రాజస్థాన్ లో నాలుగు నూతన వైద్య కళాశాలలకు ప్రధాన మంత్రి శంకుస్థాపన కూడా చేశారు
‘‘మహమ్మారికాలం లో భారతదేశం తన బలాన్ని, ఆత్మనిర్భరత ను పెంపొందించుకోవాలనిసంకల్పించింది’’
‘‘మేము దేశ ఆరోగ్య రంగం రూపు రేఖల ను మార్చివేయడం కోసం ఒక జాతీయ దృష్టికోణం మరియు జాతీయ ఆరోగ్య విధానం.. ఈ రెండిటి పైన పని చేశాం’’
‘‘గడచిన 6-7 సంవత్సరాలలో 170 కి పైగా నూతన వైద్య కళాశాలల ను ఏర్పాటు చేయడమైంది; అంతేకాదు, 100 కు పైగాకొత్త మెడికల్ కాలేజీ ల ఏర్పాటు సంబంధిత పనులు వేగం గా సాగుతున్నాయి’’
‘‘2014వసంవత్సరం లో, దేశం లో మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ లు, పోస్ట్గ్రాడ్యుయేట్ ల తాలూకు మొత్తం సీట్లు దాదాపు గా 82,000 గా ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 1,40,000 కు పెరిగింది’’
‘‘రాజస్థాన్ లో అభివృద్ధి, భారతదేశం తాలూకు అభివృద్ధి ని వేగిర పరుస్తుంది’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సిపెట్ (సిఐపిఇటి): ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీ, జ‌య్‌ పుర్ ను ప్రారంభించారు. ఆయన రాజస్థాన్ లోని బాంస్ వాడా, సిరోహీ, హనుమాన్ గఢ్, ఇంకా దౌసా జిల్లాల లో నాలుగు కొత్త వైద్య కళాశాల లకు శంకుస్థాపన కూడా చేశారు. సిపెట్ (సిఐపిఇటి) ఇన్ స్టిట్యూట్ తో పాటు 4 నూతన మెడికల్ కాలేజీల కు గాను రాజస్థాన్ ప్రజల కు ప్రధాన మంత్రి అభినందన లు తెలిపారు. 2014వ సంవత్సరం అనంతరం కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్ కోసం 23 వైద్య కళాశాల ల ఏర్పాటు సంబంధి ఆమోదాన్ని తెలిపిందని, వాటి లో నుంచి 7 వైద్య కళాశాల లు ఈసరికే పనిచేయడం మొదలైందని ఆయన తెలిపారు.

ఈ సందర్భం లో శ్రోతల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, గత 100 సంవత్సరాల కాలం లో తలెత్తిన అతి పెద్ద మహమ్మారి ప్రపంచ ఆరోగ్య రంగాని కి ఒక పాఠాన్ని నేర్పిందన్నారు. ప్రతి ఒక్క దేశం తనదైన పద్ధతి లో ఈ సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ విపత్తు లో భారతదేశం తన బలాన్ని, ఆత్మనిర్భరత ను పెంచుకోవాలనే సంకల్పాన్ని చెప్పుకొందని ఆయన అన్నారు.

వ్యవసాయం రాష్ట్ర జాబితా లోని అంశం గా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి పదవి ని తాను నిర్వహించిన కాలం లో దేశ ఆరోగ్య రంగం లోని లోటుల ను తాను అర్థం చేసుకొన్నానని, మరి వాటిని తొలగించేందుకు ప్రధాన మంత్రి గా నిరంతరం ప్రయత్నిస్తూ వస్తున్నానని ఆయన అన్నారు. ‘‘దేశ ఆరోగ్య రంగం రూపు రేఖల ను మార్చివేయడం కోసం మేం ఒక జాతీయ దృష్టికోణాన్ని, ఒక జాతీయ ఆరోగ్య విధానాన్ని తీసుకు రావాలని పాటుపడ్డాం. స్వచ్ఛ్ భారత్ అభియాన్ మొదలుకొని ఆయుష్మాన్ భారత్, మరి ఇప్పుడేమో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిశన్ దాకా చూస్తే, ఆ తరహా ప్రయాస లు అనేకం ఈ దృష్టికోణాని కి సంబంధించినవే’’ అని ప్రధాన మంత్రి వివరించారు. ఆయుష్మాన్ భారత్ యోజన లో భాగం గా రాజస్థాన్ లో సుమారు మూడున్నర లక్షల మంది ప్రజల కు ఉచిత చికిత్స లు అందాయి, అంతేకాకుండా, ఆ రాష్ట్రం లో దాదాపు గా 2,500 వరకు హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్ ల ఏర్పాటు తాలూకు పనులు కూడా మొదలయ్యాయని తెలిపారు.

మెడికల్ కాలేజీలు గానీ, సూపర్ స్పెశాలిటీ హాస్పిటల్స్ గానీ, వాటి నెట్ వర్క్ ను దేశం లోని ప్రతి సుదూర ప్రాంతాని కి శరవేగం గా విస్తరించడం ముఖ్యం అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘భారతదేశం 6 ఎఐఐఎమ్ఎస్ ల నుంచి ముందంజ వేసి, ఇవాళ 22 కు పైగా ఎఐఐఎమ్ఎస్ లతో ఒక బలమైన నెట్ వర్క్ వైపు సాగుతోందనే విషయాన్ని మనం సంతోషం గా చెప్పుకోవచ్చు’’ అని కూడా ఆయన అన్నారు.

గడచిన 6-7 సంవత్సరాల కాలం లో 170కి పైగా కొత్త మెడికల్ కాలేజీలు సిద్ధం అయ్యాయి. మరో 100 కు పైగా నూతన వైద్య కళాశాల ల తాలూకు పనులు త్వరిత గతి న జరుగుతున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. 2014వ సంవత్సరం లో దేశం లో మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సీట్ల మొత్తం సంఖ్య సుమారు 82,000 గా ఉండింది. ప్రస్తుతం వాటి సంఖ్య 1,40,000 కు పెరిగింది. క్రమబద్దీకరణ మరియు పాలన రంగాల ను చూసినా, నేశనల్ మెడికల్ కమిశన్ రంగం లోకి రావడం తో, గతించిన కాలం సమస్య లను, ప్రశ్నల ను పరిష్కరించడమైంది అని ప్రధాన మంత్రి వివరించారు.

ఆరోగ్య సంరక్షణ తో సంబంధం కలిగిన నిపుణులైన మానవ శక్తి తాలూకు నేరు ప్రభావం ఆరోగ్య సేవల పై ఉంటుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇది కరోనా కాలం లో కొట్టొచ్చినట్లు కనిపించింది అని ఆయన అన్నారు. ‘ఉచితం గా టీకా మందు , ప్రజలు అందరికీ వ్యాక్సీన్’ అంటూ కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న ఉద్యమం సఫలం కావడం దీనికి అద్దం పడుతోంది అని ఆయన అన్నారు. ప్రస్తుతం భారతదేశం లో 88 కోట్ల కు పైగా కరోనా వ్యాక్సీన్ డోజుల ను ఇప్పించడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు.

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’  ను జరుపుకొంటున్న ఈ కాలం లో ఉన్నత స్థాయి నైపుణ్యాల ను కలిగి ఉండటం అనేది భారతదేశాన్ని పటిష్ట పరచడం ఒక్కటే కాకుండా ఆత్మనిర్భర భారత్ తాలూకు సంకల్పాన్ని నెరవేర్చుకోవడం లో కూడా ఒక ప్రధానమైన పాత్ర ను పోషిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. అత్యంత వేగం తో వర్ధిల్లుతున్న పరిశ్రమల లో ఒకటైన పెట్రో-కెమికల్ ఇండస్ట్రీ వంటి పరిశ్రమ కు నైపుణ్యం కలిగిన మానవ శక్తి ఎంతయినా అవసరం ఉంది అని ఆయన చెప్పారు. నూతనం గా ఏర్పాటైన ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ టెక్నాలజీ లక్షల కొద్దీ యువతీయువకుల ను కొత్త కొత్త అవకాశల తో జోడిస్తుంది అని ఆయన అన్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవి ని నిర్వర్తించినప్పటి కాలాన్ని గుర్తు కు తెచ్చుకొంటూ, ప్రస్తుతం ఎనర్జీ యూనివర్సిటి గా వ్యవహారం లో ఉన్న ఇదివరకటి పండిత్ దీన్ దయాళ్ పెట్రోలియమ్ యూనివర్సిటి ని స్థాపించి, దానిని పెంచి పోషించడం కోసం తాను చేసిన కృషి ని గురించి వివరించారు. ఈ విధమైన విద్యా సంస్థ స్వచ్ఛ శక్తి రంగం లో నూతన ఆవిష్కరణ లకు తోడ్పాటు ను అందించడం కోసం యువత కు బాట ను పరుస్తుందని ఆయన అన్నారు.

బాడ్ మేర్ లో రాజస్థాన్ రిఫైనరీ ప్రాజెక్టు 70,000 కోట్ల రూపాయల కు పైగా పెట్టుబడి తో శరవేగం గా పురోగమిస్తున్న సంగతి ని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. రాష్ట్రం లో సిటి గ్యాస్ డిస్ట్రిబ్యూశన్ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, 2014 వ సంవత్సరం వరకు చూస్తే రాష్ట్రం లో ఒకే ఒక నగరానికి సిటి గ్యాస్ డిస్ట్రిబ్యూశన్ కు కావలసిన అనుమతి ఉందని, ప్రస్తుతం రాష్ట్రం లో 17 జిల్లాల కు సిటి గ్యాస్ డిస్ట్రిబ్యూశన్ నెట్ వర్క్ ను కలిగి ఉండటానికి అనుమతి ఇవ్వడం జరిగిందని ప్రధాన మంత్రి చెప్పారు. రాబోయే సంవత్సరాల లో రాష్ట్రం లో ప్రతి ఒక్క జిల్లా లో గొట్టపు మార్గం ద్వారా గ్యాస్ ను సరఫరా చేసే నెట్ వర్క్ ఉంటుంది అని ఆయన అన్నారు. టాయిలెట్ లు, విద్యుత్తు, గ్యాస్ కనెక్శన్ ల రాక తో ‘జీవించడం లో సౌలభ్యం’ మొదలైంది అని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం రాష్ట్రం లో ‘జల్ జీవన్ మిశన్’ లో భాగం గా 21 లక్షల కు పైగా కుటుంబాల కు గొట్టపు మార్గం ద్వారా నీరు అందుతోందని ఆయన అన్నారు. ‘‘రాజస్థాన్ లో జరిగే అభివృద్ధి, భారతదేశం లో అభివృద్ధి కి జోరు ను అందిస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. రాష్ట్రం లో పేద కుటుంబాల కోసం 13 లక్షల కు పైగా పక్కా ఇళ్ళ ను నిర్మించడం జరిగింది అని ఆయన చెప్పారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi