పురూలియాలోని రఘునాథ్‌పూర్‌లో రఘునాథ్‌పూర్ థర్మల్ పవర్ స్టేషన్ రెండో దశ(2x60 మెగావాట్లు)కు శంకుస్థాపన
మెజియా థర్మల్ పవర్ స్టేషన్ యూనిట్ 7, 8 కి సంబంధించి ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్జిడి) వ్యవస్థ ప్రారంభం
ఎన్హెచ్-12 ఫరక్కా-రాయ్‌గంజ్ సెక్షన్ నాలుగు లేనింగ్ కోసం రహదారి ప్రాజెక్ట్‌ ప్రారంభం
పశ్చిమ బెంగాల్‌లో రూ.940 కోట్ల పైగా విలువైన నాలుగు రైలు ప్రాజెక్టులను జాతికి అంకితం
"పశ్చిమ బెంగాల్ తన ప్రస్తుత మరియు భవిష్యత్తు విద్యుత్ అవసరాలకు స్వయం సమృద్ధిగా ఉండాలనేది మా ప్రయత్నం"
"దేశానికి, అనేక తూర్పు రాష్ట్రాలకు పశ్చిమ బెంగాల్ తూర్పు ద్వారం వలె పనిచేస్తుంది"
"రోడ్డు మార్గాలు, రైల్వేలు, వాయుమార్గాలు, జలమార్గాల ఆధునిక మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది"

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ప‌శ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లా కృష్ణాన‌గ‌ర్‌లో రూ. 15,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలు కొన్నిటిని జాతికి అంకితం చేశారు, మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. నేటి అభివృద్ధి ప్రాజెక్టులు విద్యుత్, రైలు, రోడ్డు వంటి రంగాలతో ముడిపడి ఉన్నాయి.

 

స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, ప‌శ్చిమ బెంగాల్‌ను వికసిత రాష్ట్రంగా మార్చే దిశ‌లో ఈరోజు మ‌రో ముంద‌డుగు వేసిన‌ట్లు చెప్పారు. రైల్వే, పోర్ట్, పెట్రోలియం రంగాలలో 7,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన ఆరంబాగ్‌లో నిన్న జరిగిన కార్యక్రమాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ రోజు కూడా, "పశ్చిమ బెంగాల్ పౌరుల జీవితాలను సులభతరం చేయడానికి 15,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడం, విద్యుత్, రహదారి, రైల్వే రంగాలను కలుపుతూ శంకుస్థాపనల కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టం" అని ప్రధాని తెలిపారు. ఈ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి ఊపునిస్తాయని, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తాయన్నారు. నేటి అభివృద్ధి కార్యక్రమాలకు పౌరులకు ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు.

అభివృద్ధి ప్రక్రియలో విద్యుత్తు ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, పశ్చిమ బెంగాల్‌ను దాని విద్యుత్ అవసరాల కోసం స్వావలంబన చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌కు చెందిన బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పురూలియా జిల్లాలోని రఘునాథ్‌పూర్‌లో ఉన్న రఘునాథ్‌పూర్ థర్మల్ పవర్ స్టేషన్ ఫేజ్ II (2x660 మెగావాట్లు) రాష్ట్రంలో రూ.11,000 కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకువస్తుందని ఆయన అన్నారు. ఇది రాష్ట్ర ఇంధన అవసరాలను పరిష్కరిస్తుందని, ఈ ప్రాంతం ఆర్థిక అభివృద్ధికి కూడా తోడ్పడుతుందని ఆయన అన్నారు. ఇంకా, మెజియా థర్మల్ పవర్ స్టేషన్ యూనిట్ 7, 8 కి సంబంధించి ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్జిడి) వ్యవస్థను సుమారు 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం పర్యావరణ సమస్యల పట్ల భారతదేశ అత్యంత ప్రాధాన్యత అంశమని చెప్పదియానికి ఉదాహరణ అని ఆయన అన్నారు.  

 

పశ్చిమ బెంగాల్, దేశానికి ‘తూర్పు ద్వారం’లా పనిచేస్తోందని, ఇక్కడి నుంచి తూర్పు ప్రాంతాలకు అవకాశాలు అపారంగా ఉన్నాయని ప్రధాని అన్నారు. అందువల్ల, రోడ్డు మార్గాలు, రైల్వేలు, వాయుమార్గాలు, జలమార్గాల ఆధునిక కనెక్టివిటీ కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈరోజు ప్రారంభించిన ఎన్హెచ్-12 (100 కి.మీ.)లోని ఫరక్కా-రాయ్‌గంజ్ సెక్షన్‌ను నాలుగు లేనింగ్‌ల కోసం రోడ్డు ప్రాజెక్ట్ దాదాపు 2000 కోట్ల రూపాయలతో ప్రారంభించిందని, ప్రయాణ సమయం సగానికి తగ్గుతుందని ఆయన అన్నారు. ఇది సమీప పట్టణాలలో ట్రాఫిక్‌ను సులభతరం చేస్తుంది. ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను పెంచడంతో పాటు రైతులకు సహాయపడుతుంది.

మౌలిక సదుపాయాల దృక్కోణంలో, రైల్వే పశ్చిమ బెంగాల్  అద్భుతమైన చరిత్రలో భాగమైందని, గత ప్రభుత్వాలు అభివృద్ధిలో అగాధం సృష్టించడం ద్వారా రాష్ట్ర వారసత్వం, ప్రయోజనాలను సరైన మార్గంలో ముందుకు తీసుకెళ్లలేదని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలలో పశ్చిమ బెంగాల్ రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ప్రధాన మంత్రి హైలైట్ చేశారు. గతంతో పోలిస్తే రెండింతలు డబ్బు ఖర్చు చేయడాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ఆధునీకరణ, అభివృద్ధికి నాలుగు రైల్వే ప్రాజెక్టులు అంకితం చేసారు. వికసిత బెంగాల్ తీర్మానాలను సాధించడంలో సహాయపడే నేటి సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. పౌరులకు తన శుభాకాంక్షలను తెలియజేస్తూ ముగించారు.

 

ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సివి ఆనంద బోస్, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ సహాయ మంత్రి శ్రీ శంతను ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం:

పురూలియా జిల్లాలోని రఘునాథ్‌పూర్‌లో రఘునాథ్‌పూర్ థర్మల్ పవర్ స్టేషన్ ఫేజ్ II (2x660 మెగావాట్లు)కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్  ఈ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అత్యంత సమర్థవంతమైన సూపర్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. కొత్త ప్లాంట్ దేశ ఇంధన భద్రతను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయనుంది.

 

మెజియా థర్మల్ పవర్ స్టేషన్ యూనిట్ 7, 8 ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్జిడి) వ్యవస్థను ప్రధాన మంత్రి ప్రారంభించారు. దాదాపు రూ.650 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ ఎఫ్‌జీడీ వ్యవస్థ ఫ్లూ వాయువుల నుంచి సల్ఫర్ డయాక్సైడ్‌ను తొలగించి, క్లీన్ ఫ్లూ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది.  జిప్సమ్‌ను ఏర్పరుస్తుంది, దీనిని సిమెంట్ పరిశ్రమలో ఉపయోగించవచ్చు.

ఎన్హెచ్-12 (100 కి.మీ) ఫరక్కా-రాయ్‌గంజ్ సెక్షన్  నాలుగు లేనింగ్ కోసం రహదారి ప్రాజెక్ట్‌ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. సుమారు 1986 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్ట్ ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది, కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఉత్తర బెంగాల్, ఈశాన్య ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది.

 

దామోదర్ - మోహిశిలా రైలు మార్గాన్ని డబ్లింగ్ చేసే ప్రాజెక్ట్‌తో సహా పశ్చిమ బెంగాల్‌లో రూ. 940 కోట్లకు పైగా విలువైన నాలుగు రైలు ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు; రాంపూర్హాట్ - మురారై మధ్య మూడవ లైన్; బజార్సౌ - అజిమ్‌గంజ్ రైలు మార్గం రెట్టింపు; అజిమ్‌గంజ్ - ముర్షిదాబాద్‌ని కలుపుతూ కొత్త లైన్. ఈ ప్రాజెక్టులు రైలు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి, సరుకు రవాణాను సులభతరం చేస్తాయి. ఈ ప్రాంతంలో ఆర్థిక, పారిశ్రామిక వృద్ధికి దోహదం చేస్తాయి. 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi