వడోదర ముంబై ఎక్స్ ప్రెస్ వే లోని ముఖ్యమైన విభాగాలను జాతికి అంకితం చేసిన ప్రధాన మంత్రి
కాక్రాపర్ అణు విద్యుత్ కేంద్రంలో రెండు కొత్త ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ల అంకితం : కెఎపిఎస్ -3 , కెఎపిఎస్ -4
నవ్సారిలో పిఎం మిత్ర పార్కు నిర్మాణ పనుల ప్రారంభం
సూరత్ మున్సిపల్ కార్పొరేషన్, సూరత్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ, డ్రీమ్ సిటీకి చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
రోడ్డు, రైలు, విద్య, నీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన
' నవ్సారిలో ఉండటం ఎప్పుడూ గొప్ప అనుభూతి. వివిధ ప్రాజెక్టుల ప్రారంభం, ప్రారంభోత్సవం గుజరాత్ అభివృద్ధి ప్రయాణాన్ని బలోపేతం చేస్తుంది ‘
“ఇతరుల ఆశలు సన్నగిల్లిన చోటే మోదీ హామీ మొదలవుతుంది’
"పేద, మధ్యతరగతి, గ్రామీణ, పట్టణ అనే తేడా లేకుండా ప్రతి పౌరుడి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే మా ప్రభుత్వ ప్రయత్నం’
“నేడు దేశంలోని చిన్న నగరాల్లో కూడా అద్భుతమైన కనెక్టివిటీ మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నారు’
“'నేడు ప్రపంచం డిజిటల్ ఇండియాను గుర్తించింది'

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం నాడు గుజరాత్ లోని నవ్సారి లో రూ.47,000 కోట్ల కు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల అంకితం, శంకుస్థాపన బ్కార్యక్రమం లో పాల్గొన్నారు. విద్యుదుత్పత్తి, రైలు, రోడ్డు, జౌళి, విద్య, నీటి సరఫరా, కనెక్టివిటీ, పట్టణాభివృద్ధి వంటి విస్తృత శ్రేణి రంగాల  ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ,  ఈ రోజు గుజరాత్ లో ఇది తన మూడో కార్యక్రమం అని, మొదట గుజరాత్ కు చెందిన పశు పాలకులు (పశువుల పెంపకందారులు), పాడిపరిశ్రమలో భాగస్వాములతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నామని చెప్పారు. తరువాత మెహసానాలోని వలీనాథ్ మహాదేవ్ ఆలయంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. "ఇప్పుడు నేను నవ్సారిలో ఈ అభివృద్ధి ఉత్సవంలో పాల్గొంటున్నాను" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా హాజరైన ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో ఫ్లాష్ లైట్లను ఆన్ చేసి, ఈ మహత్తర అభివృద్ధి ఉత్సవంలో భాగస్వాములు కావాలని కోరారు. టెక్స్ టైల్, విద్యుత్, పట్టణాభివృద్ధి రంగాల్లో వడోదర, నవ్సారి, భరూచ్, సూరత్ తదితర ప్రాంతాల్లో రూ.40,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టిన సందర్భంగా ప్రధాన మంత్రి పౌరులను అభినందించారు.

 

‘మోదీ కీ గ్యారంటీ’ ప్రచారాన్ని ప్రస్తావిస్తూ, తాను ఇచ్చిన హామీలు నెరవేరుతాయన్న భరోసాను ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు, ఇది గుజరాత్ ప్రజలకు చాలా కాలంగా తెలిసిన వాస్తవం అని అన్నారు. వ్యవసాయం, ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్ అంటూ ఐదు ‘ఎఫ్' ల గురించి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడేవారని గుర్తు చేసుకున్నారు. "నేడు, పట్టు నగరమైన సూరత్ నవ్సారి వరకు విస్తరించబడుతోంది" అని ప్రధాన మంత్రి అన్నారు, ఈ రంగంలో అతిపెద్ద ఉత్పత్తిదారులు , ఎగుమతిదారులతో పోటీపడే భారతదేశ సామర్థ్యాన్ని వివరించారు. గుజరాత్ టెక్స్ టైల్ పరిశ్రమ ప్రత్యేకతను చెబుతూ, సూరత్ లో తయారయ్యే టెక్స్ టైల్స్ కు ఉన్న విశిష్ట గుర్తింపును ప్రధాన మంత్రి వివరించారు. పీఎం మిత్ర పార్కు నిర్మాణం పూర్తయితే మొత్తం ప్రాంత ముఖచిత్రమే మారిపోతుందని, దీని నిర్మాణానికే రూ.3,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆయన ఉద్ఘాటించారు. కటింగ్, వీవింగ్, జిన్నింగ్, గార్మెంట్స్, టెక్నికల్ టెక్స్ టైల్స్, టెక్స్ టైల్ మెషినరీ వంటి కార్యకలాపాలకు పీఎం మిత్ర పార్కు విలువ గొలుసు పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుందని, అదే సమయంలో ఉపాధికి ఊతమిస్తుందని ఆయన అన్నారు. ఈ పార్కులో కార్మికులకు ఇళ్లు, లాజిస్టిక్స్ పార్కు, గిడ్డంగులు, ఆరోగ్య సౌకర్యాలు, శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి అవసరమైన సౌకర్యాలు ఉంటాయని ప్రధాన మంత్రి తెలియజేశారు.

రూ.800 కోట్లకు పైగా విలువ చేసే తాపీ రివర్ బ్యారేజీకి శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇది సూరత్ లో నీటి సరఫరాకు సంబంధించిన సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తుందని , వరద లాంటి పరిస్థితులను నివారించడంలో కూడా సహాయపడుతుందని ప్రధాన మంత్రి చెప్పారు.

 

దైనందిన జీవితంలో, పారిశ్రామికాభివృద్ధిలో విద్యుత్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, 20-25 సంవత్సరాల క్రితం గుజరాత్ లో విద్యుత్ కోతలు చాలా తరచుగా ఉండేవని గుర్తు చేశారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఎదుర్కొన్న సవాళ్లను కూడా ప్రస్తావిస్తూ బొగ్గు, గ్యాస్ దిగుమతులు ప్రధాన అవరోధాలుగా పేర్కొన్నారు. జలవిద్యుదుత్పత్తికి ఉన్న కనీస అవకాశాలను కూడా ఆయన ప్రస్తావించారు. రాష్ట్రాన్ని విద్యుత్ ఉత్పత్తి సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తూ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం, నేడు గుజరాత్ లో భారీ మొత్తంలో విద్యుదుత్పత్తి చేస్తున్న సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రస్తావిస్తూ ప్రధాని 'మోదీ హై తో ముంకిన్ హై' అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

విద్యుత్ ఉత్పత్తి సంక్షోభం నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తాను “మోదీ హై తో ముమ్కిన్ హై” అంతర్దృష్టి అందించామని , అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం, సౌర పవన విద్యుత్ ఉత్పత్తికి పెద్దపీట వేయడం తో నేడు గుజరాత్‌లో భారీ విద్యుత్ ఉత్పత్తి అవు తోందని చెప్పారు.

అణువిద్యుత్ ఉత్పాదన గురించి వివరిస్తూ, కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ (కెఎపిఎస్) యూనిట్ 3 , యూనిట్ 4 లో రెండు కొత్త స్వదేశీ ప్రెజర్డ్ హెవీ వాటర్ రియాక్టర్ల (పిహెచ్ డబ్ల్యుఆర్) ను ఈ రోజు జాతికి అంకితం చేసినట్టు ప్రధాన మంత్రి చెప్పారు. ఈ రియాక్టర్లు ఆత్మనిర్భర్ భారత్ కు ఉదాహరణలని, గుజరాత్ అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు.

 

పెరుగుతున్న ఆధునిక మౌలిక సదుపాయాలతో దక్షిణ గుజరాత్ అపూర్వమైన అభివృద్ధిని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా కుటుంబాల విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా ఆదాయాన్ని ఆర్జించే మాధ్యమంగా మారుతుందని చెప్పారు. దేశంలోని మొట్టమొదటి బుల్లెట్ రైలు ఈ ప్రాంతం గుండా వెళ్తుందని, ఈ ప్రాంతం దేశంలోని పెద్ద పారిశ్రామిక కేంద్రాలైన ముంబై, సూరత్ లను కలుపుతుందని ప్రధాన మంత్రి తెలియజేశారు.

"నవ్సారి ఇప్పుడు తన పారిశ్రామిక అభివృద్ధి తో గుర్తింపు పొందుతోంది" అని ప్రధాని మోదీ అన్నారు, నవ్సారితో సహా మొత్తం పశ్చిమ గుజరాత్ వ్యవసాయ పురోగతికి ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని రైతులకు ప్రయోజనాలను అందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి శ్రీ మోదీ మాట్లాడుతూ, పండ్ల సాగు ఆవిర్భావాన్ని గురించి వివరించారు. నవ్సారి నుండి ప్రపంచ ప్రసిద్ధి చెందిన హపస్ వల్సారి రకాల మామిడి ,  చికూ (సపోడిల్లా) గురించి ప్రస్తావించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు రూ.350 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందిందని ప్రధాని తెలిపారు.

యువత, పేదలు, రైతులు, మహిళల సాధికారతకు తాను ఇచ్చిన హామీని ప్రధాని పునరుద్ఘాటించారు. ఈ హామీ కేవలం పథకాలను రూపొందించడానికి మాత్రమే కాకుండా అందరికీ అందేలా నిర్ధారించడానికి కూడా వర్తిస్తుందని ఆయన అన్నారు.

గిరిజన, తీరప్రాంత గ్రామాలను గతంలో నిర్లక్ష్యం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం ఉమర్గాం నుంచి అంబాజీ వరకు ఈ ప్రాంతంలో అన్ని మౌలిక వసతులు కల్పించిందన్నారు. జాతీయ స్థాయిలో కూడా అభివృద్ధిలో వెనుకబడిన 100కు పైగా ఆకాంక్షాత్మక జిల్లాలు దేశంలోని మిగతా ప్రాంతాలతో కలిసి ముందుకు సాగుతున్నాయని అన్నారు .

 

"ఇతరుల నుండి ఆశలు సన్నగిల్లిన చోట మోడీ హామీ ప్రారంభమవుతుంది" అని ప్రధాన మంత్రి అన్నారు. పేదలకు పక్కా ఇళ్లు, ఉచిత రేషన్ పథకం, విద్యుత్, తాగునీరు, పేదలు, రైతులు, దుకాణదారులు, కూలీలకు బీమా పథకాలు వంటి హామీలను వివరించారు. "ఇది నేడు వాస్తవం ఎందుకంటే ఇది మోదీ హామీ" అని శ్రీ మోదీ అన్నారు.

గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ అనీమియా సమస్యను ప్రస్తావిస్తూ, ఈ వ్యాధిని నిర్మూలించడానికి జాతీయ స్థాయిలో సమిష్టి కృషి చేయాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. తన ముఖ్యమంత్రి రోజుల్లో సికిల్ సెల్ అనీమియాను ఎదుర్కోవడానికి రాష్ట్రం చేపట్టిన ముందస్తు చర్యలను ప్రస్తావించిన ప్రధాన మంత్రి, వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి విస్తృతమైన జాతీయ ప్రయత్నాలను కూడా వివరించారు. సికిల్ సెల్ అనీమియా నుంచి విముక్తి కల్పించేందుకు జాతీయ మిషన్ ను ప్రారంభించామని, దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో ఈ వ్యాధిని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర చొరవను ప్రధాని మోదీ వివరించారు. ఈ మిషన్ లో భాగంగా దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ అనీమియాకు స్క్రీనింగ్ లు నిర్వహిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రానున్న మెడికల్ కాలేజీల గురించి ప్రస్తావించారు.

పేద, మధ్యతరగతి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల తో నిమిత్తం లేకుండా ప్రతి పౌరుడి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.

మునుపటి కాలంలోని ఆర్థిక స్తబ్దతను గుర్తు చేస్తూ, "ఆర్థిక స్తబ్దత అంటే దేశానికి పరిమిత ఆర్థిక వనరులు ఉండడం " అని ప్రధాన మంత్రి వివరించారు, ఆ కాలంలో గ్రామీణ పట్టణ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని నొక్కి చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ 2014 లో 11 వ స్థానం నుండి 5 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని, దీని అర్థం నేడు భారత పౌరులకు ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బు ఉందని, అందువల్ల భారతదేశం దానిని ఖర్చు చేస్తోందని ఆయన అన్నారు. అందువల్ల, నేడు దేశంలోని చిన్న నగరాల్లో కూడా అద్భుతమైన కనెక్టివిటీ మౌలిక సదుపాయాలు నిర్మించబడుతున్నాయి. చిన్న పట్టణ కేంద్రాల నుంచి కూడా విమాన ప్రయాణ సౌకర్యం, అందుబాటులో ఉందని, నాలుగు కోట్ల పక్కా గృహాలు నిర్మించామని చెప్పారు.

డిజిటల్ ఇండియా కార్యక్రమం విజయాన్ని, పరిధిని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, "ఈ రోజు ప్రపంచం డిజిటల్ ఇండియాను గుర్తించింది" అని అన్నారు. కొత్త స్టార్టప్ లు, క్రీడారంగం లో యువత ఆవిర్భావంతో డిజిటల్ ఇండియా చిన్న నగరాల రూపురేఖలను మార్చిందని ఆయన ఉద్ఘాటించారు. ఇలాంటి చిన్న పట్టణాల్లో నయా మధ్యతరగతి ఆవిర్భావం భారత్ ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు దోహద పడుతుందని ఆన్నారు.

అభివృద్ధితో పాటు వారసత్వానికి ప్రాధాన్యమివ్వడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, స్వాతంత్ర్యోద్యమం లేదా జాతి నిర్మాణం ఏదైనా ఈ ప్రాంతం భారతదేశ విశ్వాసం , చరిత్రకు ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. బంధుప్రీతి, బుజ్జగింపు, అవినీతి రాజకీయాల కారణంగా ఈ ప్రాంత వారసత్వం నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. దీనికి భిన్నంగా, భారతదేశపు గొప్ప వారసత్వం ప్రతిధ్వని నేడు ప్రపంచవ్యాప్తంగా వినబడుతోందని ప్రధాన మంత్రి అన్నారు. దండి ఉప్పు సత్యాగ్రహం జరిగిన ప్రదేశంలో దండి మెమోరియల్ అభివృద్ధి, సర్దార్ పటేల్ కృషికి అంకితమైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏర్పాటు గురించి ఆయన ప్రస్తావించారు.

ప్రసంగాన్ని ముగిస్తూ,  ప్రధాన మంత్రి, వచ్చే 25 సంవత్సరాల పాటు దేశాభివృద్ధికి రోడ్ మ్యాప్ ఇప్పటికే సిద్ధమయిందని ఆన్నారు. "ఈ 25 సంవత్సరాలలో, మనం ఒక వికసిత్ గుజరాత్,  ఒక వికసిత్ భారత్ను తయారు చేస్తాము" అని ప్రధాని అన్నారు.

గుజరాత్ ముఖ్య మంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ , పార్లమెంటు సభ్యుడు శ్రీ సి.ఆర్ .పాటిల్ తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, గుజరాత్ ప్రభుత్వానికి చెందిన మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

నేపథ్యం

అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారువడోదర ముంబై ఎక్స్ ప్రెస్ వే లోని బహుళ ప్యాకేజీలుభరూచ్నవ్సారివల్సాద్ లలో బహుళ రహదారి ప్రాజెక్టులుతాపిలో గ్రామీణ మంచినీటి సరఫరా ప్రాజెక్టుభరూచ్ లో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు వీటిలో ఉన్నాయినవ్సారిలో పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ రీజియన్అపెరల్ (పీఎం మిత్రపార్కు నిర్మాణ పనులను ప్రధాని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి ముఖ్యమైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వీటిలో భరూచ్-దహేజ్ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ ప్రెస్ వే;  వడోదరలోని ఎస్.ఎస్.జి ఆసుపత్రిలో బహుళ ప్రాజెక్టులు; వడోదరలో ప్రాంతీయ సైన్స్ కేంద్రం; సూరత్, వడోదర, పంచమహల్ లలో రైల్వే గేజ్ మార్పిడి ప్రాజెక్టులు; భరూచ్, నవ్సారి సూరత్ లలో బహుళ రహదారి ప్రాజెక్టులు; వల్సాద్ లో అనేక నీటి సరఫరా పథకాలు, పాఠశాల,  హాస్టల్ భవనం ,నర్మదా జిల్లాలో ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి.

సూరత్ మునిసిపల్ కార్పొరేషన్సూరత్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీడ్రీమ్ సిటీకి చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ పిసిఐఎల్) రూ .22,500 కోట్లకు పైగా వ్యయంతో  కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ (కె ఎ పి ఎస్ ) యూనిట్ 3, యూనిట్ 4లో నిర్మించే రెండు కొత్త ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లను (పిహెచ్ డబ్ల్యూఆర్) ప్రధాని జాతికి అంకితం చేశారు. కె ఎ పి ఎస్-3,  కె ఎ పి ఎస్-4 ప్రాజెక్టులు 1400 (700*2) మెగావాట్ల సంచిత సామర్థ్యాన్ని కలిగిన అతిపెద్ద స్వదేశీ పిహెచ్ డబ్ల్యూ ఆర్ లు. ఇవి ప్రపంచంలోనే ఉత్తమమైన రియాక్టర్లతో పోల్చదగిన అధునాతన భద్రతా లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ రెండు రియాక్టర్లు కలిపి సంవత్సరానికి 10.4 బిలియన్ యూనిట్ల స్వచ్ఛమైన విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి  గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, గోవా ,  కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ , డామన్ అండ్ డయ్యూ వంటి బహుళ రాష్ట్రాల వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తాయి.

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi