతలకు దారితీసే భిన్నమైన పరిస్థితిని చూశాయని శ్రీ నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. 

 

2014 సంవత్సరంలో, దేశం ఒక పెద్ద మార్పు తీసుకురావాలనీ, కొత్త దిశలో పయనించాలనీ, సంకల్పించినప్పుడు, ఈ వాతావరణాన్ని మార్చడం ఒక పెద్ద సవాలుగా నిలిచిందని, ప్రధానమంత్రి పేర్కొన్నారు.  సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ నల్లధనానికి వ్యతిరేకంగా కమిటీ ఏర్పాటు నిరుపయోగమైందని ఆయన తెలిపారు.  ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ కమిటీని ఏర్పాటు చేయడం, అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వ నిబద్ధతను తెలియజేసింది ఆయన అన్నారు.  2014 నుండి దేశం బ్యాంకింగ్ రంగం, ఆరోగ్య రంగం, విద్యా రంగం, కార్మిక, వ్యవసాయం మొదలైన అనేక రంగాలలో సంస్కరణలను చవి చూసిందని ఆయన పేర్కొన్నారు.   ఈ సంస్కరణల ప్రభావంతో, ఆత్మ నిర్భర్ భారత్ ప్రచారాన్ని విజయవంతం చేయడానికి దేశం ఇప్పుడు తన పూర్తి శక్తితో ముందుకు సాగుతోందని ఆయన వివరించారు. ప్రపంచంలోని ప్రముఖ దేశాలలో ఒకటిగా భారతదేశాన్ని మార్చాలని ఆయన ఊహించారు.

పరిపాలనా వ్యవస్థలు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, జవాబుదారీగా, ప్రజలకు సమాధానం చెప్పే విధంగా ఉండవలసిన అవసరాన్ని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.  ఏ విధమైన అవినీతి అయినా దీనికి వ్యతిరేకంగా అతిపెద్ద శత్రువు అని ఆయన అన్నారు.  అవినీతి ఒక వైపు దేశ అభివృద్ధిని దెబ్బతీస్తుందని, మరోవైపు అది సామాజిక సమతుల్యతను, వ్యవస్థపై ప్రజలు కలిగి ఉండవలసిన నమ్మకాన్నీ, నాశనం చేస్తుందని ఆయన వివరించారు.  అందువల్ల, అవినీతిని అరికట్టడం అనేది ఏ ఒక్క ఏజెన్సీ లేదా సంస్థ యొక్క బాధ్యత మాత్రమే కాదు, అది సమిష్టి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.  అవినీతిని స్వతంత్ర విధానంతో వ్యవహరించలేమని ఆయన అన్నారు.

 

ఇది దేశం మొత్తానికి సంబంధించి ఆలోచించినప్పుడు, నిఘా యొక్క పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది.  అవినీతి, ఆర్థిక నేరాలు, మాదక ద్రవ్యాల వ్యవస్థ, మనీలాండరింగ్, ఉగ్రవాదం, తీవ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం మొదలైనవన్నీ చాలావరకు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. 

అందువల్ల అవినీతిపై పోరాడటానికి సమగ్రమైన విధానంతో క్రమబద్ధమైన తనిఖీలు, సమర్థవంతమైన ఆడిట్లు మరియు సామర్థ్యం పెంపొందించడం మరియు శిక్షణ అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు.  అన్ని ఏజెన్సీలు సమిష్టిగా, సహకార స్ఫూర్తితో పనిచేయడం ప్రస్తుతం ఎంతైనా అవసరమని ప్రధాని నొక్కి చెప్పారు.

అప్రమత్త భారతదేశం, సంపన్న భారతదేశం (सतर्क भारत, समृद्ध भारत) ను రూపొందించడానికి అవసరమైన నూతన మార్గాలను సూచించడానికి ఈ సమావేశం ఒక సమర్థవంతమైన వేదికగా అవతరించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆకాంక్షించారు.

పేదరికంతో పోరాడుతున్న మన దేశంలో అవినీతికి స్థానం లేదని 2016 విజిలెన్స్ అవగాహన కార్యక్రమంలో తాను చెప్పిన విషయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.  దశాబ్దాలుగా పేదలకు అందవలసిన ప్రయోజనాలు అందలేదనీ, అయితే, ఇప్పుడు డీ.బీ.టీ. కారణంగా పేదలు నేరుగా తమ ప్రయోజనాలను పొందుతున్నారని ఆయన చెప్పారు. డీ.బీ.టీ. వల్ల మాత్రమే, అనర్హుల చేతుల్లోకి ప్రయోజనాలు చేరకుండా, 1.7 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువగా నిధులు ఆదా అయ్యాయని ఆయన చెప్పారు. 

ఈ సంస్థలపై ప్రజల విశ్వాసం మళ్ళీ పునరుద్ధరించబడుతోందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రభుత్వం నుండి బలమైన జోక్యం లేదా ప్రభుత్వం లేకపోవడం ఉండకూడదనీ, అయితే, ప్రభుత్వ జోక్యాన్ని అవసరం మేరకు పరిమితం చేయాలని, ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.  ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకుంతోందని కానీ లేదా అవసరమైనప్పుడు ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదని కానీ, ప్రజలు భావించకూడదని ఆయన సూచించారు.   

గత కొన్ని సంవత్సరాలుగా 1500 కు పైగా చట్టాలను రద్దు చేయడం జరిగిందనీ, అనేక నియమాలను సరళీకృతం చేశామనీ శ్రీ మోదీ తెలియజేశారు.  సామాన్య ప్రజలకు ఇబ్బందులను తగ్గించడానికి పెన్షన్, స్కాలర్‌షిప్, పాస్‌పోర్ట్, స్టార్టప్ మొదలైన వాటి కోసం ఆన్ ‌లైన్ ‌లో దరఖాస్తు చేసుకునేలా మార్పులు చేశామన్నారు. 

 

ప్రధానమంత్రి ఒక సామెతను ఉటంకించారు

“'प्रक्षालनाद्धि पंकस्य

दूरात् स्पर्शनम् वरम्'।”

అంటే, "తరువాత శుభ్రం చేసుకోడానికి ప్రయత్నించడం కంటే మురికిగా ఉండకపోవడమే మంచిది". అని అర్ధం. 

అదేవిధంగా, శిక్షాత్మక నిఘా కంటే నివారణ నిఘా మంచిదని ఆయన సూచించారు.  అందువల్ల, అవినీతికి దారితీసే పరిస్థితులను తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన విజ్ఞప్తి చేశారు. 

కౌటిల్యుడు చెప్పిన ఒక సామెతను ఆయన ఈ  సందర్భంగా ఉటంకించారు. 

“न भक्षयन्ति ये

त्वर्थान् न्यायतो वर्धयन्ति च ।

नित्याधिकाराः कार्यास्ते राज्ञः प्रियहिते रताः ॥”

అంటే, "ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయకుండా, ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించేవారిని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమైన పదవులలో నియమించాలి", అని అర్ధం. 

ఉద్యోగుల బదిలీ మరియు నియామకాల కోసం సిఫార్సులు చేయడానికి, గతంలో ఒక అసహ్యకరమైన వ్యవస్థ ఒకటి ఉండేదని ఆయన చెప్పారు.  ఇప్పుడు ప్రభుత్వం అనేక విధాన నిర్ణయాలు తీసుకుంది, ఈ పరిస్థితిని మార్చాలనే సంకల్పాన్ని ప్రదర్శించింది, ఉన్నత పదవులకు నియామకాలకు సిఫార్సులు ముగిశాయి.  గ్రూప్ బి & సి పోస్టుల కోసం ఇంటర్వ్యూను ప్రభుత్వం రద్దు చేసింది.  బ్యాంకు బోర్డ్ బ్యూరో ఏర్పాటు, బ్యాంకుల్లో సీనియర్ పదవులకు నియామకాలలో పారదర్శకతను నిర్ధారిస్తుందని ఆయన అన్నారు.

దేశంలోని విజిలెన్స్ వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక చట్టపరమైన సంస్కరణలు చేపట్టామని, కొత్త చట్టాలను ప్రవేశపెట్టామని ప్రధానమంత్రి చెప్పారు.  బ్లాక్ మనీకి వ్యతిరేకంగా చట్టాలు, బెనామి ఆస్తులు, పారిపోయిన ఆర్ధిక అపరాధుల చట్టం వంటి విజిలెన్స్ వ్యవస్థను బలోపేతం చేయడానికి రూపొందించిన కొత్త చట్టాలను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు.  పరోక్ష పన్ను అంచనా వ్యవస్థను అమలు చేసిన ప్రపంచంలోని కొద్ది దేశాలలో భారతదేశం కూడా ఉందని ఆయన తెలిపారు.  అవినీతిని నివారించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్న కొద్ది దేశాలలో కూడా భారతదేశం ఉంది.  విజిలెన్స్‌కు సంబంధించిన ఏజెన్సీలకు మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, సామర్థ్యం పెంపొందించడం, సరికొత్త మౌలిక సదుపాయాలు మరియు సామగ్రిని అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అనీ, తద్వారా వారు మరింత సమర్థవంతంగా పని చేస్తాయనీ, తద్వారా మంచి ఫలితాలను అందించగలవుతాయనీ ఆయన వివరించారు. 

అవినీతికి వ్యతిరేకంగా ఈ ప్రచారం కేవలం ఒక రోజు లేదా కేవలం ఒక వారం మాత్రమే నిర్వహించే వ్యవహారం కాదని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.

