‘‘భారతదేశం లో ఎఐ తాలూకు నూతన ఆవిష్కరణల ఉత్సాహాన్ని మనం చూస్తున్నాం’’
‘‘ప్రభుత్వం యొక్క విధానాలు మరియు కార్యక్రమాలు ‘‘అందరికీ ఎఐ’’ భావన నుండి మార్గదర్శకత్వాన్ని పొందుతున్నాయి’’
‘‘భారతదేశం ఎఐ నిబాధ్యతాయుక్తం గాను మరియు నీతి యుక్తం గాను ఉపయోగించుకోవడం కోసం కంకణంకట్టుకొన్నది’’
‘‘ఎఐ అనేదిమార్పును తీసుకు వచ్చేది అనే అంశం లో అనుమానం లేదు, అయితే దానిని మరింత గా పారదర్శకమైంది గాతీర్చిదిద్దుకోవలసింది మనమే’’
‘‘నైతికత పరం గా, ఆర్థిక పరం గా, సామాజిక పరం గా పరిష్కారాల ను కనుగొన్నప్పుడు మాత్రమే ఎఐ పై విశ్వాసం వృద్ధిచెందుతుంది’’
‘‘ఎఐ వృద్ధి క్రమం లో అప్‌స్కిలింగ్ ను మరియు రీస్కిలింగ్ ను ఒక భాగం గా చేయగలరు’’
‘‘ఎఐ ని నీతియుక్తంగా ఉపయోగించుకోవడం కోసం ఒక గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ ను రూపొందించడానికి మనం కలసికట్టుగా పాటుపడి తీరాలి’’
‘‘ఏదైనా సమాచారంలేదా ఉత్పాదన ఎఐ మాధ్యం ద్వారా తయారు అయింది అని నిరూపించడాని కి ఒక సాఫ్ట్ వేర్వాటర్‌మార్క్ ను పరిచయం చేయడం వీలు పడుతుందా’’
‘‘ఎఐ సంబంధి పనిముట్టుల ను వాటి దక్షతల కు అనుగుణం గా ఎర్రని, పచ్చని లేదా ఆకుపచ్చని శ్రేణులకు చెందినవి గా వర్గీకరించ

గ్లోబల్ పార్ట్ నర్‌శిప్ ఆన్ ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (జిపిఎఐ) శిఖర సమ్మేళనాన్ని న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. గ్లోబల్ ఎఐ ఎక్స్ పో లో ఆయన అడుగిడి, పరిశీలించారు. జిపిఎఐ అనేది కృత్రిమ మేథ (ఎఐ) తాలూకు సిద్ధాంతానికి మరియు అభ్యాసానికి మధ్య గల అంతరాయాన్ని భర్తీ చేసే లక్ష్యం తో 29 సభ్యత్వ దేశాలు అవలంభించనున్నటువంటి ఒక మల్టీ-స్టేక్ హోల్డర్ ఇనిశియేటివ్ గా ఉంది. ఈ లక్ష్య సాధన లో ఎఐ సంబంధి ప్రాధాన్య అంశాల పై అత్యాధునిక పరిశోధనల కు మరియు తత్సంబంధి కార్యకలాపాల కు సమర్థన ను అందించడం జరుగుతుంది. 2024 వ సంవత్సరానికి జిపిఎఐ తాలూకు లీడ్ చైన్ గా భారతదేశం ఉంది.

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, కృత్రిమ మేధస్సు కు సంబంధించి యావత్తు ప్రపంచం చర్చోపచర్చల లో నిమగ్నం అయిన తరుణం లో వచ్చే సంవత్సరం లో జరుగనున్న జిపిఎఐ సమిట్ కు భారతదేశం అధ్యక్షత వహించనుండడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. సకారాత్మకమైనటువంటి దృష్టి కోణాల తో పాటు నకారాత్మకమైనటువంటి దృష్టి కోణాలు కూడ వెలుగు లోకి వస్తున్నాయి అని ప్రధాన మంత్రి చెప్తూ, ప్రతి ఒక్క దేశం భుజస్కందాల మీద బాధ్యత ఉంది అని నొక్కిపలికారు. జిపిఎఐ సమిట్ విషయం లో ఎఐ తాలూకు వివిధ పరిశ్రమ ప్రముఖుల తో సంభాషణ లు మరియు చర్చ లు జరుగుతూ ఉన్నాయి అని ఆయన గుర్తు కు తీసుకు వచ్చారు. ఎఐ ప్రతి ఒక్క దేశాన్ని ప్రభావితం చేసింది, అది చిన్న దేశం కావచ్చు లేదా పెద్ద దేశం కావచ్చు అని ఆయన అన్నారు; మరి ఈ విషయం లో జాగ్రత గా ముందంజ వేయాలి అని ఆయన సూచించారు. జిపిఎఐ సమిట్ లో చోటు చేసుకొనే చర్చ మానవ జాతి కి ఒక దిశ ను ఇవ్వడం తో పాటుగా మానవ జాతి కి సంబంధించిన మూల ఆధారాల ను సైతం పదిలం గా ఉంచబోతోంది అని ఆయన స్పష్టం చేశారు.

 

ప్రస్తుతం ఎఐ సంబంధి ప్రతిభ తో ముడిపడిన రంగం లో మరియు ఎఐ కి సంబంధించిన ఆలోచనల లో ప్రధానమైన పాత్రధారి గా భారతదేశం ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఎఐ సంబంధి సాంకేతిక విజ్ఞానం యొక్క ఎల్లల ను విస్తరిస్తూ, ఈ రంగం లో పరిశోధన లు జరపడం లో భారతదేశాని కి చెందిన యువత ముందడుగు వేస్తున్న నేపథ్యం లో భారతదేశం లో ఎఐ సంబంధి హుషారైన చేతన గోచరిస్తున్నది అని ఆయన అన్నారు. ఎఐ సంబంధి ప్రదర్శన లో ఉంచిన ఉత్పాదనల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, ఆ వస్తువులు సాంకేతిక విజ్ఞానం మాధ్యం ద్వారా సమాజం లో పరివర్తన ను తీసుకు వచ్చేందుకు జరుగుతున్న ప్రయాస లు అంటూ అభివర్ణించారు. ఇటీవలే ప్రారంభం అయినటువంటి ఎఐ ఎగ్రీకల్చర్ చాట్‌బాట్ ను గురించి ప్రధాన మంత్రి వెల్లడిస్తూ, ఈ పరిణామం రైతుల కు వ్యవసాయం సంబంధి వివిధ అంశాల లో సహాయకారి కానుంది అని వివరించారు. ఆరోగ్య సంరక్షణ మరియు సతత అభివృద్ధి లక్ష్యాల రంగం లో ఎఐ ని వినియోగించుకోవడాన్ని గురించి కూడ ఆయన వివరించారు.

 

 

‘‘భారతదేశం లో అభివృద్ధి మంత్రం అంటే అది ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రభుత్వం తన విధానాల ను, కార్యక్రమాల ను ‘‘ అందరికీ ఎఐ’’ అనే స్ఫూర్తి తో రూపొందించింది అని ఆయన చెప్పారు. సామాజిక అభివృద్ధి కోసం మరియు అన్ని వర్గాల వారి వృద్ధి కోసం ఎఐ యొక్క దక్షతల ను ఎక్కువ లో ఎక్కువ గా ఉపయోగించుకోవడం కోసం ప్రభుత్వం పాటు పడుతుంది, అదే కాలం లో ఎఐ ని బాధ్యతాయుక్తం గాను మరియు నీతి యుక్తం గాను వినియోగిస్తుంది అని ఆయన అన్నారు. కృత్రిమ మేధ అంశం లో ఒక జాతీయ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం గురించి, త్వరలో ప్రారంభించబోయే ఎఐ మిశన్ ను గురించి ప్రధాన మంత్రి వెల్లడించారు. ఎఐ మిశన్ అనేది ఎఐ తాలూకు కంప్యూటింగ్ పవర్స్ ను ఖాయం చేస్తుంది అని ఆయన అన్నారు. ఇది భారతదేశం లో స్టార్ట్-అప్స్ కు మరియు నూతన ఆవిష్కర్తల కు మెరుగైన సేవల ను అందిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. దీనితో పాటు గా వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ఇంకా విద్య బోధన రంగాల లో ఎఐ అప్లికేశన్స్ ను కూడా ప్రోత్సహిస్తుంది అని ఆయన వివరించారు. విద్య బోధన సంబంధి శిక్షణ సంస్థ ల మాధ్యం ద్వారా రెండో అంచె నగరాల లో మరియు మూడో అంచె నగరాల లో ఎఐ సంబంధి నైపుణ్యాల విస్తృతి ని గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఎఐ సంబంధి కార్యక్రమాల ను ప్రోత్సహించేటటువంటి భారతదేశం యొక్క జాతీయ స్థాయి ఎఐ పోర్టల్ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఐరావత్ (AIRAWAT) కార్యక్రమాన్ని ప్రస్తావించారు. పరిశోధనల కు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రయోగశాల కోసం, పరిశ్రమ రంగం కోసం మరియు స్టార్ట్-అప్ ల రంగం కోసం ఒక ఉమ్మడి ప్లాట్ ఫార్మ్ ను త్వరలో ప్రవేశపెట్టడం జరుగుతుంది అని ఆయన తెలియజేశారు.

 

ఎఐ యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి చెప్తూ, ఎఐ అనేది నూతన భవిత ను తీర్చిదిద్దేందుకు ఒక పెద్ద ఆధారం అవుతోంది అని వ్యాఖ్యానించారు. ఎఐ అనేది ప్రజల ను కలిపి ఉంచడం తో పాటు, ఆర్థిక అభివృద్ధి కే కాకుండా సమానత్వాని కి మరియు సామాజిక న్యాయాని కి సైతం పూచీ పడుతుంది అని ఆయన అన్నారు. ఎఐ ని మరిన్ని వర్గాల వారి చెంతకు తీసుకు పోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన ఉద్ఘాటించారు. ‘‘ఎఐ ఎంత విస్తృతం అయితే, ఎఐ యొక్క అభివృద్ధి యాత్ర అంత వ్యాప్తి చెందుతుంది, ఎఐ ఎంత జన బాహుళ్యాని కి సమీపిస్తే, దాని తాలూకు ఫలితాలు అంతగా వృద్ధి చెందుతాయి’’ అని ఆయన అన్నారు. గడచిన శతాబ్ద కాలం లో సాంకేతిక విజ్ఞానం యొక్క ప్రాప్తి అసమానమైంది గా ఉన్న కారణం గా సమాజం లో సమానత్వ లోపం అంతగా పెచ్చుపెరిగింది అని ఆయన అన్నారు. దీనిని నివారించడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని సమానత్వ వ్యాప్తి ప్రధానమైంది గా మలచడం లో ప్రజాస్వామిక విలువల ను నిర్లక్ష్యం చేయకూడదు అంటూ ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ‘‘ఎఐ యొక్క అభివృద్ధి గతి అనేది పూర్తి గా మానవీయ విలువల పైన మరియు ప్రజాస్వామిక విలువల పైన ఆధారపడి ఉంటుంది. సామర్థ్యానికి, నైతికత్వానికి, దక్షత కు తోడు భావోద్వేగాల కు కూడా ఒక పీట ను వేయవలసిన అగత్యం మన మీద ఉంది’’ అని ఆయన అన్నారు.

 

ఏదైనా ఒక వ్యవస్థ ను పది కాలాల పాటు మనుగడ లో ఉంచాలి అంటే గనుక దానిని మార్పుల కు వీలు ఉండేటటువంటిది గాను, పారదర్శకమైంది గాను మరియు విశ్వసనీయమైందిగాను మలచడం అనేది ముఖ్యం అని ప్రధాన మంత్రి ఉద్భోదించారు. ‘‘ఎఐ అనేది పరివర్తనాత్మకమైంది అనడం లో ఎటువంటి అనుమానం లేదు. అయితే, దీనిని మరింత ఎక్కువ పారదర్శకమైంది గా తీర్చిదిద్దవలసిన బాధ్యత కూడా ఉంది’’ అని ఆయన అన్నారు. సమాచారాన్ని పారదర్శకత తో కూడుకొన్నది గా మరియు ఎటువంటి పక్షపాతాని కి తావు ఇవ్వనటువంటిది గా ఉంచడం అనేది ఒక మంచి నాంది ప్రస్తావన కాగలుగుతుంది అని ఆయన అన్నారు. కృత్రిమ మేధ తాలూకు అభివృద్ధి యాత్ర లో ఏ ఒక్కరిని విడచిపెట్టి ముందుకు వెళ్ళడం జరుగదు అని అన్ని దేశాల కు హామీ ని ఇవ్వడం తప్పనిసరి అని ఆయన అన్నారు. ఎఐ కి సంబంధించిన నీతి పరమైన, ఆర్థిక పరమైన మరియు సామాజిక పరమైన అంశాల ను పరిష్కరించినప్పుడు మాత్రమే ఎఐ లో విశ్వాసం వర్ధిల్లగలుగుతుంది అని ఆయన అన్నారు. దీనిని సాధించడాని కి ఉన్న ఒక దారి ఏది అంటే అది ఎఐ యొక్క వృద్ధి క్రమం లో అప్‌స్కిలింగు కు మరియు రీస్కిలింగు కు చోటు ను చూపించడం అని ఆయన అన్నారు. సమాచార పరిరక్షణ మరియు వికాసశీల దేశాల (గ్లోబల్ సౌథ్) కు హామీ లు సైతం అనేక ఆందోళనల ను ఉపశమింప చేయగలుగుతాయి అని ఆయన అన్నారు.

