ఓఖా ప్రధాన భూభాగాన్ని , బేట్ ద్వారకను కలిపే సుదర్శన్ సేతు జాతికి అంకితం
వడినార్, రాజ్ కోట్-ఓఖా వద్ద పైప్ లైన్ ప్రాజెక్టు అంకితం
రాజ్ కోట్-జెతల్సర్-సోమనాథ్ , జెతల్సర్-వాన్జాలియా రైలు విద్యుదీకరణ ప్రాజెక్టుల అంకితం
ఎన్ హెచ్ -927లోని ధోరాజీ-జమ్కండోర్నా-కలవాడ్ సెక్షన్ వెడల్పునకు శంకుస్థాపన
జామ్ నగర్ లో రీజనల్ సైన్స్ సెంటర్ కు శంకుస్థాపన
సిక్కా థర్మల్ పవర్ స్టేషన్ లో ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్ జీడీ) వ్యవస్థ ఏర్పాటుకు శంకుస్థాపన
“కేంద్రంలో, గుజరాత్ లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చాయి”
“''ఇటీవల ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించే భాగ్యం కలిగింది. అదే దైవత్వాన్ని ఈ రోజు ద్వారకా ధామ్ లో అనుభవిస్తున్నాను".
"నీట మునిగిన ద్వారకా నగరానికి దిగుతున్నప్పుడు, దైవత్వపు గొప్పతనం నన్ను చుట్టుముట్టింది"
"సుదర్శన సేతులో కలలు కన్నదానికి పునాది పడింది, నేడు అది నెరవేరింది"
"సంపన్నమైన , బలమైన దేశాన్ని నిర్మించడానికి ఆధునిక కనెక్టివిటీ మార్గం"
‘వికాస్ భీ విరాసత్ భీ' మంత్రం తో విశ్వాస కేంద్రాల
ఇది నిజంగా సుదర్శనీయం" అని ప్రధాని మోదీ అన్నారు. స్వచ్ఛత మిషన్ పట్ల ద్వారక ప్రజల కు ఉన్న నిబద్ధతను ప్రధాన మంత్రి ప్రశంసించారు.
గత ప్రభుత్వాల హయాంలో జరిగిన కుంభకోణాలను ఆయన తప్పుబట్టారు.

ఆయన ఆదేశాలను పాటించాను. నా బాధ్యతను నిర్వర్తించాను" అని ప్రధాన మంత్రి తన పేర్కొన్నారు. వంతెనకు అమర్చిన సోలార్ ప్యానెళ్ల ద్వారా లైటింగ్ కోసం విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఆయన చెప్పారు. సుదర్శన్ సేతులో మొత్తం 12 టూరిస్ట్ గ్యాలరీలు ఉన్నాయని, సముద్రం విస్తారమైన వీక్షణను అందిస్తుందని ఆయన తెలిపారు. "నేను ఈ రోజు ఈ గ్యాలరీలను సందర్శించాను. ఇది నిజంగా సుదర్శనీయం" అని ప్రధాని మోదీ అన్నారు. స్వచ్ఛత మిషన్ పట్ల ద్వారక ప్రజల కు ఉన్న నిబద్ధతను ప్రధాన మంత్రి ప్రశంసించారు.  ప్రపంచ ప్దృష్టిని ఆకర్షిస్తున్న పరిశుభ్రత స్థాయిని కాపాడాలని కోరారు.

 

న్యూ ఇండియాపై తాను ఇచ్చిన హామీపై వ్యతిరేకతను ప్రస్తావించిన  ప్రధాన మంత్రి, ప్రజలు తమ కళ్లముందే నవభారత ఆవిర్భావాన్ని చూస్తున్నారని అన్నారు. రాజకీయ సంకల్పం లేకపోవడం, వారసత్వ రాజకీయాల స్వార్థంతో పేదలను ఆదుకోవడానికి ఇష్టపడకపోవడం వల్ల ఇది ఇంతకుముందు సాధ్యపడలేదని ఆయన అన్నారు. ఇది వికసిత్ భారత్ గొప్ప లక్ష్యాల కోసం ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని చిన్నదిగా ఉంచిందని ఆయన అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన కుంభకోణాలను ఆయన తప్పుబట్టారు.

2014లో తాను అధికారంలోకి వచ్చినప్పుడు దేశాన్ని ఎవరూ దోచుకోనివ్వబోమని ఇచ్చిన హామీని ప్రధాని గుర్తు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన వేల కోట్ల కుంభకోణాలన్నీ ఇప్పుడు ఆగిపోయాయని, పదేళ్లలో దేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. తత్ఫలితంగా ఒకవైపు దైవ విశ్వాసం, తీర్థయాత్రల ప్రదేశాలు పునఃప్రారంభమవడాన్ని, మరోవైపు మెగా ప్రాజెక్టుల ద్వారా నవభారతాన్ని అభివృద్ధి చేయడాన్ని చూడొచ్చని ప్రధాని అన్నారు. సుదర్శన్ సేతు, గుజరాత్ కేంద్రంగా ఉన్న భారతదేశపు పొడవైన కేబుల్ ఆధారిత వంతెన, ముంబైలో దేశంలోనే పొడవైన సముద్ర వంతెన, జమ్మూ కాశ్మీర్ లోని చీనాబ్ పై నిర్మించిన అద్భుతమైన వంతెన, తమిళనాడులో భారతదేశపు మొదటి నిలువు లిఫ్ట్ బ్రిడ్జి అయిన న్యూ పంబన్ వంతెన,  అస్సాంలో భారతదేశపు పొడవైన నదీ వంతెనను ఆయన ఉదాహరణలుగా ఇచ్చారు. "ఇటువంటి ఆధునిక కనెక్టివిటీ సంపన్నమైన,  బలమైన దేశాన్ని నిర్మించడానికి మార్గం" అని ఆయన అన్నారు.

దేశంలో టూరిజం వృద్ధికి కనెక్టివిటీ ప్రాముఖ్యతను వివరించిన  ప్రధాన మంత్రి, మెరుగైన కనెక్టివిటీ కారణంగా గుజరాత్ పర్యాటక కేంద్రంగా మారిందని వివరించారు. గుజ రాత్ కొత్త ఆకర్షణ  గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం గుజరాత్ లో 22 అభయారణ్యాలు, నాలుగు జాతీయ పార్కులు ఉన్నాయన్నారు. వేల సంవత్సరాల పురాతన ఓడరేవు నగరం లోథాల్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించబడింది. నేడు అహ్మదాబాద్ నగరం, రాణి కీ వావ్, చంపానేర్ ధోలావీరా ప్రపంచ వారసత్వ సంపదగా మారాయి. శివరాజ్పురి ద్వారకాలోని బ్లూ ఫ్లాగ్ బీచ్. ఆసియాలోనే అతి పొడవైన రోప్ వే గిర్నార్ లో ఉంది. ఆసియా సింహాలకు గిర్ అడవి మాత్రమే ఆవాసం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్దార్ సాహెబ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తా నగర్ లో ఉంది. ఈ రోజు రానోత్సవ్ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకుల జాతర నిర్వహించబడుతుంది. కచ్ లోని ధోర్డో గ్రామం ప్రపంచంలోని ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దేశభక్తికి, పర్యాటకానికి నాదబెట్ ఒక ముఖ్యమైన కేంద్రంగా మారుతోంది.

 

'వికాస్ భీ విరాసత్ భీ' మంత్రానికి అనుగుణంగా విశ్వాస కేంద్రాలను అప్ గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. ద్వారకా, సోమనాథ్, పావగఢ్, మోధేరా, అంబాజీ వంటి అన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో సౌకర్యాలను అభివృద్ధి చేశారు. భారతదేశాన్ని సందర్శించిన ప్రతి ఐదవ పర్యాటకుడు గుజరాత్ ను సందర్శిస్తున్నాడని ఆయన అన్నారు.  గత ఏడాది ఆగస్టు వరకు 15.5 లక్షల మంది పర్యాటకులు గుజరాత్ కు వచ్చారు. ఈ-వీసా సౌకర్యాలు కూడా గుజరాత్ కు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని ఆయన చెప్పారు.

"సంకల్పం ద్వారా సాధించడానికి సౌరాష్ట్ర భూమి ఒక పెద్ద ఉదాహరణ" అని ప్రధాన మంత్రి అన్నారు, ఈ ప్రాంతంలో ప్రతి సందర్శన కొత్త శక్తిని ఎలా నింపుతుందో నొక్కి చెప్పారు. సౌరాష్ట్ర ప్రజలు ప్రతి నీటి బొట్టు కోసం పరితపించి వలస వెళ్లాల్సిన దుర్భర పరిస్థితులను గుర్తు చేసుకున్న ప్రధాని సౌనీ యోజన ద్వారా సౌరాష్ట్రలోని వందలాది గ్రామాలకు సాగు, తాగు నీటి సరఫరా కోసం 1300 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేయడానికి శ్రీకారం చుట్టారు.

 

రానున్న సంవత్సరాలలో గుజరాత్ తో పాటు సౌరాష్ట్ర ప్రాంతం మొత్తం కొత్త విజయ శిఖరాలను చేరుకుంటుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. 'ద్వారకాధీష్ ఆశీస్సులు మనపై ఉన్నాయి. మనం కలిసి విక సిత్ సౌరాష్ట్ర, విక్సిత్ గుజరాత్ లను తయారు చేస్తాం" అని ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

గుజరాత్ ముఖ్య మంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ , పార్లమెంట్ సభ్యుడు శ్రీ సి.ఆర్ పాటిల్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

నేపథ్యం

 

సుమారు రూ.980 కోట్ల వ్యయంతో నిర్మించిన ఓఖా ప్రధాన భూభాగాన్నిబేట్ ద్వారకా ద్వీపాన్ని కలిపే సుదర్శన్ సేతును ప్రధాని జాతికి అంకితం చేశారుఇది దేశంలో 2.32 కి.మీ.అత్యంత పొడవైన కేబుల్ స్టేడ్ వంతెన 2.32 కి.మీసుదర్శన్ సేతు ఒక ప్రత్యేకమైన డిజైన్ ను కలిగి ఉందిఇది శ్రీమద్భగవద్గీత శ్లోకాలు , రెండు వైపులా భగవాన్ కృష్ణుడి చిత్రాలతో అలంకరించబడిన ఫుట్ పాత్ ను కలిగి ఉందిఫుట్ పాత్ పైభాగంలో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి ఒక మెగావాట్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు.   వంతెన రవాణాను సులభతరం చేస్తుందిద్వారకా,  బేట్-ద్వారకా మధ్య ప్రయాణించే వారి  సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.  వంతెన నిర్మాణానికి ముందుయాత్రికులు బేట్ ద్వారక చేరుకోవడానికి పడవ రవాణాపై ఆధారపడవలసి వచ్చేది ఐకానిక్ వంతెన దేవభూమి ద్వారక కు ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉంటుంది.

 

ప్రస్తుతమున్న ఆఫ్ షోర్ లైన్లను మార్చడం, ప్రస్తుతం ఉన్న పైప్ లైన్ ఎండ్ మానిఫోల్డ్ (పిఎల్ఇఎమ్)ను విడిచిపెట్టడం, మొత్తం వ్యవస్థను (పైప్ లైన్ లు, పిఎల్ ఇఎమ్ లు, ఇంటర్ కనెక్టింగ్ లూప్ లైన్) సమీపంలోని కొత్త ప్రదేశంలో మార్చడం వంటి అంశాలతో కూడిన పైప్ లైన్ ప్రాజెక్టును వడినార్ వద్ద ప్రధాన మంత్రి అంకితం చేశారు. రాజ్ కోట్-ఓఖా, రాజ్ కోట్-జెతల్సర్-సోమనాథ్,జెతల్సర్-వాన్జాలియా రైల్ విద్యుదీకరణ ప్రాజెక్టులను కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు.

 

ప్రస్తుతమున్న ఆఫ్ షోర్ లైన్లను మార్చడం, ప్రస్తుతం ఉన్న పైప్ లైన్ ఎండ్ మానిఫోల్డ్ (పిఎల్ఇఎమ్)ను విడిచిపెట్టడం, మొత్తం వ్యవస్థను (పైప్ లైన్ లు, పిఎల్ ఇఎమ్ లు, ఇంటర్ కనెక్టింగ్ లూప్ లైన్) సమీపంలోని కొత్త ప్రదేశంలో మార్చడం వంటి అంశాలతో కూడిన పైప్ లైన్ ప్రాజెక్టును వడినార్ వద్ద ప్రధాన మంత్రి అంకితం చేశారు. రాజ్ కోట్-ఓఖా, రాజ్ కోట్-జెతల్సర్-సోమనాథ్,జెతల్సర్-వాన్జాలియా రైల్ విద్యుదీకరణ ప్రాజెక్టులను కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు.

 

ఎన్ హెచ్ -927డి లోని ధోరాజీ-జమ్కందోర్నా-కలవాడ్ సెక్షన్ విస్తరణకు,  జామ్ నగర్ లో రీజనల్ సైన్స్ సెంటర్; జామ్ నగర్ లోని సిక్కా థర్మల్ పవర్ స్టేషన్ లో ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్ జీడీ) వ్యవస్థ ఏర్పాటు కు ప్రధాని శంకుస్థాపన చేశారు.

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Ayushman driving big gains in cancer treatment: Lancet

Media Coverage

Ayushman driving big gains in cancer treatment: Lancet
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Tamil Nadu meets Prime Minister
December 24, 2024

Governor of Tamil Nadu, Shri R. N. Ravi, met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Governor of Tamil Nadu, Shri R. N. Ravi, met PM @narendramodi.”