గత దశాబ్దాలుగా క్రమంగా పెరుగుతున్న, తరతరాల అవినీతి, ఒక ప్రధాన సవాలుగా మారిందని,  ఆయన పేర్కొన్నారు, ఇది దేశంలో ఒక బలీయమైన శక్తిగా ఎదిగిందన్నారు.  ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ అయ్యే అవినీతిని, తరతరాల అవినీతిగా ఆయన అభివర్ణించారు.  ఒక తరం అవినీతిపరులకు సరైన శిక్ష లభించనప్పుడు, రెండవ తరం మరింత శక్తితో అవినీతికి పాల్పడుతుందని ఆయన పేర్కొన్నారు.  ఈ కారణంగా, ఇది చాలా రాష్ట్రాల్లో రాజకీయ సంప్రదాయంలో ఒక భాగమైందని మోదీ పేర్కొన్నారు.  ఒక తరం నుండి మరో తరానికి ఈ అవినీతి సామ్రాజ్యం విస్తరించడంతో, అది దేశాన్ని డొల్లగా చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.   ఈ పరిస్థితి దేశ అభివృద్ధికి, సంపన్న భారతదేశానికి, స్వావలంబన కలిగిన భారతదేశానికి పెద్ద అడ్డంకిగా మారిందని ఆయన పేర్కొన్నారు.  ఈ అంశాన్ని కూడా ఈ జాతీయ సదస్సులో చర్చించాలని ఆయన ఆకాంక్షించారు.

అవినీతి సంబంధించిన వార్తలపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి కోరారు.  అవినీతిపై బలమైన సమయానుకూల చర్యల ఉదాహరణలను ప్రముఖంగా చూపించినప్పుడు, అది ప్రజల విశ్వాసాన్ని పెంచుతుంది, అదే సమయంలో అవినీతిపరులు తప్పించుకోవడం కష్టమనే ఒక సందేశాన్ని కూడా పంపుతుందని ఆయన తెలిపారు. 

అవినీతిని ఓడించి, భారతదేశాన్ని సుసంపన్నంగా, స్వావలంబనగా మార్చడం ద్వారా, సర్దార్ పటేల్ కలని సాధించగలిగితే దేశం బలోపేతం అవుతుందని ఆయన అన్నారు.

ప్రతి సంవత్సరం అక్టోబర్ 27వ తేదీ నుండి నవంబర్ 2వ తేదీ వరకు భారతదేశంలో "విజిలెన్స్ అవేర్‌ నెస్ వీక్" జరుపుకుంటున్న ‌సమయంలోనే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈ జాతీయ సమావేశాన్ని ఏర్పాటుచేసింది.  ఈ సమావేశంలో కార్యకలాపాలలో అవగాహన పెంచే లక్ష్యంతో నిఘా సమస్యలపై దృష్టి సారించబడతాయి.  మరియు పౌరుల భాగస్వామ్యం ద్వారా ప్రజా జీవితంలో సమగ్రత మరియు సంభావ్యతను ప్రోత్సహించడానికి భారతదేశం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.

మూడు రోజులపాటు కొనసాగే ఈ సదస్సులో – విదేశీ అధికార పరిధిలోని దర్యాప్తులో ఎదురైయ్యే సవాళ్ళు;  అవినీతికి వ్యతిరేకంగా విధానపరమైన తనిఖీగా  నివారణ నిఘా;  ఆర్థిక చేరిక కోసం విధానపరమైన మెరుగుదలలు; బ్యాంకు మోసాల నివారణ; వృద్ధి దోహదకారిగా ప్రభావవంతమైన ఆడిట్; అవినీతికి వ్యతిరేకంగా పోరాటానికి ప్రేరణగా అవినీతి నిరోధక చట్టానికి తాజా సవరణలు; సామర్థ్య నిర్మాణం మరియు శిక్షణ; వేగవంతమైన మరియు మరింత ప్రభావవంతమైన పరిశోధన కోసం అనువుగా ఉండే విధంగా, మల్టీ ఏజెన్సీ సమన్వయం; ఆర్థిక నేరాలలో అభివృద్ధి చెందుతున్న ధోరణులు;  సైబర్ నేరాలు; నేర పరిశోధన ఏజెన్సీలలో ఉత్తమ పద్ధతుల నియంత్రణ మరియు మార్పిడికి బహుళ జాతి ఆర్గనైజ్డ్ నేర చర్యలు; మొదలైన వివిధ అంశాలపై వివరంగా చర్చలు జరుపుతారు.   

ఈ సదస్సు విధాన రూపకర్తలను, అభ్యాసకులను ఒక సాధారణ వేదికపైకి తీసుకువస్తుంది.  వ్యవస్ధ పరమైన మెరుగుదలలు మరియు నివారణ నిఘా చర్యల ద్వారా అవినీతిని ఎదుర్కోవడానికి ఈ సదస్సు ఒక దోహదకారిగా పనిచేస్తుంది,  తద్వారా మంచి పాలన మరియు జవాబుదారీ పరిపాలనను ప్రారంభించడానికి వీలుకల్పిస్తుంది. భారతదేశంలో వ్యాపారం సులభతరం చేయడానికి ఇది ఒక ముఖ్యమైన అంశంగా పనిచేస్తుంది. 

ఈ సమావేశంలో పాల్గొనేవారిలో అవినీతి నిరోధక కార్యాలయాలు, నిఘా కార్యాలయాలు, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఆర్ధిక నేర విభాగాలు లేదా సి.ఐ.డి కార్యాలయాల అధిపతులు; సి.వి.ఓ.లు;  సి.బి.ఐ. అధికారులు, వివిధ కేంద్ర సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు.  ప్రారంభ సమావేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, డి.జి.పి. లు కూడా పాల్గొన్నారు.

Click here to read PM's speech 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"