 

ఏఐ ప్రతికూల అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి, 21వ శతాబ్దంలో అభివృద్ధికి ఇది బలమైన సాధనంగా మారగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, అది నాశనకారిగా కూడా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. డీప్‌ఫేక్, సైబర్ సెక్యూరిటీ, డేటా చౌర్యం, ఉగ్రవాద సంస్థలు ఏఐ సాధనాలను వినియోగించడం వంటి సవాళ్లను ఎత్తిచూపిన ప్రధాని మోదీ, వాటిని ఎదుర్కోగలిగే చర్యల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. భారతదేశం జి20 ప్రెసిడెన్సీ సమయంలో బాధ్యతాయుతమైన మానవ-కేంద్రీకృత ఏఐ పాలన కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలనే భారతదేశ ప్రతిపాదనను ఆయన ప్రస్తావించారు. జి20 న్యూఢిల్లీ డిక్లరేషన్ 'ఏఐ సూత్రాల' పట్ల అన్ని సభ్య దేశాల నిబద్ధతను పునరుద్ఘాటించిందని అన్నారు. వివిధ అంతర్జాతీయ సమస్యలపై ఒప్పందాలు, ప్రోటోకాల్‌ల మాదిరిగానే కలిసి పనిచేయాలని, ఏఐ నైతిక ఉపయోగం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని నొక్కి చెప్పారు. ఇందులో అధిక-రిస్క్ లేదా ఫ్రాంటియర్ ఏఐ సాధనాల పరీక్ష, అభివృద్ధి కూడా ఉంది. దృఢ నిశ్చయం, నిబద్ధత, సమన్వయం, సహకారం ఆవశ్యకతను నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, ఈ దిశలో ఒక్క క్షణం కూడా వృధా చేయవద్దని యావత్ ప్రపంచానికి పిలుపునిచ్చారు. “మేము ఇచ్చిన కాలపరిమితిలో గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్‌ను పూర్తి చేయాలి. మానవాళిని రక్షించడానికి ఇలా చేయడం చాలా ముఖ్యం” అన్నారాయన.

 

ఏఐని ప్రపంచవ్యాప్త ఉద్యమం లాంటిదని పేర్కొంటూ, సహకారం ఆవశ్యకతను ప్రధాని నొక్కి చెప్పారు. ఏఐ విశ్వసనీయతను మెరుగుపరచడానికి ఏఐ సాధనాలను పరీక్షించడానికి, శిక్షణ ఇవ్వడానికి డేటా సెట్‌లు, ఏదైనా ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేయడానికి ముందు కాల పరిమితి, వ్యవధి వంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతకాలలని  ప్రధనమంత్రి సూచించారు. ఏదైనా ఏఐ జనరేటెడ్ సమాచారం కానీ, ఉత్పత్తిని కానీ రూపొందిస్తే, దానిని గుర్తించడానికి సాఫ్ట్‌వేర్ వాటర్‌మార్క్‌ను ప్రవేశపెట్టవచ్చా అని కూడా ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వంలోని వాటాదారులను ఉద్దేశించి ప్రధాన మంత్రి, ఆధారాలతో కూడిన నిర్ణయాధికారం కోసం వివిధ పథకాల డేటాను అన్వేషించాలని, ఏఐ సాధనాలకు శిక్షణ ఇవ్వడానికి డేటాను ఉపయోగించవచ్చో చూడాలని వారిని కోరారు. ఏఐ సాధనాలను వాటి సామర్థ్యాల ప్రకారం ఎరుపు, పసుపు లేదా ఆకుపచ్చగా వర్గీకరించగల ఆడిట్ మెకానిజం ఉందా అని ప్రధాని అడిగారు. “మనం స్థిరమైన ఉపాధిని నిర్ధారించే సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయగలమా? మనం ప్రామాణిక ప్రపంచ ఏఐ  విద్యా పాఠ్యాంశాలను తీసుకురాగలమా? ఏఐ  ఆధారిత భవిష్యత్తు కోసం ప్రజలను సిద్ధం చేయడానికి మనం ప్రమాణాలను నిర్దేశించగలమా?", ప్రధాన మంత్రి అన్నారు.

భారతదేశంలోని వందలాది భాషలు, వేలాది మాండలికాలను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, డిజిటల్ చేరికను పెంచడానికి స్థానిక భాషలలో డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ఏఐని ఉపయోగించాలని సూచించారు. ఇకపై మాట్లాడని భాషలను పునరుద్ధరించడానికి, సంస్కృత భాష గొప్ప జ్ఞానాన్ని, సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, వేద గణితంలో తప్పిపోయిన వాల్యూమ్‌లను తిరిగి కలపడానికి ఏఐని ఉపయోగించాలని ఆయన సూచించారు.

ప్రతి ప్రతినిధికి ఆలోచనలను ఇచ్చి పుచ్చుకోవడం, గొప్ప అభ్యాస అనుభవానికి జీపీఏఐ సమ్మిట్ ఒక అద్భుతమైన అవకాశంగా ఉంటుందని ప్రధాన మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. “రాబోయే రెండు రోజుల్లో, ఏఐ వివిధ అంశాలను పరిశీలిస్తారని, ఫలితాలు, అమలు చేసినప్పుడు, ఖచ్చితంగా బాధ్యతాయుతమైన, స్థిరమైన భవిష్యత్తును నిర్మించేందుకు మార్గం సుగమం చేస్తాయని నేను ఆశిస్తున్నాను”, అని ప్రధాన మంత్రి ముగించారు.

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్, జీపీఏఐ  జపాన్  విధాన సమన్వయం, అంతర్గత వ్యవహారాలు, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ హిరోషి యోషిదా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్ కృష్ణన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. .

 

నేపథ్యం 

జీపీఏఐ అనేది 29 సభ్య దేశాలతో కూడిన బహుళ- వాటాదారుల చొరవ.  ఇది ఏయూ - సంబంధిత ప్రాధాన్యతలపై అత్యాధునిక పరిశోధన, అనువర్తిత కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ద్వారా ఏఐ పై సిద్ధాంతం, అభ్యాసాల మధ్య అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2024లో జీపీఏఐకి భారతదేశం ప్రధాన చైర్‌గా ఉంది. 2020లో జీపీఏఐ వ్యవస్థాపక సభ్యులలో ఒకరిగా, జీపీఏఐ కి ప్రస్తుత ఇన్‌కమింగ్ సపోర్ట్ చైర్‌గా, 2024లో జీపీఏఐకి లీడ్ చైర్‌గా, భారతదేశం డిసెంబర్ 12-14, 2023 వరకు వార్షిక జీపీఏఐ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది.
 

ఏఐ, గ్లోబల్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్కిలింగ్, ఏఐ, డేటా గవర్నెన్స్, ఎంఎల్  వర్క్‌షాప్ వంటి విభిన్న అంశాలపై అనేక సెషన్‌లు సమ్మిట్ సమయంలో నిర్వహిస్తారు. సమ్మిట్‌లోని ఇతర ఆకర్షణలలో రీసెర్చ్ సింపోజియం, ఏఐ  గేమ్‌ఛేంజర్స్ అవార్డు, ఇండియా ఏఐ ఎక్స్‌పో ఉన్నాయి.

సమ్మిట్‌లో వివిధ దేశాల నుండి 50కి పైగా జీపీఏఐ నిపుణులు, 150 పైగా స్పీకర్లు పాల్గొననున్నారు. ఇంటెల్, రిలయన్స్ జియో, గూగుల్, మెటా, ఏడబ్ల్యూఎస్, యోటా, నెట్ వెబ్, పేటీఎం,  మైక్రోసాఫ్ట్, మాస్టర్ కార్డ్, ఎన్ఐసి, ఎస్టిపిఐ, ఇమ్మెర్స్, జియో హాప్టిక్, భాషిణి వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ఏఐ గేమ్‌ఛేంజర్‌లు పాల్గొంటారు.

 

 

 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi