Quote‘‘అమృతకాలం ఒక బలమైన, అభివృద్ధి చెందిన మరియు అన్ని వర్గాల ను కలుపుకొనిపోయే భారతదేశాన్నిఆవిష్కరించే దిశ లో కృషిచేయడం కోసం మనకు అవకాశాన్ని ఇస్తుంది’’
Quote‘‘ప్రతి ఒక్క ప్రసార మాధ్యమ సంస్థస్వచ్ఛ్ భారత్ అభియాన్ ను గొప్ప నిజాయతీ తో చేపట్టింది’’
Quote‘‘యోగ, ఫిట్ నెస్ మరియు బేటీ బచావో బేటీ పఢావో లకు లోకప్రియత్వాన్నిసంపాదించిపెట్టడం లో ప్రసార మాధ్యమాలు చాలా ప్రోత్సాహకరమైన పాత్ర ను పోషించాయి’’
Quote‘‘భారతదేశానికి చెందిన ప్రతిభాన్వితయువత చోదక శక్తి గా ఉన్నందువల్ల, మన దేశం ఆత్మనిర్భరత దిశ లో ముందుకుసాగిపోతోంది’’
Quote‘‘మన ప్రయాసల యొక్క మార్గదర్శక సిద్దాంతంఏమిటి అంటే అది ఇప్పటి తరం కంటే భావి తరాలు ఒక ఉత్తమమైన జీవన శైలి ని సొంతంచేసుకొనేందుకు పూచీ పడేలా ఉండాలి అనేదే’’

మాతృభూమి శతాబ్ది సంవత్సరం ఉత్సవాల ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.

ఈ వార్తాపత్రిక యొక్క ప్రయాణం లో ప్రముఖ పాత్ర ను పోషించిన వారు అందరి కి ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ఘటించారు. ‘‘మహాత్మ గాంధి యొక్క ఆదర్శాల ద్వారా ప్రేరణ ను పొంది, భారతదేశం యొక్క స్వాతంత్ర్య పోరాటాన్ని బలపరచడం కోసం మాతృభూమి ఏర్పాటైంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. వలస పాలన కు వ్యతిరేకం గా మన దేశ ప్రజల ను ఏకం చేయడం కోసం భారతదేశం అంతటా ఏర్పాటైన వార్తాపత్రికలు మరియు నియమిత కాలాని కి వెలువడే పత్రిక ల వైభవోపేతమైనటువంటి సంప్రదాయం లో మాతృభూమి కూడా ఒకటి గా నిలబడింది అని ఆయన అన్నారు. లోకమాన్య తిలక్, మహాత్మ గాంధి, గోపాల కృష్ణ గోఖలే, శ్యాంజీ కృష్ణ వర్మ గారులు మరియు ఇతరులు భారతదేశం యొక్క స్వాతంత్ర్య పోరాట కాలం లో వారి కృషి ని కొనసాగించడం కోసం వార్తాపత్రికల ను ఉపయోగించుకొన్న ఉదాహరణల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ప్రత్యేకించి, అత్యవసర పరిస్థితి కాలం లో భారతదేశం యొక్క ప్రజాస్వామ్య మర్యాద ను కాపాడడం కోసం ఎం.పి. వీరేంద్ర కుమార్ గారు చేసిన కృషి ని ప్రధాన మంత్రి స్మరించుకొన్నారు.

|

స్వరాజ్య సాధన కోసం స్వాతంత్ర్య పోరాట కాలం లో మన ప్రాణాల ను త్యాగం చేసే అవకాశం మనకు లభించలేదు, అయితే అమృత కాలం ఒక బలమైనటువంటి, అభివృద్ధి చెందినటువంటి మరియు అన్ని వర్గాల ను కలుపుకొనిపోయేటటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించే దిశ లో కృషిచేసే అవకాశాన్ని మనకు ఇస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. న్యూ ఇండియా యొక్క ప్రచార ఉద్యమాల లో ప్రసార మాధ్యమాలు ప్రసరింపచేసిన సకారాత్మక ప్రభావాన్ని గురించి ఆయన వివరించారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్ ను ప్రసార మాధ్యమాల రంగం లోని ప్రతి ఒక్క సంస్థ గొప్ప చిత్తశుద్ధి తో చేపట్టిన సంగతి ని ఆయన ఒక ఉదాహరణ గా చెప్పారు. అదే మాదిరి గా యోగ కు, ఫిట్ నెస్ కు మరియు బేటీ బచావో బేటీ పఢావో కు ప్రజల లో మంచి ఆదరణ లభించేటట్టుగా చేయడం లో ప్రసార మాధ్యమాలు చాలా ప్రోత్సాహకరమైనటువంటి పాత్ర ను పోషించాయి అని ఆయన అన్నారు. ‘‘ఈ విషయాలు రాజకీయ రంగాని కి మరియు రాజకీయ పక్షాల కు ఆవల ఉన్న విషయాలు. అవి రాబోయే సంవత్సరాల లో ఒక ఉత్తమమైన దేశ ప్రజల ను తీర్చిదిద్దడానికి సంబంధించినవి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

స్వాతంత్ర్య పోరాటం తాలూకు అంతగా తెలియని ఘటనల నున గురించి, మరుగున పడిపోయిన స్వాతంత్ర్య యోధులను గురించి, స్వాతంత్ర్య పోరాటం తో అనుబంధాన్ని కలిగివున్న ప్రదేశాల ను గురించి ప్రముఖం గా ప్రకటించే ప్రయాసల ను ప్రసార మాధ్యమాలు ఇంతలంతలు చేయగలుగుతాయి అని ప్రధాన మంత్రి సూచన చేశారు. అదే విధం గా, ప్రసార మాధ్యమాల రంగాని కి చెందని వర్ధమాన రచయితల కు ఒక వేదిక ను ఇవ్వడానికి, ప్రాంతీయ భాషల ను మాట్లాడని చోట్ల ఆయా భాషల ను వ్యాప్తి చేయడానికి వార్తాపత్రిక లు ఒక గొప్ప మార్గం కాగలుగుతాయి అని ప్రధాన మంత్రి అన్నారు.

|

ఈ కాలం లో భారతదేశం నుంచి ప్రపంచం ఏం ఆశిస్తోందనే విషయాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, మహమ్మారి ని సంబాళించలేకపోతుంది అంటూ మొదట్లో వ్యక్తం అయినటువంటి ఊహాగానాల ను భారతదేశం సఫలతాపూర్వకం గా ఛేదించిందన్నారు. రెండు సంవత్సరాల పాటు 80 కోట్ల మంది ప్రజలు ఉచిత ఆహార పదార్థాల ను అందుకొన్నారు. 180 కోట్ల టీకామందు డోజుల ను ప్రజల కు ఇప్పించడమైంది అని ప్రధాన మంత్రి తెలిపారు. ‘‘భారతదేశానికి చెందిన ప్రతిభాన్విత యువత చోదక శక్తి గా ఉన్నందువల్ల, మన దేశం ఆత్మనిర్భరత దిశ లో ముందుకు సాగిపోతోంది. భారతదేశాన్ని దేశీయ అవసరాల ను మరియు ప్రపంచం అవసరాల ను తీర్చే ఒక ఆర్థిక సత్తా కేంద్రం గా తీర్చిదిద్దాలి అనేదే ఈ సిద్ధాంతానికి కేంద్ర స్థానం లో నిలచిన అంశం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఇంతకు ముందు లేనటువంటి సంస్కరణల ను ప్రవేశపెట్టడం జరిగింది, అవి ఆర్థిక పురోగతి కి దన్ను గా నిలచాయి. స్థానిక వాణిజ్య సంస్థల ను ప్రోత్సహించడం కోసం వేరు వేరు రంగాల లో ఉత్పత్తి తో ముడి పెట్టిన ప్రోత్సాహక పథకాల ను తీసుకు రావడం జరిగింది. భారతదేశం లో స్టార్ట్- అప్ ఇకో- సిస్టమ్ ఇప్పుడు ఉన్నంత హుషారు గా ఇదివరకు ఎన్నడూ లేదు అని కూడా ప్రధాన మంత్రి వివరించారు. ఒక్క గత 4 సంవత్సరాల కాలంలోనే, యుపిఐ ఆధారిత లావాదేవీలు 70 రెట్ల కు పైబడి పెరిగాయి. నేశనల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కోసం 110 లక్షల కోట్ల రూపాయల ను వెచ్చించడం జరుగుతున్నది. పిఎమ్ గతిశక్తి మరిన్ని మౌలిక సదుపాయాల కల్పన కు దోహదం చేయడం తో పాటు పాలన ను మరింత సౌకర్యవంతం గా మార్చనుంది అని శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. భారతదేశం లోని ప్రతి ఒక్క పల్లె అధిక వేగం తో పనిచేసేటటువంటి ఇంటర్ నెట్ సంధానాన్ని కలిగివుండేలా చూడటానికి మేం చురుకుగా పనిచేస్తున్నాం. మా ప్రయాసల కు మార్గదర్శకం గా నిలచే సిద్ధాంతం ఏమిటి అంటే అది ఇప్పటి తరం వారి కంటే భావి తరాల వారు ఒక మెరుగైనటువంటి జీవన శైలి ని సొంతం చేసుకొనేటట్టు చూడాలి అనేదే’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India eyes potential to become a hub for submarine cables, global backbone

Media Coverage

India eyes potential to become a hub for submarine cables, global backbone
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Indian cricket team on winning ICC Champions Trophy
March 09, 2025

The Prime Minister, Shri Narendra Modi today congratulated Indian cricket team for victory in the ICC Champions Trophy.

Prime Minister posted on X :

"An exceptional game and an exceptional result!

Proud of our cricket team for bringing home the ICC Champions Trophy. They’ve played wonderfully through the tournament. Congratulations to our team for the splendid all around display."