India's Energy Plan aims to ensure energy justice: PM
We plan to achieve ‘One Nation One Gas Grid’ & shift towards gas-based economy: PM
A self-reliant India will be a force multiplier for the global economy and energy security is at the core of these efforts: PM

4వ ఇండియా ఎనర్జీ ఫోరం సెరా వీక్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా  ప్రసంగించారు.  "మార్పు చెందుతున్న ప్రపంచంలో భారతదేశ ఇంధన భవిష్యత్తు" అనేది ఈ సారి ఇతివృత్తంగా నిర్ణయించారు.    

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారతదేశం ఇంధన శక్తి తో నిండి ఉందనీ, భారతదేశ ఇంధన భవిష్యత్తు ఉజ్వలంగా, భద్రంగా ఉందని అన్నారు.  ఇంధన డిమాండ్ దాదాపు మూడింట ఒక వంతు తగ్గడం, ప్రస్తుతమున్న ధరల అస్థిరత, పెట్టుబడి నిర్ణయాలను ప్రభావితం చేయడం, రాబోయే కొన్నేళ్లలో ప్రపంచ ఇంధన డిమాండ్‌లో సంకోచించటం వంటి వివిధ సవాళ్లు ఉన్నప్పటికీ, భారతదేశం ఇంధన వినియోగదారునిగా ఎదగాలని అంచనా వేయబడిందనీ, అదేవిధంగా దీర్ఘకాలిక ఇంధన వినియోగాన్ని రెట్టింపు చేయాలని అంచనా వేయబడిందనీ ఆయన వివరించారు.   

దేశీయ విమానయాన పరంగా భారతదేశం మూడవ అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్టుగా ఉందని ప్రధానమంత్రి పేర్కొంటూ, 2024 నాటికి భారతీయ విమానయాన సంస్థలు తమ విమానాల సంఖ్యను 600 నుండి 1200 కు పెంచుతాయని అంచనా వేశారు.

ఇంధనం యొక్క అందుబాటు అనేది సరసమైన మరియు నమ్మదగినదిగా ఉండాలని భారతదేశం విశ్వసిస్తోందని, ఆయన అన్నారు.  సామాజిక-ఆర్థిక పరివర్తనాలు జరిగే సమయంలోనే అదిసాధ్యమౌతుంది.  ఇంధన రంగం ప్రజలను శక్తివంతం చేస్తుందనీ, "సులభంగా జీవించడం" ను మరింత పెంచుతుందని ఆయన అన్నారు. దీన్ని సాధించడానికి ప్రభుత్వ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు.  ఈ కార్యక్రమాలు ముఖ్యంగా గ్రామీణ ప్రజలు, మధ్యతరగతి మరియు మహిళలకు సహాయపడ్డాయని ఆయన అన్నారు.

స్థిరమైన వృద్ధి కోసం భారతదేశం యొక్క ప్రపంచ కట్టుబాట్లను అనుసరించి ఇంధన న్యాయాన్ని పూర్తిగా నిర్ధారించడం భారతదేశ ఇంధన ప్రణాళిక లక్ష్యమని ప్రధానమంత్రి తెలియజేశారు.   చిన్న కార్బన్ ఫుట్ ప్రింట్‌తో భారతీయుల జీవితాలను మెరుగుపర్చడానికి ఎక్కువ విద్యుత్తు అవసరమని దీని అర్థం.  భారతదేశ ఇంధన రంగాన్ని వృద్ధి కేంద్రీకృత, పరిశ్రమ స్నేహపూర్వక మరియు పర్యావరణ స్పృహతో ఉండాలని ఆయన ఊహించారు.  అందువల్ల పునరుత్పాదక ఇంధన వనరులను పెంచడంలో, భారతదేశం, అత్యంత చురుకైన దేశాలలో ఒకటిగా ఉన్నదని ఆయన అన్నారు.  

స్వచ్ఛమైన ఇంధన పెట్టుబడుల కోసం భారతదేశాన్ని అత్యంత ఆకర్షణీయమైన, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ట్టుగా మార్చడానికి తీసుకున్న – 36 కోట్లకు పైగా ఎల్.‌ఈ.డీ.  బల్బులను పంపిణీ చేయడం; ఎల్.ఈ.డి. బల్బుల ధరను 10 రెట్లు తగ్గించడం; గత 6 సంవత్సరాలలో 1.1 కోట్ల స్మార్ట్ ఎల్.ఈ.డి. వీధి-దీపాలను అమర్చడం;  వంటి చర్యలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు.  ఈ చర్యల వల్ల సంవత్సరానికి 60 బిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అవుతుందని అంచనా వేసినట్లు ఆయన తెలియజేశారు.  గ్రీన్-హౌస్ గ్యాస్ ఉద్గారాలను సంవత్సరానికి 4.5 కోట్ల టన్నులకు పైగా కార్బండయాక్సైడ్ తగ్గిస్తుందని అంచనా వేసినట్లు, అదేవిధంగా,  ద్రవ్య పరంగా ఏటా సుమారు 24,000 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని కూడా అంచనావేసినట్లు ఆయన చెప్పారు. 

అంతర్జాతీయ లక్ష్యానికి చేరుకోడానికి వీలుగా భారతదేశం సరైన మార్గంలోనే ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  2022 నాటికి వ్యవస్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 175 గిగా వాట్లకు పెంచాలనే లక్ష్యాన్ని మరింత పెంచి, 2030 నాటికి 450 గిగా వాట్లకు విస్తరించామని ఆయన చెప్పారు.  మిగతా పారిశ్రామిక ప్రపంచంలో కంటే భారతదేశం అతి తక్కువ కర్బన ఉద్గారాలను కలిగి ఉన్నప్పటికీ, వాతావరణ మార్పులపై పోరాడటానికి భారతదేశం తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

గత ఆరేళ్లలో ఇంధన రంగంలో సంస్కరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని ప్రధానమంత్రి చెప్పారు.  అన్వేషణ మరియు లైసెన్సింగ్ విధానంలో సంస్కరణలు; కేవలం 'రాబడి' నుండి 'ఉత్పత్తి'ని పెంపొందించడం పై దృష్టిని కేంద్రీకరించడం;  ఎక్కువ పారదర్శకత మరియు క్రమబద్దీకరించిన విధానాలపై దృష్టి పెట్టడం; 2025 నాటికి సంవత్సరానికి 250 నుండి 400 మిలియన్ మెట్రిక్ టన్నుల శుద్ధి సామర్థ్యాన్ని పెంచడానికి ప్రణాళిక మొదలైన ఇటీవల చేపట్టిన అనేక సంస్కరణలను ఆయన వివరించారు. దేశీయ గ్యాస్ ఉత్పత్తిని పెంచడం ప్రభుత్వానికి ముఖ్యమనీ, 'ఒక దేశం ఒక గ్యాస్ గ్రిడ్' ద్వారా, దేశాన్ని గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు మార్చవచ్చుననీ, ఆయన అన్నారు.  

ముడి చమురు ధరలను మరింత బాధ్యతాయుతంగా నిర్ణయించాలని ప్రధానమంత్రి సంబంధిత సమాజాన్ని కోరారు. చమురు మరియు గ్యాస్ రెండింటికీ పారదర్శకమైన, సౌకర్యవంతమైన మార్కెట్లను సృష్టించే దిశగా సమాజం కృషి చేయాలని కూడా ఆయన కోరారు.  సహజ వాయువు యొక్క దేశీయ ఉత్పత్తిని పెంచడానికీ, గ్యాస్ యొక్క మార్కెట్ ధరల ఆవిష్కరణలో ఏకరూపతను తీసుకురావదానికీ, ప్రభుత్వం, సహజ వాయువు మార్కెటింగ్ వ్యవస్థలో సంస్కరణలను తీసుకువచ్చిందని, ఆయన చెప్పారు.  ఇది ఈ-బిడ్డింగ్ ద్వారా సహజ వాయువు విక్రయాలలో మార్కెటింగ్ స్వేచ్ఛను పెంపొందింస్తుందని ఆయన తెలియజేశారు.  భారతదేశం యొక్క మొట్టమొదటి ఆటోమేటెడ్ జాతీయ స్థాయి గ్యాస్ ట్రేడింగ్ వ్యవస్థను ఈ ఏడాది జూన్‌ లో ప్రారంభించడం జరిగిందనీ, ఇది గ్యాస్ మార్కెట్ ధరలను తెలుసుకోవడానికి ప్రామాణిక విధానాలను సూచిస్తుందనీ, ఆయన వివరించారు. 

"ఆత్మనిర్భర్ భారత్" అంటే 'స్వావలంబన భారతదేశం' దృష్టితో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి  అన్నారు.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్వావలంబన భారతదేశం కూడా ఒక శక్తిని పెంపొందించేదిగా అవుతుందని, ఈ ప్రయత్నాలలో  ఇంధన భద్రత ప్రధానమైనదని, ఆయన పేర్కొన్నారు.  ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా చమురు మరియు గ్యాస్ రంగాల్లో పెట్టుబడులు పెరగడం ద్వారా ఈ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయనీ, ఇతర రంగాలలో కూడా ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయనీ, ఆయన తెలిపారు.  కీలకమైన అంతర్జాతీయ ఇంధన సంస్థలతో ప్రభుత్వం వ్యూహాత్మక మరియు సమగ్ర ఇంధన ఒప్పందాలను కుదుర్చుకుంటోందని ఆయన చెప్పారు.  పొరుగు దేశాలకు మొదటి ప్రాధాన్యం అనే భారతదేశ విధానంలో భాగంగా, పరస్పర ప్రయోజనం కోసం మన పొరుగు దేశాలతో ఇంధన కారిడార్ల అభివృద్ధి కోసం ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని ఆయన వివరించారు. 

సూర్య భగవంతుడి రథాన్ని నడుపుతున్న ఏడు గుర్రాల మాదిరిగా, భారతదేశ ఇంధన రంగంలో ఏడు కీలక అంశాలు ఉంటాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

1.     గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్ళడానికి మన ప్రయత్నాలను వేగవంతం చేయడం.

2.     శిలాజ ఇంధనాలు ముఖ్యంగా పెట్రోలియం మరియు బొగ్గు యొక్క శుభ్రమైన ఉపయోగం 

3.     జీవ ఇంధనాలను నడపడానికి దేశీయ వనరులపై ఎక్కువగా ఆధారపడటం.

4.      2030 నాటికి 450 గిగా వాట్ల పునరుత్పాదక లక్ష్యాన్ని సాధించడం.

5.      చైతన్యాన్ని డీ-కార్బోనైజ్ చేయడానికి విద్యుత్ సహకారాన్ని పెంచడం.

6.     హైడ్రోజన్‌తో సహా అభివృద్ధి చెందుతున్న ఇంధనాలలోకి వెళ్లడం

7.     శక్తి వ్యవస్థలలో డిజిటల్ ఆవిష్కరణ.

గత ఆరు సంవత్సరాలుగా అమల్లో ఉన్న ఈ బలమైన ఇంధన విధానాల కొనసాగింపు ఉంటుందని ఆయన చెప్పారు.  

"ఇండియా ఎనర్జీ ఫోరం – సెరా వీక్" పరిశ్రమ, ప్రభుత్వం మరియు సమాజం మధ్య ఒక ముఖ్యమైన వేదికగా పనిచేస్తోందని, మంచి ఇంధన భవిష్యత్తు కోసం ఫలవంతమైన చర్చలు జరపాలని ఈ సమావేశాన్ని కోరుకుంటున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

Click here to read PM's speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 22 డిసెంబర్ 2024
December 22, 2024

PM Modi in Kuwait: First Indian PM to Visit in Decades

Citizens Appreciation for PM Modi’s Holistic Transformation of India