కోవిడ్ ఉన్న‌ప్ప‌టికీ, కాశీ లో అభివృద్ధి వేగం ప‌దిలం గా ఉంది: ప్ర‌ధాన మంత్రి
ఈ కన్‌వెన్శన్ సెంటర్ భార‌త‌దేశాని కి, జ‌పాన్ కు మ‌ధ్య ఉన్న బ‌ల‌మైన బంధాన్ని చాటుతోంది: ప్ర‌ధాన మంత్రి
ఈ కన్‌వెన్శన్ సెంటర్ ఒక సాంస్కృతిక కేంద్రం గాను, భిన్న ప్ర‌జ‌ల ను ఏకం చేసే మాధ్య‌మం గాను ఉంటుంది: ప్ర‌ధాన మంత్రి
గ‌త ఏడు సంవ‌త్స‌రాల లో కాశీ కి అనేక అభివృద్ధి ప‌థ‌కాలు అలంకారాలు అయ్యాయి; రుద్రాక్ష్ లేనిదే ఆ అలంకారాలు సంపూర్ణం కావు: ప్ర‌ధాన మంత్రి

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జ‌పాన్ అందించిన ఆర్థిక స‌హాయం తో వారాణసీ లో నిర్మాణం జరిగిన ఇంటర్ నేశనల్ కోఆపరేశన్ ఎండ్ కన్‌వెన్శన్ సెంటర్ - ‘రుద్రాక్ష్’ ను ప్రారంభించారు.  అటు తరువాత, ఆయన బిహెచ్‌ యు లోని మాతా శిశు ఆరోగ్య విభాగాన్ని ప‌రిశీలించారు.  కోవిడ్ స‌న్న‌ద్ధ‌త ను స‌మీక్షించ‌డం కోసం అధికారుల తోను, వైద్య వృత్తి నిపుణుల తోను ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు.

జ‌న స‌మూహాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, కోవిడ్ ఉన్న‌ప్ప‌టికీ కాశీ లో అభివృద్ధి వేగం పదిలంగా ఉందన్నారు.  ఇంటర్ నేశనల్ కోఆపరేశన్ ఎండ్ కన్‌వెన్శన్ సెంటర్ - ‘రుద్రాక్ష్’ ఈ సృజ‌నాత్మ‌క‌త‌, ఈ చైత‌న్యం ల ఫ‌లిత‌మే అని ఆయ‌న అన్నారు.  భార‌త‌దేశాని కి, జ‌పాన్ కు మ‌ధ్య ఉన్న‌టువంటి బ‌ల‌మైన బంధాన్ని ఈ సెంట‌ర్ చాటుతోంద‌ని ఆయ‌న అన్నారు.  ఈ స‌మావేశ కేంద్రాన్ని నిర్మించ‌డం లో సాయ‌ప‌డినందుకు జ‌పాన్ ను ఆయ‌న కొనియాడారు.

జ‌పాన్ ప్ర‌ధాని శ్రీ సుగా యోశీహిదే ఆ కాలం లో చీఫ్ కేబినెట్ సెక్ర‌ట్రి గా ఉన్నార‌ని శ్రీ న‌రేంద్ర మోదీ గుర్తు కు తెచ్చారు.  అప్ప‌టి నుంచి ఆయ‌న జ‌పాన్ ప్ర‌ధాని అయ్యేటంత వ‌ర‌కు ఈ ప్రాజెక్టు లో ఆయన స్వీయ ప్రమేయం ఉందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.  భార‌త‌దేశం ప‌ట్ల శ్రీ సుగా యోశీహిదే కు గ‌ల ప్రీతి కి గాను భార‌త‌దేశం లోని ప్ర‌తి ఒక్క‌రు ఆయ‌న కు కృత‌ జ్ఞులై ఉంటారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఈ రోజు న జ‌రిగిన కార్య‌క్ర‌మం తో స‌న్నిహితం గా మెలగిన జ‌పాన్ పూర్వ ప్ర‌ధాని శ్రీ శింజో ఆబే ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జ్ఞప్తి కి తెచ్చుకొన్నారు.  శ్రీ శింజో ఆబే జ‌పాన్ ప్ర‌ధాని గా ఉన్న కాలం లో కాశీ కి విచ్చేసిన‌ప్పుడు, ఆయన తో రుద్రాక్ష్ తాలూకు ఆలోచ‌న పై తాను చర్చించిన సందర్బాన్ని శ్రీ న‌రేంద్ర మోదీ గుర్తు కు తెచ్చుకొన్నారు.  ఈ భ‌వ‌నాని కి ఆధునిక‌త‌ వెలుగు తో పాటు సాంస్కృతిక ప్ర‌కాశం కూడా ఉందని, భార‌త‌దేశం-జ‌పాన్ సంబంధాల  తో ఈ భవనం ముడిప‌డి ఉంద‌ని, అంతేకాక భావి స‌హ‌కారం తాలూకు అవ‌కాశం కూడా ఈ భవనాని కి ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  జ‌పాన్ ను తాను సందర్శించిన‌ప్ప‌టి నుండి ఈ విధ‌మైన ప్ర‌జా సంబంధాల ను గురించి ఆలోచ‌న చేయ‌డ‌మైంద‌ని, రుద్రాక్ష్ తో పాటు, అహ‌మ‌దాబాద్ లో జెన్ గార్డెన్ వంటి ప‌థ‌కాలు ఈ సంబంధానికి ప్ర‌తీక‌ గా నిలుస్తున్నాయని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.

ప్ర‌స్తుతం వ్యూహాత్మ‌క రంగం లో, ఆర్థిక రంగం లో భార‌త‌దేశాని కి అత్యంత విశ్వ‌స‌నీయ‌మైన మిత్ర దేశాల లో ఒక మిత్ర దేశం గా ఉన్నందుకు జ‌పాన్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కొనియాడారు.  జ‌పాన్ తో భార‌త‌దేశాని కి ఉన్న మైత్రి యావ‌త్తు ప్రాంతం లో అత్యంత స్వాభావిక‌మైన భాగ‌స్వామ్యాల లో ఒక‌టి గా లెక్క‌ కు వ‌స్తోంద‌ని ఆయ‌న అన్నారు.  మ‌న అభివృద్ధి మ‌న న‌డ‌వ‌డిక తో ముడిప‌డి ఉండాల‌ని భార‌త‌దేశం- జ‌పాన్ లు భావిస్తున్నాయి.  ఈ అభివృద్ధి స‌ర్వ‌తోముఖం గాను, స‌ర్వుల కోస‌మూను, స‌ర్వ వ్యాప్తం గాను ఉండాలి అని ఆయ‌న అన్నారు. 

పాట‌లు, సంగీతం, క‌ళ బ‌నార‌స్ నాడుల లో నుంచి ప్ర‌వ‌హిస్తున్నాయి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఇక్క‌డ మాత గంగా తీరం లోని ఘ‌ట్టాల పైన ఎన్నో క‌ళ‌ లు ప్రాణం పోసుకొన్నాయి, జ్ఞానం శిఖ‌ర స్థాయి ని చేరుకొంది, మాన‌వాళి కి సంబంధించిన‌ అనేక గంభీర‌మైన భావాలు జ‌నించాయి అని ఆయన చెప్పారు.  ఆ ర‌కం గా బ‌నార‌స్ సంగీతాని కి, ధ‌ర్మాని కి, ఆత్మ కు, జ్ఞానాని కి, విజ్ఞానాని కి సంబంధించిన ఒక పెద్ద ప్ర‌పంచ కేంద్రం గా మార‌గ‌ల‌దు అని ఆయన చెప్పారు.  ఈ సెంట‌ర్ ఒక సాంస్కృతిక కేంద్ర బిందువు గా, విభిన్న  ర‌కాల ప్ర‌జ‌ల ను ఏకం చేసే మాధ్య‌మం గా రూపుదిద్దుకొంటుందన్నారు.  ఈ సెంట‌ర్ ను కాపాడుకోండి అంటూ కాశీ ప్ర‌జ‌ల కు ఆయన విజ్ఞప్తి చేశారు.  

గ‌త ఏడేళ్ళ లో ఎన్నో అభివృద్ధి ప‌థ‌కాలు కాశీ కి ఆభ‌ర‌ణాలు గా మారాయ‌ని, ఈ అలంక‌ర‌ణ అనేది రుద్రాక్ష లేకుండా ఏ విధం గా ముగియగ‌ల‌దు ? అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఇప్పుడు ఇక సిస‌లైన శివుడు ధ‌రించినటువంటి కాశీ, ఈ రుద్రాక్ష తో జతపడి, మ‌రింత గా తళుకులీనుతుందని, మరి కాశీ శోభ ఇంకా కాస్త ఇనుమ‌డిస్తుంద‌ని ఆయన చెప్పారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 జనవరి 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones