ప్రపంచ బౌద్ధ ధర్మ శిఖర సమ్మేళనం ఈ రోజు న న్యూ ఢిల్లీ లో హోటల్ అశోక్ లో జరగగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ శిఖర సమ్మేళనం యొక్క ప్రారంభిక సదస్సు లో పాలుపంచుకొని, సభికుల ను ఉద్దేశించి ప్రసంగిచారు. ప్రధాన మంత్రి ఒక ఛాయాచిత్ర ప్రదర్శన లో కలియతిరిగారు; బుద్ధుని ప్రతిమ కు ఆయన పుష్పాంజలి ని సమర్పించారు. పంతొమ్మిది మంది ప్రముఖ బౌద్ధ భిక్షువుల కు ప్రత్యేక దుస్తుల (చివర్ దాన) ను కూడా ఆయన అందజేశారు.
సమావేశాని కి తరలి వచ్చిన జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, గ్లోబల్ బుద్ధిస్ట్ సమిట్ యొక్క ప్రారంభిక సదస్సు లో పాలుపంచుకోవడాని కి ప్రపంచం నలు మూలల నుండి తరలి వచ్చిన వారందరి కి స్వాగతం పలికారు. ‘అతిథి దేవో భవ’ (ఈ మాటల కు- అతిథులు దైవం తో సమానం- అని భావం ) అనేది బుద్ధుడు పుట్టిన ఈ గడ్డ యొక్క సంప్రదాయం, మరి బుద్ధుని ఆదర్శాల ను అనునిత్యం అనుసరిస్తున్న అటువంటి ఎంతో మంది ప్రముఖుల హాజరు ను పట్టి చూస్తే, మనలకు చుట్టుప్రక్కల బుద్ధుడే స్వయం గా ఇక్కడ కు విచ్చేశారా అనే అనుభూతి కలుగుతున్నది అని అని ఆయన అన్నారు. ‘‘బుద్ధుడు వ్యక్తి కి మించి ఒక బోధగా ఉన్నారు.’’ అని ప్రధాన మంత్రి అన్నారు. బుద్ధుడు స్వరూపానికి మించి ఒక ఆలోచన గా ఉన్నారు, బుద్ధుడు చిత్రణ కు మించి ఒక చేతన గా ఉన్నారు. ఇంకా, బుద్ధుని యొక్క ఈ చేతన చిరంతరమూ, నిరంతరమూను.’’ అని ప్రధాన మంత్రి అన్నారు. విభిన్న ప్రాంతాల నుండి విచ్చేసిన అటువంటి ఎంతో మంది ఉనికి బుద్ధుని యొక్క విస్తృతి కి ప్రాతినిధ్యం వహిస్తున్నది. అంతేకాకుండా అది మానవాళి ని ఒకే సూత్రం లో పెనవేస్తున్నది కూడాను అని ప్రధాన మంత్రి అన్నారు. సామూహిక ఇచ్ఛాశక్తి యొక్క బలాన్ని గురించి మరియు ప్రపంచ సంక్షేమం కోసం పాటుపడాలి అనేటటువంటి భగవాన్ బుద్ధుని వివిధ దేశాల లో కోట్ల సంఖ్య లో గల అనుయాయుల సంకల్పం గురించి ఆయన ప్రత్యేకం గా ప్రస్తావించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యక్రమం యొక్క ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, గ్లోబల్ బుద్ధిస్ట్ సమిట్ ప్రారంభిక ఘట్టం అన్ని దేశాల ప్రయాసల కు ఒక ప్రభావశీలమైన అటువంటి వేదిక ను ఏర్పరుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంస్కృతి మంత్రిత్వ శాఖ కు మరియు ఇంటర్ నేశనల్ బుద్ధిస్ట్ కన్ ఫెడరేశన్ ప్రధాన మంత్రి ధన్యవాదాలు పలికారు.
బౌద్ధం తో తనకు స్వీయ బంధాన్ని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. తాను పుట్టిన వడ్ నగర్ ఒక ప్రముఖ బౌద్ధ క్షేత్రం అని, వడ్ నగర్ ను శ్రీ హవేన్ సాంగ్ సందర్శించారని
ఆయన గుర్తు కు తీసుకు వచ్చారు. సార్ నాథ్ నెలకొన్న కాశీ ని గురించి కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించి, బౌద్ధ వారసత్వం తో బంధం యొక్క గాఢత ను గురించి పేర్కొన్నారు.
భారతదేశం స్వాతంత్య్రాన్ని సంపాదించుకొన్న అనంతరం 75వ సంవత్సరం లో ఆజాదీ కా అమృత్ కాల్ ను జరుపుకొంటున్న సందర్భం లో గ్లోబల్ బుద్ధిస్ట్ సమిట్ జరుగుతున్నది అని ప్రధాన మంత్రి చెబుతూ, భారతదేశానికి దాని భవిష్యత్తు తో పాటుగా ప్రపంచ హితానికి సంబంధించిన క్రొత్త సంకల్పాలు ఉన్నాయి అని స్పష్టం చేశారు. వేరు వేరు రంగాల లో భారతదేశం ఇటీవల నెలకొల్పిన ప్రపంచ స్థాయి మైలురాళ్ళ కు సాక్షాత్తు భగవాన్ బుద్ధుడుయే ప్రేరణ గా ఉన్నారు అని ఆయన నొక్కిచెప్పారు.
సిద్ధాంతము, అభ్యాసము మరియు సాధన అనే బౌద్ధ పథాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకువస్తూ, గడచిన తొమ్మిది సంవత్సరాల లోనూ భారతదేశం తాను సాగించిన ప్రయాణం లో ఈ మూడు అంశాల ను పాటిస్తూ వచ్చింది అన్నారు. భగవాన్ బుద్ధుని బోధల ను ప్రచారం చేయడం కోసం భారతదేశం సమర్పణ భావం తో పని చేస్తోంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం లోను, నేపాల్ లోను బుద్ధిస్ట్ సర్కిట్ లను అభివృద్ధి పరచడం గురించి, సార్ నాథ్, కుశీ నగర్ ల పునరుద్ధరణ ను గురించి, కుశీ నగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గురించి, ఐబిసి సహకారం తో లుమ్బిని లో ఇండియా ఇంటర్ నేశనల్ సెంటర్ ఆఫ్ బుద్ధిస్ట్ హెరిటేజ్ ఎండ్ కల్చర్ ను గురించి ఆయన ప్రస్తావించారు.
మానవాళి కి సంబంధించిన అంశాల పట్ల భారతదేశం సహానుభూతి ఇమిడిపోయి ఉంది అంటే అందుకు ఖ్యాతి భగవాన్ బుద్ధుని బోధల కు దక్కుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. పీస్ మిశన్స్ మరియు తుర్కియే లో భూకంపం సంభవించినప్పుడు రక్షణ కార్యకలాపాల లో భారతదేశం హృదయపూర్వకం గా పాలుపంచుకోవడాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. ‘‘140 కోట్ల మంది భారతదేశం వాసుల లోని ఈ భావోద్వేగాన్ని ప్రపంచ దేశాలు గమనించి, గ్రహించి, స్వీకరించాయి.’’ అని ఆయన అన్నారు. బుద్ధ ధమ్మ మరియు శాంతి లను వ్యాప్తి చేయడం కోసం భావ సారూప్యం, సమాన హృదయ స్పందన కలిగిన అటువంటి దేశాల కు అవకాశాన్ని ఐబిసి వంటి వేదిక లు అందిస్తున్నాయి అని కూడా ఆయన అన్నారు.
‘‘సమస్య నుండి మొదలైన ప్రయాణం పరిష్కారం వద్ద కు చేరుకోవడం అనేదే బుద్ధుని సిసలైన ప్రస్థానం గా ఉన్నది.’’ అని ప్రధాన మంత్రి అన్నారు. భగవాన్ బుద్ధుని పయనాన్ని గురించి ప్రధాన మంత్రి మరింత గా వివరిస్తూ, ఆయన తన రాజ మహలు మరియు రాచరికం యొక్క జీవన విధానాన్ని వదలి పెట్టారు. ఎందుకు అంటే ఆయన ఇతరుల జీవనం లో ఉన్నటువంటి వేదన ను గుర్తించారు అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ఒక వ్యక్తి ఎప్పుడైతే స్వార్థం తో కూడిన ఆలోచన లను విడచిపెట్టి, సంకుచిత మనస్తత్వాన్ని వదలిపెట్టి, ప్రపంచం గురించిన బుద్ధ మంత్రం యొక్క సారాన్ని ఆకళింపు చేసుకొన్నప్పుడు అది మాత్రమే సమృద్ధి యుక్త ప్రపంచ ఆవిష్కారం అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక దారి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. వనరుల కొరత ను ఎదుర్కొంటున్న దేశాల ను గురించి మనం పట్టించుకొంటేనే ఒక మెరుగైనటువంటి మరియు స్థిరమైనటువంటి ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి వీలవుతుంది అని ఆయన నొక్కిచెప్పారు. ‘‘ప్రతి ఒక్క వ్యక్తి మరియు ప్రతి ఒక్క దేశం యొక్క ప్రాధాన్యం దేశ హితం తో పాటు ప్రపంచ హితం కూడా కావాలి అనేదే ప్రస్తుతం ఉన్నటువంటి తక్షణావసరం’’, అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.
వర్తమాన కాలం ఈ దశాబ్దం లోకెల్లా అత్యంత సవాలు తో కూడినటువంటి కాలం అని ప్రధాన మంత్రి అన్నారు. ఒక ప్రక్క యుద్ధం జరుగుతోంది, ఆర్థికపరమైన అస్థిరత్వం ఉంది, ఉగ్రవాదం మరియు ధార్మిక తీవ్రవాదం.. మరో ప్రక్క ప్రజాతులు అంతరించడంతోను, మంచుదిబ్బ లు కరిగిపోతూ ఉండడం తోను ఎదురవుతున్న జలవాయు పరివర్తన సవాలు అని ఆయన అన్నారు. ఈ విపరిణామాలన్నింటి మధ్య బౌద్ధాన్ని నమ్మేటటువంటి మరియు జీవులన్నిటి సంక్షేమాన్ని కోరుకొనేటటువంటి ప్రజానీకం కూడా ఉన్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ఆశే, ఈ విశ్వాసమే ఈ పృథ్వి యొక్క అతి పెద్ద బలం గా ఉంది. ‘‘ఈ ఆశ ఎప్పుడైతే సార్వజనికం అయిపోతుందో బుద్ధుడు ప్రవచించిన ధమ్మ అనేది ప్రపంచం యొక్క నమ్మిక గా అవుతుంది. మరి బుద్ధుడు ఏదైతే అనుభూతి ని చెందారో అది మానవ జాతి తాలూకు విశ్వాసం గా పరిణమిస్తుంది.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
ఆధునిక కాలం లోని సమస్య లు అన్నీ వాటంతట అవే భగవానుడు ప్రాచీన కాలం లో బోధించిన బోధ ల ద్వారా పరిష్కారాల దిశ గా సాగుతాయి అని శ్రీ నరేంద్ర మోదీ చెప్తూ, తద్వారా బుద్ధుని బోధల కు గల ఔచిత్యాన్ని నొక్కి చెప్పారు. భగవాన్ బుద్ధుడు యుద్ధాన్ని, ఓటమి ని విడనాడుతూ, చిరకాల శాంతి కోసం పాటు పడుతూ విజయాన్ని చేజిక్కించుకోండని చెప్పారని ప్రధాన మంత్రి అన్నారు. శత్రుత్వాన్ని శత్రుత్వం తోనే ఎన్నటికీ ఎదురొడ్డ జాలం, సంతోషం అనేది ఏకత్వం లోనే దాగి ఉంది అని ఆయన అన్నారని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఒక వ్యక్తి అన్యుల కు ఏదైనా ఒక విషయాన్ని చెప్పే కంటే ముందు గా తన ఆచరణ ఎలా ఉన్నదీ పరిశీలన చేసుకోవాలి. ఇది తన సొంత అభిప్రాయాల ను ఇతరుల పైన రుద్దాలని నేటి ప్రపంచం లో సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి జాడ్యాన్ని అంతం చేయగలుగుతుంది అని కూడా ఆయన అన్నారు. బుద్ధుని బోధల లో తనకు నచ్చిన ‘అప్ప దీపో భవ:’ ను గురించి ప్రధాన మంత్రి మరోమారు తెలియ జేశారు. ఈ మాటల కు ‘మీకు మీరే దారి దీపం కావాలి’ అని అర్థం. ఇది భగవానుని బోధ ల తాలూకు శాశ్వత ప్రాసంగికత ను చాటి చెబుతోంది. ‘ప్రపంచాని కి బుద్ధుడి ని మా దేశం ఇచ్చింది తప్ప యుద్ధాన్ని ఇవ్వ లేదు’ అంటూ కొన్ని సంవత్సరాల క్రిందట ఐక్య రాజ్య సమితి లో తాను చెప్పినట్లు ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వచ్చారు.
‘‘బుద్ధుని మార్గం భవిత కు మార్గం, అంతేకాదు అది ఎల్లకాలం మనుగడ లో ఉండేటటువంటి మార్గం కూడాను’ అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ప్రపంచం గనుక బుద్ధుని బోధల ను అవలంబించి ఉన్నట్లయితే జలవాయు పరివర్తన సమస్య ను ప్రపంచం ఎదుర్కొనేదే కాదు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. దేశాలు అన్య దేశాల ను గురించి గాని, భావి తరాల ను గురించి గాని ఆలోచించడం ఆపివేసినందువల్లనే ఈ సమస్య తలెత్తింది అని ప్రధాన మంత్రి వివరించారు. ఈ పొరబాటు పెద్ద ఆపద స్థాయిల కు పెరిగిపోయింది అని ఆయన అన్నారు. స్వీయ ప్రయోజనాన్ని గురించిన ఆలోచన కు తావు ఇవ్వకుండా సత్ ప్రవర్తన ను కలిగివుండాలి అని బుద్ధుడు చెప్పారు, ఎందుకంటే అటువంటి ప్రవర్తన మొత్తం మీద శ్రేయస్సు కు దారి తీస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక పద్ధతి లో ఈ భూమి ని ఏ విధం గా ప్రభావితం చేస్తున్నదీ ప్రధాన మంత్రి తన ప్రసంగం లో ప్రముఖం గా ప్రకటించారు. అది జీవన శైలి కావచ్చు, తీసుకొనే ఆహారం కావచ్చు, లేదా ప్రయాణపు అలవాట్లు కావచ్చు అని ఆయన వల్లిస్తూ, జలవాయు పరివర్తన తో పోరాడే దిశ లో అందరూ వారి వంతు గా తలో చేయి ని వేయవచ్చును అని ఆయన అన్నారు. లైఫ్ స్టయిల్ ఫార్ ఎన్ వైరన్ మంట్ లేదా మిశన్ లైఫ్ (Mission LiFE) ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, ప్రజలు చైతన్యవంతులు అయి వారి జీవన శైలి ని మార్చుకోవడం అంటూ జరిగితే అటువంటప్పుడు జలవాయు పరివర్తన అనే భారీ సమస్య ను కూడా పరిష్కరించడం కుదురుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘మిశన్ లైఫ్ బుద్ధుని ప్రేరణ ల నుండి ప్రభావితం అయింది. మరి అది బుద్ధుని భావజాలాన్ని మునుముందుకు తీసుకుపోతుంది’’, అని శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు.
ప్రధాన మంత్రి తన ప్రసంగం చివర లో భౌతికవాదం మరియు స్వార్థపరత్వం ల వ్యామోహాల నుండి బయటపడి ‘భవతు సబ్ మంగళాని’ అనే భావన ను అలవరచుకోవాలి అని నొక్కిచెప్పారు. బుద్ధుడి ని ఒక ప్రతీక గా గాక ఒక ప్రతిబింబం గా కూడాను తీసుకోవాలి అని ఆయన అన్నారు. వెన్ను ను చూపి పరారవడం కాకుండా ఎప్పటికీ మునుముందుకే సాగిపోతూ ఉండాలి అన్న బుద్ధుని మాటల ను మనం జ్ఞాపకం పెట్టుకొన్నప్పుడే ఈ సంకల్పాన్ని నెరవేర్చవచ్చును అని ఆయన వ్యాఖ్యానించారు. అందరు ఒక్కటి గా కలసి ముందంజ వేస్తే సంకల్పాలు సాకారం అవుతాయి అనే విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం లో సంస్కృతి శాఖ కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, చట్టం మరియు న్యాయం శాఖ కేంద్ర మంత్రి శ్రీ కిరణ్ రిజీజూ, సంస్కృతి శాఖ సహాయ మంత్రులు శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్, శ్రీమతి మీనాక్షి లేఖి మరియు ఇంటర్ నేశనల్ బుద్ధిస్ట్ కన్ ఫెడరేశన్ సెక్రట్రి జనరల్ డాక్టర్ శ్రీ ధమ్మపియ లు పాల్గొన్నారు.
పూర్వరంగం
ఏప్రిల్ 20 వ మరియు 21 వ తేదీల లో రెండు రోజు ల పాటు జరిగే ఈ శిఖర సమ్మేళనాన్ని ఇంటర్ నేశనల్ బుద్ధిస్ట్ కన్ ఫెడరేశన్ సహకారం తో కేంద్ర సంస్కృతి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ‘‘రిస్పాన్సెస్ టు కంటెంపరరి చాలింజెస్: :ఫిలాసఫీ టు ప్రాక్సిస్’’ అనేది గ్లోబల్ బుద్ధిస్ట్ సమిట్ యొక్క ఇతివృత్తం గా ఉంది.
బౌద్ధానికి సంబంధించినటువంటి మరియు సార్వజనీన అందోళనల పై ప్రపంచ బౌద్ధ ధమ్మ నాయకత్వాన్ని, పండితుల ను నిమగ్నం చేయడాని కి, వాటి ని సమష్టి గా పరిష్కరించడాని కి విధాన పరమైన సూచనల ను అందించాలి అనేదే ఈ శిఖర సమ్మేళనం యొక్క ప్రయాస గా ఉన్నది. సమకాలీన పరిస్థితుల లో బుద్ధ ధమ్మం యొక్క ప్రాథమిక విలువ లు ఏ విధం గా ప్రేరణ ను, మార్గదర్శకత్వాన్ని అందించగలవో ఈ శిఖర సమ్మేళనం చర్చ ల రూపేణా అన్వేషిస్తుంది.
ఈ శిఖర సమ్మేళనం లో ప్రపంచ వ్యాప్తం గా ఉన్న ప్రముఖ పండితులు, సంఘ నాయకులు, ధమ్మ అవలంబికులు పాల్గొన్నారు. వారు ప్రపంచ సమస్యల పై చర్చలు జరపనున్నారు. విశ్వజనీన విలువల పై ఆధారపడిన బుద్ధ ధమ్మ లో సమాధానాల ను అన్వేషిస్తారు. నాలుగు అంశాల పైన చర్చ లు జరుపుతారు. అవి ఏవేవి అంటే వాటి లో బుద్ధ ధమ్మ మరియు శాంతి; బుద్ధ ధమ్మ: పర్యావరణ సంక్షోభం, ఆరోగ్యం మరియు స్థిరత్వం; నలంద బౌద్ధ సంప్రదాయం పరిరక్షణ; బుద్ధ ధమ్మ తీర్థయాత్ర, జీవన వారసత్వం మరియు బుద్ధ అవశేషాలు: దక్షిణ, ఆగ్నేయ మరియు తూర్పు ఆసియా లోని దేశాల కు భారతదేశం యొక్క శతాబ్దాల నాటి సాంస్కృతిక సంబంధాల కు స్థిరమైన పునాది అనేవి భాగం గా ఉంటాయి.
बुद्ध व्यक्ति से आगे बढ़कर एक बोध हैं।
— PMO India (@PMOIndia) April 20, 2023
बुद्ध स्वरूप से आगे बढ़कर एक सोच हैं।
बुद्ध चित्रण से आगे बढ़कर एक चेतना हैं। pic.twitter.com/ipGZreYYaS
Inspired by teachings of Lord Buddha, India is taking new initiatives for global welfare. pic.twitter.com/KLlHv9eJ6K
— PMO India (@PMOIndia) April 20, 2023
हमने भगवान बुद्ध के मूल्यों का निरंतर प्रसार किया है। pic.twitter.com/Sfp6ehuid2
— PMO India (@PMOIndia) April 20, 2023
भारत विश्व के हर मानव के दुःख को अपना दुःख समझता है। pic.twitter.com/zXuyTIjNc2
— PMO India (@PMOIndia) April 20, 2023
समस्याओं से समाधान की यात्रा ही बुद्ध की यात्रा है। pic.twitter.com/nMxaLFJzMr
— PMO India (@PMOIndia) April 20, 2023
आज दुनिया जिस युद्ध और अशांति से पीड़ित है, बुद्ध ने सदियों पहले इसका समाधान दिया था। pic.twitter.com/cmPMsYMgIk
— PMO India (@PMOIndia) April 20, 2023
भारत ने दुनिया को युद्ध नहीं बुद्ध दिए हैं। pic.twitter.com/lXWNyN9yF1
— PMO India (@PMOIndia) April 20, 2023
बुद्ध का मार्ग भविष्य का मार्ग है, sustainability का मार्ग है। pic.twitter.com/XEdTYcPWyn
— PMO India (@PMOIndia) April 20, 2023