ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న గుజరాత్ లోని మహెసాణా లో తరభ్ లో 13,500 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు, శంకుస్థాపన జరిపారు. ఈ ప్రాజెక్టు లు ఇంటెర్ నెట్ కనెక్టివిటీ, రైలు మార్గాలు, రహదారాలు, విద్య, ఆరోగ్యం, కనెక్టివిటీ, పరిశోధన మరియు పర్యటన ల వంటి వివిధ రంగాల కు చెందినవి.
సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఇప్పటి కి సరిగ్గా ఒక నెల రోజుల క్రిందట అంటే జనవరి 22 వ తేదీ నాడు తనకు అయోధ్య లో రామ్ లలా యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం లో పాలుపంచుకొనే అవకాశం లభించింది అని గుర్తు కు తెచ్చుకొన్నారు. ఫిబ్రవరి 14 వ తేదీ నాడు బసంత్ పంచమి సందర్భం లో గల్ఫ్ దేశాల లోని అబూ ధాబీ లో ఒకటో హిందూ దేవాలయాన్ని తాను ప్రారంభించిన సందర్భాన్ని కూడా ఆయన జ్ఞప్తి కి తెచ్చుకొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ జిల్లా లో కల్కి ధామ్ కు శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. తరభ్ లోని వాడీనాథ్ మహాదేవ్ ఆలయం లో ఈ రోజు న దైవ దర్శనం, అర్చన మరియు అభిషేకం కార్యక్రమాల లో పాలుపంచుకొన్న విషయాన్ని సైతం ఆయన ప్రస్తావించారు.
భారతదేశాని కి మరియు ప్రపంచాని కి వాడీనాథ్ శివ్ ధామ్ అనేది ఒక తీర్థ యాత్ర స్థలం గా ఉన్నప్పటికీ, రేవాడీ సమాజాని కి మరియు దేశవ్యాప్తం గా భక్త జనుల కు ఇది ఒక మంగళప్రదం అయినటువంటి పీఠం అని ప్రధాన మంత్రి అన్నారు.
భారతదేశం యొక్క అభివృద్ధి ప్రస్థానం లో ప్రస్తుత ఘట్టాని కి గల ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, ఇది ‘దైవ కార్యం’ తో పాటు, ‘దేశ కార్యం’ అని, ఇవి రెండు కూడ శర వేగం గా సాగుతున్నాయని పేర్కొన్నారు. ‘‘మరొక ప్రక్కన ఈ మంగళప్రదమైనటువంటి కార్యక్రమం లో 13,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అభివృద్ధి పనులు దేశ ప్రజల కు అంకితం కావడమో, లేదా శంకుస్థాపన పూర్తి కావడమో జరిగింది’’ అని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు లు రైలు మార్గాలు, రహదారులు, నౌకాశ్రయాలు , రవాణా, నీరు, భద్రత, పట్టణ అభివృద్ధి మరియు పర్యటన రంగాల కు సంబంధించినవి. ఇవి జీవన సౌలభ్యాన్ని పెంపొందింప చేయనున్నాయి; అంతేకాకుండా, ఈ ప్రాంతం లో యువతీ యువకుల కు క్రొత్త ఉద్యోగ అవకాశాల ను అందించనున్నాయి అని ఆయన తెలిపారు.
మహెసాణా పవిత్ర భూమి లో దైవికమైన శక్తి నెలకొంది అని ప్రధాన మంత్రి అంటూ, ఈ దైవిక శక్తి కృష్ణ భగవానుని తో మరియు మహాదేవుని తో అనుబంధం ఏర్పడిన వేల సంవత్సరాల నాటి ఆధ్యాత్మిక చేతన తో ప్రజల ను జత కలుపుతోందన్నారు. ఈ శక్తే ప్రజల ను గాదీపతి మహంత్ వీరమ్-గిరి బాపూ జీ యొక్క యాత్ర తో పెనవేస్తోంది అంటూ ఆయన కు శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి ఘటించారు. గాదీపతి మహంత్ బల్ దేవ్ గిరి బాపు యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకు పోయేందుకు గాను మహంత్ శ్రీ జయరామ్ గిరి బాపు సమక్షం లో ప్రధాన మంత్రి ప్రణామాన్ని ఆచరించారు. బల్ దేవ్ గిరి బాపు జీ తో తనకు నాలుగు దశాబ్దాల ప్రగాఢమైన అనుబంధం ఉందని ప్రధాన మంత్రి వెల్లడిస్తూ, అప్పట్లో గుజరాత్ కు ముఖ్యమంత్రి గా తాను ఉన్న కాలం లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేలుకొలపడం కోసం ఆయన ను అనేక సారులు తన నివాసాని కి ఆహ్వానించిన సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు. ఆయన 2021 వ సంవత్సరం లో కన్నుమూశారు అంటూ ప్రధాన మంత్రి స్మరించుకొన్నారు; ప్రస్తుతం అందరికి ఆయన యొక్క దివంగత ఆత్మ నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి, ఎందుకంటే ఆయన యొక్క సంకల్పం కార్యరూపాన్ని దాల్చింది అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ‘‘శతాబ్దాల నాటిది అయినటువంటి ఈ దేవాలయం 21వ శతాబ్ది యొక్క వైభవంతోను, ప్రాచీన సంప్రదాయాల యొక్క దివ్యత్వం తోను కొలువుదీరింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సందర్భం లో వందల కొద్దీ శ్రమజీవుల యొక్క మరియు హస్తకళ నిపుణుల యొక్క సేవల ను గురించి ఆయన ప్రముఖం గా పేర్కొన్నారు. వాడీనాథ్ మహాదేవ్, హింగ్‌లాజ్ మాతా జీ మరియు దత్తాత్రేయ భగవానుల ప్రాణ ప్రతిష్ఠల ను వరుసబెట్టి ఈ రోజు న జరిపించిన వారి యొక్క ప్రయాసల ను ఆయన కొనియాడుతూ, ఈ సందర్భం లో వారి కి అభినందనల ను తెలియ జేశారు.
ఈ దేవాలయాలు ఆరాధన స్థలాల కంటే మించి, మన శతాబ్దాల ఘనత కలిగిన నాగరకత కు సంకేతాలు గా కూడా ఉన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. సమాజం లో జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం లో దేవాలయాలు పోషిస్తున్న పాత్ర ను ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. జ్ఞానాన్ని వ్యాప్తి చేసే సంప్రదాయాన్ని ముందుకు తీసుకు పోతున్నందుకు స్థానిక ధార్మిక అఖాడాల ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఈ సందర్భం లో పుస్తక్ పర్వ్ యొక్క నిర్వహణ, పాఠశాల మరియు వసతి గృహం యొక్క నిర్మాణం ప్రజల లో జాగృతి ని మరియు విద్య పట్ల చైతన్యాన్ని వృద్ధి చెందింప చేశాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ ‘దైవ కార్యాల కు’ మరియు ‘దేశ కార్యాల కు’ ఉత్తమమైనటువంటి ఉదాహరణ మరొకటి ఉండబోదు’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆ కోవ కు చెందిన అభిప్రాయాల ను పెంచి పోషించుకొంటున్నందుకు గాను రాబడీ సమాజ్ ను ఆయన ప్రశంసించారు.
‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ భావన వలిధామ్ లో ఇమిడిపోయి ఉంది అని ప్రధాన మంత్రి చెప్పారు. ఈ భావన కు అనుగుణం గా సమాజం లోని ప్రతి ఒక్క వర్గాని కి చెందిన ప్రజల జీవనాన్ని మెరుగు పరచడం కోసం ప్రభుత్వం కంకణం కట్టుకొందన్నారు. ‘‘సమాజం లో ఆఖరి మెట్టు మీద నిలబడిన వ్యక్తి యొక్క జీవనం లో మార్పు తీసుకు రావాలి అనేదే మోదీ ఇచ్చేటటువంటి హామీ యొక్క ధ్యేయం గా ఉంది’’ అని ఆయన అన్నారు. క్రొత్త దేవాలయాల రాక ను గురించి మరి, అలాగే కోట్ల కొద్దీ పేదల కు పక్కా ఇళ్ళ నిర్మాణాన్ని గురించి ప్రధాన మంత్రి వివరించారు. ఇటీవలే 1.25 లక్షల గృహాల నిర్మాణం కోసం శంకుస్థాపన జరగడాన్ని గురించి, మరి వాటిని దేశ ప్రజల కు అంకితం చేయడాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. 80 కోట్ల మంది పౌరుల కు ఆహార పదార్థాల ను ఉచితం గా ఇవ్వడం అనేది ‘భగవంతుని ప్రసాదమే’, అదే విధం గా చూసినప్పుడు 10 కోట్ల మంది క్రొత్త కుటుంబాల కు నల్లా నీరు సరఫరా చేయడం అనేది ‘అమృతమే’ అని ఆయన అభివర్ణించారు.
గడచిన రెండు దశాబ్దాల లో గుజరాత్ లో వారసత్వ స్థలాల అభివృద్ధి దిశ లో ప్రభుత్వం చేస్తూ వచ్చిన ప్రయాసల ను గురించి, అలాగే మౌలిక సదుపాయాల అభివృద్ధి ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. భారతదేశం లో దశాబ్దాల తరబడి అభివృద్ధి కి మరియు వారసత్వాని కి మధ్య విరోధం ఏర్పడడం, మంగళప్రదం అయినటువంటి సోమనాథ దేవాలయం వివాద స్థలం గా మారడం, పావాగఢ్ స్థలం అనాదరణ పాలబడడం, మొఢేరా లో సూర్య దేవాలయాని కి సంబంధించి వోటు బ్యాంకు రాజకీయాలు తెర మీదకు రావడం, భగవాన్ రాముని ఉనికి ని ప్రశ్నించడం; మరి ఆయన దేవాలయం యొక్క అభివృద్ధి లో అడ్డంకుల ను ఏర్పరచడం శోచనీయం అని ఆయన అన్నారు. యావత్తు దేశ ప్రజలు బాల రాముని జన్మస్థలం లో దేవాలయం నిర్మాణం కావడం పట్ల ప్రసన్నత లో మునిగి తేలుతూ ఉన్నప్పటికీ ఫలానా వ్యక్తులు ఇంకా వ్యతిరేకతనే వ్యాప్తి చేస్తున్నారు అని కూడా ఆయన అన్నారు.
‘‘ప్రస్తుతం, భావి తరాల వారి కోసం ఒక వీలునామా ఆస్తి ని అందించడానికి ‘న్యూ ఇండియా’ లో సకల ప్రయాసలు జరుగుతూ ఉన్నాయి’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఈ రోజు న నిర్మాణం లో ఉన్న క్రొత్త రహదారులు మరియు ఆధునిక రైలు మార్గాలు అభివృద్ధి చెందిన దేశాని కి బాటల ను పరుస్తున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం మహెసాణా కు రైలు మార్గ సంధానాన్ని బలోపేతం చేయడమైందని ఆయన అన్నారు. రైలు మార్గం యొక్క డబ్లింగు పూర్తి కావడం తో కాండ్ లా , టూనా, ఇంకా ముంద్రా నౌకాశ్రయాల తో బనాస్ కాంఠా మరియు పాటన్ లకు సంధానం మెరుగు పడింది అని ఆయన అన్నారు. డీసా ఎయర్ ఫోర్స్ స్టేశన్ కు రన్ వే నిర్మాణానికై ఒకటిన్నర సంవత్సరాల క్రిందట శంకుస్థాపన ను తానే జరిపినట్లు ప్రధాన మంత్రి చెప్పారు. ‘‘మోదీ ఏదైనా ఒక ప్రతిజ్ఞ ను చేశాడంటే దానిని నెరవేర్చుతాడు. దీనికి డీసా లో ఈ రన్ వే యే ఒక ఉదాహరణ గా ఉంది; మరి ఇది మోదీ ఇచ్చినటువంటి హామీ’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
గుజరాత్ లోని ఉత్తర ప్రాంతం లో 20-25 సంవత్సరాల క్రిందట అవకాశాలు చాలా పరిమితం గా ఉండడం తో పాటు, పారిశ్రమీకరణ యొక్క పరిధి కూడా చాలా తక్కువ గా ఉండింది అని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. ఇదే సందర్భం లో ఆయన పశువుల కాపరుల కు ఎదురైన సవాళ్ళ ను గురించి, రైతులు వ్యవసాయ క్షేత్రాల కు సాగునీరు పెట్టుకోవడం లో ఎదురైన సవాళ్ళ ను గురించి ఆయన ప్రస్తావించారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకు వచ్చిన సకారాత్మకమైన మార్పుల ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొంటూ, రైతులు ఒక సంవత్సరం లో రెండు మూడు పంటల ను పండిస్తున్నారని, ఈ ప్రాంతం అంతటా నీటి మట్టం లో వృద్ధి చోటుచేసుకొందన్నారు. ఈ రోజు న నీటి జలవనరుల కు సంబంధించిన 1500 కోట్ల రూపాయల కు పైగా వ్యయం అయ్యే 8 ప్రాజెక్టుల కు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన జరగడాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించి ఈ ఘటన గుజరాత్ లోని ఉత్తర ప్రాంతం లో నీటి సంబంధి సమస్యల ను పరిష్కరించడం లో మరింత గా సాయపడగలదన్నారు. బిందు సేద్యం వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబిస్తున్నందుకు, మరి అలాగే రసాయనాల కు తావు ఉండనటువంటి ప్రాకృతిక వ్యవసాయ ధోరణుల వైపు మొగ్గుచూపుతున్నందుకు గుజరాత్ ఉత్తర ప్రాంత రైతుల ను ఆయన కొనియాడారు. ‘‘మీ యొక్క ప్రయాస లు దేశం అంతటా రైతుల లో ఉత్సాహాన్ని ఇనుమడింప చేస్తాయి’’ అని ఆయన అన్నారు.
దేశాన్ని అభివృద్ధి చేయడం తో పాటు వారసత్వాన్ని పరిరక్షించడం కోసం ప్రభుత్వం తీసుకొంటున్న శ్రద్ధ ను గురించి ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించడానికి ముందుగా ప్రముఖం గా ప్రకటించారు. ఈ రోజు న చేపడుతున్న అభివృద్ధి పథకాల కు గాను ఆయన తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ఈ సందర్భం లో అనేక మంది పార్లమెంటు సభ్యులు, ఎమ్ఎల్ఎ లు, గుజరాత్ ప్రభుత్వ ప్రతినిధుల తో పాటు గుజరాత్ యొక్క ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ హాజరు కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.
పూర్వరంగం
ఎనిమిది వేల కు పైగా గ్రామ పంచాయతీల కు హై-స్పీడ్ ఇంటర్‌నెట్ ను అందించే భారత్ నెట్ రెండో దశ - గుజరాత్ ఫైబర్ గ్రిడ్ నెట్ వర్క్ లిమిటెడ్ తో సహా ముఖ్యమైన ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు. ప్రదాన మంత్రి దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రాజెక్టుల లో మహెసాణా, బనాస్ కాంఠా జిల్లాల లో రైలు మార్గం డబ్లింగు, గేజ్ మార్పిడి, క్రొత్త బ్రాడ్-గేజ్ లైన్ కోసం అనేక ప్రాజెక్టుల ను; ఖేడా, గాంధీనగర్, అహమదాబాద్, మహెసాణా లలో బహుళ రహదారి ప్రాజెక్టులు; గాంధీనగర్ లో గుజరాత్ బయోటెక్నాలజీ యూనివర్సిటీ యొక్క ప్రధాన విద్య సంబంధి భవనం; బనాస్ కాంఠా లో అనేక నీటి సరఫరా ప్రాజెక్టు భాగం గా ఉన్నాయి.
ఇదే కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి పలు కీలక ప్రాజెక్టుల కు కూడా శంకుస్థాపన చేశారు; ఆ ప్రాజెక్టుల లో ఆణంద్ జిల్లా లో జిల్లా స్థాయి ఆసుపత్రి మరియు ఆయుర్వేద ఆసుపత్రి, అలాగే బనాస్ కాంఠా లోని అంబాజీ ప్రాంతం లో రింఛడియా మహాదేవ్ ఆలయం మరియు సరస్సు ల అభివృద్ధి; గాంధీనగర్, అహమదాబాద్, బనాస్ కాంఠా, ఇంకా మహెసాణా లలో అనేక రహదారులు మరియు నీటి సరఫరా మెరుగుదల సంబంధి ప్రాజెక్టు లు; డీసా ఎయర్ ఫోర్స్ స్టేశన్ యొక్క రన్ వే; అహమదాబాద్ లో హ్యూమన్ ఎండ్ బయోలాజికల్ సైన్స్ గేలరీ; జిఐఎఫ్‌టి సిటీ లో గుజరాత్ బయోటెక్నాలజీ రిసర్చ్ సెంటర్ (జిబిఆర్‌సి) తాలూకు నూతన భవనం; గాంధీనగర్, అహమదాబాద్ , బనాస్ కాంఠా లలో నీటి సరఫరా ను మెరుగు పరచడానికి ఉద్దేశించిన అనేక ప్రాజెక్టు లు ఉన్నాయి.
ये एक ऐसा समय है, जब देवकाज हो या फिर देश काज, दोनों तेज़ गति से हो रहे हैं: PM @narendramodi pic.twitter.com/2uE2pHY96s
— PMO India (@PMOIndia) February 22, 2024
एक तरफ देश में देवालय भी बन रहे हैं और करोड़ों गरीबों के पक्के घर भी बन रहे हैं। pic.twitter.com/rv35W0rd22
— PMO India (@PMOIndia) February 22, 2024
आज नए भारत में हो रहा हर प्रयास, भावी पीढ़ी के लिए विरासत बनाने का काम कर रहा है। pic.twitter.com/iLQFqRlScp
— PMO India (@PMOIndia) February 22, 2024