మేక్ ఇన్ ఇండియా, అనేది భారతదేశం కోసం, ప్రపంచం కోసం: ప్రధాని మోదీ
వచ్చే ఐదేళ్లలో రక్షణ ఉత్పత్తిలో ఎంఎస్‌ఎంఇల సంఖ్యను 15 వేలకు పెంచడమే మా ప్రయత్నం: ప్రధాని మోదీ
భారతదేశంలో రక్షణ తయారీకి అపారమైన సామర్థ్యం ఉంది; డిమాండ్ ఉంది, ప్రజాస్వామ్యం & నిర్ణయాత్మకం: ప్రధాని

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘డిఫ్ ఎక్స్‌ పో’ యొక్క ప‌ద‌కొండో సంచిక ను ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని ల‌ఖ్ న‌వూ లో ఈ రోజు న ప్రారంభించారు.  ప్ర‌తి రెండు సంవ‌త్స‌రాల‌ కు ఒక‌సారి నిర్వ‌హించే భార‌త‌దేశ‌ సైనిక ప్ర‌ద‌ర్శ‌న దేశాని కి ఒక ప్ర‌పంచ స్థాయి ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల కేంద్రం గా ఉన్న స‌త్తా ను నిరూపించ‌ద‌లుస్తోంది.  ‘డిఫ్ ఎక్స్‌ పో 2020’ భార‌త‌దేశాని కి చెందిన అతిపెద్ద ర‌క్ష‌ణ రంగ ఉత్ప‌త్తుల ప్ర‌ద‌ర్శన వేదిక‌ల‌ లో ఒక‌టిగానే కాకుండా ప్ర‌పంచం లో అగ్ర‌గామి డిఫ్ ఎక్స్‌ పో ల‌లో ఒక‌టి గా కూడా మారింది.  ఈ ప‌ర్యాయం ఈ ఎక్స్‌ పో లో ప్ర‌పంచం అంతటి నుండి ఒక వేయి ర‌క్ష‌ణ సంబంధ త‌యారీదారు సంస్థ‌లు మ‌రియు  150 కంపెనీలు  పాలుపంచుకొంటున్నాయి.

 

డిఫ్ ఎక్స్‌ పో యొక్క ప‌ద‌కొండో సంచిక కు ప్ర‌తి ఒక్క‌రి ని భార‌త‌దేశ ప్ర‌ధాన మంత్రి హోదా లో మాత్ర‌మే కాకుండా ఉత్త‌ర్ ప్ర‌దేశ్ యొక్క ఎంపీ గా కూడా ఆహ్వానించ‌డం త‌న కు రెట్టింపు సంతోషాన్ని ఇస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ‘‘ఇది ప్ర‌జ‌ల కు మ‌రియు భార‌త‌దేశం లోని యువ‌త కు ఒక చాలా పెద్ద అవ‌కాశం.  ‘మేక్ ఇన్ ఇండియా’ భార‌త‌దేశ భ‌ద్ర‌త ను పెంచ‌డం ఒక్క‌టే కాకుండా ర‌క్ష‌ణ రంగం లో ఉపాధి తాలూకు నూత‌న అవ‌కాశాల ను కూడా సృష్టిస్తుంది.  ఇది రాబోయే కాలం లో ర‌క్ష‌ణ సంబంధిత ఎగుమ‌తుల కు ద‌న్ను గా కూడా నిలుస్తుంది’’ అని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

భార‌త‌దేశం కేవ‌లం ఒక విప‌ణి కాదు, ఇది యావ‌త్తు ప్ర‌పంచానికి ఒక అపార‌మైన అవ‌కాశం కూడా

నేటి డిఫ్ ఎక్స్‌ పో భార‌త‌దేశం యొక్క విశాల‌త్వాని కి, దాని వ్యాప్తి కి, వివిదత్వాని కి, అలాగే ప్ర‌పంచం లో దాని యొక్క విస్తృత భాగ‌స్వామ్యాని కి ఒక స‌జీవ‌మైన సాక్ష్యం గా ఉంది.  భార‌త‌దేశం ర‌క్ష‌ణ మరియుభ‌ద్ర‌త   రంగం లో ఒక బ‌ల‌మైన పాత్ర ను పోషిస్తూ ముందంజ వేస్తోంద‌న‌డానికి ఇది ఒక రుజువు గా ఉన్నది.  ఈ ఎక్స్‌ పో రక్ష‌ణ‌ కు సంబంధించిన ప‌రిశ్ర‌మ‌ కు ప్ర‌తిబింబం గా ఉండ‌ట‌మే కాక భార‌త‌దేశం ప‌ట్ల ప్ర‌పంచాని కి ఉన్న విశ్వాసాని కి కూడాను ప్ర‌తిబింబం గా నిలుస్తున్నది.  ర‌క్ష‌ణ గురించి మ‌రియు ఆర్థిక వ్య‌వ‌స్థ ను గురించి ప‌రిచ‌యం ఉన్న‌వారు భార‌త‌దేశం కేవ‌లం ఒక మార్కెట్ కాదు యావ‌త్తు ప్ర‌పంచాని కి ఒక అపార‌మైన అవ‌కాశాల నిల‌యం అన్న సంగ‌తి ని త‌ప్ప‌క గుర్తెరుగుతారు.

డిజిట‌ల్ ట్రాన్స్‌ ఫార్మేశ‌న్ ఆఫ్ డిఫెన్స్‌’ రేప‌టి స‌వాళ్ళ ను ప్ర‌తిబింబిస్తున్నది

డిఫ్ ఎక్స్ పో యొక్క ఉప ఇతివృత్తం అయిన‌టువంటి ‘డిజిట‌ల్ ట్రాన్స్‌ ఫార్మేశ‌న్ ఆఫ్ డిఫెన్స్‌’ రేప‌టి స‌వాళ్ళ ను మ‌రియు చింత‌ల ను ప్ర‌తిబింబిస్తోంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  జీవితం సాంకేతిక విజ్ఞాన చోద‌కం గా మారుతున్న క్ర‌మం లో, భ‌ద్ర‌త ప‌ర‌మైన ఆందోళ‌న‌ లు మ‌రియు స‌వాళ్ళు మ‌రింత గంభీరం గా మారుతున్నాయి.  ఇది వ‌ర్త‌మానానికే కాక‌ మ‌న భ‌విష్య‌త్తు కు సంబంధించి కూడాను ఒక ముఖ్య విష‌యం.  ప్ర‌పంచం అంత‌టా ర‌క్ష‌ణ బ‌ల‌గాలు స‌రిక్రొత్త సాంకేతిక‌త ల‌ను రూపొందించుకొంటున్నాయి.  భార‌త‌దేశం సైతం ప్ర‌పంచం తో పాటే క‌దం తొక్కుతున్నది.  అనేక మూల రూపాల ను కూడా అభివృద్ధి ప‌ర‌చ‌డం జ‌రుగుతున్నది.  వ‌చ్చే అయిదు సంవ‌త్స‌రాల కాలం లో ర‌క్ష‌ణ రంగం లో ఆర్టిఫిశ‌ల్ ఇంటెలిజెన్స్ తాలూకు క‌నీసం 25 ఉత్ప‌త్తుల ను అభివృద్ధి ప‌ర‌చాల‌నేది మా ల‌క్ష్యం గా ఉంది.

అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ క‌ల‌ ను పండించ‌డం

ల‌ఖ్ న‌వూ లోని ఈ ఎక్స్‌ పో మ‌రియొక కార‌ణం వ‌ల్ల కూడా ముఖ్య‌మైన‌టువంటిది గా ఉందని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  భార‌త‌దేశం పూర్వ ప్ర‌ధాని కీ.శే. అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ ర‌క్ష‌ణ రంగం లో త‌యారీ ప్ర‌క్రియ దేశ‌వాళీది గా ఉండాల‌ని క‌ల‌గ‌న్నారు.  మ‌రి ఆ దిశ గా అనేక చ‌ర్య‌ల‌ ను తీసుకున్నారు.

“ఆయ‌న దార్శ‌నిక‌త ను అనుస‌రిస్తూ, మేము అనేక ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల త‌యారీ ప్ర‌క్రియ ను వేగ‌వంతం చేశాము.  2014వ సంవ‌త్స‌రం లోనే మేము 217 ర‌క్ష‌ణ రంగ‌ సంబంధ లైసెన్సుల‌ ను ఇచ్చాము.  గ‌డ‌చిన అయిదు సంవ‌త్స‌రాల లో ఈ సంఖ్య 460కి చేరుకొంది.  భార‌త‌దేశం ప్ర‌స్తుతం శ‌త‌ఘ్ని ద‌ళం వాడే ఆయుధాలు మొద‌లుకొని, యుద్ధ విమానాల వాహ‌కాల నుండి, పోరాట జ‌లాంత‌ర్గాముల వ‌ర‌కు  త‌యారు చేస్తున్న‌ది.  ప్ర‌పంచ ర‌క్ష‌ణ సంబంధ ఎగుమతుల లో భార‌త‌దేశం వాటా కూడా అధికం అయింది.  గ‌డ‌చిన రెండు సంవ‌త్స‌రాల కాలం లో భార‌త‌దేశం దాదాపు గా 17 వేల కోట్ల ర‌క్ష‌ణ రంగ ఉత్ప‌త్తుల‌ ను ఎగుమ‌తి చేసింది.  ప్ర‌స్తుతం మా ల‌క్ష్యం ర‌క్ష‌ణ సంబంధిత‌ ఎగుమ‌తుల‌ ను 5 బిలియ‌న్ డాల‌ర్ స్థాయికి పెంచాల‌నేదే’’ అని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

ర‌క్ష‌ణ రంగం లో ప‌రిశోధ‌న మ‌రియు అభివృద్ధి అనేది దేశ విధానం లో ఒక ప్ర‌ధాన‌మైన భాగం

‘‘గ‌త అయిదారు సంవ‌త్స‌రాల కాలం లో మా ప్ర‌భుత్వం ప‌రిశోధ‌న మ‌రియు అభివృద్ధి  (ఆర్‌ & డి) ని మా దేశం యొక్క విధానం లో ఒక ప్ర‌ధాన‌మైన భాగం గా తీర్చిదిద్దింది.  ర‌క్ష‌ణ రంగ ఆర్‌ & డి మ‌రియు త‌యారీ కై దేశం లో అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాల‌ ను స‌న్న‌ద్ధం చేయ‌డం జ‌రుగుతోంది.  ఇత‌ర దేశాల తో సంయుక్త సంస్థ‌ల కై క‌స‌ర‌త్తు లు జ‌రుగుతున్నాయి.  కార్య‌సాధ‌న లో అవ‌రోధాల‌న్నిటి ని తొల‌గించేందుకు త‌దేక దృక్ప‌థం తో ఒక ప్ర‌య‌త్నం కూడా చేయ‌డ‌మైంది.  ఇది పెట్టుబ‌డి కి మ‌రియు నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌ కు సిద్ధం గా ఉన్న ఒక వాతావ‌ర‌ణానికి దారితీసింది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ఉత్ప‌త్తిదారు కు మ‌రియు వినియోగ‌దారు కు మ‌ధ్య భాగ‌స్వామ్యం

ఉత్ప‌త్తిదారు కు మ‌రియు వినియోగ‌దారు కు మ‌ధ్య భాగ‌స్వామ్యం ఏర్ప‌ర‌చ‌డం ద్వారా దేశ భ‌ద్ర‌త ను మ‌రింత శ‌క్తిమంతం చేయ‌వ‌చ్చ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

‘‘ర‌క్ష‌ణ సంబంధిత త‌యారీ కేవ‌లం ప్ర‌భుత్వ సంస్థ‌ల కు ప‌రిమితం కాకూడ‌దు.  అందులో ప్రైవేటు రంగం కూడా స‌మాన‌మైన ప్రాతినిధ్యాన్ని మ‌రియు భాగ‌స్వామ్యాన్ని క‌లిగివుండాలి” అని ఆయ‌న అన్నారు.

‘న్యూ ఇండియా’ కోసం నూత‌న ల‌క్ష్యాలు

భార‌త‌దేశం లో రెండు ర‌క్ష‌ణ త‌యారీ కారిడోర్ లు నిర్మాణాధీనం లో ఉన్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.  వాటిలో ఒక‌టి త‌మిళ నాడు లో, మ‌రొక‌టి ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో ఉన్నాయి.  ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని డిఫెన్స్ కారిడోర్ యొక్క ఆరు భాగాల ను ల‌ఖ్ న‌వూ తో పాటు కాన్‌ పుర్, చిత్ర‌కూట్‌, ఝాన్సీ, ఆగ్రా, ఇంకా అలీగ‌ఢ్ ల‌లో నెల‌కొల్ప‌డం జ‌రుతుంది.  భార‌త‌దేశం లో ర‌క్ష‌ణ సంబంధిత త‌యారీ కి మ‌రింత జోరు ను సంత‌రించ‌డం కోసం క్రొత్త ల‌క్ష్యాల ను నిర్దేశించ‌డ‌మైంది.

“ర‌క్ష‌ణ ఉత్ప‌త్తి రంగం లో ఎమ్ఎస్ఎమ్ఇ ల సంఖ్య ను రానున్న అయిదు సంవ‌త్స‌రాల కాలం లో 15 వేల కు పైబ‌డి తీసుకు పోవ‌డం అనేది మా యొక్క ల‌క్ష్యం గా ఉంది.  ఐ-డిఇఎక్స్ (I-DEX) తాలూకు ఆలోచ‌న ను విస్త‌రింప‌జేసేందుకు గాను 200 డిఫెన్స్ స్టార్ట్-అప్ ల‌ను క్రొత్త గా ప్రారంభించాల‌ని ల‌క్ష్యం గా పెట్టుకోవ‌డ‌మైంది.  క‌నీసం 50 నూత‌న సాంకేతిక‌త‌ లను మ‌రియు ఉత్ప‌త్తుల ను అభివృద్ధి ప‌ర‌చాల‌నేది దీని లోని ప్ర‌యాస.  దేశం లోని ప్ర‌ధాన‌మైన పారిశ్రామిక సంఘాలు ర‌క్ష‌ణ రంగ త‌యారీ కై ఒక ఉమ్మ‌డి వేదిక ను ఏర్పాటు చేయాల‌ని, అలా చేసిన‌ప్పుడు అవి ర‌క్ష‌ణ రంగం లో సాంకేతిక‌త అభివృద్ధి కి మ‌రియు ఉత్ప‌త్తి కి సంబంధించిన ప్ర‌యోజ‌నాన్ని పొంద‌గ‌లుగుతాయ‌ని కూడా నేను సూచిస్తున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"