రాజ్ కోట్, బటిండా, రాయబరేలీ, కళ్యాణి, మంగళగిరిలో ఐదు ఎయిమ్స్ లను అంకితం
23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.11,500 కోట్లకు పైగా విలువైన 200కు పైగా హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధాని
పుణెలో 'నిసర్గ్ గ్రామ్' పేరుతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతికి ప్రారంభోత్సవం
సుమారు రూ.2280 కోట్ల విలువైన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కు చెందిన 21 ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేసిన ప్రధాని
వివిధ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు శంకుస్థాపన
రూ.9 వేల కోట్లకు పైగా విలువైన ముంద్రా-పానిపట్ పైప్లైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
మేము ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి బయటకు తీసుకువెడుతున్నాము: ఢిల్లీ వెలుపల ముఖ్యమైన జాతీయ కార్యక్రమాలను నిర్వహించే ధోరణి పెరుగుతోంది:
"న్యూ ఇండియా శరవేగంగా లక్ష్యాలు పూర్తి చేస్తోంది"
“తరాల మార్పును నేను చూస్తున్నాను; కానీ మోదీపై అభిమానం ఏ వయసు పరిమితి కైనా మించి ఉంది:
“మునిగిన ద్వారక దర్శనంతో వికాస్, విరాసత్ కోసం నా సంకల్పం కొత్త బలాన్ని సంతరించుకుంది. వికసిత్ భా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం గుజరాత్ లోని రాజ్ కోట్ లో రూ.48,100 కోట్ల కు పైగా విలువ చేసే పలు అభివృద్ధి పథకాలకు జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. ఆరోగ్యం, రోడ్డు, రైలు, ఇంధనం, పెట్రోలియం- సహజవాయువు, పర్యాటకం వంటి ముఖ్యమైన రంగాలకు సంబంధించి ఈ ప్రాజెక్టులు ఉన్నాయి.
"అభివృద్ధి చెందుతున్న భారతదేశం వేగంగా పనులు పూర్తి చేస్తోంది, ప్రత్యేకించి మీరు ఈ 5 ఎఐఐఎంఎస్ లను చూసినప్పుడు", అని శ్రీ మోదీ అన్నారు.

ప్రియమైన నా దేశ ప్రజలారా, నమస్కారం. ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం 110 వ ఎపిసోడ్‌ కు స్వాగతం. ఎప్పటిలాగే ఈసారి కూడా మీ వద్ద నుండి పెద్ద సంఖ్య లో వచ్చిన సూచనల ను, స్పందనల ను, వ్యాఖ్యల ను స్వీకరించాం. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎపిసోడ్‌ లో ఏ అంశాల ను చేర్చాలి అనేదే సవాలు గా ఉంది. సానుకూల వైఖరి తో కూడిన అనేక స్పందనల ను నేను అందుకున్నాను. వాటిలో ఇతరుల కు ఆశాకిరణం గా మారడం ద్వారా వారి జీవితాల ను మెరుగు పరచడానికి కృషి చేస్తున్న చాలా మంది దేశవాసుల ప్రస్తావన లు ఉన్నాయి.

 

సహచరులారా, కొన్ని రోజుల తరువాత మార్చి 8 వ తేదీ న ‘మహిళల దినం’ ను జరుపుకొంటున్నాం. దేశ అభివృద్ధి ప్రయాణం లో నారీ శక్తి యొక్క సహకారాని కి వందనాల ను సమర్పించేందుకు ఒక అవకాశమే ప్రత్యేకమైనటువంటి ఈ రోజు మహిళల కు సమాన అవకాశాలు లభించినప్పుడే ప్రపంచం అభివృద్ధి చెందుతుంది అని మహాకవి భారతియార్ అన్నారు. నేడు భారతదేశం మహిళల శక్తి ప్రతి రంగం లో ప్రగతి పథం లో దూసుకు పోతున్నది. మన దేశం లో గ్రామాల లో నివసించే మహిళ లు కూడా డ్రోన్ లను ఎగురవేస్తారు అని కొన్నేళ్ల క్రితం వరకు ఎవరైనా ఊహించారా ? కానీ నేడు ఇది సాధ్యపడుతోంది. ఈ రోజు న ప్రతి ఊరి లో డ్రోన్ దీదీ ని గురించే చాలా చర్చ జరుగుతోంది. “నమో డ్రోన్ దీదీ, నమో డ్రోన్ దీదీ” అనే పదాలు అందరి నోళ్ల లో నానుతున్నాయి. అందరూ ఈ విషయాన్ని గురించే మాట్లాడుకొంటున్నారు. విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. అందుకే ఈ సారి ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో నమో డ్రోన్ దీదీ తో ఎందుకు మాట్లాడకూడదు అని నేను కూడా అనుకున్నాను. ఉత్తర్ ప్రదేశ్‌ లోని సీతాపూర్‌ కు చెందిన నమో డ్రోన్ దీదీ సునీత గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆమె తో మాట్లాడుదాం.

 

మోదీ గారు: సునీతా దేవి గారు.. మీకు నమస్కారం.

సునీతా దేవి: నమస్తే సర్.

మోదీ గారు: సునీత గారూ... ముందుగా నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ కుటుంబాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి.

సునీతా దేవి: సర్. మా కుటుంబం లో మా ఇద్దరు పిల్లలు, నేను భర్త మరియు మా అమ్మ ఉన్నాం.

మోదీ గారు: సునీత గారూ.. మీరు ఏం చదువుకున్నారు ?

సునీతా దేవి: సర్. నేను బి. ఏ. (ఫైనల్) అండి.

మోదీ గారు: మరి ఇంటి కార్యకలాపాలు వగైరా గురించి చెబుతారా ?

సునీతా దేవి: వ్యవసాయానికి సంబంధించినటువంటి పనుల ను చేస్తుంటాం సర్.

మోదీ గారు: సరే సునీత గారూ.. ఈ డ్రోన్ దీదీ గా మారే మీ ప్రయాణం ఎలా మొదలైంది ? మీరు శిక్షణ ను ఎక్కడ తీసుకొన్నారు ?, ఏయే మార్పు లు చోటు చేసుకొన్నాయి ?, ఏమేమిటి జరిగాయి ? , నేను మొదటి నుండి తెలుసుకోవాలని అనుకుంటున్నాను.

సునీతా దేవి: సర్. అలహాబాద్‌ లోని ఫూల్ పుర్ ఇఫ్ కో (IFFCO) కంపెనీ లో మాకు శిక్షణ ను ఇవ్వడం జరిగింది. మేం అక్కడి నుండి శిక్షణ పొందాం సర్.

మోదీ గారు: అప్పటి లోపు డ్రోన్ లను గురించి ఎప్పుడైనా మీరు విని ఉన్నారా ?

సునీతా దేవి: సర్. గతం లో ఎప్పుడూ వినలేదు. ఒక్కసారి అలా చూశాం సీతాపుర్‌ లోని కృషి విజ్ఞాన కేంద్రం లో. మేం మొదటి సారి డ్రోన్ ను అక్కడ చూశాం.

మోదీ గారు: సునీత గారూ.. మీరు మొదటి రోజు న వెళ్ళినప్పటి అనుభూతి ని నేను అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నాను.

 

సునీతా దేవి: సర్..

మోదీ గారు: మొదటి రోజు న మీకు డ్రోన్ ను చూపించి ఉంటారు. అప్పుడు బోర్డు మీద ఏదో నేర్పించి ఉంటారు. కాగితం పైనా నేర్పించి ఉంటారు. ఆపై మైదానానికి తీసుకెళ్ళి అభ్యాసం చేయించి ఉంటారు. ఇలా అన్ని విషయాల ను మీరు నాకు పూర్తి గా చెప్పగలరా !

సునీతా దేవి: అవును సర్. మేం అక్కడకు వెళ్ళిన రెండో రోజు నుండి మా శిక్షణ మొదలైంది. ముందుగా థియరి ని బోధించి ఆ తరువాత రెండు రోజుల పాటు క్లాస్ నిర్వహించారు. క్లాస్‌ లో డ్రోన్‌ లోని భాగాలు, మేం చేయవలసింది ఏమిటి ?, ఎలా చేయాలి ?- ఇలాగ అన్నీ థియరి లో బోధించారు. మూడో రోజు న మాకు పేపర్ పై పరీక్ష పెట్టారు. ఆ తరువాత కంప్యూటర్ ద్వారా కూడా పరీక్ష పెట్టారు. అంటే ముందుగా క్లాసు ను నిర్వహించి తరువాత పరీక్ష పెట్టారు. ఆ తరువాత ప్రాక్టికల్ ను జరిపించారు. డ్రోన్ ను ఎలా ఎగరేయాలి ?, ఎలాగ కంట్రోల్ చేయాలి.. ఇలా ప్రతిదీ ఆచరణాత్మకం గా నేర్పించారు.

మోదీ గారు: డ్రోన్ పనితీరు ను ఎలా నేర్పించారు ?

సునీతా దేవి: సర్.. వ్యవసాయం లో కూడా డ్రోన్ పని చేస్తుంది. వానాకాలం లేక ఇతర కాలాల్లో అయినా వానలు కురవడం వల్ల పంటలు కోసేందుకు పొలాల్లోకి వెళ్లలేకపోతున్నాం. అప్పుడు కూలీ లు పొలాల కు ఎలా వెళ్తారు ? అప్పుడు డ్రోన్ ఉపయోగం వల్ల రైతుల కు ఎంతో మేలు జరుగుతుంది. పొలాల్లోకి కూడా ప్రవేశించవలసిన అవసరం లేదు. కూలీల ను పెట్టుకుని పనులు చేసుకున్నట్టు గట్టు మీద నిలబడి డ్రోన్‌ తో పనులు చేసుకోవచ్చు. పొలం లోపల పురుగుల నుండి కూడా రక్షణ లభిస్తుంది. ఇబ్బందులు ఉండవు. రైతుల కు కూడా చాలా మంచిది. ఇప్పటి వరకు 35 ఎకరాల లో పిచికారీ చేశాం సర్‌.

 

మోదీ గారు: అంటే దీనివల్ల లాభాలు ఉన్నాయనే సంగతి రైతు ల కు తెలుసంటారా ?

సునీతా దేవి: అవును సర్. రైతు లు చాలా సంతృప్తి గా ఉన్నారు. చాలా బాగుంది అని వారు చెబుతున్నారు. సమయం కూడా ఆదా అవుతుంది. అన్ని సౌకర్యాలూ అదే చూసుకుంటుంది. నీళ్ళు, మందులు- అన్నీ అదే కలుపుకొంటుంది. రైతు లు వారి పొలం ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉందో చెబితే చాలు. అరగంట లో మొత్తం పని ని డ్రోన్ యే చక్కబెడుతుంది.

మోదీ గారు: మరి అయితే ఈ డ్రోన్‌ ని చూడడానికి వేరే వాళ్ళు కూడా వస్తూ ఉండి ఉండవచ్చేమో ?

సునీతా దేవి: సర్.. చాలా మంది గుమిగూడతారు. డ్రోన్ ను చూడడానికి చాలా మంది వస్తారు. పెద్ద పెద్ద రైతు లు ఉన్నారు, వారు నంబరు కూడా అడిగి తీసుకుంటుంటారు ఎప్పుడైనా మేం కూడా మిమ్మల్ని పిచికారీ కోసం పిలుస్తాం అంటూ.

మోదీ గారు: సరే. లఖ్ పతి దీదీ (లక్షాధికారి సోదరీమణి) ని తయారు చేయాలి అనే లక్ష్యం నాకు ఉంది. కాబట్టి, డ్రోన్ దీదీ నాతో మొదటి సారి గా మాట్లాడుతున్న విషయాల ను ఈ రోజు న దేశవ్యాప్తంగా ఉన్న సోదరీమణులు వింటూ ఉంటే, మీరు వారికి ఏమి చెప్పాలని అనుకుంటున్నారు ?

సునీతా దేవి: ఈ రోజు నేనొక్కదాన్నే డ్రోన్ దీదీ ని. అటువంటి వేలాది సోదరీమణులు నాలా డ్రోన్ దీదీలు గా మారడానికి ముందుకు వచ్చారా అంటే, నేను చాలా సంతోషిస్తాను. నేను ఒంటరి గా ఉన్నప్పుడు వేల మంది నాతో పాటు నిలబడితే ఆనందం గా ఉంటుంది. ఒంటరి గా లేము అని, చాలా మంది డ్రోన్ దీదీ అనే గుర్తింపు తో మాతో ఉన్నారని సంతోషం గా ఉంటుంది.

మోదీ గారు: సునీత గారూ.. మీకు నా తరఫు నుండి అనేకానేక అభినందన లు. ఈ నమో డ్రోన్ దీదీ, ఈ దేశం లో వ్యవసాయాన్ని ఆధునికీకరించడానికి గొప్ప మాధ్యం గా మారుతోంది. నా పక్షాన అనేకానేక శుభాకాంక్షలు.

 

సునీతా దేవి: మీకు ధన్యవాదాలు, థేంక్ యు సర్.

మోదీ గారు: మీకు ధన్యవాదాలు!

 

సహచరులారా, ప్రస్తుతం మహిళా శక్తి వెనుకబడిపోయినటువంటి రంగం అంటూ దేశం లో ఏ రంగమూ లేదు. మహిళ లు వారి నాయకత్వ సామర్థ్యాలను మెరుగైన రీతి లో చాటిన మరొక రంగం ఏది అంటే అది ప్రాకృతిక వ్యవసాయ రంగం. జల సంరక్షణ ఇంకా పారిశుద్ధ్యం. రసాయనాల వల్ల మన భూమాత కు కలుగుతున్న కష్టాలు, బాధ లు, వేదన నుండి మన ధరణి మాత ను కాపాడడం లో దేశం లోని మాతృ శక్తి పెద్ద పాత్ర ను పోషిస్తున్నది. దేశం లో ప్రతి మూల న ఇప్పుడు మహిళ లు ప్రాకృతిక వ్యవసాయాన్ని విస్తరిస్తున్నారు. ఇవాళ దేశం లో ‘జల్‌ జీవన్‌ మిశన్‌’ లో భాగం గా ఇంత పని జరుగుతుంటే అందులో దీనికి వెనుక నీటి సంఘాల ది చాలా పెద్ద పాత్రే ఉంది. ఈ నీటి సంఘాల నాయకత్వం మహిళల దగ్గరే ఉంది. దీనికి అదనం గా నీటి సంరక్షణ కోసం మహిళ లు అన్ని విధాలు గాను కృషి చేస్తున్నారు. అటువంటి ఒక మహిళ యే కళ్యాణి ప్రఫుల్ల పాటిల్ గారు. ఆమె నాతో ఫోన్ లైన్‌ లో ఉన్నారు. ఆవిడ మహారాష్ట్ర నివాసి. రండి, కళ్యాణి ప్రఫుల్ల పాటిల్‌ గారి తో మాట్లాడి, ఆమె ఏం చెబుతారో తెలుసుకుందాం.

 

ప్రధాన మంత్రి గారు: కళ్యాణి గారూ.. నమస్తే.

కళ్యాణి గారు: నమస్తే సర్ జీ, నమస్తే.

ప్రధాన మంత్రి గారు: కళ్యాణి గారూ.. ముందుగా మీరు మీ గురించి, మీ కుటుంబాన్ని గురించి, మీ పనిపాటుల ను గురించి కాస్త వివరాలను తెలియజేయండి.

కళ్యాణి గారు: సర్.. నేను ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ చదివాను. మా ఇంట్లో నా భర్త, మా అత్త గారు, ఇంకా నా ఇద్దరు పిల్లలు ఉంటాం. మూడేళ్ల నుండి నేను మా గ్రామ పంచాయతీ లో పని చేస్తున్నాను.

ప్రధాన మంత్రి గారు: అయితే ఊళ్ళో వ్యవసాయ పనుల లో నిమగ్నం అయ్యారా ? ఎందుకంటే మీ దగ్గర ప్రాథమిక జ్ఞ‌ానం కూడా ఉంది. మీ చదువు కూడాను ఈ రంగం లోనే పూర్తి అయింది. ఇక మీరు వ్యవసాయం లో చేరారు. మరి మీరు ఏయే క్రొత్త ప్రయోగాల ను చేశారంటారు ?

 

కళ్యాణి గారు: సర్... మేం ఏవైతే పది రకాల వనస్పతులు ఉన్నాయో వాటిని అన్నింటిని కలిపి వేసి మేం ఆర్గానిక్ స్ప్రే ను తయారు చేశాం. మనం పురుగు మందుల ను పిచికారీ చేస్తే మనకు మంచి చేసే స్నేహపూర్వక కీటకాలు కూడా నాశనం అవుతాయి. నీళ్ల లో రసాయనాల ను కలిపినందువల్ల నేల కలుషితం అవుతూ, ఈ కారణం గా మన శరీరం మీద సైతం హానికారక ప్రభావాలు ప్రసరిస్తూ ఉంటాయి. ఈ లెక్క న మేం కనీస స్థాయి లో పురుగుమందుల ను ఉపయోగించాం.

ప్రధాన మంత్రి గారు: అంటే ఒక రకం గా మీరు పూర్తి గా ప్రాకృతిక వ్యవసాయం వైపు మళ్లుతున్నారన్న మాట.

కళ్యాణి గారు: అవునండి, మా సాంప్రదాయిక వ్యవసాయం ఏదైతే ఉందో క్రిందటి ఏడాది మేం అలాగే చేశాం.

ప్రధాన మంత్రి గారు: ప్రాకృతిక వ్యవసాయం లో మీకు ఎటువంటి అనుభవం లభించింది ?

కళ్యాణి గారు: సర్. మా ఆడవాళ్ళకి అయ్యే ఖర్చులు తక్కువయ్యాయి. ఆ పరిష్కారం లభించాక ఆ ఉత్పత్తుల ను పురుగుమందులు లేకుండా తయారు చేశాం. ఎందుకంటే ఇప్పుడు పట్టణ ప్రాంతాల తో పాటు గ్రామీణ ప్రాంతాల లో కూడాను కేన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి దానికి తగ్గట్టుగా భావి కుటుంబాన్ని కాపాడుకోవాలి అంటే ఈ మార్గాన్ని అవలంబించవలసిందే. అందుకు అనుగుణం గా ఆయా మహిళ లు కూడా ఇందులో చురుకు గా పాలుపంచుకొంటున్నారు.

 

ప్రధాన మంత్రి గారు: సరే కళ్యాణి గారు.. నీటి సంరక్షణ లోనూ మీరు ఏదైనా కృషి ని చేశారా ? అందులో మీరు చేసింది ఏమిటి ?

కళ్యాణి గారు: సర్.. మన ప్రభుత్వ భవనాలైన ప్రాథమిక పాఠశాల, ఆంగన్‌ బాడీ, మా గ్రామ పంచాయతీ భవనం- వీటి దగ్గర ఉన్న వర్షపు నీటినంతటినీ ఒకే చోటు లోకి సేకరించాం సర్. రీచార్జ్ శాఫ్ట్, అంటే వాన నీరు- భూమి లోపల కు చొచ్చుకు పోవాలి. కాబట్టి మేం మా గ్రామం లో 20 రీచార్జ్ శాఫ్ట్ లను తయారు చేశాం. మరో 50 రీచార్జ్ శాఫ్ట్ లు మంజూరు అయ్యాయి. ఇప్పుడు ఆ పని కూడా త్వరలో ప్రారంభం అవుతుంది.

ప్రధాన మంత్రి గారు: కళ్యాణి గారు.. మీతో మాట్లాడినందుకు చాలా ఆనందం గా ఉంది. మీకు చాలా చాలా శుభాకాంక్ష లు.

కళ్యాణి గారు: ధన్యవాదాలు సర్, ధన్యవాదాలు సర్. మీతో మాట్లాడినందుకు నాకు కూడా చాలా సంతోషం గా ఉంది. నా జీవితం సంపూర్ణం గా సార్థకమయింది, నాకు ఇలాగ అనిపిస్తున్నది.

ప్రధాన మంత్రి గారు: మంచిది, సేవ చేస్తూ ఉండండి.

ప్రధానమంత్రి గారు: మీ పేరే కళ్యాణి మరి మీరు కళ్యాణ పూర్వకమైనటువంటి కార్యాలనే చేస్తూ ఉంటారన్నమాట. ధన్యవాదాలండీ. నమస్కారం.

కళ్యాణి గారు: ధన్యవాదాలు సర్. ధన్యవాదాలు.

 

సహచరులారా, సునీత గారు అయినా, కళ్యాణి గారు అయినా, వివిధ రంగాల లో స్త్రీ శక్తి సాధించినటువంటి సాఫల్యం చాలా ప్రేరణ ను అందిస్తున్నది. నేను మరో సారి మన మహిళా శక్తి అందిస్తున్నటువంటి ఈ స్ఫూర్తి ని మనస్పూర్తి గా ప్రశంసిస్తున్నాను.

 

ప్రియమైన నా దేశ ప్రజలారా, ప్రస్తుతం మన అందరి జీవనం లో సాంకేతిక విజ్ఞ‌ానం ప్రాముఖ్యం చాలా పెరిగిపోయింది. మొబైల్ ఫోన్ లు, డిజిటల్ పరికరాలు ప్రతి ఒక్కరి జీవనం లో ఒక ముఖ్యమైన భాగం గా మారిపోయాయి. కానీ ఇప్పుడు అడవి జంతువుల తో సమన్వయం లో డిజిటల్ పరికరాలు మనకు సహాయపడతాయి అని మీరు ఊహించ గలరా ! కొన్ని రోజుల తరువాత మార్చి 3 వ తేదీ న ‘ప్రపంచ వన్యప్రాణి దినం’ రాబోతోంది. వన్యప్రాణుల సంరక్షణ పై అవగాహన ను కల్పించే లక్ష్యం తో ఈ దినోత్సవాన్ని జరుపుకొంటాం. ఈ సంవత్సరం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ఇతివృత్తం లో డిజిటల్ ఇనొవేశన్‌ కు ప్రాధాన్యాన్ని ఇవ్వడమైంది. మన దేశం లో వివిధ ప్రాంతాల లో వన్యప్రాణుల సంరక్షణ కోసం సాంకేతికత ను విరివి గా ఉపయోగిస్తున్నారన్న విషయం తెలిస్తే మీరు సంతోషిస్తారు. గత కొన్ని సంవత్సరాలు గా ప్రభుత్వ ప్రయాసల వల్ల దేశం లో పులుల సంఖ్య పెరిగింది. మహారాష్ట్ర లోని చంద్రపుర్ పులుల అభయారణ్యం లో పులుల సంఖ్య 250 కి పైగా పెరిగింది. చంద్రపుర్ జిల్లా లో మనుషులు, పులుల మధ్య ఘర్షణ ను తగ్గించడానికి కృత్రిమ మేధ సహాయాన్ని తీసుకొన్నారు. ఇక్కడ గ్రామ, అటవీ సరిహద్దుల లో కెమెరా లు ఏర్పాటు చేశారు. పులి గ్రామ సమీపం లోకి వచ్చినప్పుడల్లా కృత్రిమ మేధ సహాయం తో స్థానిక ప్రజలు వారి మొబైల్‌ లో హెచ్చరిక ను అందుకొంటారు. నేడు ఈ వ్యవస్థ ఈ టైగర్ రిజర్వ్ చుట్టూ ఉన్న 13 గ్రామాల ప్రజలకు చాలా సౌకర్యాన్ని అందించింది. పులుల కు కూడా రక్షణ లభించింది.

 

సహచరులారా, నేడు యువ నవ పారిశ్రమికవేత్త లు వన్యప్రాణుల సంరక్షణ, ఇకో టూరిజమ్ కోసం నూతన ఆవిష్కరణల ను కూడా తీసుకు వస్తున్నారు. ఉత్తరాఖండ్‌ లోని రూడ్ కీ లో రోటర్ ప్రిసిఝన్ గ్రూప్స్ సంస్థ కెన్ నది లో మొసళ్ల పైన నిఘా ను ఉంచడం లో సహాయ పడే రకం డ్రోన్‌ ను ను వైల్డ్‌ లైఫ్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారం తో తయారు చేసింది. ఇదే విధం గా బెంగళూరు లోని ఓ కంపెనీ ‘బఘీరా’ మరియు ‘గరుడ్’ పేరుల తో ఏప్‌ల ను సిద్ధం చేసింది. బఘీరా ఏప్‌ తో అడవి లో సఫారీ సమయం లో వాహనం వేగాన్ని, ఇతర కార్యకలాపాల ను పర్యవేక్షించవచ్చు. దేశం లోని అనేక పులుల అభయారణ్యాల లో దీనిని ఉపయోగిస్తున్నారు. కృత్రిమ మేధ (ఏల్టర్నేటివ్ ఇంటెలిజెన్స్- ఎఐ) పైన, ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి) పైన ఆధారపడే గరుడ ఏప్ ను ఏదైనా సిసిటివి కి కలపడం ద్వారా వాస్తవ కాలిక హెచ్చరికలు అందడం మొదలవుతుంది. వన్య ప్రాణుల పరిరక్షణ కోసం చేసే ఇటువంటి ప్రతి ప్రయాస తోనూ మన దేశం లో జీవ వైవిధ్యం మరింత సమృద్ధం అవుతోంది.

 

సహచరులారా, భారతదేశం లో ప్రకృతి తో సమన్వయం అనేది మన సంస్కృతి లో అంతర్భాగం గా ఉంది. వేల సంవత్సరాలు గా ప్రకృతి తోను, వన్య ప్రాణులతోను సహజీవనం చేస్తూ జీవిస్తున్నాం. మీరు ఎప్పుడైనా మహారాష్ట్ర లోని మేల్‌ఘాట్ పులుల అభయారణ్యానికి వెళ్తే మీరు దాన్ని స్వయంగా అనుభూతి చెందవచ్చు. ఈ టైగర్ రిజర్వ్ సమీపం లోని ఖట్ కలి గ్రామం లో నివసిస్తున్న ఆదివాసి కుటుంబాలు ప్రభుత్వ సహాయంతో వారి ఇళ్లను హోమ్ స్టేలు గా మార్చుకున్నాయి. ఇది వారికి భారీ ఆదాయ వనరు గా మారుతోంది. అదే గ్రామం లో నివాసం ఉంటున్న కోర్ కు తెగ కు చెందిన ప్రకాశ్ జామ్‌కార్‌ గారు తన రెండు హెక్టార్ల భూమి లో ఏడు గదుల హోమ్‌ స్టే ను సిద్ధం చేశారు. ఆయన కుటుంబం ఆ స్థలం లో బస చేసే పర్యటకుల కు ఆహారం, పానీయాల ఏర్పాటుల ను చేస్తుంది. ఆయన తన ఇంటి చుట్టూ ఔషధ మొక్కల తో పాటు మామిడి, కాఫీ చెట్ల ను కూడా నాటారు. ఇది పర్యటకుల ను ఆకర్షించడమే కాకుండా ఇతర వ్యక్తుల కు కొత్త ఉపాధి అవకాశాల ను కూడా అందించింది.

 

ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పశు పోషణ ను గురించి మాట్లాడేటప్పుడు, మనం తరచు గా ఆవులు, గేదెల వద్ద మాత్రమే ఆగిపోతాం. కానీ మేక కూడా ఒక ముఖ్యమైన పశువు. దీనిపై ఎక్కువ గా చర్చ జరగ లేదు. దేశం లోని వివిధ ప్రాంతాల లో చాలా మంది ప్రజలు మేకల పెంపకం తో సంబంధం కలిగి ఉన్నారు. ఒడిశా లోని కాలాహండి లో మేక ల పెంపకం గ్రామ ప్రజల జీవనోపాధి తో పాటు వారి జీవన ప్రమాణాల ను మెరుగు పరచడానికి ప్రధాన సాధనం గా మారుతోంది. ఈ ప్రయత్నం వెనుక జయంతి మహాపాత్ర గారు, ఆమె భర్త బీరెన్ సాహు గారి పెద్ద స్థాయి నిర్ణయం ఉంది. వారిద్దరూ బెంగళూరు లో మేనేజ్‌మెంట్ నిపుణులు. అయితే వారు కొంత విరామాన్ని తీసుకొని కాలాహండి లోని సాలెభాటా గ్రామాని కి రావాలి అని నిర్ణయించుకున్నారు. ఇక్కడి గ్రామీణుల సమస్యల ను పరిష్కరించడంతో పాటుగా వారికి సాధికారత ను కల్పించే విధంగా ఏదైనా మంచి చేయాలి అని వారు భావించారు. సేవ భావం తోను, అంకితభావం తోను కూడిన ఈ ఆలోచన తో మాణికాస్తు ఎగ్రో ను స్థాపించి రైతుల తో కలసి పనిచేయడం ప్రారంభించారు. జయంతి గారు, బీరేన్ గారు లు ఇక్కడ ఆసక్తికరమైన మాణికాస్తు గోట్ బ్యాంకు ను కూడా ప్రారంభించారు. వారు సామాజిక స్థాయి లో మేక ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. వారి మేక ల ఫారం లో డజన్ల కొద్ది మేక లు ఉన్నాయి. రైతుల కోసం పూర్తి వ్యవస్థ ను మాణికాస్తు మేక ల బ్యాంకు సిద్ధం చేసింది. దీని ద్వారా రైతులకు 24 నెలల కాలాని కి రెండు మేకల ను అందజేస్తారు. మేక లు 2 సంవత్సరాల లో 9 నుండి 10 పిల్లల కు జన్మనిస్తాయి. వాటిలో 6 పిల్లల ను బ్యాంకు లో ఉంచుతారు. మిగిలిన వాటి ని మేకల ను పెంచే కుటుంబాని కి ఇస్తారు. అంతే కాదు మేక ల సంరక్షణ కు అవసరమైన సేవల ను సైతం వారు అందిస్తున్నారు. ప్రస్తుతం లో 50 గ్రామాల కు చెందిన 1000 మందికి పైగా రైతులు ఈ జంట తో అనుబంధాన్ని కలిగివున్నారు. వారి సహకారం తో గ్రామ ప్రజలు పశు పోషణ రంగం లో స్వావలంబన దిశ గా పయనిస్తున్నారు. విభిన్న రంగాల లో విజయవంతమైన నిపుణులు చిన్న రైతులు సాధికారిత ను, స్వయం సమృద్ధి ని పొందేందుకు కొత్త పద్ధతుల ను అవలంబించడం చూసి నేను చాలా సంతోషం గా ఉన్నాను. వారి కృషి అందరి కి స్ఫూర్తి ని ఇస్తుంది.

 

ప్రియమైన నా దేశ ప్రజలారా, మన సంస్కృతి నేర్పింది ఏమిటి అంటే అది ‘పరమార్థ్ పరమో ధర్మః’ అనేదే. ఈ మాటలకు అర్థం, ఇతరులకు సహాయం చేయడమే అతి పెద్ద కర్తవ్యం అని. ఈ భావన ను అనుసరించి మన దేశం లో లెక్క లేనంత మంది ప్రజలు నిస్వార్థం గా ఇతరుల కు సేవ చేయడానికి వారి యొక్క జీవనాన్ని అంకితం చేసివేస్తున్నారు. అటువంటి వారి లో ఒకరు - బిహార్‌ లోని భోజ్‌ పుర్‌ కు చెందిన భీమ్ సింహ్ భవేశ్ గారు. ఆయన పని గురించి ఆయన ప్రాంతం లోని ముస్ హర్ సామాజిక వర్గం వారి లో చాలా చర్చ జరుగుతోంది. అందుకే ఈ రోజు న ఈ విషయాన్ని మీతో ఎందుకు మాట్లాడ కూడదు అని అనుకున్నాను. బిహార్‌ లో అత్యంత నిరాదరణ కు గురైన సముదాయమూ, చాలా పేద సముదాయమూ ముస్ హర్ అనే సముదాయం. భీమ్ సింహ్ భవేశ్ గారు ఈ సముదాయం లోని పిల్లల భవిష్యత్తు ఉజ్వలం గా ఉండేందుకు వారి లో విద్య వ్యాప్తి పై దృష్టి పెట్టారు. ముస్ హర్ సామాజిక వర్గాని కి చెందిన దాదాపు 8 వేల మంది బాలల ను పాఠశాల లో చేర్పించారు. ఆయన ఒక పెద్ద గ్రంథాలయాన్ని కూడా కట్టించారు. దాని వల్ల పిల్లల కు చదువు కోవడం లో మెరుగైన సౌకర్యాలు లభిస్తున్నాయి. భీమ్ సింహ్ గారు తన సామాజిక వర్గ సభ్యుల కు అవసరమైన పత్రాల ను తయారు చేయడం లో, వారి కి దరఖాస్తుల ను పూరించడం లో కూడాను సహాయం చేస్తారు. ఇది గ్రామ ప్రజల కు అవసరమైన వనరుల ను మరింత మెరుగు పరచింది. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి ఆయన 100 కు పైగా వైద్య శిబిరాల ను నిర్వహించారు. కరోనా సంక్షోభం పెద్దదవుతున్నప్పుడు భీమ్ సింహ్ గారు తాను ఉన్న ప్రాంతం లోని ప్రజల ను టీకామందు ను తీసుకోవలసింది గా ప్రోత్సహించారు. దేశం లోని వివిధ ప్రాంతాల లో భీమ్ సింహ్ భవేశ్ గారు ల వంటి అనేక మంది ఉన్నారు. వారు సమాజం లో ఈ తరహా అనేక ఉదాత్తమైన పనుల్లో నిమగ్నమై ఉన్నారు. బాధ్యతాయుతమైన పౌరులు గా మనం మన విధుల ను నిర్వర్తిస్తే, అది బలమైన దేశాన్ని నిర్మించడం లో చాలా సహాయకారి గా ఉంటుంది.

 

ప్రియమైన నా దేశ ప్రజలారా, భారతదేశం యొక్క సుందరత్వం ఇక్కడి వివిధత్వం మరియు మన సంస్కృతి యొక్క విభిన్న మైనటువంటి వర్ణాల లో సైతం ఇమిడిపోయి ఉంది. భారతీయ సంస్కృతి ని పరిరక్షించడానికి, అందంగా తీర్చిదిద్దడాని కి ఎంత మంది నిస్వార్థం గా కృషి చేస్తున్నారో చూస్తే నాకు చాలా సంతోషం గా ఉంటుంది. భారతదేశం లోని ప్రతి ప్రాంతం లో ఇటువంటి వ్యక్తులు కనిపిస్తారు. వీరిలో భాష రంగం లో పనిచేస్తున్న వారు కూడా అధిక సంఖ్య లో ఉన్నారు. జమ్ము - కశ్మీర్‌ లోని గాందర్‌ బల్‌ కు చెందిన మొహమ్మద్ మాన్ శాహ్ గారు గత మూడు దశాబ్దాలు గా గోజ్ రీ భాష ను పరిరక్షించే ప్రయత్నాల లో నిమగ్నం అయి ఉన్నారు. ఆయన ఆదివాసీ సముదాయం అయిన గుజ్జర్ బకర్ వాల్ సముదాయాని కి చెందిన వారు. బాల్యం లో చదువు కోసం కష్టపడే వారు. రోజూ 20 కిలోమీటర్ల దూరం కాలినడక న వెళ్లే వారు. అటువంటి సవాళ్ల మధ్య ఆయన మాస్టర్స్ డిగ్రీ ని పొందారు. తన భాష ను కాపాడుకోవాలి అనే ఆయన సంకల్పం దాంతో మరింత బలపడింది.

 

సాహిత్యరంగం లో మాన్ శాహ్ గారి కార్యాల పరిధి ఎంత పెద్దది అంటే ఈ కృషి ని దాదాపు 50 సంపుటాల లో భద్రపరచారు. వీటిలో కవిత లు, జానపద గేయాలు కూడా కలిసి ఉన్నాయి. ఆయన అనేక పుస్తకాల ను గోజ్ రీ భాష లోకి అనువదించారు.

 

సహచరులారా, అరుణాచల్ ప్రదేశ్‌ లోని తిరప్‌ కు చెందిన బన్ వంగ్ లోసు గారు ఒక ఉపాధ్యాయుడు. వాంచో భాష వ్యాప్తి లో అత్యంత విలువైన కృషి ని ఆయన చేశారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అసమ్ లోని కొన్ని ప్రాంతాల లో ఈ భాష లో మాట్లాడుతారు. భాషా పాఠశాల నిర్మాణానికి ఆయన కృషి చేశారు. వాంచో భాష కు సంబంధించిన లిపి కూడా సిద్ధమైంది. రాబోయే తరాల కు వాంచో భాష ను నేర్పిస్తున్నారు. తద్వారా ఆ భాష అంతరించి పోకుండా కాపాడుతున్నారు.

 

సహచరులారా, పాటల ద్వారాను, నృత్యాల ద్వారాను సంస్కృతి ని, భాష ను కాపాడుకోవడం లో తలమునకలు గా ఉన్న వారు మన దేశం లో చాలా మంది ఉన్నారు. కర్నాటక కు చెందిన శ్రీ వెంకప్ప అంబాజీ సుగేత్కర్ జీవనం కూడా ఈ విషయం లో చాలా స్ఫూర్తిదాయకం. ఇక్కడి బాగల్‌కోట్ నివాసి సుగేత్ కర్ గారు జానపద గాయకులు. ఆయన 1000 కంటే ఎక్కువ గోంధ్ లీ పాటల ను పాడారు. ఈ భాష లో కథల ను కూడా ప్రచారం చేశారు. వందల కొద్దీ విద్యార్థుల కు ఫీజు లేకుండా శిక్షణ ను కూడా ఇచ్చారు. భారతదేశం లో నిరంతరం మన సంస్కృతి ని సుసంపన్నం చేస్తున్నటువంటి, ప్రగాఢ ఆసక్తి మరియు ఉత్సాహం నిండిన అటువంటి వ్యక్తుల కు కొరత లేదు. మీరు కూడా వారి నుండి స్ఫూర్తి పొందండి. మీ స్వంతం గా ఏదైనా చేయడానికి ప్రయత్నించండి. మీరు చాలా సంతృప్తి ని అనుభవిస్తారు.

 

ప్రియమైన నా దేశ ప్రజలారా, రెండు రోజుల క్రితం నేను వారాణసీ లో ఉన్నాను. అక్కడ చాలా అద్భుతమైన ఫోటో ఎగ్జిబిశను ను చూశాను. కాశీ, పరిసర ప్రాంతాల యువత కెమెరా లో బంధించిన క్షణాలు అద్భుతం గా ఉన్నాయి. అందులో మొబైల్ కెమెరా తో తీసిన ఫోటో లు చాలా ఉన్నాయి. నిజాని కి నేడు మొబైల్ ఉన్న వారు కంటెంట్ సృష్టికర్తలు గా మారారు. సామాజిక మాధ్యాలు కూడా ప్రజల కు వారి నైపుణ్యాల ను, ప్రతిభ ను చూపడం లో చాలా సహాయ పడ్డాయి. భారతదేశం లోని మన యువ స్నేహితులు కంటెంట్ సృష్టి రంగంలో అద్భుతాలు చేస్తున్నారు. ఇది ఏ సామాజిక మాధ్యం వేదిక అయినా కానివ్వండి. కచ్చితం గా మన యువ స్నేహితులు వేరువేరు విషయాల పై విభిన్న అంశాల ను శేర్ చేసుకొంటారు. అది పర్యటన రంగం కావచ్చు. సామాజిక మార్పు కారకాలు కావచ్చు. ప్రజా భాగస్వామ్యం కావచ్చు. లేదా స్పూర్తిదాయకమైన జీవిత ప్రయాణం కావచ్చు. వీటికి సంబంధించిన వివిధ రకాల కంటెంట్ సామాజిక మాధ్యాల లో అందుబాటు లో ఉంది. కంటెంట్‌ ను సృజిస్తున్న దేశ యువత గళం నేడు చాలా ప్రభావవంతం గా మారింది. వారి ప్రతిభ ను గౌరవించేందుకు, దేశం లో నేశనల్ క్రియేటర్స్ అవార్డు మొదలైంది. దీని లో వివిధ కేటగిరీల లో సామాజిక మార్పు విషయం లో ప్రభావశీలమైన వాణి గా మారేందుకు సాంకేతిక విజ్ఞ‌ానాన్ని ఉపయోగిస్తున్న వారిని సత్కరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పోటీ ని మైగవ్ (MyGov) లో నిర్వహించడం జరుగుతున్నది. కంటెంట్ సృష్టికర్త లు ఇందులో చేరవలసింది గా నేను కోరుతున్నాను. మీకు అటువంటి ఆసక్తికరమైన కంటెంట్ క్రియేటర్ లను గురించి తెలిస్తే, కచ్చితం గా వారి ని నేశనల్ క్రియేటర్స్ అవార్డు కు నామినేట్ చేయండి.

 

ప్రియమైన నా దేశ ప్రజలారా, కొద్ది రోజుల క్రితం ఎన్నికల సంఘం ‘మేరా పెహ్లా ఓట్ – దేశ్ కే లియే’ అనే పేరు తో మరో ప్రచారాన్ని ప్రారంభించినందుకు నేను సంతోషిస్తున్నాను. దీని ద్వారా మొదటి సారి వోటర్ లు అత్యధిక సంఖ్య లో వోటు వేయాలి అని ప్రత్యేకంగా అభ్యర్థించారు. ఉత్సాహం, శక్తితో నిండిన యువ శక్తి పట్ల భారతదేశం గర్విస్తోంది. ఎన్నికల ప్రక్రియ లో యువత అధిక సంఖ్య లో పాల్గొంటే దాని ఫలితాలు దేశాని కి అంతే ఎక్కువ ప్రయోజనకరం గా ఉంటాయి. మొదటి సారి వోటరు లు కూడా రికార్డు సంఖ్యలో వోటు వేయాలి అని నేను కోరుతున్నాను. 18 ఏళ్లు నిండిన తరువాత 18 వ లోక్‌ సభ కు సభ్యుడి ని ఎన్నుకొనే అవకాశం మీకు లభిస్తుంది. అంటే ఈ 18 వ లోక్ సభ కూడా యువత ఆకాంక్ష కు ప్రతీక అవుతుంది. అందుకే మీ వోటు కు ప్రాధాన్యం మరింత గా పెరిగింది. సార్వత్రిక ఎన్నికల హడావుడి మధ్య యువత, కేవలం రాజకీయ కార్యకలాపాల్లో భాగం కావడమే కాకుండా ఈ కాలం లో జరిగే చర్చలు, వాదనల ను గురించి కూడా తెలుసుకోవాలి. గుర్తు పెట్టుకోండి- ‘మేరా పహ్ లా వోట్ – దేశ్ కే లియే’ (అంటే ‘నా మొదటి ఓటు - దేశం కోసం’ అని భావం). క్రీడా ప్రపంచం, చలనచిత్ర పరిశ్రమ, సాహిత్య ప్రపంచం, ఇతర నిపుణులు, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల తో సహా దేశం లోని ప్రభావశీలురు ఈ ప్రచారం లో పాల్గొనాలి. ఏ రంగాని కి చెందిన ప్రభావశీలురు అయినా ఈ ప్రచారం లో చురుకు గా పాల్గొని, వోటు ను మొదటిసారి గా వేస్తున్న వోటర్ లను ప్రోత్సహించడానికి మద్దతు ను ఇవ్వాలని నేను కోరుతున్నాను.

 

సహచరులారా, ఈ ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం ఎపిసోడ్‌ లో ఇంతే. దేశం లో లోక్‌ సభ ఎన్నికల సంబంధి వాతావరణం నెలకొనడం తో కిందటి సారి మాదిరి గానే మార్చి నెల లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు లోకి వచ్చేందుకు ఆస్కారం ఉంది. గడచిన 110 ఎపిసోడ్‌ల లో ప్రభుత్వ నీడ కు దూరం గా ఉంచడం ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం భారీ విజయం. ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో దేశం యొక్క సామూహిక శక్తి గురించి, దేశం సాధించిన విజయాల ను గురించి న చర్చ జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రజల కు చెందిన, ప్రజల కోసం, ప్రజలే సిద్ధం చేసిన కార్యక్రమం. అయినప్పటికీ రాజకీయ సంప్రదాయాల ను అనుసరించి, లోక్‌ సభ ఎన్నికల ఈ రోజుల లో ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం వచ్చే మూడు నెలల పాటు ప్రసారం కాదు. తరువాతి సారి మనం ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో కలుసుకున్నప్పుడు అది 111 వ ఎపిసోడ్ అవుతుంది. తరువాతి సారి ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం శుభ సంఖ్య 111 తో మొదలవుతుంది. ఇంతకంటే మంచిది ఏముంటుంది! అయితే, సహచరులారా, మీరు నా కోసం ఒక పని ని చేస్తూనే ఉండాలి. ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం మూడు నెలలు ఆగిపోవచ్చు. కానీ, దేశ విజయాలు కొంతకాలం ఆగవు. కాబట్టి సమాజం, దేశం సాధించిన విజయాల ను ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం హ్యాశ్ ట్యాగ్ (#) తో సామాజిక మాధ్యాల లో పోస్ట్ చేస్తూ ఉండండి. | కొంతకాలం కిందట ఓ యువకుడు నాకు మంచి సలహా ను ఇచ్చారు. ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్‌ల లో చిన్న చిన్న వీడియోల ను యూట్యూబ్ శార్ట్‌ ల రూపం లో శేర్ చేయాలి అనేదే ఆ సూచన. అందువల్ల, అటువంటి లఘు చిత్రాల ను విస్తృతం గా శేర్ చేయండి అంటూ ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం శ్రోతల కు నేను విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi