విద్యుత్తు రంగం లో దేశవ్యాప్తం గా అనేక ప్రాజెక్టులను ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు శంకుస్థాపన చేశారు
ఏడు ప్రాజెక్టుల ను ప్రారంభించడం తో పాటు పవర్ గ్రిడ్కార్పొరేశన్ ఆఫ్ ఇండియా కు చెందిన ఒక ప్రాజెక్టు కు శంకుస్థాపన చేశారు
నవీకరణ యోగ్య శక్తి కి సంబంధించిన అనేక ప్రాజెక్టులను దేశ ప్రజల కు అంకితం ఇవ్వడం తో పాటు శంకుస్థాపన చేశారు
వివిధ రైలు మరియు రోడ్డు ప్రాజెక్టుల ను దేశ ప్రజల కుఅంకితం చేయడం తో పాటు శంకుస్థాపన చేశారు
‘‘తెలంగాణ ప్రజలయొక్క అభివృద్ధి ప్రధానమైనకలల ను నెరవేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలు గాను సమర్థన ను అందిస్తోంది’’
‘‘రాష్ట్రాల ను అభివృద్ధిచేయడం ద్వారా దేశం యొక్క అభివృద్ధి ని సాధించాలనే మంత్రం తో మేం ముందుకుసాగిపోతున్నాం’’
‘‘భారతదేశంలోఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి రేటు ను నమోదు చేయడాన్ని గురించి ప్రపంచ దేశాల లోచర్చించుకొంటున్నారు’’
‘‘మా దృష్టి లోఅభివృద్ధి సాధన అంటే అది నిరుపేదలు, దళితులు, ఆదివాసులు, వెనుకబడిన వర్గాలవారు మరియు నిరాదరణ కు గురి అయినప్రజల కు అభివృద్ధి ఫలాల ను అందించడమే’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 56,000 కోట్ల రూపాయలకు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను తెలంగాణ లోని ఆదిలాబాద్ లో ఈ రోజు న ప్రారంభించడం, దేశ ప్రజల కు అంకితం చేయడం లతో పాటు, శంకుస్థాపన కూడా జరిపారు.

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఒక్క తెలంగాణ కే కాకుండా, యావత్తు దేశాని కి సంబంధించిన అభివృద్ధి ప్రధానమైన ప్రాజెక్టుల కు ఆదిలాబాద్ గడ్డ సాక్షి గా ఉందన్నారు. ఈ రోజు న 56,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన 30 కి పైగా అభివృద్ధి ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేయడం గాని, లేదా వాటి కి సంబంధించిన శంకుస్థాపనలు గాని ఈ రోజు న జరుగుతూ ఉండడమే దీనికి కారణం అని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టుల లో రాష్ట్రం లో శక్తి, పర్యావరణ మైత్రీపూర్వకమైనటువంటి స్థిరాభివృద్ధి ప్రాజెక్టుల కు తోడు రహదారి సంధానం ప్రముఖం గా ఉన్న ప్రాజెక్టులు భాగం గా ఉన్నాయి.

 

కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్రం.. ఈ రెండు దాదాపు గా పది సంవత్సరాల ను పూర్తి చేసుకొన్నాయి అని ప్రధాన మంత్రి చెప్పారు. రాష్ట్ర పౌరులు కన్న కలల ను పండించుకోవడం కోసం అవసరమైన అన్ని విధాల సహాయాన్ని ప్రభుత్వం సమకూర్చుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ రోజు న సైతం 800 మెగావాట్ సామర్థ్యం కలిగినటువంటి ఎన్‌ టిపిసి రెండో యూనిటు ను ప్రారంభించడం జరిగింది; ఇది తెలంగాణ లో విద్యుచ్ఛక్తి ఉత్పాదన ను మరింత గా పెంచుతుంది అని ప్రధాన మంత్రి తెలిపారు. అంబారి - ఆదిలాబాద్ - పీంపల్‌ ఖోటీ రైలు మార్గాల విద్యుతీకరణ పూర్తి అయిన సంగతి ని మరియు ఆదిలాబాద్, బేలా ఇంకా ములుగు లలో రెండు ప్రధానమైనటువంటి జాతీయ రాజమార్గ ప్రాజెక్టుల కు శంకుస్థాపన జరిగిన సంగతి ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ రోజు న చేపడుతున్న ఆధునిక రైలు ప్రాజెక్టులు మరియు రహదారి ప్రాజెక్టులు తెలంగాణ తో పాటు, యావత్తు ప్రాంతం యొక్క అభివృద్ధి కి జోరును అందిస్తాయి; అంతేకాదు, ప్రయాణాని కి పట్టే కాలాన్ని కూడా తగ్గిస్తాయి. పర్యటన రంగాని కి ప్రోత్సాహాన్ని ఇవ్వడం ద్వారా లెక్కలేనన్ని ఉద్యోగ అవకాశాల ను కల్పిస్తాయి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

 

రాష్ట్రాల ను అభివృద్ధిపరచడం ద్వారా దేశాన్ని అభివృద్ధి పథం లోకి తీసుకు పోవాలి అనేదే మంత్రం గా ఉంది అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ఒక చక్కని ఆర్థిక వ్యవస్థ ద్వారా దేశం పట్ల నమ్మకం వృద్ధి చెందుతుంది, మరి రాష్ట్రాలు పెట్టుబడిని అందుకోవడం వల్ల అది కూడా లాభపడుతాయి అని ఆయన అన్నారు. గడచిన మూడు నెలల కాలం లో 8.4 శాతం మేరకు వృద్ధి చెందిన ఒకే ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థ గా భారతదేశం ఉన్నందువల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క అధిక వృద్ధి రేటు ను గురించి ప్రపంచం లో పలు దేశాలు మాట్లాడుకొంటున్నాయి అని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ‘‘ఈ విధమైన వేగం తో భారతదేశం ప్రపంచం లో మూడో అతి పెద్దదైనటువంటి ఆర్థిక వ్యవస్థ గా నిలువ కలుగుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. దీనికి అర్థం ఏమిటి అంటే, తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ సైతం అధిక వృద్ధి ని నమోదు చేస్తుంది అనేదే అని ఆయన వివరించారు.

 

తెలంగాణ వంటి ప్రాంతాల పట్ల ఇంతకు ముందు నిర్లక్ష్యం జరిగిన విషయాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, గడచిన 10 సంవత్సరాల లో పరిపాలన లో క్రొత్త పంథాల ను అనుసరించిన సంగతి ని ప్రముఖం గా ప్రకటించారు. గత పదేళ్ళ లో రాష్ట్రం యొక్క అభివృద్ధి కి అధికం గా కేటాయింపులు జరిగాయన్న విషయాన్ని గురించి ప్రధాన మంత్రి తెలియజేస్తూ, ‘‘మా దృష్టి లో అభివృద్ధి ని సాధించడం అంటే అది నిరుపేదల , దళితుల, ఆదివాసీల వెనుకబడిన వర్గాల మరియు నిరాదరణకు గురి అయిన వర్గాల ప్రజల కు అభివృద్ధి ఫలాల ను అందించడమే’’ అని ప్రధాన మంత్రి అన్నారు. 25 కోట్ల మంది కి పైగా ప్రజలు పేదరికం నుండి బయటకు వచ్చారు అని, మరి దీని కి గాను ఖ్యాతి ని పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకే ఇవ్వవలసి ఉంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఆ తరహా ప్రచార ఉద్యమాల ను రాబోయే అయిదు సంవత్సరాల లో మరింత ఎక్కవ గా అమలు పరచడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.

 

ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర గవర్నరు డాక్టర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌, తెలంగాణ యొక్క ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మరియు కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి లతో పాటు ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

 

పూర్వరంగం

 

విద్యుత్తు రంగానికి సంబంధించి దేశంలో పలు ప్రాజెక్టులను ప్రధాన మంత్రి ప్రారంభించి, దేశ ప్రజల కు అంకితం చేయడంతో పాటు శంకుస్థాపన చేశారు. ఎన్ టి పి సి కి చెందిన 800 మెగావాట్ల (యూనిట్-2) తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ను ప్రధాన మంత్రి తెలంగాణ లోని పెద్దపల్లి లో దేశ ప్రజల కు అంకితం చేశారు. అల్ట్రా-సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ ప్రాజెక్టు 85 శాతం విద్యుత్తు ను తెలంగాణ కు సరఫరా చేస్తుంది. భారతదేశంలో అన్నిఎన్ టి పి సి విద్యుత్ కేంద్రాల లో అత్యధిక విద్యుత్తు ఉత్పాదన సామర్థ్యాన్ని- సుమారు 42 శాతం సామర్థ్యాన్ని- ఈ ప్రాజెక్టు కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్టు కు శంకుస్థాపన చేసింది కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యే.

 

ఝార్ ఖండ్ లోని ఛత్రా లో గల ఉత్తర కరణ్ పురా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో 660 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ -2 ను కూడా ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేశారు. సాంప్రదాయిక వాటర్ కూల్డ్ కండెన్సర్ లతో పోలిస్తే నీటి వినియోగాన్ని 1/3వ వంతు కు తగ్గించే ఎయర్ కూల్డ్ కండెన్సర్ (ఎసిసి) పరిజ్ఞానం తో రూపొందించినటువంటి దేశంలోకెల్లా తొలి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు లో పనుల ను ప్రధాన మంత్రి జెండా ను చూపెట్టడం ద్వారా ప్రారంభించారు.

 

చత్తీస్ గఢ్ లో బిలాస్ పుర్ లోని సీపట్ లో ఫ్లై యాష్ ఆధారిత లైట్ వెయిట్ అగ్రిగేట్ ప్లాంటు ను, ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా లో ఎస టి పి వాటర్ టు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటు ను కూడా ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేశారు.

 

ఇంకా, ఉత్తర్ ప్రదేశ్ లోని సోన్ భద్ర లో సింగ్ రౌలి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజ్-3 (2×800 మెగావాట్ల సామర్థ్యం కలిగినది) కి, చత్తీస్ గఢ్ లోని రాయ్ గఢ్ లో గల లారా లో 4జి ఇథెనాల్ ప్లాంటు కు ఫ్లూ గ్యాస్ కార్బన్ డయాక్సైడ్ టు 4జి ఇథెనాల్ ప్లాంటు ; ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం లో సింహాద్రి లో గల సీ వాటర్ టు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటు; ఛత్తీస్ గఢ్ లెపి కోర్బా లో ఫ్లై యాష్ ఆధారిత ఎఫ్ ఎ ఎల్ జి అగ్రిగేట్ ప్లాంటు లకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు.

 

ప్రధాన మంత్రి ఏడు ప్రాజెక్టుల ను ప్రారంభించడంతో పాటు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కు చెందిన ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేశారు. నేశనల్ గ్రిడ్ ను బలోపేతం చేయడం లో ఈ ప్రాజెక్టు లు కీలక పాత్ర ను పోషించనున్నాయి.

 

ప్రధాన మంత్రి రాజస్థాన్ లోని జైసల్మేర్ లో జాతీయ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేశన్ (ఎన్ హెచ్ పిసి )కి చెందిన 380 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలర్ ప్రాజెక్టు ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ఒక్కో సంవత్సరం లో 792 మిలియన్ యూనిట్ల మేరకు కాలుష్య రహిత విద్యుత్తు ను ఉత్పత్తి చేయనుంది.

 

ప్రధాన మంత్రి ఉత్తర్ ప్రదేశ్ లోని జలౌన్ లో బుందేల్ ఖండ్ సౌర్ ఊర్జా లిమిటెడ్ (బిఎస్ యుఎల్ ) 1200 మెగావాట్ల సామర్థ్యం కలిగివుండే జలౌన్ అల్ట్రా మెగా రిన్యూవబుల్ ఎనర్జీ పవర్ పార్కు కు శంకుస్థాపన చేశారు. ఈ పార్కు ఏటా 2400 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ను ఉత్పత్తి చేయనుంది.

 

ఉత్తర్ ప్రదేశ్ లోని జలౌన్ లో, కాన్ పుర్ దేహత్ లో సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ (ఎస్ జెవిఎన్) కు చెందిన మూడు సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ల మొత్తం సామర్థ్యం 200 మెగావాట్లు. ఈ ప్రాజెక్టుల కు శంకుస్థాపన ను కూడా గతంలో ప్రధాన మంత్రే చేశారు. ప్రధాన మంత్రి ఉత్తరాఖండ్ లోని ఉత్తర్ కాశీ లో నైత్వార్ మోరి జల విద్యుత్తు కేంద్రం తో పాటు అనుబంధ ట్రాన్స్ మిశన్ లైను ను కూడా ప్రారంభించారు. బిలాస్ పుర్, హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పుర్ లో, అసమ్ లోని ధుబ్రి లో రెండు ఎస్ జె వి ఎన్ సోలార్ ప్రాజెక్టులు రెండిటి కి, అలాగే హిమాచల్ ప్రదేశ్ లో 382 మెగావాట్ల సున్నీ డ్యామ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు.

 

ఉత్తర్ ప్రదేశ్ లోని లలిత్ పుర్ జిల్లా లో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి టియుఎస్ సిఒ కు చెందిన 600 మెగావాట్ల లలిత్ పుర్ సోలర్ పవర్ ప్రాజెక్టు కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు నుండి ఏడాది కి 1200 మిలియన్ యూనిట్ల కాలుష్య రహిత విద్యుత్తు ఉత్పాదన జరగాలని లక్ష్యం గా నిర్దేశించుకోవడం జరిగింది.

 

నవీకరణ యోగ్య శక్తి మాధ్యం లో 2500 మెగావాట్ల విద్యుత్తు ను తరలించడానికి ఉద్దేశించినటువంటి రిన్యూస్ కొప్పాళ్ -నరేంద్ర ట్రాన్స్ మిశన్ స్కీము ను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ అంతర్ రాష్ట్ర ప్రసార పథకం కర్ణాటక లోని కొప్పాళ్ జిల్లా లో ఉంది. విద్యుత్తు రంగానికి సంబంధించినటువంటి దామోదర్ వేలీ కార్పొరేశన్ మరియు ఇండిగ్రిడ్ లకు చెందిన ఇతర ప్రాజెక్టులను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.

 

ప్రధాన మంత్రి ఈ పర్యటన లో విద్యుత్తు రంగం తో పాటు రహదారుల రంగానికి మరియు రైలు రంగానికి చెందిన ప్రాజెక్టులను కూడా ఈ సందర్శన లో భాగం గా చేపట్టడమైంది. నూతనం గా విద్యుతీకరించిన అంబారి - ఆదిలాబాద్ - పింపల్ ఖుటి రైలు మార్గాన్ని ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేశారు. ఎన్ హెచ్ -353బి మరియు ఎన్ హెచ్ -163 ల ద్వారా తెలంగాణ ను మహారాష్ట్ర తో, తెలంగాణ ను ఛత్తీస్ గఢ్ తో కలిపే రెండు ప్రధానమైన జాతీయ రాజమార్గ ప్రాజెక్టుల కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi