పారాదీప్ రిఫైనరీలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మోనో ఇథిలీన్ గ్లైకాల్ ప్రాజెక్టుకు ప్రారంభం
పారాదీప్ వద్ద 0.6 ఎం ఎం టి పి ఎ
ఎల్ పి జి దిగుమతి సదుపాయాన్ని, పారాదీప్ నుండి హల్దియా వరకు ప్రయాణించే 344 కిలోమీటర్ల పొడవైన ఉత్పత్తి పైప్ లైన్ ను ప్రారంభించిన ప్రధాని
ఐఆర్ఇఎల్ (ఐ) లిమిటెడ్ కు చెందిన ఒడిశా సాండ్స్ కాంప్లెక్స్ లో 5 ఎంఎల్ డి సామర్థ్యం గల సముద్రపు నీటి డీశాలినేషన్ ప్లాంట్ ప్రారంభం
జాతికి పలు రైలు ప్రాజెక్టుల అంకితం, శంకుస్థాపన
పలు రోడ్డు ప్రాజెక్టులు జాతికి అంకితం
"నేటి ప్రాజెక్టులు దేశంలో మారుతున్న పని సంస్కృతిని ప్రదర్శిస్తాయి"
“ప్రస్తుత అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ప్రతిజ్ఞ చేస్తూ భవిష్యత్తు కోసం పని చేస్తున్న ప్రభుత్వం నేడు దేశంలో ఉంది” “స్థానిక వనరులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేలా, ఒడిశాలో ఆధునిక కనెక్టివిటీపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది”

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలోని చండిఖోల్  లో రూ.19,600 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన ,జాతికి అంకితం చేశారు. ఆయిల్ అండ్ గ్యాస్, రైల్వేస్, రోడ్డు, ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్, అటామిక్ ఎనర్జీ వంటి రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, జగన్నాథుడు, మా బిర్జా ఆశీస్సులతో జాజ్ పూర్, ఒడిశాలో ఈ రోజు కొత్త అభివృద్ధి ప్రవాహం మొదలైందని ప్రధాన మంత్రి అన్నారు. శ్రీ బిజూ పట్నాయక్ జయంతిని పురస్కరించుకుని దేశానికి, ఒడిశాకు ఆయన చేసిన అసమాన సేవలను ప్రధాన మంత్రి గుర్తు చేసుకున్నారు.

పెట్రోలియం, సహజవాయువు, అణుశక్తి, రహదారులు, రైల్వేలు, కనెక్టివిటీ రంగాల్లో సుమారు రూ.20,000 కోట్ల విలువైన భారీ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను ప్రస్తావిస్తూ, ఇది ఈ ప్రాంతంలో పారిశ్రామిక కార్యకలాపాలను పెంచుతుందని, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. కొత్తగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గానూ ఒడిషా ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.

 

విక్షిత్ భారత్ సంకల్పంతో పని చేస్తూనే దేశ ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వ విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తున్నట్టు ప్రధాని తెలిపారు. ఇంధన రంగంలో తూర్పు రాష్ట్రాల సామర్థ్యాలను పెంపొందించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రస్తావించారు. ఉర్జా గంగా యోజన కింద ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి ఐదు పెద్ద రాష్ట్రాలు సహజ వాయువు సరఫరా కోసం భారీ ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. ఒడిశాలోని పారాదీప్ నుంచి పశ్చిమబెంగాల్ లోని హల్దియా వరకు 344 కిలోమీటర్ల పొడవైన ప్రొడక్ట్ పైప్ లైన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. పారాదీప్ రిఫైనరీలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మోనో ఇథిలీన్ గ్లైకాల్ ప్రాజెక్టును, పారాదీప్ లో 0.6 ఎంఎంటిపిఎ ఎల్ పి జి ఇంపోర్ట్ ఫెసిలిటీని ఆయన ప్రారంభించారు, ఇది తూర్పు భారతదేశంలోని పాలిస్టర్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పును తీసుకువస్తుంది. భద్రక్, పారాదీప్ లలో టెక్స్ టైల్ పార్కుకు ముడిసరుకును కూడా ఇది అందిస్తుంది.

నేటి సందర్భం దేశంలో మారుతున్న పని సంస్కృతికి చిహ్నమని నొక్కిచెప్పిన ప్రధాని, అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఏనాడూ ఆసక్తి చూపని గత ప్రభుత్వాన్ని , శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులను సకాలంలో ప్రారంభించే ప్రస్తుత ప్రభుత్వంతో పోల్చారు. 2014 తర్వాత పూర్తయిన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ, 2002లో చర్చనీయాంశంగా మారిన పారాదీప్ రిఫైనరీవిషయంలో , ప్రస్తుత ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చే వరకు ఎలాంటి పనులు జరగలేదని  అన్నారు. తెలంగాణలోని సంగారెడ్డిలో పారాదీప్ - హైదరాబాద్ పైప్ లైన్ ను ప్రారంభించడాన్ని, , పశ్చిమబెంగాల్  ఆరాంబాగ్ లోని హల్దియా నుంచి బరౌని వరకు 500 కిలోమీటర్ల పొడవైన క్రూడాయిల్ పైప్ లైన్ ను మూడు రోజుల క్రితం ప్రారంభించడాన్ని  ఆయన ప్రస్తావించారు.

 

ఒడిశా అభివృద్ధికి తూర్పు భారతదేశంలోని సమృద్ధిగా ఉన్న సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందని తెలిపారు. రోజుకు 50 లక్షల లీటర్ల ఉప్పునీటిని శుద్ధి చేసి తాగడానికి అనువుగా మార్చే గంజాం జిల్లాలోని డీశాలినేషన్ ప్లాంట్ గురించి కూడా  ప్రధాని మోదీ వివరించారు.

ఒడిశాలో ఆధునిక కనెక్టివిటీపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, తద్వారా స్థానిక వనరులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంచుతాయని ప్రధాన మంత్రి చెప్పారు. గడచిన పదేళ్లలో 3000 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు, రైల్వేల బడ్జెట్ ను 12 రెట్లు పెంచామని ప్రధాని చెప్పారు. రైలు-హైవే-పోర్టు కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు జాజ్పూర్, భద్రక్, జగత్సింగ్పూర్, మయూర్భంజ్, ఖోర్డా, గంజాం, పూరీ, కెందుఝర్లలో జాతీయ రహదారులను విస్తరిస్తున్నట్లు తెలిపారు.  కొత్త అంగుల్ సుకిందా రైల్వే లైన్ కళింగ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.

బిజూ పట్నాయక్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ, నేటి అభివృద్ధి కార్యక్రమాలకు గానూ, పౌరులను అభినందిస్తూ ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ శ్రీ రఘుబర్ దాస్, ఒడిషా ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.

 

నేపథ్యం

ప్రధాన మంత్రి పారాదీప్ రిఫైనరీలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మోనో ఇథిలీన్ గ్లైకాల్ ప్రాజెక్టును ప్రారంభించారుఇది భారత దేశం దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడంలో మరింత సహాయపడుతుందిఒడిశాలోని పారాదీప్ నుంచి పశ్చిమబెంగాల్ లోని హల్దియా వరకు 344 కిలోమీటర్ల పొడవైన పైప్ లైన్ ను ఆయన ప్రారంభించారుభారత దేశ తూర్పు కోస్తాలో దిగుమతి మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ప్రధాన మంత్రి పారాదీప్ లో 0.6 ఎంఎంటీపీఏ ఎల్ పీజీ ఇంపోర్ట్ ఫెసిలిటీని ప్రారంభించారు.

 ప్రాంతంలో రహదారి మౌలిక సదుపాయాలను పెంపొందించడం కోసం ఎన్ హెచ్-49 లోని సింఘారా నుంచి బింజాబహల్ సెక్షన్ నాలుగు లేన్ లనుఎన్ హెచ్-49 లోని బింజాబహల్ నుంచి తిలిబాని సెక్షన్ నాలుగు లేన్ లనుఎన్ హెచ్-18 లోని బాలాసోర్ఝార్పోఖరియా సెక్షన్  నాలుగు లేన్ లనుఎన్ హెచ్ -16లోని టాంగి-భువనేశ్వర్ సెక్షన్  నాలుగు లేన్ లను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారుచండిఖోల్ వద్ద చండిఖోల్ - పారాదీప్ సెక్షన్ ఎనిమిది లేన్  నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

 

162 కి.మీ.ల బన్సాపానీ - దైతారీ - టోమ్కా - జఖాపురా రైలు మార్గాన్ని ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు. ఇది ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ ఫెసిలిటీ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, కియోంఝర్ జిల్లా నుండి ఇనుము మరియు మాంగనీస్ ఖనిజాన్ని సమీప ఓడరేవులు, ఉక్కు కర్మాగారాలకు సమర్థవంతంగా రవాణా చేయడానికి వీలు కల్పిస్తుంది, ఇది ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదం చేస్తుంది.

కళింగనగర్ లో కాంకోర్ కంటైనర్ డిపో ప్రారంభోత్సవం కూడా దేశీయ, అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో జరిగింది. నార్లాలో ఎలక్ట్రిక్ లోకో పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్, కాంతాబంజిలో వ్యాగన్ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్, బాఘుపాల్ లో నిర్వహణ సౌకర్యాల అప్ గ్రేడేషన్, విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇతర రైల్వే ప్రాజెక్టులలో కొత్త రైలు సర్వీసుల ప్రారంభం కూడా ఉంది.

ఐఆర్ఇఎల్ (ఐ) లిమిటెడ్ కు చెందిన ఒడిశా శాండ్స్ కాంప్లెక్స్ లో ఐదు ఎంఎల్ డీ సామర్థ్యం గల సముద్రపు నీటి డీశాలినేషన్ ప్లాంట్ ను కూడా ప్రధాని ప్రారంభించారు. భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేసిన స్వదేశీ డీశాలినేషన్ టెక్నాలజీల క్షేత్ర అనువర్తనాల్లో భాగంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage