గాంధీ ఆశ్రమం స్మారకం తాలూకు మాస్టర్ ప్లాను ను ఆయన ఆవిష్కరించారు
‘‘బాపు బోధించినటువంటిసత్యం, అహింస, దేశ సేవ మరియు నిరాదరణ కు లోనైన వర్గాల వారికి చేసేసేవ లో దైవ సేవ ను చూడాలి అనే విలువల ను సాబర్‌మతీ ఆశ్రమం సజీవం గా ఉంచింది’’
‘‘భారతదేశం అమృతకాలం లో ప్రవేశించడాని కి వీలు గా ఒక ప్రవేశ ద్వారాన్ని అమృత్ మహోత్సవ్ ఏర్పరచింది’’
‘‘ఒక దేశం తన వారసత్వాన్ని పరిరక్షించుకోలేకపోతే, ఆ దేశం భవిష్యత్తు ను సైతం కోల్పోతుంది. బాపు యొక్క సాబర్‌మతీ ఆశ్రమం ఒక్క దేశం యొక్క వారసత్వమే కాదు, అది యావత్తు మానవ జాతి యొక్క వారసత్వం గా ఉంది’’
‘‘వారసత్వాన్ని పరిరక్షించుకొనేమార్గాన్ని గుజరాత్ యావత్ దేశాని కి చూపించింది’’
‘‘ప్రస్తుతం,భారతదేశం అభివృద్ధి చెందాలన్న దృఢ సంకల్పం తో ముందుకు సాగిపోతూ ఉంటే, గాంధీ మహాత్ముని యొక్క ఈ పవిత్ర క్షేత్రం మనకు అందరికిఒక గొప్ప ప్రేరణ సాధనం గా ఉన్నది’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సాబర్‌మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయన కొచ్‌రబ్ ఆశ్రమాన్ని ప్రారంభించడం తో పాటు గాంధీ ఆశ్రమం స్మారకం తాలూకు మాస్టర్ ప్లాను ను ఆవిష్కరించారు. గాంధీ మహాత్ముని విగ్రహాని కి ప్రధాన మంత్రి పుష్పాంజలి ని సమర్పించారు. హృదయ్ కుంజ్ ను కూడా ప్రధాన మంత్రి సందర్శించారు. అక్కడ ఏర్పాటైన ఒక ప్రదర్శన ను పరిశీలించి, ఒక మొక్క ను నాటారు.

 

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, సాబర్‌మతీ ఆశ్రమం సదా ఒక సాటిలేనటువంటి శక్తి తాలూకు చైతన్య భరితం అయిన కేంద్రం గా ఉంటూ వస్తోంది; మరి, మనం ఇక్కడ కు వచ్చినప్పుడు మన అంతరంగం లో బాపు యొక్క ప్రేరణ ను పొందుతూ ఉంటాం అని పేర్కొన్నారు. ‘‘బాపు బోధించినటువంటి సత్యం, అహింస, దేశ సేవ, నిరాదరణ కు లోనైన వర్గాల వారికి చేసే సేవలోనే దైవాని కి చేసే సేవ ను అనుభూతి చెందుతూ ఉండడం అనేటటువంటి విలువల ను సజీవం గా ఉంచింది’’ అని ఆయన అన్నారు. గాంధీ గారు సాబర్‌మతీ కి తరలి వెళ్ళే కంటే ముందుగా కొచ్‌రబ్ ఆశ్రమం లో ఉన్నారన్న సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. సరిక్రొత్త గా రూపుదిద్దుకొన్న కొచ్‌రబ్ ఆశ్రమాన్ని ప్రధాన మంత్రి ఈ రోజు న దేశ ప్రజల కు అంకితం చేశారు. పూజ్యులైన గాంధీ మహాత్ముని కి ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ని ఘటించారు; ఈ రోజు న చేపట్టుకొన్నటువంటి ముఖ్యమైన మరియు ప్రేరణాత్మకమైన ప్రాజెక్టుల కు గాను దేశ పౌరుల కు అభినందనల ను ప్రధాన మంత్రి తెలియ జేశారు.

 

మార్చి నెల 12 వ తేదీ నాడే పూజ్య బాపు దాండి యాత్ర ను మొదలు పెట్టారు అని ప్రధాన మంత్రి గుర్తు చేస్తూ, భారతదేశం యొక్క స్వాతంత్య్ర పోరాటం లో ఈ దినాన్ని సువర్ణాక్షరాల తో లిఖించడం జరిగిందని వివరించారు. స్వాతంత్య్ర భారతదేశం లో ఒక క్రొత్త శకం ఆరంభాని కి సాక్షి గా ఈ చరిత్రాత్మకమైనటువంటి రోజు ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. దేశ ప్రజలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను సాబర్‌మతీ ఆశ్రమం నుండి మొదలు పెట్టుకొన్నది కూడా మార్చి నెల 12 వ తేదీననే అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు. ఈ గడ్డ చేసిన త్యాగాల ను స్మరించుకోవడం లో ఒక ముఖ్య పాత్ర ఈ కార్యక్రమానిది అని ఆయన అన్నారు. ‘‘భారతదేశం అమృత కాలం లోకి ప్రవేశించడాని కి ఒక ప్రవేశ ద్వారాన్ని అమృత్ మహోత్సవ్ సృష్టించింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఇది భారతదేశ స్వాతంత్య్ర కాలం లో వ్యక్తం అయిన తరహా సమైక్య వాతావరణాన్ని పౌరుల లో ఏర్పరచింది అని ఆయన అన్నారు. గాంధీ మహాత్ముని ఆదర్శాలు మరియు విశ్వాసాల ప్రభావాన్ని, అమృత్ మహోత్సవ్ కు ఉన్న పరిధి ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు. ‘‘ఆజాదీ కా అమృత్ కాల్ కార్యక్రమం లో భాగం గా ‘పంచ్ ప్రణ్’ యొక్క ప్రతిజ్ఞ ను మూడు కోట్ల మంది కి పైగా ప్రజలు స్వీకరించారు’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. రెండు లక్షల కు పైగా అమృత వాటికల ను అభివృద్ధి పరచి, వాటి లో రెండు కోట్ల కు పైగా మొక్కల ను నాటిన సంగతి ని గురించి, జల సంరక్షణ ధ్యేయం తో డెబ్భయ్ వేల కు పైగా అమ‌ృ‌త్ సరోవరాల ను నిర్మించడాన్ని గురించి, దేశ భక్తి తాలూకు వ్యక్తీకరణ వలె మారిపోయిన హర్ ఘర్ తిరంగా ప్రచార కార్యక్రమాన్ని గురించి, స్వాతంత్య్ర సమర యోధుల కు పౌరులు శ్రద్ధాంజలి ని సమర్పించిన ‘మేరీ మాటీ మేరా దేశ్’ ప్రచార ఉద్యమాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి ఈ సందర్భం లో తెలియ జేశారు. అమృత్ కాలం లో రెండు లక్షల కు పైగా ప్రాజెక్టుల కు శంకుస్థాపన జరిగిన విషయాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. సాబర్‌మతీ ఆశ్రమాన్ని వికసిత్ భారత్ యొక్క సంకల్పాల తాలూకు తీర్థం గా కూడా మారింది అంటూ ఆయన అభివర్ణించారు.

 

‘‘ఏ దేశం అయినా దాని వారసత్వాన్ని పరిరక్షించుకోలేక పోయిందా అంటే ఆ దేశం దాని భవిష్యత్తు ను కూడా పోగొట్టుకొంటుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. బాపు యొక్క సాబర్‌మతీ ఆశ్రమం దేశం యొక్క వారసత్వం మాత్రమే కాదు ఆ ఆశ్రమం మానవ జాతి యొక్క వారసత్వానికి ప్రతీక అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ అమూల్యమైనటువంటి వారసత్వం చాలా కాలం గా నిర్లక్ష్యాని కి లోను అయిన సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు కు తెస్తూ, ఆశ్రమం యొక్క విస్తీర్ణం 120 ఎకరాలు ఉండేది కాస్తా అయిదు ఎకరాల కు తగ్గిపోయిందని, 36 భవనాలు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నాయని, వాటి లో మూడు భవనాల ను సందర్శకుల కోసం తెరచి ఉంచడమైందని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. స్వాతంత్య్ర పోరాటం లో ఈ ఆశ్రమాని కి దక్కిన ప్రాముఖ్యాన్ని దృష్టి లో పెట్టుకొని ఈ ఆశ్రమాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత భారతదేశం లోని 140 కోట్ల మంది పౌరుల కు ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

 

ఆశ్రమాని కి చెందిన 55 ఎకరాల భూమి ని తిరిగి సంపాదించుకోవడం లో ఆశ్రమ నివాసులు సహకారాన్ని అందించడాన్ని ప్రధాన మంత్రి గుర్తించారు. ఆశ్రమ భవనాల ను అన్నింటిని వాటి సిసలు ఆకారం లో సంరక్షించాలనే ఉద్దేశ్యాన్ని ఆయన వెల్లడించారు.

 

ఈ తరహా కట్టడాల ను చాలా కాలం గా చిన్నచూపు చూస్తూ వచ్చినందునకు గల ప్రధాన కారణం ఇచ్ఛాశక్తి లోపించడం, వలసవాద మనస్తత్వం మరియు తృప్తి పరచేటటువంటి ధోరణులే అంటూ ప్రధాన మంత్రి తప్పుపట్టారు. కాశీ విశ్వనాథ్ ధామ్ ను ఒక ఉదాహరణ గా ఆయన పేర్కొంటూ, అక్కడి ప్రజలు భక్త జనానికై సదుపాయాల ను ఏర్పాటు చేయడాని కి సహకరించి 12 ఎకరాల భూమి ని ఇచ్చారని, దీనితో కాశీ విశ్వనాథ్ ధామ్ పునరభివృద్ధి పనులు పూర్తి అయిన తరువాత 12 కోట్ల మంది తీర్థయాత్రికులు అక్కడకు వచ్చి వెళుతున్నారని ఆయన అన్నారు. ఇదే విధం గా అయోధ్య లో శ్రీ రామ జన్మభూమి యొక్క విస్తరణ కార్యకలాపాల కోసం 200 ఎకరాల భూమి ని విముక్త చేయడం జరిగింది, అక్కడ కూడాను గడచిన 50 రోజుల లో ఒక కోటి మంది కి పైగా భక్తులు దైవదర్శనం కోసం వచ్చి వెళ్ళారు అని ఆయన అన్నారు.

 

యావత్తు దేశాని కి వారసత్వ పరిరక్షణ పద్ధతి ని గుజరాత్ చాటి చెప్పింది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. సర్ దార్ శ్రీ పటేల్ యొక్క నాయకత్వం లో సోమనాథ్ పునరుద్ధరణ కార్యం ఒక చరిత్రాత్మకమైన ఘట్టం అని ప్రధాన మంత్రి అన్నారు. వారసత్వ పరిరక్షణ తాలూకు ఇతర ఉదాహరణల ను గురించి ఆయన చెబుతూ, అహమదాబాద్ నగరాన్ని ప్రపంచ వారసత్వ నగరం గా చేయడం తో పాటు, చాంపానెర్, ధోలావీరా, లోథల్, గిర్‌ నార్, పావాగఢ్, మొఢేరా మరియు అంబాజీ ల ప్రస్తావన ను తీసుకు వచ్చారు.

 

భారతదేశ స్వాతంత్య్ర పోరాటాని కి సంబంధించిన వారసత్వాన్ని పునరుద్ధరించడం కోసం అవలంబిస్తున్న టువంటి అభివృద్ధి ప్రచార కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, రాజ్ పథ్ ను కర్తవ్య పథ్ గా తిరిగి అభివృద్ధి చేసిన విషయాన్ని , నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని, అండమాన్ మరియు నికోబార్ దీవుల లో ప్రాంతాల కు స్వాతంత్య్ర సంబంధి పేరుల ను పెడుతూ తీర్చిదిద్దడాన్ని, శ్రీ బి.ఆర్. ఆంబేడ్‌ కర్ తో అనుబంధం ఉన్న స్థలాల ను ‘పంచ్ తీర్థ్’ గా అభివృద్ధి పరచడాన్ని, ఏక్‌తా నగర్ లో స్టేచ్యూ ఆఫ్ యూనిటీ ని ఆవిష్కరించడాన్ని, మరి అలాగే దాండి రూపు రేఖల ను సరిక్రొత్త గా తీర్చిదిద్దడం గురించి ప్రధాన మంత్రి వివరించారు. ఈ దిశ లో సాబర్‌మతీ ఆశ్రమాన్ని పునరుద్ధరించడం ఒక పెద్ద అడుగు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

 

“భవిష్యత్ తరాలు, సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించే వారు చరఖా శక్తి, విప్లవానికి నాంది పలికే దాని సామర్థ్యం నుంచి స్ఫూర్తి పొందుతారు” అన్నారు.;శతాబ్దాల బానిసత్వం కారణంగా నిరాశతో బాధపడుతున్న ఒక జాతి లో బాపూ ఆశ, విశ్వాసాన్ని నింపారు , అని ఆయన అన్నారు. బాపూజీ దార్శనికత భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు స్పష్టమైన దిశను చూపిస్తుందని పేర్కొన్న ప్రధాన మంత్రి, గ్రామీణ పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, మహాత్మా గాంధీ అందించిన ఆత్మనిర్భర్, స్వదేశీ ఆదర్శాలను అనుసరిస్తూ ఆత్మనిర్భర్ భారత్ ప్రచారాన్ని నిర్వహిస్తోందని అన్నారు. గుజరాత్ లో 9 లక్షల వ్యవసాయ కుటుంబాలు ప్రకృతి సేద్యాన్ని అవలంబించాయని, దీనివల్ల 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం తగ్గిందని తెలిపారు. ఆధునిక రూపంలో పూర్వీకులు వదిలివెళ్లిన ఆదర్శాలతో జీవించాలని, గ్రామీణ పేదల జీవనోపాధికి ప్రాధాన్యమివ్వడానికి ఖాదీ వినియోగాన్ని పెంచాలని, ఆత్మనిర్భర్ ప్రచారాన్ని ప్రోత్సహించాలని ప్రధాని చెప్పారు. గ్రామాల సాధికారత గురించి ప్రస్తావిస్తూ, బాపూజీ దార్శనికత అయిన గ్రామ స్వరాజ్యం సజీవంగా వస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. స్వయం సహాయక బృందాలు, కోటి మందికి పైగా దీదీలు, డ్రోన్ పైలట్లుగా మారడానికి సిద్ధంగా ఉన్న మహిళలు ఇలా మహిళల పాత్ర పెరుగుతోందని, ఈ మార్పు బలమైన భారతదేశానికి ఒక ఉదాహరణ అని, సర్వతోముఖ భారతానికి ఈ మార్పు ఒక ఉదాహరణ అని అన్నారు.
 

ప్రభుత్వ చర్యల వల్ల గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ ఇటీవల సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు. ఈ రోజు, భారతదేశం అభివృద్ధి సంకల్పంతో ముందుకు సాగుతున్నప్పుడు, ఈ మహాత్మా గాంధీ మందిరం మనందరికీ గొప్ప ప్రేరణ. అందువల్ల సబర్మతి ఆశ్రమం, కొచ్రబ్ ఆశ్రమం అభివృద్ధి కేవలం చారిత్రక ప్రదేశాల అభివృద్ధి మాత్రమే కాదు. వికసిత్ భారత్ సంకల్పం, స్ఫూర్తిపై మనకున్న నమ్మకాన్ని కూడా ఇది బలపరుస్తుంది ; అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. బాపూజీ ఆశయాలు, ఆయనతో ముడిపడి ఉన్న స్ఫూర్తిదాయక ప్రదేశాలు దేశ నిర్మాణ ప్రయాణంలో మనకు మార్గనిర్దేశనం చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
 

అహ్మదాబాద్ ఒక వారసత్వ నగరం కాబట్టి గైడ్ ల కోసం పోటీని సృష్టించాలని గుజరాత్ ప్రభుత్వానికి, అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కు ప్రధాన మంత్రి సూచించారు. ప్రతిరోజూ కనీసం 1000 మంది పిల్లలను సబర్మతి ఆశ్రమానికి తీసుకెళ్లి సమయం గడపాలని పాఠశాలలను కోరారు. ;ఇది అదనపు బడ్జెట్ అవసరం లేకుండా క్షణాలను పొందడానికి మనకు అనుమతిస్తుంది; అన్నారు. ప్రసంగాన్ని ముగిస్తూ ప్రధాన మంత్రి, కొత్త దృక్పథాన్ని
అందించడం దేశ అభివృద్ధి ప్రయాణానికి బలాన్ని ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవ్ రత్ , గుజ రాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నేపథ్యం పునర్నిర్మించిన కొచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించారు. 1915 లో దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చిన తరువాత మహాత్మా గాంధీ స్థాపించిన మొదటి ఆశ్రమం ఇది. దీనిని ఇప్పటికీ గుజరాత్ విద్యాపీఠం స్మారక చిహ్నంగా, పర్యాటక

 

ప్రదేశంగా సంరక్షి స్తోంది. గాంధీ ఆశ్రమ మెమోరియల్ మాస్టర్ ప్లాన్ ను కూడా ప్రధాని ప్రారంభించారు. మహాత్మాగాంధీ చూపిన ఆదర్శాలను నిలబెట్టడం, గౌరవించడం, ఆయన ఆశయాలను ప్రదర్శించే మార్గాలను అభివృద్ధి చేయడం, ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం ప్రధాని నిరంతర కృషి చేస్తున్నారు. ఈ కృషిలో మరో ప్రయత్నంగా, గాంధీ ఆశ్రమ స్మారక ప్రాజెక్టు ప్రస్తుత, భవిష్యత్ తరాలకు మహాత్మా గాంధీ బోధనలు తత్వాన్ని
పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఈ మాస్టర్ ప్లాన్ కింద ప్రస్తుతం ఉన్న ఐదెకరాల ఆశ్రమ విస్తీర్ణాన్ని 55 ఎకరాలకు విస్తరించనున్నారు. ప్రస్తుతం ఉన్న 36 భవనాలను పునరుద్ధరిస్తారు. వీటిలో గాంధీ నివాసంగా పనిచేసిన ;హృదయ్ కుంజ్; సహా 20 భవనాలనుb సంరక్షిస్తారు. 13 భవనాలన పునరుద్ధరణ, మూడు భవనాల పునర్నిర్మాణం చేపడతారు. ఈ మాస్టర్ ప్లాన్ లో పరిపాలనా సౌకర్యాల కోసం కొత్త భవనాలు, ఓరియెంటేషన్
 

సెంటర్ వంటి సందర్శకుల సౌకర్యాలు, చరఖా స్పిన్నింగ్ పై ఇంటరాక్టివ్ వర్క్షాప్లు, హ్యాండ్ మేడ్ పేపర్, కాటన్ వీవింగ్ , లెదర్ వర్క్ , పబ్లిక్ యుటిలిటీస్ ఉన్నాయి. ఈ భవనాల్లో గాంధీజీ జీవితంలోని అంశాలతో పాటు ఆశ్రమం వారసత్వాన్ని తెలిపే ఇంటరాక్టివ్ ఎగ్జిబిషన్లు, యాక్టివిటీస్ ఉంటాయి. గాంధీజీ ఆలోచనలను పరిరక్షించడానికి, సంరక్షించడానికి , వ్యాప్తి చేయడానికి ఒక లైబ్రరీ, ఆర్కైవ్స్ భవనాన్ని నిర్మించడం కూడా మాస్టర్ ప్లాన్ లో భాగం. ఆశ్రమ లైబ్రరీ, ఆర్కైవ్స్ ను సందర్శించే పండితులు ఉపయోగించుకునే సౌకర్యాలను కూడా ఇది కల్పిస్తుంది. విభిన్న ఆకాంక్షలతో, బహుళ భాషలలో సందర్శకులకు మార్గనిర్దేశం చేయగల ఒక వ్యాఖ్యాన కేంద్రాన్ని సృష్టించడానికి కూడా ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుంది, వారి అనుభవాన్ని సాంస్కృతికంగా, మేధోపరంగా మరింత ఉత్తేజపరిచేలా సుసంపన్నం చేస్తుంది. ఈ స్మారక చిహ్నం భావితరాలకు ప్రేరణగా, గాంధేయ భావాలను పెంపొందించడానికి, ట్రస్టీషిప్ సూత్రాల ద్వారా తెలియజేసే ప్రక్రియ ద్వారా గాంధేయ విలువల సారాన్ని ఉత్తేజపరుస్తుంది.

 

సెంటర్ వంటి సందర్శకుల సౌకర్యాలు, చరఖా స్పిన్నింగ్ పై ఇంటరాక్టివ్ వర్క్షాప్లు, హ్యాండ్ మేడ్ పేపర్, కాటన్ వీవింగ్ , లెదర్ వర్క్ , పబ్లిక్ యుటిలిటీస్ ఉన్నాయి. ఈ భవనాల్లో గాంధీజీ జీవితంలోని అంశాలతో పాటు ఆశ్రమం వారసత్వాన్ని తెలిపే ఇంటరాక్టివ్ ఎగ్జిబిషన్లు, యాక్టివిటీస్ ఉంటాయి. గాంధీజీ ఆలోచనలను పరిరక్షించడానికి, సంరక్షించడానికి , వ్యాప్తి చేయడానికి ఒక లైబ్రరీ, ఆర్కైవ్స్ భవనాన్ని నిర్మించడం కూడా మాస్టర్ ప్లాన్ లో భాగం. ఆశ్రమ లైబ్రరీ, ఆర్కైవ్స్ ను సందర్శించే పండితులు ఉపయోగించుకునే సౌకర్యాలను కూడా ఇది కల్పిస్తుంది. విభిన్న ఆకాంక్షలతో, బహుళ భాషలలో సందర్శకులకు మార్గనిర్దేశం చేయగల ఒక వ్యాఖ్యాన కేంద్రాన్ని సృష్టించడానికి కూడా ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుంది, వారి అనుభవాన్ని సాంస్కృతికంగా, మేధోపరంగా మరింత ఉత్తేజపరిచేలా సుసంపన్నం చేస్తుంది. ఈ స్మారక చిహ్నం భావితరాలకు ప్రేరణగా, గాంధేయ భావాలను పెంపొందించడానికి, ట్రస్టీషిప్ సూత్రాల ద్వారా తెలియజేసే ప్రక్రియ ద్వారా గాంధేయ విలువల సారాన్ని ఉత్తేజపరుస్తుంది.

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage