హిందుస్తాన్ ఉర్వరక్ & రసాయన్ లిమిటెడ్ (హెచ్‌యుఆర్ఎల్) సింద్రీ ఎరువుల ప్లాంటు ను దేశ ప్రజల కు ఆయన అంకితం చేశారు
17,600 కోట్ల రూపాయల కు పైగా విలువకలిగిన అనేక రైల్ ప్రాజెక్టుల కు ఝార్‌ఖండ్ లో శంకుస్థాపన చేయడం తో పాటుగా దేశ ప్రజల కు అంకితమిచ్చారు
దేవ్‌ఘర్- డిబ్రూగఢ్ రైలు సర్వీసు కు, టాటానగర్ మరియు బాదామ్‌పహాడ్ మధ్య (రోజు) రాకపోకలు జరిపే ఎమ్ఇఎమ్‌యు రైలు సర్వీసు కు, ఇంకా శివ్‌పుర్ స్టేశన్ నుండి భారీ గా సరకు ను రవాణా చేసే రైలుబండి కి ప్రారంభ సూచక పచ్చజెండా ను ప్రధాన మంత్రి చూపెట్టారు
చత్‌రా లో ఉత్తర కరణ్‌పురా సుపర్ థర్మల్ పవర్ప్రాజెక్టు లో ఒకటో యూనిట్ (దీని సామర్థ్యం 660 మెగా వాట్ లు) ను దేశ ప్రజల కు అంకితమిచ్చారు
ఝార్‌ఖండ్ లో బొగ్గు రంగాని కి సంబంధించిన ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితమిచ్చారు
‘‘పునరుద్ధరణపూర్తి అయిన మరియు పూర్తి అవుతున్న అయిదు ప్లాంటు లు 60 లక్షల మెట్రిక్టన్నుల యూరియా ను ఉత్పత్తి చేయడం ద్వారా ఈ ముఖ్య రంగం లో ఆత్మనిర్భరత సాధన దిశ గా భారతదేశాన్నిశరవేగం గా
సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, 35,700 కోట్ల రూపాయల కు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ను ఝార్ ఖండ్ లో ఈ రోజు న మొదలు పెట్టడమైందని చెప్తూ, రాష్ట్రం లోని రైతుల కు, ఆదివాసుల కు మరియు పౌరుల కు ఆయన అభినందనల ను తెలియ జేశారు.
దీని ద్వారా ఈ ప్లాంటు లు భారతదేశాన్ని ఒక ముఖ్యమైన రంగం లో ఆత్మనిర్భరత సాధన దిశ లోకి శరవేగం గా తీసుకు పోతాయి అని ప్రధాన మంత్రి అన్నారు.
భగవాన్ బిర్‌సా ముండా పుట్టిన గడ్డ వికసిత్ భారత్ యొక్క సంకల్పాలు నెరవేరడాని కి ఒక శక్తి కేంద్రం గా ఉంటుందన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

ముప్ఫై అయిదు వేల ఏడు వందల కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి పథకాల కు ఝార్‌ఖండ్ లోని ధన్‌బాద్ లో గల సింద్ రీ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శంకుస్థాపన జరపడం తో పాటు దేశ ప్రజల కు అంకితమిచ్చారు. ఈ రోజు న ప్రారంభించుకొంటున్న అభివృద్ధి ప్రాజెక్టు లు ఎరువులు, రైల్ వే, విద్యుత్తు మరియు బొగ్గు ల వంటి అనేక రంగాల కు చెందినవి. శ్రీ నరేంద్ర మోదీ హెచ్‌యుఆర్ఎల్ నమూనా ను పరిశీలించడం తో పాటుగా సింద్ రీ ప్లాంటు యొక్క కంట్రోల్ రూము ను కూడా చూశారు.

 

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, 35,700 కోట్ల రూపాయల కు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ను ఝార్ ఖండ్ లో ఈ రోజు న మొదలు పెట్టడమైందని చెప్తూ, రాష్ట్రం లోని రైతుల కు, ఆదివాసుల కు మరియు పౌరుల కు ఆయన అభినందనల ను తెలియ జేశారు.

 

సింద్ రీ ఎరువుల కర్మాగారాన్ని మొదలు పెట్టాలన్న తన సంకల్పాన్ని గురించి ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వచ్చారు. ‘‘ఇది మోదీ యొక్క హామీ గా ఉండింది, మరి ఈ రోజు న ఈ హామీ ని నెరవేర్చడమైంది’’ అని ఆయన అన్నారు. 2018వ సంవత్సరం లో ఈ ఎరువుల కర్మాగారాని కి ప్రధాన మంత్రి యే శంకుస్థాపన జరిపారు. ఈ ప్లాంటు ఆరంభం అయినందువల్ల స్థానిక యువతీ యువకుల కు ఉద్యోగ సంబంధి నూతనమైన మార్గాల ను తెరచినట్లు అయింది అని ఆయన అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దిశ లో సాగుతున్న యాత్ర లో నేటి కార్యక్రమాని కి ప్రాముఖ్యం ఉంది అని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. ప్రతి సంవత్సరం లో భారతదేశాని కి 360 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరపడుతుంది; మరి 2014వ సంవత్సరం లో భారతదేశం 225 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ను మాత్రమే ఉత్పత్తి చేసింది. డిమాండు కు, సరఫరా కు మధ్య గల భారీ అంతరం తో భారీ దిగుమతుల అగత్యం తలెత్తింది. ‘‘మా ప్రభుత్వం యొక్క ప్రయాసల కారణంగా, గడచిన పది సంవత్సరాల లో, యూరియా ఉత్పత్తి 310 లక్షల మెట్రిక్ టన్నుల కు వృద్ధి చెందింది’’ అని ఆయన తెలిపారు. రామగుండం-గోరఖ్‌పుర్, ఇంకా బరౌనీ ఎరువుల కర్మాగారాల ను పునరుద్ధరించే అంశాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. ఈ జాబితా లోకి సింద్ రీ కర్మాగారాన్ని జోడించడం జరిగింది అని ఆయన అన్నారు. వచ్చే ఒకటిన్నర సంవత్సరం కాలం లో తాల్‌చెర్ ఎరువుల కర్మాగారం కూడా మొదలవుతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు. ఆ ప్లాంటు ను కూడా దేశ ప్రజల కు తానే అంకితం చేయగలనంటూ ప్రధాన మంత్రి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ అయిదు ప్లాంటు లు 60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ను తయారు చేయగలుగుతాయి. దీని ద్వారా ఈ ప్లాంటు లు భారతదేశాన్ని ఒక ముఖ్యమైన రంగం లో ఆత్మనిర్భరత సాధన దిశ లోకి శరవేగం గా తీసుకు పోతాయి అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ఈ రోజు న ఝార్‌ఖండ్ లో క్రొత్త రైలు మార్గాల ఆరంభం, ఇప్పటికే ఉన్న రైలు మార్గాల లో డబ్లింగ్ పనులు మరియు అనేక ఇతర రైల్ వే ప్రాజెక్టుల పనుల ను మొదలు పెట్టడం వంటి చర్యల తో ఝార్‌ఖండ్ లో రైల్ వే రంగ సంబంధి క్రాంతి చోటుచేసుకొని ఒక క్రొత్త అధ్యాయం మొదలవుతోంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ధన్‌బాద్-చంద్రపుర రైలు మార్గం ఆ ప్రాంతాని కి ఒక క్రొత్త రూపు ను సంతరించనుండడాన్ని గురించి, అలాగే బాబా బైద్యనాథ్ దేవాలయాన్ని మరియు మాత కామాఖ్య శక్తి పీఠాన్ని దేవ్‌ఘర్-డిబ్రూగఢ్ రైలు సర్వీసు కలపనుండడాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. వారాణసీ - కోల్‌కాతా - రాంచీ ఎక్స్‌ప్రెస్ వే కు వారాణసీ లో తాను శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తీసుకు వస్తూ, ఇది చత్‌రా, హజారీబాగ్, రామ్ గఢ్ మరియు బొకారో ల వంటి స్థానాల కు సంధానాన్ని మెరుగుపరచడం తో పాటు గా యావత్తు ఝార్‌ఖండ్ లో ప్రయాణాని కి పట్టే కాలాన్ని తగ్గిస్తుందని, అంతేకాకుండా భారతదేశం లోని యావత్తు తూర్పు ప్రాంతం లో సరకుల రవాణా సంబంధి వ్యవస్థ కు ఊతం లభించనుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు లు ఝా‌ర్‌ఖండ్ తో ప్రాంతీయ సంధానానికి ఊతం గా ఉండడం తో పాటు ఈ ప్రాంతం లో ఆర్థిక అభివృద్ధి కి వేగాన్ని జత చేస్తాయి అని ఆయన తెలిపారు.

 

‘‘గడచిన పది సంవత్సరాల లో ఆదివాసీ సముదాయం, పేద ప్రజలు, యువతీయువకులు మరియు మహిళల యొక్క అభివృద్ధి కి పెద్దపీట ను వేయడం ద్వారా ప్రభుత్వం ఝార్‌ఖండ్ కోసం శ్రమించింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. 2047వ సంవత్సరాని కల్లా భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి దేశం గా తీర్చిదిద్దడాని కి ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసి ఉంది అని ప్రధాన మంత్రి నొక్కి చెప్తూ, ప్రస్తుతం ప్రపంచం లో అత్యంత వేగవంతం గా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల లో ఒకటి గా భారతదేశం ఉందన్నారు. నిన్నటి రోజు న వెలువడిన తాజా త్రైమాసికం తాలూకు ఆర్థిక గణాంకాల ను గురించి ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. 2023వ సంవత్సరం అక్టోబరు మొదలుకొని డిసెంబరు మధ్య కాలం లో 8.4 శాతం వృద్ధి రేటు నమోదు అయింది, ఇది వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశ లో శీఘ్ర గతి న చోటుచేసుకొంటున్న అభివృద్ధి ని తెలియజెప్తోంది అని ఆయన అన్నారు. ‘‘వికసిత్ భారత్ ఏర్పడాలి అంటే వికసిత ఝార్‌ఖండ్ ను తయారు చేయడం కూడ అంతే ముఖ్యం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఝార్‌ఖండ్ అభివృద్ధి చెందేటట్లుగా రాష్ట్ర ప్రభుత్వాని కి తమ ప్రభుత్వం అన్ని విధాల సమర్థన ను అందిస్తోంది అని ఆయన చెప్పారు. భగవాన్ బిర్‌సా ముండా పుట్టిన గడ్డ వికసిత్ భారత్ యొక్క సంకల్పాలు నెరవేరడాని కి ఒక శక్తి కేంద్రం గా ఉంటుందన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి తాను ధన్‌బాద్ కు వెళ్ళవలసి ఉన్న కారణం గా చిన్న ఉపన్యాసాన్నే ఇచ్చారు. కలలు మరియు సంకల్పాలు మరింత గా బలోపేతం అవుతాయి అని ఆయన అన్నారు. ఝార్‌ఖండ్ ప్రజల కు శుభాకాంక్షల ను మరియు అభినందనల ను తెలియజేస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

 

ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో ఝార్‌ఖండ్ గవర్నరు శ్రీ సి.పి. రాధాకృష్ణన్, ఝార్‌ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ చంపయీ సోరెన్, కేంద్ర మంత్రి శ్రీ అర్జున్ ముండా మరియు ఇతరులు ఉన్నారు.

 

పూర్వరంగం

 

హిందుస్తాన్ ఉర్వరక్ & రసాయన్ లిమిటెడ్ (హెచ్‌యుఆర్ఎల్ ) సింద్రీ ఫర్టిలైజర్ ప్లాంటు ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు. 8900 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో అభివృద్ధి చేసినటువంటి ఈ ఎరువుల కర్మాగారం యూరియా రంగం లో స్వయంసమృద్ధి దిశ లో ఒక ముందంజ గా ఉంది. ఈ ప్లాంటు ప్రారంభం కావడం తో దేశం లో ప్రతి సంవత్సరం లో స్వదేశీ యూరియా ఉత్పాదన 12.7 ఎల్ఎమ్‌టి మేర పెరుగుతుంది. ఫలితం గా దేశంలో రైతుల కు ప్రయోజనం లభిస్తుంది. గోరఖ్‌పుర్ లోను, రామగుండం లోను ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ జరిగిన అనంతరం దేశం లో పున:ప్రారంభం అవుతున్న మూడో ఎరువుల కర్మాగారం ఇది; గోరఖ్ పుర్ లో ఎరువుల కర్మాగారాన్ని 2021వ సంవత్సరం డిసెంబరు లో మరియు రామగుండం లో ఎరువుల కర్మాగారాన్ని 2022వ సంవత్సరం నవంబరు లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు.

 

ప్రధాన మంత్రి ఝార్‌ఖండ్ లో 17,600 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక రైల్ వే ప్రాజెక్టుల ను ప్రారంభించడం తో పాటు దేశ ప్రజల కు అంకితం చేశారు. వీటి లో సోన్ నగర్-అండాల్ ను కలిపే మూడో మరియు నాలుగో లైను; టోరి- శివపుర్ మొదటి, రెండో మరియు బిరాటోలి- శివ్‌పుర్ మూడో రైలు లైను (టోరి- శివ్‌పుర్ ప్రాజెక్టు లో భాగం); మోహన్‌పుర్ - హంస్‌డిహా నూతన రైలు మార్గం; ధన్ బాద్-చంద్రపుర రైలు మార్గం భాగం గా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల తో రాష్ట్రం లో రైలు సేవలు విస్తృతం కావడం తో పాటు ఆ ప్రాంతం లో సామాజిక-ఆర్థిక అభివృద్ధి చోటు చేసుకోనుంది. కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి మూడు రైళ్ల కు పచ్చజెండా ను చూపెట్టి వాటి ని ప్రారంభించారు. ఈ మూడు రైళ్లు ఏవేవి అంటే వాటిలో దేవ్‌ఘర్ - డిబ్రూగఢ్ రైలు సర్వీసు, టాటానగర్ మరియు బాదాంపహాడ్ ల మధ్య ఎమ్ఇఎమ్‌యు రైలు సర్వీసు (ప్రతి రోజూ) మరియు శివ్‌పుర్ స్టేశన్ నుండి సుదూర ప్రాంతానికి పోయేటటువంటి సరకుల రవాణా రైలుబండి ఉన్నాయి.

 

ప్రధాన మంత్రి ఝార్ ఖండ్ లో ఉత్తర కరణ్ పురా సుపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఎస్‌టిపిపి), చత్ రా కు చెందిన యూనిట్- 1 ( దీని సామర్థ్యం 660 మెగావాట్ లు) లు సహా ముఖ్యమైన విద్యుత్తు ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేశారు. 7500 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో అభివృద్ది చేసినటువంటి ఈ ప్రాజెక్టు తో ఈ ప్రాంతం లో విద్యుత్తు సరఫరా మెరుగుపడనుంది. ఉపాధి కల్పన కు కూడా ఇది తోడ్పడనుంది. రాష్ట్రం లో సామాజిక, ఆర్థిక అభివృద్ధి కి దోహదం లభించనుంది. దీనితో పాటు ప్రధాన మంత్రి ఝార్ ఖండ్ లో బొగ్గు రంగం తో ముడిపడ్డ ప్రాజెక్టుల ను కూడా దేశ ప్రజల కు అంకితం చేశారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi