గుజరాత్ లోని అదాలజ్ లో శ్రీ అన్నపూర్ణధామ్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన వసతి గృహాన్ని, విద్య భవనాల సముదాయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న ప్రారంభించారు. ఇదే కార్యక్రమం లో భాగం గా, జన్ సహాయక్ ట్రస్ట్ యొక్క హీరామణి ఆరోగ్యధామ్ నిర్మాణాని కి భూమిపూజ ను కూడా ప్రధాన మంత్రి నిర్వహించారు. ఈ సందర్భం లో పాల్గొన్న వారి లో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయీ పటేల్ కూడా ఉన్నారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, శ్రీ అన్నపూర్ణధామ్ యొక్క దివ్యమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి మరియు సామాజికమైనటువంటి కార్యాల తో దీర్ఘకాలం పాటు అనుబంధాన్ని కలిగి ఉండడం పట్ల ప్రసన్నత ను వ్యక్తం చేశారు. ఆరోగ్యం, విద్య మరియు పోషకాహారం రంగం లో తోడ్పాటు ను అందించడం గుజరాత్ స్వభావం లోనే ఇమిడి ఉంది అని ఆయన అన్నారు. అన్ని సముదాయాలు వాటి సామర్థ్యం మేరకు వాటి వంతు పాత్ర ను పోషిస్తాయి. మరి పాటీదార్ సముదాయం సమాజం కోసం తన భూమిక ను నెరవేర్చడం లో ఎన్నటికీ వెనుకబడిపోనేలేదు అని ఆయన అన్నారు.
సమృద్ధి కి సంబంధించిన దేవత అయినటువంటి మాత అన్నపూర్ణా దేవి అంటే ప్రతి ఒక్కరి కీ ప్రగాఢమైన ఆరాధన భావం ఉన్నది. మరీ ముఖ్యం గా పాటీదార్ సముదాయాని కి నిత్య జీవనం తాలూకు వాస్తవాల తో ప్రగాఢమైనటువంటి అనుబంధం ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. మాత అన్నపూర్ణా దేవి విగ్రహాన్ని కెనడా నుండి ఇటీవలే కాశీ కి తిరిగి తీసుకు రావడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఆ తరహా లో మన సంస్కృతి కి చెందిన డజన్ ల కొద్దీ ప్రతీకల ను గత కొన్నేళ్ళు గా విదేశాల నుండి వెనుక కు రప్పించడం జరిగింది’’ అని ఆయన అన్నారు.
మన సంస్కృతి లో ఆహారాని కి, ఆరోగ్యాని కి, ఇంకా విద్య కు ఎప్పుడూ గొప్ప ప్రాముఖ్యాన్ని కట్టబెట్టడం జరుగుతున్నది. మరి ఈ రోజు న, శ్రీ అన్నపూర్ణధామ్ ఈ విషయం లో మరో అడుగు ను ముందుకు వేసింది అని ప్రధాన మంత్రి అన్నారు. కొత్త గా ఏర్పాటయ్యే సదుపాయాలు గుజరాత్ లో సామాన్య ప్రజానీకాని కి ఎంతగానో మేలు ను చేస్తాయి. ప్రత్యేకించి ఒకే కాలం లో 14 మంది వ్యక్తుల కు రక్తశుద్ధి చికిత్స ను అందించడం కోసం ఉద్దేశించినటువంటి కేంద్రం, అంతేకాకుండా రోజు లో 24 గంటల పాటు రక్తాన్ని సరఫరా చేసేటటువంటి బ్లడ్ బ్యాంకు.. ఇవి ప్రజల కు ఎంతో ఉపయోగకరం గా ఉంటాయి అని ఆయన అన్నారు. జిల్లా ఆసుపత్రుల లో ఉచితం గా రక్తశుద్ధి చికిత్స సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆరంభించింది అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని గుజరాతీ భాష లో కొనసాగిస్తూ, మంచి పనులను చేస్తున్నందుకు ట్రస్టు ను, ట్రస్టు యొక్క నాయకత్వాన్ని మెచ్చుకొన్నారు. ఉద్యమం తో నిర్మాణాత్మకమైన పనుల ను జోడించడం అనేది ఈ ప్రముఖుల లోని గొప్ప లక్షణం అని ఆయన అన్నారు. ప్రాకృతిక వ్యవసాయాని కి పెద్ద పీట ను వేయడం తో పాటు ముఖ్యమంత్రి యొక్క నాయకత్వం ‘మృదువు గానే అయినా దృఢ నిశ్చయం’ తో కూడుకొని ఉంది అంటూ ప్రధాన మంత్రి ప్రశంసించారు. సాధ్యమైన చోటల్లా ప్రాకృతిక వ్యవసాయాని కి మొగ్గు చూపండంటూ సభికుల కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. గుజరాత్ లో అభివృద్ధి తాలూకు సంపన్నమైన సంప్రదాయం నెలకొంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ అభివృద్ధి తాలూకు సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి మరింత ముందుకు తీసుకు పోతున్నారు అని ఆయన అన్నారు.
ఏకత విగ్రహం రూపం లో, భారతదేశం సర్ దార్ పటేల్ గారి కి ఒక ఘనమైనటువంటి శ్రద్ధాంజలి ని సమర్పించింది. సర్ దార్ పటేల్ గారి పేరు ప్రపంచం నలు చెరగుల కు చేరుకొంది అని ప్రధాన మంత్రి అన్నారు.
మాత అన్నపూర్ణాదేవి కి చెందిన గడ్డ అయినటువంటి గుజరాత్ లో అనుచితాహారాని కి ఎటువంటి తావు ఉండకూడదు అని ప్రధాన మంత్రి అన్నారు. ఆహార లోపం వల్ల శుష్కించడం అనేది తరచు గా అజ్ఞానం వల్ల సంభవిస్తుంది అని ఆయన అన్నారు. సమతుల ఆహారం విషయం లో చైతన్యాన్ని వ్యాప్తి చేయాలి అని ఆయన నొక్కి చెప్పారు. ఆరోగ్యాని కి మొట్టమొదటి మెట్టు ఆహారం అని ప్రధాన మంత్రి పేర్కొంటూ, పోషకాహారం లోపించడం అనేది ఆహార లేమి కి బదులు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో అనేది తెలియకపోవడం వల్ల తలెత్తుతుంది అని ప్రధాన మంత్రి వివరించారు. మహమ్మారి కాలం లో 80 కోట్ల మంది కి పైగా ప్రజల కు ఆహార ధాన్యాలు ఉచితం గా అందేటట్టు ప్రభుత్వం పూచీపడింది అని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. నిన్నటి రోజు న రాత్రి పూట యుఎస్ అధ్యక్షుని తో తాను మాట్లాడిన విషయాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించి, డబ్ల్యుటిఒ నియమాల ను సడలించిన పక్షం లో, ఆహారధాన్యాల ను ఇతర దేశాల కు భారతదేశం పంపించగలుగుతుంది అని యుఎస్ అధ్యక్షుని కి చెప్పినట్లు తెలిపారు. మాత అన్నపూర్ణ దేవి అనుగ్రహం వల్ల భారతదేశం లోని రైతులు ఈసరికే ప్రపంచాన్ని గురించి శ్రద్ధ వహిస్తున్నారు అని ప్రధాన మంత్రి అన్నారు.
గుజరాత్ లో ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. పారిశ్రామికాభివృద్ధి తాలూకు సరికొత్త ధోరణుల అవసరాల కు తగినట్లు గా నైపుణ్యాభివృద్ధి ని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది అని కూడా ఆయన పునరుద్ఘాటించారు. ఔషధ నిర్మాణ పరిశ్రమ లో ప్రముఖమైన పాత్ర ను రాష్ట్రం పోషించడానికి వీలుగా ఫార్మసీ కాలేజీ ని ఏర్పాటు చేయడం లో ఆరంభ దశ లో ప్రోత్సాహాన్ని ఇవ్వడాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ, నైపుణ్యాన్ని అభివృద్ధి పరచడం లో ప్రభుత్వం మరియు సముదాయం యొక్క ప్రయాస లు అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తాయి అని ఆయన అన్నారు. ఇండస్ట్రీ 4.0 ప్రమాణాల ను సాధించడం లో దేశాని కి గుజరాత్ నాయకత్వం వహించాలి. ఎందుకంటే ఆ పని ని చేసే శక్తియుక్తులు రాష్ట్రాని కి ఉన్నాయి అని ఆయన అన్నారు.
డాయేలిసిస్ రోగుల కు నిధుల పరం గా ఎదురయ్యే ప్రతికూల ప్రభావాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, రక్తశుద్ధి సంబంధి ఉచిత చికిత్స సంబంధి సదుపాయాల ను దేశం లోని అన్ని జిల్లాల కు విస్తరించడాన్ని గురించి నొక్కి చెప్పారు. అదే మాదిరి గా తక్కువ ఖర్చు కే మందుల ను అందించడం ద్వారా రోగగ్రస్తుల కు వ్యయ భారాన్ని జన్ ఔషధీ కేంద్రాలు తగ్గిస్తున్నాయి అని ఆయన అన్నారు. స్వచ్ఛత, పోషణ, జన్ ఔషధి, డాయేలిసిస్ ప్రచార ఉద్యమం, స్టెంటు, ఇంకా మోకాలి చిప్ప మార్పిడి ల యొక్క ధరల లో తగ్గింపు వంటి చర్య లు సామాన్య ప్రజల కు భారాన్ని తగ్గించి వేశాయి అని ఆయన అన్నారు. అదే విధం గా ఆయుష్మాన్ భారత్ పథకం పేదల కు మరియు మధ్యతరగతి రోగుల కు, ప్రత్యేకించి మహిళా రోగుల కు సాయపడ్డాయి అని ప్రధాన మంత్రి అన్నారు.
వసతి గృహం మరియు విద్య భవన సముదాయం లో 600 మంది విద్యార్థుల కు బస మరియు భోజనం వగైరా సదుపాయాల ను కల్పించడం కోసం 150 గదులు ఉన్నాయి. ఇతర సదుపాయాల లో జిపిఎస్ సి, యుపిఎస్ సి పరీక్షల కోసం శిక్షణ కేంద్రం, ఇ-లైబ్రరీ, సమావేశాల నిర్వహణ కు ఉద్దేశించిన ఒక గది, క్రీడల కు ఉద్దేశించిన ఒక గది, టీవీ గది తో పాటు ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు వంటివి ఉన్నాయి.
హీరామణి ఆరోగ్య ధామ్ ను జన్ సహాయక్ ట్రస్టు అభివృద్ధి పరచనుంది. వాటి లో ఒకే సారి 14 మంది కి రక్తశుద్ధి చికిత్స చేసే సదుపాయం, రోజు లో 24 గంటలూ రక్తాన్ని అందుబాటు లో ఉంచేటటువంటి సౌకర్యం తో బ్లడ్ బ్యాంక్, రోజు లో 24 గంటలూ అందుబాటు లో ఉండేటటువంటి మెడికల్ స్టోర్, ఆధునిక పరీక్ష ప్రధానమైనటువంటి ప్రయోగశాల మరియు ఆరోగ్య పరీక్షల కు సంబంధించినటువంటి అగ్ర శ్రేణి పరికరాలు కూడా ఉంటాయి. ఇది ఆయుర్వేదం, హోమియోపథి, ఏక్యూపంక్చర్, యోగ చికిత్స ల వంటి వాటి కి సంబంధించిన ఆధునిక సౌకర్యాల తో కూడినటువంటి డే- కేర్ సెంటర్ గా సేవల ను అందించనుంది. అందులో ప్రథమ చికిత్స సంబంధి శిక్షణ, టెక్నిశియన్ లకు ఉద్దేశించిన శిక్షణ, ఇంకా వైద్యుల కు సంబంధించిన శిక్షణ సదుపాయాలు కూడా లభించనున్నాయి.