‘‘అక్టోబరు 30 వతేదీ మరియు 31 వ తేదీ లు ప్రతి ఒక్కరికీ ఎంతో ప్రేరణ ను ఇచ్చేటటువంటివి, ఎందుకంటే వాటి లో అక్టోబరు 30 వ తేదీ న గోవింద్ గురూజీ యొక్క వర్ధంతి మరి అక్టోబరు 31 వ తేదీ న సర్ దార్ పటేల్ గారి జయంతి కాబట్టి’
‘‘భారదేశం యొక్క అభివృద్ధి గాథ ప్రపంచమంతటా ఒక చర్చనీయాంశం గా మారిపోయింది’’
‘‘మోదీ ఎటువంటిసంకల్పాన్ని తీసుకున్నా, దానిని నెరవేర్చుతారు’’
‘‘ సాగు నీటి పారుదలప్రాజెక్టు ల కారణం గా గత 20- 22 సంవత్సరాల లో ఉత్తర గురజరాత్ లో సాగునీటి పారుదల పరిధిఅనేక రెట్లు పెరిగిపోయింది’’
‘‘గుజరాత్ లో ఆరంభంఅయిన నీటి సంరక్షణ పథకం ప్రస్తుతం దేశం లో జల్ జీవన్ మిశన్ రూపాన్ని తీసుకొంది’’
‘‘ఉత్తర గుజరాత్ లో 800 కు పైగా క్రొత్త గ్రామీణ పాడి సహకార సంఘాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది’’
‘‘మన వారసత్వాన్ని అభివృద్ధితో జోడించడం కోసం ప్రస్తుతం దేశం లో ఇదివరకు ఎన్నడు లేని విధం గా పనులు జరుగుతున్నాయి’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న గుజరాత్ లోని మెహ్ సాణా లో దాదాపు గా 5,800 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టుల ను ప్రారంభించడం, దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు గా శంకుస్థాపన కూడా వేశారు. ఈ ప్రాజెక్టుల లో రైలు, రోడ్డు, త్రాగునీరు మరియు సాగు నీటి పారుదల వంటి అనేక రంగాల కు చెందిన ప్రాజెక్టు లు ఉన్నాయి.

జన సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, అక్టోబరు 30 వ తేదీ మరియు 31 వ తేదీ ప్రతి ఒక్కరికీ ఎంతో ప్రేరణ ను అందిస్తున్నాయని, వాటిలో అక్టోబరు 30 వ తేదీ న గోవింద్ గురు జీ యొక్క వర్ధంతి ఉండగా, అక్టోబరు 31 వ తేదీ న ర్ దార్ పటేల్ గారి జయంతి ఉంది అన్నారు. ‘‘మన తరం ప్రపంచం లో అతి పెద్దదైన విగ్రహం ‘ది స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ని నిర్మించడం ద్వారా సర్ దార్ సాహబ్ కు శ్రద్ధాంజలి ని చాటుకొంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్య్ర భారతదేశం లో ఆదివాసి సమాజం అందించిన తోడ్పాటు కు మరియు ఆదివాసి సమాజం ఒడిగట్టిన త్యాగాని కి ప్రతీక గా గోవింద్ గురు జీ యొక్క జీవనం నిలచింది అని ఆయన ప్రస్తావించారు. గత కొన్ని సంవత్సరాల లో ప్రభుత్వం మాన్ గఢ్ ధామ్ యొక్క ప్రాముఖ్యాన్ని జాతీయ స్థాయి లో ప్రతిష్ఠించింది అని ఆయన చెప్తూ, ఈ కార్యాని కి గాను తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

అంతకు ముందు ప్రధాన మంత్రి అంబాజీ ఆలయం లో దైవ దర్శనం మరియు పూజ కార్యక్రమాల లో తాను పాలుపంచుకొన్న విషయాన్ని ప్రస్తావించి, అంబాజీ దేవి ని ఆశీస్సులకై వేడుకొనే అవకాశం తనకు లభించినందుకు కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. గబ్బర్ పర్వతం యొక్క అభివృద్ధి పనుల ను చేపట్టి, ఆ పర్వతం యొక్క వైభవాన్ని వృద్ధి చెందింప చేసేందుకు జరుగుతున్న కార్యాల ను ఆయన ప్రశంసించారు. ఈ రోజు న చేపట్టిన ప్రాజెక్టుల ను గురించి ఆయన మాట్లాడుతూ, మాత ఆశీస్సుల తో సుమారు 6,000 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టుల కు శంకుస్థాపన మరియు ప్రారంభం జరిగాయన్నారు. ఈ ప్రాజెక్టు లు ఆ ప్రాంతం లో కనెక్టివిటీ ని మరింత మెరుగు పరచి, అక్కడి రైతుల కు మేలు చేస్తాయి అని ఆయన వివరించారు. ‘‘ఈ ప్రాజెక్టు ల వల్ల మెహ్ సాణా, పాటన్, బనాస్ కాంఠా, సాబర్ కాంఠా, మహిసాగర్, అహమదాబాద్, ఇంకా గాంధీనగర్ ల చుట్టుప్రక్కల జిల్లాల కు కూడా ప్రయోజనం అందుతుంది’’ అని ఆయన చెప్పారు. ఈ రోజు న చేపడుతున్న ప్రాజెక్టుల కు గాను గుజరాత్ ప్రజల కు ఆయన అభినందనల ను తెలియ జేశారు.

‘‘భారతదేశం యొక్క అభివృద్ధి గాథ ప్రపంచవ్యాప్తం గా చర్చనీయాంశం గా మారిపోయింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. చంద్ర గ్రహం దక్షిణ ధ్రువం లో చంద్రయాన్ దిగడం గురించి మరియు జి20 కి భారతదేశం అధ్యక్షత విజయవంతం కావడాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. భారతదేశం యొక్క ప్రతిష్ట పెరిగినందుకు ఇవ్వవలసిన ఖ్యాతి ని ప్రజల యొక్క శక్తి కే ఇవ్వాలి అని ఆయన అన్నారు. దేశం లో చోటుచేసుకొంటున్న సమగ్ర అభివృద్ధి ని గురించి ఆయన ప్రముఖం గా ప్రకటిస్తూ, ఈ సందర్భం లో జల సంరక్షణ, సాగు నీటి పారుదల మరియు త్రాగునీటి కోసం తీసుకొన్న చర్యల ను ప్రస్తావించారు. రహదారులు కావచ్చు, రైలు మార్గాలు కావచ్చు లేదా విమానాశ్రయాలు కావచ్చు.. అన్ని రంగాల లో ఇదివరకు ఎరుగని స్థాయి లో పెట్టుబడులు చోటు చేసుకొంటున్న సంగతి ని గురించి శ్రీ నరేంద్ర మోదీ చెప్తూ, ఆ పెట్టుబడులు భారతదేశం లో ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి కి దోహదపడతాయని స్పష్టంచేశారు.

గుజరాత్ లో ప్రజలు ప్రస్తుతం దేశం లోని మిగతా ప్రాంతాల లో జరుగుతున్న అభివృద్ధి పనుల ను ఇప్పటికే కనులారా కాంచారు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ‘‘మోదీ ఏ సంకల్పాన్ని తీసుకొన్నా సరే దాని ని పూర్తి చేస్తార’’ని ప్రధాన మంత్రి అన్నారు. శరవేగం గా జరుగుతున్న అభివృద్ధి తాలూకు ఖ్యాతి ని గుజరాత్ ప్రజలు ఎన్నుకొన్న స్థిరమైన ప్రభుత్వానికే ఆయన కట్టబెడుతూ, దీని ద్వారా ఉత్తర గుజరాత్ సహా పూర్తి రాష్ట్రం ప్రయోజనాల ను అందుకొంది అన్నారు.

 

త్రాగు నీటి ఎద్దడి మరియు సేద్యానికై సాగునీటిపారుదల కు కొరత ల కారణం గా ఉత్తర గుజరాత్ అంతటా జీవనం కఠినం గా మారిన సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, ఒక్క పాడి వ్యాపారాన్నే తీసుకొంటే అది ఎన్నో కష్టనష్టాల ను ఎదుర్కోవలసి వచ్చిందన్నారు. రైతులు ఏటా ఒక పంట ను మాత్రమే సాగు చేసే, అది కూడాను ఒక కచ్చితత్వానికి వీలు ఉండని స్థితి లో ఉండే వారు అని ఆయన వివరించారు. ఈ ప్రాంతాని కి జవసత్వాల ను తిరిగి అందించేందుకు ఇక్కడ నీటి సరఫరా కోసం మరియు నీటి పారుదల సౌకర్యాల కోసం చేపట్టిన పనుల ను గురించి తెలియజేశారు. ‘‘మేం ఉత్తర గుజరాత్ లో వ్యవసాయ రంగం తో పాటు పారిశ్రామిక రంగాన్ని కూడాను అభివృద్ధి చేసేందుకు పాటుపడ్డాం’’ అని ఆయన అన్నారు. ఉత్తర గుజరాత్ లో ప్రజల కు సాధ్యమైనంత అధిక సంపాదన కు క్రొత్త క్రొత్త మార్గాల ను సృష్టించాలి అన్నదే ప్రభుత్వం ధ్యేయం అని ఆయన అన్నారు. గుజరాత్ యొక్క అభివృద్ధి కి గాను నర్మద మరియు మాహీ నదుల జలాల ను ఉపయోగించే సుజలాం-సఫలాం పథకం గురించి ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. గరిష్ఠ లాభాల కు పూచీ పడేటట్లు గా సాబర్ మతీ మీద 6 ఆనకట్టల ను నిర్మించడం జరుగుతోంది అని శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు. ‘‘వీటిలో ఒక ఆనకట్ట ను ఈ రోజు న ప్రారంభించడమైంది. దీని ద్వారా మన రైతుల కు మరియు డజన్ ల కొద్దీ గ్రామాల కు చాలా లాభం చేకూరుతుంది’’ అని ఆయన అన్నారు.

ఈ సాగు నీటిపారుదల ప్రాజెక్టు ల కారణం గా గత 20-22 సంవత్సరాల లో ఉత్తర గుజరాత్ లో సేద్యపు నీటిపారుదల యొక్క పరిధి ఇంతలంతలు గా వృద్ధి చెందింది అని ప్రధాన మంత్రి చెప్పారు. ప్రభుత్వం అందుబాటు లోకి తీసుకు వచ్చినటువంటి సూక్ష్మ సేద్యం సంబంధి నూతన సాంకేతికత ను ఉత్తర గుజరాత్ రైతులు ఇట్టే అందిపుచ్చుకున్నారు అని ఆయన తెలియజేస్తూ, ఈ నవీన సాంకేతికత ను బనాస్ కాంఠా లో 70 శాతం క్షేత్రం లోని రైతులు ఉపయోగించుకొంటున్నందుకు సంతోషాన్ని వెలిబుచ్చారు. ‘‘రైతులు ఇక గోధుమలు, ఆముదం, వేరుశనగ, ఇంకా సెనగ వంటి అనేక పంటల తో పాటు గా సోంపు, జీలకర్ర తదితర మసాలా దినుసుల పంటల ను ఎన్నింటినో సాగు చేయగలుగుతారు’’ అని ఆయన వివరించారు. దేశం లో సాగయ్యే ఇసాబ్ గోల్ శుద్ధి లో 90 శాతం గుజరాత్ లోనే అవుతోంది, ఇది గుజరాత్ కు ఒక విశిష్టమైన గుర్తింపు ను ప్రసాదిస్తోంది అని ప్రధాన మంత్రి తెలిపారు. వ్యావసాయిక ఉత్పాదన అంతకంతకు పెరుగుతోంది అని కూడా ఆయన వివరిస్తూ, బంగాళా దుంపలు, కేరట్, మామిడి, ఉసిరి, దానిమ్మ, జామ మరియు నిమ్మ పండ్ల సాగు ను గురించి ప్రస్తావించారు. డిసా ను బంగాళా దుంపల సాగు కు ఒక సేంద్రియ వ్యావసాయక కేంద్రం గా తీర్చిదిద్దేందుకు ప్రయాస లు జరుగుతున్నాయి అని ఆయన అన్నారు. బనాస్ కాంఠా లో బంగాళా దుంపల ప్రాసెసింగ్ కోసం ఒక భారీ ప్లాంటు ను ఏర్పాటు చేసే అంశాన్ని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. మెహ్ సాణా లో ఎగ్రో ఫూడ్ పార్క్ నిర్మాణం జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. బనాస్ కాంఠా లో ఇదేవిధమైనటువంటి మెగా ఫూడ్ పార్కు ను నిర్మించడాని కి తగిన సన్నాహాలు జరుగుతున్నాయి అని ఆయన అన్నారు.

 

ప్రతి ఇంటి కి నీటి ని సరఫరా చేయడం గురించి శ్రీ నరేంద్ర మోదీ చెప్తూ, గుజరాత్ లో మొదలు పెట్టిన జల సంరక్షణ పథకం ప్రస్తుతం యావత్తు దేశం కోసం జల్ జీవన్ మిశన్ రూపాన్ని సంతరించుకొంది అన్నారు. ‘‘గుజరాత్ లో మాదిరి, హర్ ఘర్ జల్ అభియాన్ దేశం లో కోట్ల కొద్దీ ప్రజల జీవనాల లో మార్పు ను తీసుకు వస్తోంది’’ అని ఆయన అన్నారు.

 

   పశుసంవర్ధక, పాడిపరిశ్రమ ప్రగతి వల్ల అత్యధికంగా లబ్ధి పొందుతున్నది మహిళలేనని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక ఉత్తర గుజరాత్‌లో కొన్నేళ్లుగా వందలాది కొత్త పశు వైద్యశాలలు నిర్మించిన నేపథ్యంలో జంతు ఆరోగ్యం, శ్రేయస్సు చక్కగా ఉంటాయన్నారు. తద్వారా పాల దిగుబడి గణనీయంగా పెరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో గత రెండు దశాబ్దాల్లో 800కుపైగా కొత్త గ్రామీణ పాల సహకార సంఘాలు కూడా ఏర్పాటైనట్లు ప్రధాని గుర్తుచేశారు. ఫలితంగా ‘‘బనస్ డెయిరీ, దూద్ సాగర్ లేదా సబర్ డెయిరీ వంటివి కూడా మునుపెన్నడూ లేనిరీతిలో విస్తరించబడుతున్నాయి. అంతేకాకుండా ఇతరత్రా రైతు ఉత్పత్తులకూ ఇవి భారీ ప్రాసెసింగ్ కేంద్రాలుగా మారుతున్నాయి’’ అన్నారు. పశుగణాన్ని వ్యాధుల ముప్పునుంచి కాపాడేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున ఉచిత టీకాల  కార్యక్రమం చేపట్టిందని ప్రధాని చెప్పారు. ఇందుకోసం రూ.15 వేల కోట్లు వెచ్చిస్తున్నదని వెల్లడించారు. ఈ ప్రాంత పశుపోషకులు టీకాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ పశుగణానికి టీకాలు వేయించాలని ఆయన కోరారు. గోబర్-ధన్ కింద ఆవు పేడతో బయోగ్యాస్, బయో ‘సిఎన్‌జి‘ తయారీ కోసం అనేక ప్లాంట్లు ఏర్పాటు చేయడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.’

   ఉత్తర గుజరాత్‌లో ఆటోమొబైల్ పరిశ్రమ విస్తరణ గురించి మాట్లాడుతూ- ఉపాధి అవకాశాలు, ప్రజల ఆదాయం పెంచిన మండల్-బేచరాజీ మోటారు వాహన కూడలి అభివృద్ధిని శ్రీ మోదీ ప్రస్తావించారు. ‘‘ఇక్కడి పరిశ్రమల ఆదాయం కేవలం పదేళ్లలోనై రెట్టింపైంది. మెహసానాలో ఆహార తయారీలోపాటు ఔషధ, ఇంజనీరింగ్ పరిశ్రమలు కూడా పురోగమించాయి. బనస్కాంత, సబర్‌కాంత జిల్లాల్లో పింగాణీ ఆధారిత పరిశ్రమలు వచ్చాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ₹5000 కోట్లకుపైగా విలువైన రైల్వే ప్రాజెక్టుల ప్రారంభం గురించి కూడా ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. మెహసానా, అహ్మదాబాద్ మధ్య ప్రత్యేక సరకు రవాణా కారిడార్ గురించి వివరించారు. పిపవావ్, పోర్‌బందర్, జామ్‌నగర్ వంటి ప్రధాన ఓడరేవులతో ఉత్తర గుజరాత్‌ సంధానాన్ని ఈ కారిడార్ మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆయన నొక్కిచెప్పారు. ఇది ఉత్తర గుజరాత్‌లో రవాణా, నిల్వ సంబంధిత రంగాలను కూడా బలోపేతం చేయగలదని పేర్కొన్నారు.

 

   దేశంలో హరిత ఉదజని, సౌరశక్తి ఉత్పత్తి గురించి చెబుతూ- ఇందులో భాగంగా రాష్ట్రంలోని పటాన్‌లోగల సౌరశక్తి పార్కుతోపాటు బనస్కాంతలో సౌరశక్తితో 24 గంటల విద్యుత్ సరఫరాగల మోధేరా గ్రామాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘ఇవాళ భవనాల పైకప్పు మీద సౌరశక్తి ఫలకాల ఏర్పాటు కోసం ప్రభుత్వం మీకు గరిష్ఠంగా ఆర్థిక సహాయం చేస్తోంది. తద్వారా ప్రతి కుటుంబానికీ నెలనెలా విద్యుత్ బిల్లును తగ్గించడమే మా లక్ష్యం’’ అన్నారు. గడచిన తొమ్మిదేళ్లలో దాదాపు 2,500 కిలోమీటర్ల మేర తూర్పు-పశ్చిమ సరకు రవాణా కారిడార్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. దీనివల్ల ప్రయాణికుల రైళ్లతోపాటు సరకు రవాణా రైళ్ల ప్రయాణ సమయం తగ్గిందన్నారు. పాలన్‌పూర్ నుంచి హర్యానాలోని రేవారీకి రైళ్ల ద్వారా పాల రవాణాను కూడా ఆయన ప్రస్తావించారు. ‘‘ఇక్కడ చేపట్టిన కటోసన్ రోడ్-బేచరాజీ రైలు మార్గం, విరాంగమ్-సమఖాయలి మార్గం డబ్లింగ్ పనులతో అనుసంధానం బలోపేతం అవుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

   గుజ‌రాత్‌లో ప‌ర్యాట‌క రంగ విస్తరణకుగల సామర్థ్యాన్ని ప్ర‌ధానమంత్రి ప్ర‌స్తావిస్తూ- ప్ర‌పంచ ప్ర‌సిద్ధ‌మైన కచ్ రాణ్ ఉత్స‌వాల గురించి వివరించారు. అలాగే ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక ప్రాంతంగా ఇటీవలే గుర్తింపు పొందిన కచ్‌లోని ధోర్డో గ్రామం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఉత్తర గుజరాత్ దేశంలోనే ప్రధాన పర్యాటక కూడలిగా మారగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు కీలక పర్యాటక కేంద్రంగా మారుతున్న నడబెట్‌ ఉదాహరిస్తూ, భారీ పర్యాటక కూడలిగా రూపొందుతున్న ధరోయి ప్రాంతం గురించి కూడా ప్రస్తావించారు. మెహసానాలోని మోధేరా గ్రామంలోగల సూర్య దేవాలయం, నగరం నడిబొడ్డునగల నిరంతరం ప్రజ్వలించే అఖండ జ్యోతి, వాద్‌నగర్‌లోని కీర్తి తోరణం, ఇతర సంప్రదాయ, అధ్యాత్మిక ప్రదేశాలను కూడా శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రాచీన నాగరికత ఆనవాళ్లను వెల్లడించే తవ్వకాలు సాగుతున్న వాద్‌నగర్‌ యావత్‌ ప్రపంచానికి పర్యాటక కేంద్రంగా మారిందన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ఇక్కడ వారసత్వ సర్క్యూట్ కింద ₹1,000 కోట్లతో అనేక ప్రాంతాలను అభివృద్ధి చేసింది’’ అంటూ ఏటా సగటున 3 లక్షల మందికిపైగా పర్యాటకులు సందర్శించే ‘రాణీగారి బావి’ని ప్రధాని ఉదాహరించారు. చివరగా- ‘‘మన వారసత్వాన్ని అభివృద్ధితో ముడిపెట్టే అద్భుత కృషి నేడు దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇది వికసిత భారతం నిర్మాణంపై మా సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుంది’’ అని ప్రధాని తన ప్రసంగం ముగించారు.

   ఈ కార్యక్రమంలో గుజరాత్ ప్రధానమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర సహాయమంత్రి శ్రీమతి దర్శనా జర్దోష్, స్థానిక ఎంపీ శ్రీ సి.ఆర్.పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

 

నేపథ్యం

   ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా  ప్రధానమంత్రి ప‌లు ప్రాజెక్టుల‌ను జాతికి అంకితం చేయడంతోపాటు మ‌రికొన్నిటికి శంకుస్థాపన కూడా చేశారు. ఈ మేరకు జాతికి అంకితం చేసిన వాటిలో రైల్వే, రహదారులు, తాగునీరు, నీటిపారుదల తదితర రంగాల పథకాలున్నాయి. ఈ మేరకు పశ్చిమ భారత ప్రత్యేక కారిడార్‌ (డబ్లుడి ఎఫ్‌సి)లో భాగమైన న్యూభాండూ-న్యూ సనంద్(ఎన్) విభాగం; విరాంగం-సమాఖియలి రైలు మార్గం డబ్లింగ్; కటోసన్ రోడ్-బెచ్రాజీ- మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్ సైడింగ్) రైలు ప్రాజెక్టు; మెహసానా, గాంధీనగర్ జిల్లాల్లోగల విజాపూర్, మాన్సా తాలూకాలోని వివిధ గ్రామ చెరువుల పనర్పూరక ప్రాజెక్ట్; మెహసానా జిల్లాలో సబర్మతి నదిపై వలసనా బ్యారేజీ; పాలన్‌పూర్, బనస్కాంతలో తాగునీరందించే రెండు పథకాలు; ధరోయ్ ఆనకట్ట ఆధారిత పాలన్‌పూర్ జీవనాడి ప్రాజెక్ట్-హెడ్ వర్క్ సహా 80 ఎంఎల్‌డి సామర్థ్యంగల నీటి శుద్ధి ప్లాంటు తదితరాలున్నాయి.

 

   ఇక ప్రధానమంత్రి శంకుస్థాపన చేసినవాటిలో మహిసాగర్ జిల్లా సంత్రంపూర్ తాలూకాలో నీటిపారుదల సౌకర్యాల కల్పన ప్రాజెక్ట్; నరోడా-దేహగాం-హర్సోల్-ధన్సురా రోడ్, సబర్‌కాంత విస్తరణ, బలోపేతం; గాంధీనగర్ జిల్లాలో కలోల్ నగరపాలిక మురుగునీటి పారుదల, మురుగుశుద్ధి నిర్వహణ ప్రాజెక్ట్; సిద్ధపూర్ (పటాన్), పాలన్‌పూర్ (బనస్కాంత), బయాద్ (ఆరావళి), వాద్‌నగర్ (మెహసానా)లలో మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు ప్రాజెక్టులున్నాయి.

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi